మ్యాచ్ ఓడినా.. చెలి చేయిపట్టాడు!
posted on Sep 1, 2022 @ 10:20PM
నవాబ్ పటౌడీ షర్మిలా టాగోర్ ల ప్రేమ నుంచి నిన్నటి వరకూ చాలామంది క్రీడాకారులు ప్రేమ పెళ్లిళ్లూ జిందాబాద్ అంటు న్నారు.అనేక టోర్నీల్లో సిక్స్ కొట్టిన ప్లేయర్ స్టాండ్స్‌లో ఉన్న ప్రేయసికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన సందర్భాలు ఎన్నో. మనకు తెలిసి భారత్ స్టార్ట్స్‌లో ఇలాంటి సీన్ కింగ్ కోహ్లీయే చేశాడు. సినీ నటి అనుష్క ప్రేమలో తలమునకలయ్యాడు. ఇద్దరూ ఒక్కట య్యారు. ఇపు డు సరికొత్త జంట తెరమీద కనపడుతోంది. అదే హాంకాంగ్ ఆల్‌రౌందర్ కించిత్ షా లవ్ ఎఫైర్. అతగాడు మంచి ప్లేయర్‌గా భారత్ ప్లేయర్లనూ ఆకట్టుకున్నాడు. ఇతను భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్‌గా నిలుస్తాడని అందరి మన్న నలు అందుకున్నాడు. ఇపుడు అతనిలో ప్రేమికుడినీ బయటపెట్టాడు. అదే పవర్ ఆఫ్ లవ్. అతను తన లవర్ దగ్గరికి వెళ్లి రింగ్ తొడిగేవరకూ ఈ కుర్రాడిలో ఈ కోణం ఉందా అని ఎవరూ ఊహించలేదు. కానీ ఇదో మంచి ముచ్చటా అందరూ చెప్పు కుంటున్నారు. ఆనందిస్తున్నారు.
ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించి సూప ర్-4 లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో హాంకాంగ్ పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత, హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కించిత్ షా స్టాండ్స్‌లోకి వెళ్లి తన గాళ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కించిత్ షా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా స్టాండ్స్‌లో వెళ్లిన కించిత్ అక్కడ నిలబడి ఉన్న తన గాళ్ ఫ్రెండ్ భుజం తట్టాడు. ఆపై మోకాళ్లపై కూర్చుని బాక్స్‌లోంచి ఉంగరం తీసి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అసలు సిసలు ప్రియుడిలా అడిగాడు.
అంతే, ఈ లవ్ ప్రపోజల్ నుంచి తేరుకునేందుకు ఆమెకు చాలా సమయమే పట్టింది. క్షణకాలంపాటు తనను తాను నమ్మలేక పోయింది. కాసేపటి తర్వాత తేరుకుని ‘యస్’ అంటూ తన అంగీకారం తెలిపింది. ఆ మాట వినగానే పైకి లేచి ఆనందంతో తన చేతిలోని ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ కౌగిలించుకుని ఆనంద డోలికల్లో తేలియాడిపోయారు. ఇదంతా చూస్తున్న స్టేడియంలోని అభిమానులు తమ సెల్‌ఫోన్లను క్లిక్‌మనించారు. కరతాళ ధ్వనులతో వారిని అభినం దించారు. ఇందు కు సంబంధించిన వీడియోను ఆసియా కప్‌ను నిర్వహిస్తున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వారికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో కించిత్ షా ఓవర్ నైట్ స్టార్‌గా అయ్యాడు.