జగన్‌కు మరో తలనొప్పి... వినుకొండ వైసీపీలో రగడ
posted on Sep 1, 2022 @ 8:18PM
రాజకీయాల్లో మిత్రులు శతృవులు కావడానికి ఆట్టే కాలం పట్టదు. ముందు తెరమీద కావలించుకుని కనిపించిన నేతలు ఆనక ఏదో అంశంలో విభేదించి పక్కా శతృవులుగా మారి ఒకరి నష్టాన్ని మరొకరు ఆశిస్తుంటారు. ఇపుడు సరిగ్గా ఇదే సీన్ పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీలో జరుగుతోంది. వినుకొండ కాంగ్రెస్‌లో రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగిన మక్కెన మల్లికార్జు న రావు ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. అంతేకాదు వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు నరసరావు పేట ఎంపీ విజయానికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే మొత్తం వ్యవహారం మారింది. మక్కెనను ఎమ్మెల్య బోల్లా దూరంగా పెట్టారు. దీంతో మక్కెన వర్గీయులు ఏమి జరుగుతోందో అర్దంగా సందిగ్ధంలో పడ్డారు. మక్కెనపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బాగా ప్రచారమయ్యాయి.
ఇదిలాఉండగా, చేపలచెరువు వ్యాపారంలో ఉన్న మక్కెన ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టేందుకు సోసైటీలో ఎమ్మెల్యే ఎదురు తిరి గారు. దీంతో మక్కెన వ్యాపారం ఊహించని విధంగా చాలా దెబ్బతిన్నది. ఎమ్మెల్యే ఒత్తిడితోనే మక్కెనపై సొసైటీ రుణాల విష యంలో ఇబ్బందుల్లో పడ్డారు. ఏకంగా మక్కెన చాలాకాలం నుంచి ఉంటున్న ఎన్ ఎస్పీ భవనాన్ని కూల్చివేశారు. బాగున్న భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవాలని, కూల్చవద్దని మక్కెన స్వయంగా ఎమ్మెల్యే బొల్లాకు విన్న వించినా పట్టించుకోలేదు మక్కెన వర్గీయులు అంటున్నారు.
అసలే వైసీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పార్టీలో లొసుగులు బయటపడి పార్టీ అధినేతకు తలభారం పెరిగింది. వారిని బుజ్జగించి పార్టీ పరువుతీయవద్దని విబేదాలు లేకుండా పార్టీకి పనిచేయమని సర్దిచెప్పలేక నానా తంటాలు పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లాలో తలెత్తిన మరో పోరు జగన్‌ను నిద్రపోనీయదేమో. ఇప్పుడు మక్కెన, బొల్లా వర్గాల మధ్య పోరు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయకుండా జగన్ కాపాడుకోవాలి. విభేదాలు ముదిరితే పార్టీకి కట్టు బడి ఉన్నవారు ఏమేరకు సర్దుకుపోతారో చూడాలి.