ఆదర్శ రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి
posted on Aug 16, 2022 @ 3:43PM
అటల్ బిహారీ వాజ్‌పేయి అనగానే ఒక అకుంఠిత దేశభక్తుడు, గొప్ప వక్త అంతకుమించి రాజనీతిజ్ఞుడు గుర్తుకువస్తారని దేశంలోని పెద్ద పెద్ద రాజకీయనాయకులంతా అంగీకరిస్తారు. ఆయన ప్రసంగిస్తూంటే లోక్‌సభలో అందరూ ఎంతో శ్రద్ధగా వినడం గురించే అందరూ చెబుతారు. ఎంతో సీరియస్ విషయాన్నే అంతా చక్కగా కాస్తంత హాస్యోక్తితో కూడిన గంభీర కంఠస్వరంతో వినిపించడం ఆయనే చెల్లింది. అటల్‌జీ అనే అన్ని పక్షాలవారూ అమిత గౌరవంగా పిలిచేవారు. దేశ సర్వతోముఖాభివృద్ధిని ఎల్లపుడూ ఆకాంక్షిం చిన మహానేత వాజ్‌పేయి.
భారత మాజీ ప్రధాన మంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 4వర్దంతి సందర్భం గా దేశం మొత్తం ఆయనకీ నివాళి అర్పిస్తోంది.ఆయన దేశానికీ చేసిన సేవలని స్మరిస్తోంది.1924 డిసెంబర్ 25 మద్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన వాజపేయి 2018 ఆగష్టు16 న కన్నుమూసారు. భారతీయ జనతా పార్టీ తర పున ప్రధానమంత్రి పదవి పొందిన నేత. మొదటసారిగా రెండవ లోక్ సభ కి ఎన్నిక అయ్యారు. ౩వ, 9వ లోక్ సభలు తప్పించి 14 వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంట్ కు ప్రాతినిద్యం వహించారు. ఆయన రెండు సార్లు రాజ్యసభ కి కూడా ఎన్నికయ్యారు.1968 నుంచి 1973 వరకు జన సంఘ్ పార్టీ అద్యక్షుడి గా పని చేసారు. 1980నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీ కి వ్యవస్థాపక అద్యక్షుడిగా సేవలు అందిం చారు. 1996 లో ప్రధాన మంత్రి లబించినా కేవలం 13 రోజులు మాత్రమే చేసారు.1998 లో రెండవ పర్యా యం ప్రధాన మంత్రి పదవి లబించినా 13 మాసాలు పాలించారు.
1999లో13వ లోక్ సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధాన మంత్రి పదవి చేబట్టి 2004 వరకు పదవి లో ఉన్నారు.దేశ రాజధాని ఢిల్లీలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక చిహ్నం ‘సదైవ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ మహా నీయునికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా బీజేపీ సీనియర్ నేతలు ‘సదైవ అటల్’ స్మారక చిహ్నం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా ప్రధానమంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్య ‘సదైవ అటల్’ స్మారకానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అటల్ జీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ పితామహుడు అటల్ బిహారీ వాజ్ పేయి కోట్లా ది మంది కార్యకర్తలకు మార్గదర్శి అని, ఆయన ఎందరో నాయకులకు స్ఫూర్తిదాయకమైని బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2018 ఆగష్టు 16వ తేదీన తుదిశ్వాస విడిచారు.