తాగి డ్రైవ్ చేయొద్దు.. జైల్లో మరీ చలి!
posted on Aug 8, 2022 @ 11:13AM
పాఠం చదవకపోతే టీచర్ కొడుతుందని భయపెడతారు, కాలేజీకి డుమ్మా కొడితే తండ్రికి చెబుతా నంటుంది తల్లి, పిచ్చివేషాలేస్తే అమ్మకి చెప్తానని బెదిరిస్తుంది అన్నను చెల్లి. తాగి డ్రైవ్ చేయద్దు ప్రాణ హాని. ఇవన్నీ చాలా సర్వసాధారణ హెచ్చరికలు, హెచ్చరిక బోర్దులు. వీటికి కుర్రాళ్లు భయపడటం మానేసేరు. జైలు శిక్ష, జరిమానాలు మామూలై పోయాయి. కానీ ఎవ్వరూ అంతగా పట్టించుకోవడమూ లేదు. వేగంగా వెళ్లడమే గొప్ప ఆనందంగా దాదాపు వాహనదారులంతా భావించ డంతో ప్రమాదాలు తప్ప డం లేదు. పోలీసులు, సంబంధిత అధికారులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు, ఇది నిత్య కృత్యమైంది.
ఇవన్నీ భరించలేకేనేమో కులు పోలీసులు చిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. కులు ప్రయాణం యువ తకు మహా యిష్టం. తాగినా తాగకున్నా వేగంగా వెళ్లడం అక్కడికి వెళ్లేవారికి సరదా. తాగి డ్రైవ్ చేయడం మరీ ప్రమాదకరం అంటున్నారు పోలీసులు. తాగి నడిపితే పోలీసులు వెంటాడి మరీ పట్టుకుంటారు. అంతే కాదు అక్కడ జైల్లో పడేస్తారు. ఎవ్వరి మాటా వినరు. ఇది తాగి నడిపేవారిని శిక్షించడంలో భాగం. కానీ చిత్రమేమంటే అక్కడ మరో హెచ్చరికా పెట్టారు. తాగి డ్రైవ్ చేస్తే తిట్టడం, కొట్టడం సరే, జైల్లో వేస్తారుట. అక్కడి జైళ్లులో వాతావరణం చాలా చలిగా ఉంటుంది. ఆ చలికి తట్టుకోలేరు. అక్కడేమీ ఉండేందుకు దుప్పట్లు, రగ్గులూ ఏమీ ఇవ్వరు. తీసికెళ్లినవారిని అలానే జైల్లో కూర్చోబెడతారంతే.
కులు దారిలో పెద్ద హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇటుగా తాగి వెళితే జైలు పాలవుతారు, అక్కడ చలికి తట్టుకో లేరు. అంతకంటే తాగకుండా ఉండి, నెమ్మదిగా తక్కువ వేగంతో ప్రయాణించండి. మీకు, మాకూ మంచి ది.. అనే హెచ్చరికతో! ఇలాంటిదేదో బావుందని ముంబై పోలీసులు కూడా ఇలాంటి హెచ్చరికలను పెద్ద హోర్డింగ్స్‌గా పెడదామనుకుంటున్నారట! బావుందిగదూ! అన్నట్టు ఇలా అన్ని రాష్ట్రాల పోలీసు అధికా రులూ నగరాల్లోనూ సీరియస్‌గా కేసులు పెడతాము, భారీ జరిమానా విధిస్తామని పెడితే బావుంటుంది. ఈ రోడ్ద ప్రమాదాలు కాస్తంత తగ్గుతాయేమో!