వైసీపీలో అసంతృప్తి.. నేతల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు, చేయని ప్రయత్నం లేదు. నిజానికి, ఓటమి అంచున నిలిచినా , దింపుడు కళ్ళెం ఆశతో ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు. తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు సాగండి అంటూ, అతి విశ్వాసాన్ని ఉద్భోదిస్తున్నారు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు. అయితే నిజంగా ప్రతి గాడపకు మేలు జరిగిందే నిజం అయితే, ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ అటు ప్రజలు, ఇటు ప్రతి పక్ష నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వు కుంటున్నారనుకోండి అది వేరే విషయం.   అలాగే చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందని    జగన్మోహన్ రెడ్డి  తనకు తాను తగిలించుకున్న భుజ కీర్తులను ఎత్తి చూపుకుంటున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని  చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని(అతి ఎంత అక్రమ విజయమో వేరే చెప్పనక్కరలేదు) భూతద్దంలో చూపించి తెలుగు దేశం అధినేత్ చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం  కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన  నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని,  175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం ..  గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం  అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు,  తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు.  నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం  ఆ భరోసా కనిపించడం లేదు. గతంలో   అభ్యర్ధి ఎవరైనా,   అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!`` అని, అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు  ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉండి పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు  2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన వైసీపీ కార్యకర్తలు చాలా వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డాణం చేయించానన్నట్లుగా ఉందని కార్యకర్తలే వాపోతున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని నేతలను నడిరోడ్డు మీద నిలదీస్తున్నారు.  అలాగే కులం, మతం ఇతర ఇంటర్నల్ లింకుల కారణంగా ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగిందేమీ లేదనీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు.  మరో వంక నాయకుల్లోనూ ఇంతకాలం అణచి పెట్టుకున్న అసంతృప్తి  అగ్నిగోళంలా భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలోంచి  తూటాలా ధిక్కారం దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.  ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి,   ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, తాడికొండ లో ఉండవల్లి శ్రీదేవి,  కర్నూలులో  ఎస్వీ మోహన్ రెడ్డి    రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి, రాయచోటిలో  శ్రీకాంత్రెడ్డి,  గిద్దలూరులో అన్నా రాంబాబు బాపట్లలో కోన శశిధర్,  శ్రీకాకుళం కిల్లి కృపారాణి, పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకరిద్దరు మినహా వీరంతా కూడా   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నవారే. అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే..ఇప్పుడు వీరికి ప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వీరిని మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధిలేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి. నిజానికి, వైసీపీలో ఏ ఇద్దరు కలిసినా ... జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్నే చర్చించుకుంటున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు నాయకుల్లోనూ భాగ్గుమనేదుకు సిద్డంగా ఉన్న అసంతృప్తి గురించే మాట్లాడు కుంటున్నారు. నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు జోరందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటోందని, వైసీపీ ముఖ్య నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు  వెనకాడుతున్నారు.. పిల్లి మేడలో గంట కట్టేది ఎవరని వేచి చూస్తున్నారు.

ఏపీలో బీజేపీ ట్రిపుల్ గేమ్.. సంపర్క్ యాత్రల మర్మమేంటో?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ డబుల్ గేమ్ కాదు త్రిబుల్ గేమ్ ఆడుతోంది. ఒక వైపు జనసేన మిత్రపక్షమని చెబుతోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్న సంకేతాలు ఇస్తోంది. అంతే కాకుండా అధికార వైసీపీకి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ రకమైన తీరుతో బీజేపీ రాష్ట్రాన్ని ఏం  చేద్దామనుకుంటోంది, ఏం సాధించాలనుకుంటోంది అన్నది పక్కన పెడితే.. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణకు రోడ్ మ్యాప్ ప్రకటించేసింది. జనవరి 26 తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత  పాదయాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించి సన్నాహకంగా   జనవరి 8న  కర్నూలులో, హిందూపురంలో బహిరంగ సభలు నిర్వహించనుంది. ఆ సభలలో సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.  జనవరి 26 తర్వాత రాష్ట్రంలో   13 వేల గ్రామాల్లో బీజేపీ చేపట్టే సంపర్క పాదయాత్రలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసేలా   కార్యాచరణ రూపొందించేసింది. అయితే రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న జగన్ అనూకూల వైఖరి, కొందరు బీజేపీ రాష్ట్ర నేతల తీరు కారణంగా ఆ పార్టీని జనం విశ్వసించడం లేదు. జగన్ సర్కార్ పై ఎంత ఘాటు విమర్వలు చేసినా జనం పట్టించుకోవడం లేదు. దీంతో జనవరి 26 తరువాత నుంచి బీజేపీ రాష్ట్రంలో  చేపట్టనున్న సంపర్క పాదయాత్రలలో రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా, ఏ మాట్లాడినా జగన్ కు ప్రయోజనం చేకూర్చేందుకేనని అత్యధికులు విశ్వసి స్తున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ రూటు మార్చి సంపర్క యాత్రలలో వైసీపీ సర్కార్ వైఫల్యాలనే టార్గెట్ చేయనుంది. కనీసం అలా ప్రకటించింది. కానీ ఇంత కాలంగా రాష్ట్ర బీజేపీ చేస్తూ వచ్చిన వ్యవహారం అంతా జగన్ సర్కార్ వైఫల్యాలను చూసీ చూడనట్లు వదిలేయడమే. అదే బీజేపీ కార్యక్రమాలలో విపక్షాన్నే టార్గెట్ చేస్తూ విమర్శించడం మాత్రమే. అందుకే సంపర్క్ యాత్రలలో కూడా అధికార పార్టీపై పైపై విమర్శలకు మాత్రమే బీజేపీ పరిమితమౌతుందనే అంతా భావిస్తున్నారు. ఇందుకు వారు ఇటీవల ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటనలో ప్రధాని మోడీతో దాదాపు గంట పాటు భేటీ అవ్వడం, ఆ తరువాత అమిత్ షాతోనూ సమావేశం కావడాన్ని తార్కాణంగా చూపుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో, కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం అసాధారణమేమీ కాదు. కానీ ఏపీ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, లెక్కలకు అందని అప్పుల తీరు తెలిసీ రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగేలా.. మచిలీపట్నం,రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం పేరిట రూ.12 వేల కోట్ల ఋణం పొందేందుకు జగన్   హస్తిన పర్యటన ఇలా ముగిసిందో లేదో అలా అనుమతి వచ్చేయడం.. ఆ రుణం ఇచ్చేందుకు, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ( ఆర్ఈసీ), పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ( పీఎఫ్ సీ) సూత్ర ప్రాయంగా అంగీకరించడాన్ని తార్కాణంగా చెబుతున్నారు. ఈ ఆమోదం లభించిన రుణంలో ఓ 24వందల కోట్ల రూపాయలు ఆర్సీసీ వెంటనే ఏపీ మ్యారిటైం బోర్డుకు అందజేయడానికి అంతా సిద్ధమైపోవడం.. కేంద్రం, జగన్ సర్కార్ ల మధ్య ఉన్న అవినాభావ అనుబంధానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ రుణమే కనుక అందకుంటే ఏపీ సర్కార్ రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు కూడా ఒక్క రూపాయి లేక విలవిలలాడే పరిస్థితి ఎదురయ్యేది. బడ్జెట్ ఆమోదం వరకూ అంటే మార్చి వరకూ ఏపీ సర్కార్ ఖజానా ఖాళీగానే ఉండే పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితి నుంచి ఏపీ గట్టెక్కేందుకు కేంద్రం తన వంతు సహకారం అందించింది. ఇటువంటి వెసులు బాటు బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో కేవలం ఏపీకి మాత్రమే లభిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణను ఆర్థిక చక్రబంధంలో బిగించేసి వేడుక చూస్తున్న మోడీ సర్కార్ ఏపీకి మాత్రం కోరిందే తడవుగా వరాలిచ్చేసి ఆదుకుంటోంది. నిజానికి ఏపీతో పోలిస్తే తేలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది. అయినా రాజకీయ కారణాలతో ఆ రాష్ట్రాన్ని మోడీ, షా ద్వయం ఇబ్బందుల్లోకి నెట్టి వేడుక చూస్తోంది. ఈ కారణంగానే   ఏపీలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా విశ్వాసాన్ని పొందడం లేదు. రాష్ట్రంలో సొంత బలం ఇసుమంతైనా లేని బీజేపీ.. ఇతర పార్టీల బలహీనతల ఆసరాగా పరాన్న జీవిగా ఉన్నా కూడా చక్రం తిప్పేయాలని చూస్తోందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మిషన్ 90 సక్సెస్ అవుతుందా?

