వైసీపీకి పసుపు భీతి!
posted on Aug 26, 2022 @ 10:29AM
ప్రతి మనిషికీ ఒక రంగు పట్ల ఇష్టం ఉంటుంది. దారికి కారణం ఫలానా అని చెప్పలేకపోవచ్చు. అలాగే వేరే రంగు పట్ల అయిష్టతా ఉంటుంది. కొందరికి కేవలం తెలుపే యిష్టం, కొందరికి గులాబీ యిష్టం ఉంటే ఇంకొందరికి పసుపు, నీలం బాగా యిష్టం. సాధారణంగా పసుపు శుభకార్యాల్లో ఎక్కువగా కనిపించే రంగు. దానికి ఆ ప్రాధాన్యత ఉంది. కానీ వైసీపీవారికి మాత్రం పసుపు బొత్తిగా పడటం లేదు. ఆ రంగులో ఏది కన పడినా విసుక్కుంటున్నారు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. పసుపు తెలుగుదేశం పార్టీవారిది. అందు వల్ల పసుపు దుస్తుల్లో ఎవరు కనిపించినా ఫ్యాన్‌వారికి ఉండడం కాస్తంత ఇబ్బందికరంగా ఉంటుంది.
పసుపు సర్వమంగళప్రదాయని అనే అభిప్రాయంతోనే తెలుగుదేశం ఆవిర్భావంలో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఆ రంగుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అందువల్ల అలా ఆ రంగు ప్రజల్ని ఆకట్టుకుం టూంది. అయితే ఇటీవలి కాలంలో రాజకీయపరంగానూ రంగుల్ని చూస్తున్నారు గనుక వైసీపీవారికి పసుపు బొత్తిగా గిట్టడం లేదు. పసుపు బ్యాక్‌గ్రగౌండ్‌లో సైకిల్ గుర్తు టీడీపీవారి గుర్తు. దీన్ని కలలో కూడా చూడదలచు కో లేదు వైసీపీ వారు.
కానీ ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ కొత్త రెండింతల ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఏపీలో వైసీపీ సర్కార్‌కు అభిమానం, ప్రతిష్ట కొంత తగ్గిందన్న అభిప్రాయాలే ఎక్కువగా విన పడుతున్నాయి. దీనికి తోడు మంతులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు గతంలో వలె బ్రహ్మరధం పట్టడం లేదు. ఎందుకు వచ్చారన్నట్టు చూపులు, ప్రశ్నలు సంధించడంతో అవమానపరుస్తున్నారు. పాలనా కాలం మూడేళ్లు ముగిసినా ఇప్పటికీ ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేకపో వడం జగన్ సర్కార్ వైఫల్యానికి అద్దంపడుతుంది. ఇచ్చిన హామీలు, పథకాలు అన్నీ నీరుగారాయి.
ఈ పరిస్థితుల్లో ఆగష్టు 25న కృష్ణాజిల్లా పెడనలో నేతన్న నేస్తం పేర ఒక కార్యక్రమం జరిగింది. అక్కడి వారు సభాప్రాంగణాన్ని వైసీపీ పతాకాలతో నింపేశారు. ఎక్కడా పసుపు, నలుపు రంగులు కనపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది వైసీపీ సంబంధించిన కార్యక్రమం గనుక టీడీపీ రంగు, పతాకా లూ ఎక్కడా కనపడకుండా ఉండటమే మంచిదని వారి అభిప్రాయం కావచ్చు, లేదా విపక్షాలవారు వచ్చి గొడవలు, రభసా సృష్టిస్తారేమోనన్న అనుమానమూ కావచ్చు. ఏమయినప్పటికీ పసుపు రంగు కనపడకుం డా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేశారు.
పెడనలో ‘నేతన్న నేస్తం’ నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సభకు ఒక వృద్ధుడు పసుపు రంగు చొక్కా వేసుకుని వచ్చారు. అది చూడగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక మహిళా ఎస్సై ఆయనను ఆపారు. అతడి తలకున్న టవల్ తీయించి, చొక్కాపై కప్పించారు. పైగా ఎట్టి పరిస్థితి లోనూ పైన కప్పుకున్న టవల్ తీయవద్దు. పసుపు చొక్కా కనిపించవద్దు’ అని హెచ్చరించారు. పసుపు రంగు చీర ధరించిన ఓ మహిళ వేదిక సమీపానికి వెళ్లకుండా అడ్డుకన్నారు. నలుపు రంగు చున్నీలు, మాస్కులు ధరించిన వారిని కూడా పోలీసులు అటకాయించారు. చున్నీలు, మాస్కులు తొలగించిన తర్వాతే లోనికి అనుమతించారు.
ఇదిలా ఉండగా, అసలు పెడనలో సీఎం సభ ప్రారంభం కాకుండానే జనం వెనుతిరిగి వెళ్లడం కనిపిం చింది. సీఎం సభ ప్రకటించిన సమయానికంటే కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవైపు వ్యాన్లు, బస్సు ల్లో జనాన్ని లోపలికి పంపిస్తుండగా, మరోవైపు నుంచి కొందరు బయటకు వెళ్లడం కనిపించింది. సీఎం వచ్చాక కూడా ఆయన ప్రసంగం వినకుండానే కొందరు వెళ్లిపోయారు. సీఎం ప్రసంగం రుచించక మరి కొందరు వెళ్లిపోవడం గమనార్హం.
కాగా, ఈ సభలో సీఎం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనన్న ఆశతో ఎదురు చూసిన చేనేత కార్మికులకు నిరాశే ఎదురయింది. చేనేత సమస్యలన్నింటికీ నేతన్న నేస్తమే పరిష్కారమన్నట్లుగా ఆయన ప్రసంగం సాగడం, చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల ప్రస్తావన లేకపోవడంపై నేత న్నలు పెదవి విరిచారు. సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత సంఘాలను బయటపడేస్తానన్న హామీ కూడా సీఎం నోట రాలేదు.
తమకూ నేతన్న నేస్తం వర్తింపజేస్తామని సీఎం ప్రకటిస్తారేమోనని ఆశతో ఎదురుచూసిన అనుబంధ వృ త్తుల కార్మికులకు నిరాశ మిగిలింది. సభ నుంచి వెళ్లిపోతున్న ప్రేక్షకులను వైసీపీ కార్యకర్తలు లోప లకు పంపేందుకు ప్రయత్నాలు చేసినా.. సీఎం ప్రసంగం చప్పగా సాగడం, ఎండ తీవ్రత కారణంగా జనం చివరి వరకు ఉండకుండా వెనుదిరిగారు.