అదానీ, అంబానీల దృష్టి ఏపీ పైనే.. జగన్
posted on Aug 16, 2022 @ 3:11PM
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భం గా ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు. ఎనిమిది పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు లక్షకు పైగా చిన్న పారిశ్రామిక సంస్థలున్నాయన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆదిత్య బిర్లా, శ్రీ సిమెంట్స్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నార న్నా రు. 15 నెలల్లోనే టైర్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైందని అన్నారు.
ప్రభుత్వ సహకారంతో రెండో ఫేజ్‌కు ముందుకొచ్చారని... 2023 ఆగస్ట్ నాటికి రెండో ఫేజ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మూతబడిన ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేర్కొన్నారు. రూ. 1.54లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
అలాగే, మూతపడ్డ ఎంఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు చేయూతినిస్తున్నామని జగన్ అన్నారు. ఎంఎస్ ఎమ్‌ఈల పున రుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్నారు, ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగై న ఉపాధి అవకాశాలు కావాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటు న్నా మని, వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉందని సీఈవో నితిన్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రపంచంలోనే బెస్ట్ ప్లాంట్‌గా యూనిట్‌ను తయా రు చేస్తామని సీఈవో నితిన్ అన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు.