చంద్రన్న సూచనలు.. మేలన్నా!
posted on Aug 16, 2022 @ 2:31PM
పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసంక్షేమాన్ని ఆశించేవాడే నిజమైన నాయకుడు. తెలుగు దేశం పార్టీ జాతీ య అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో మరింతగా ఆ సంగతిని ప్రజలకు స్పష్టం జేస్తున్నారు. ప్రజల సంక్షేమమే తమ పార్టీ లక్ష్యంగా నూత నోత్సాహం తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు.
డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోగ్యయోగం కాదని, దేశం లేదా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి అది తీవ్ర ఆటంకమని బాబు అన్నారు. దేశం వచ్చే పాతికేళ్లలో విజన్ 2047 లక్ష్యా లపై ప్రభుత్వం పనిచేయాలని ఆయన కొన్ని సూచనలు చేశారు.
విజన్-2047కు చంద్రబాబు సూచనలేమంటే.. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడం. ఆర్థిక అసమానతల్లేని సమాజాన్ని నిర్మించడం. యువతకు అవకాశాలు కల్పించడం, దేశంలో సంపద సృష్టి జరగాలి. ఆ సంపదను పేద ప్రజలకు పంచడం. రైతుల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకురావడం, విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ చేయడం, మహిళా సాధికారతకు ప్రణాళికలు వేయడం, దేశంలో నదుల అనుసం ధానం చేయాలి.
ఏపీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేశాం. అవినీతి రహిత పాలన అందించడం, టెక్నా లజీతో అవినీతిని అంతం చేయడం. వచ్చే 25 ఏళ్లలో భారత్ నంబర్ 1 కావడానికి ప్రభుత్వం తో పాటు ప్రజలు ప్రత్యేక ప్రణాళిక, సంకల్పంతో పనిచేసి సుసాధ్యం చేయాలన్నారు.