ప్రధాని ఆటోగ్రాఫ్ కోరుకున్న నిఖత్
posted on Aug 8, 2022 @ 12:54PM
స్కూల్లోప్రొగ్రెస్ రిపోర్టు మీద నాన్న సంతకం ఇష్టం, పెద్దయ్యాక అధికారుల మెప్పు మహాయిష్టం, పెద్ద పెద్ద పోటీల్లో గెలిచే క్రీడాకారులకు పతకాలంటే మరీ యిష్టం, రాజకీయనాయకులకు సీఎం అంటే తెగని ప్రేమ. కానీ క్రీడాకారులను అభిమానించి, ఆదరించడమే కాకుండా, వారి ఓటమిలోనూ వారికి మనోధైర్యం పెంచెలా ప్రశంసించిన ప్రధాని మోడీ అంటే సూపర్‌స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు వీరాభిమానం మెండు. అందుకే ఆయన ఆటోగ్రాఫ్ తప్పకండా తీసుకుంటానని నిఖత్ అన్నది.
అంతర్జాతీయ పోటీల్లో మామూలుగా గెలవడమే కష్టం. అలాంటిది పతకం సాధించడం మరీ గొప్ప విష యం. అందులోనూ స్వర్ణ పతకం సాధించడమనేది మహాద్భుతం. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ఏ క్రీడాకారులకయినా దేశ ప్రజలంతా మద్దతునిస్తున్నారన్న భావనే సగం బలాన్నిస్తుంది. వారి శిక్షణ, అస లు పోటీ సమయంలో మనోధైర్యం, గెలవాలన్న పట్టుదల అనేవి నిజానికి సెకండరీ. దేశం కోసం వాళ్లు పోటీపడతారేగాని వారి కోసం కాదు. ఇదే సహజంగా క్రీడాకారులు,క్రీడాసంఘాలు గొప్ప నినాదంగా ప్రచా రం చేస్తుంటారు. అది నూటికి నూరుపాళ్లూ నిజం. నమ్మితీరాల్సిందే. కాకుంటే కొన్న పర్యాయాలు ఓటమి ని చవిచూడాల్సి వస్తుంది. అన్నిపర్యాయాలు మనవాళ్లే గెలవాలని రూలు లేదు.
ఇదుగో ఇలాంటపుడే ఫరవాలేదు. మరోసారి, మరో పోటీలో గెలుస్తావన్న ఒక్క మాట వేయి కన్నీళ్ల బాధని మరిపిస్తుంది. కోచ్ ఎంత వెన్నుతట్టి బెంగపడకు, అదేమంత గొప్ప సంగతి కాదు, తర్వాత పోటీకి సిద్ధపడదామనే అంటూ పక్కనే ఉండి కొండంత ధైర్యమిస్తూంటారు. వారిదీ గొప్ప సేవే. కానీ ప్రజల నుంచి, అధికారుల నుంచీ ఊరు నుంచీ వచ్చే చిన్న ధైర్యాన్ని నూరిపోసే సమాచారం, ఎక్కడో ఉన్నక్రీడాకారులకు మనోధైర్యాన్ని కొండంత పెంచుతుంది, నీరసాన్ని, దిగుల్ని దూరం చేస్తుంది. అదే నిఖిత్ విషయంలో ప్రధాని మోడీ చేశారు.
అందుకే ప్రపంచ చాంపియన్, తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోస్వర్ణం సాధించాక మన ప్రధానమంత్రి నరేంద్రమోదీని గుర్తు చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల 50 కిలోల ఫైనల్లో నిఖత్ జరీన్ టైటిల్ ఫైట్‌లో 5-0తో కార్లీ మెక్‌నాల్ (నార్తర్న్‌ఐలాండ్)ను మట్టికరిపించింది. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాక తాను ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి బాక్సింగ్ గ్లోవ్స్ పై ఆటోగ్రాఫ్తీ సుకుంటానని నిఖత్ జరీన్ సంతోషంగా చెప్పారు.
తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం గెలుస్తానని ప్రజలు ఊహించారని, తాను 5:0 అద్భుతమైన స్కోర్‌తో స్వర్ణం గెలిచానని చెప్పారు.‘‘నా దేశం కోసం స్వర్ణం గెలిచినందుకు నేను థ్రిల్‌గా ఉన్నాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల తర్వాత ఇది నా తదుపరి ప్రధాన పోటీ లోనూ స్వర్ణం గెలిచాను కాబట్టి చాలా సంతోషం గా ఉన్నానని నిఖత్ వ్యాఖ్యానించారు. స్వర్ణ పతక విజేత మాట్లాడుతూ జాతీయ గీతం ఆలపించినప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని, రాబోయే ఈవెంట్‌లలో తాను దేశం గర్వపడేలా మంచి ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.