రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. అమోదం
posted on Aug 8, 2022 @ 12:11PM
ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ముందుగా చెప్పినట్లే సోమవారం ఉదయం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని కలిసిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అంద జేశారు. కోమటిరెడ్డి రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం అధికారి కంగా ప్రకటించింది. అనంతరం గవర్నర్ తమిళిసై ను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపా యింట్ మెంట్ కోరారు. కాగా రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరడానికి ముహూర్తం కూడా ఫిక్సై పోయిందని తెలుస్తున్నది. ఈ నెలాఖరులో ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారు.
2018 డిసెంబర్‌లో మునుగోడు ఎమ్మెల్యే గా రాగోపాల్ రెడ్డి గెలిచారు. కాగా కేసీఆర్ పాలనలో తెలంగాణా అన్యాయమైపోయిందని, తెలంగాణా తల్లిని కాపాడుకోవడానికే తాను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చానని రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణాలో కుటుంబ పాలనతో రాష్ట్రాభివృద్ధి కుంటుబడిందని, దీన్ని ఎదుర్కొని పాలక పక్షాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి లేదని రాజ గోపాల్ అన్నా రు. ఆయన రాజీనామా చేయడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ మునగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.
పార్టీ సభ్యత్వానికీ, మునుగోడు ఎమ్మెల్యే పదవికీ ఆయన రాజీనామా చేశారు. ఆయన్ను పార్టీ నుంచి తొల గించాలా వద్దా అన్న అంశం మీద ఢిల్లీలో పార్టీ హైకమాండ్‌తో పార్టీ నాయకుల సమావేశానంతరం కోమటిరెడ్డి రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే బీజేపీలో ఎప్పుడు చేరుతున్నారన్నది అప్పు డు చెప్పనప్పటికీ రాజీనామా అనంతరం ఆయనీ విషయంలో స్పష్టత ఇచ్చారు. అమిత్ షా సమక్షంలో ఆయన ఈ నెల చివరి వారంలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు, బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లోకి మారుతుండడం విషయం లోనూ పార్టీ నాయకులు వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పట్ల కూడా ఆయన ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పార్టీ హైకమాండ్‌ను గతంలో విమర్శించినవారికే పార్టీలో కీలక పదవులు కట్టిపెట్టడం పట్ల కూడా రాజ గోపాల్ అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడి యాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంకు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తప్ప ఇంకే కనిపించడం లేదని మండిపడ్డారు. టీ ఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని విమ ర్శించారు. ఉప ఎన్నిక వచ్చాక మునుగోడు గుర్తొచ్చిందన్నారు. యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తా రని తెలిపారు. టీపీసీసీ చీప్ భాష విని సమాజం తలదించుకుందని, జైలుకెళ్లిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్మరని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.