మిషన్ 90  టైటిల్ బాగుంది. కానీ, కమల దళం నిర్దేశించుకున్న లక్ష్యం నెర వేరుతుందా? అంటే అదంత ఈజీ టాస్క్ కాదు. మరి అ విషయం కమలనాథులకు తెలియదా అంటే, తెలుసు. అయినా, మోడీ షా నాయకత్వంలో బీజేపీ  ఎప్పుడు, ఎక్కడ నేల చూపులు చుడదు. తలెత్తి చూసే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుంది తప్ప  తల దించుకుని చూసే అలోచన కార్యకర్తలలో రానీయదు. అవును, బీజేపీ విధానాలను కమ్యూనిస్ట్ శంఖంలో పోసి విశ్లేషించే ఒక మేధావి, మాజీ ఎమ్మెల్సీ అన్నట్లుగా, మోడీ షా  జోడీ నాయకత్వంలోని బీజేపీ, పులి మీద  స్వారీ చేసేందుకు ఇష్టపడుతుందే  కానీ  పిల్లి మీద స్వారీ చేయదు.   పశ్చిమ బెంగాల్ లో జరిగింది అదే..  200 ప్లస్ టార్గెట్ గా ఎన్నికల బరిలో దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత షా, ఒకటికి వందసార్లు, బీజేపీ 200 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, వచ్చితీరాలని పార్టీ నాయకులు, కార్యకర్తల మెదళ్ల లో ఒక సెల్ఫ్ టార్గెట్ ను ఇంజెక్ట్ చేశారు. నిజమే,పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రకటిత లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ అప్రకటిత లక్ష్యాన్ని చేరుకుంది.  కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా, సింగిల్ సీటు రాలేదు. బీజేపీ ఫిక్స్ చేసుకున్న  200 టార్గెట్ ను కాదు, ప్రశాంత్ కిశోర్ విసిరిన 100 సీట్ల ఛాలెంజ్ ని చేరుకోలేక పోయింది. అయినా  సింగిలే డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు చేరింది.  77 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకుంది. అంతకు ముందు 2016 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది కేవలం 3 అసెంబ్లీ సీట్లు, ఆ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు కేవలం 10.16 శాతం. అదే 2021కి వచ్చే సరికి, సీట్ల సంఖ్య 3 నుంచి 77కు పెరిగితే, ఓట్ల శాతం 10.16 నుంచి 38.13 శాతానికి చేరింది.   అలాగని పశ్చిమ బెంగాల్ స్టొరీనే తెలంగాణలో రీపీట్  అవుతుందా అంటే, కావచ్చు, కాకపోవచ్చును. కానీ, హైదరాబాద్ శివారులో జరిగిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ  కన్వీనర్ల సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని, సిద్దం చేసుకున్న రోడ్ మ్యాప్ ను సింపుల్ గా తీసి పారేయడం సరికాదని  పరిశీలకులు భావిస్తున్నారు. అవును  బీజేపీ హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్ట్ మేథావులు కూడా  బీజేపీ సక్సెస్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ బెంగాల్ తరహా వ్యూహంతో పావులు కడుపుతోందని  మాత్రం  గట్టిగా నమ్ముతున్నారు.   ఈ వ్యూహంలో భాగంగా కొత్త ఏడాదిలో పది  నెలల రోడ్ మ్యాప్ తో  వరుస కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతున్నది. పది నెలల రోడ్ మ్యాప్ లో మొదటి నాలుగు నెలలలో  రాష్ట్ర ప్రభుత్వ  వైఫల్యాలను జనంలో ఎండగట్టడంతోపాటు రాష్ట్రానికి కేంద్రం ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చిందో  ప్రజలకు వివరించనుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ పేరుతో పది వేల గ్రామ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీని హైదరాబాద్ కు ఆహ్వానించి, ఏడు లక్షల మంది బూత్ కమిటీ సభ్యులతో సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో  ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికను రెడీ చేసుకుంది. వీటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకురావాలనే ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది.   రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై  ఏప్రిల్ లో చార్జిషీట్ విడుదల చేయాలనుకుంటున్నది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించి భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నది. హైదరాబాద్ శివారులో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ, కన్వీనర్ల సమావేశంలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  చేసిన దిశా నిర్దేశంతో నేతలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా  బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాడాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని పార్టీ ప్రకటించింది. సో.. చివరకు ఏమి జరుగుతుంది  అనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొనేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ను అష్టదిగ్బంధనం చేసి  రాష్ట్రానికే పరిమితం చేసే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. యాదృచ్చికమే కావచ్చును కానీ  ఎమ్మెల్యేల బేరసారాల కేసులో  కేసీఆర్ టార్గెట్ చేసిన బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  సారధ్యంలో బీజేపీ  కేసీఆర్ హటావో .. తెలంగాణ బచావో   వ్యూహరచన జరిగిందిని ఇకపై కూడా  మిషన్ 90 కి కర్త, కర్మ, క్రియగా ఆయనే వ్యవహరిస్తారని అంటున్నారు.అంతేకాదు,  బీఎల్ సతోష్  హైదరాబాద్ నడిగడ్డ నుంచే కేసీఆర్  కు సవాలు విసిరి వెళ్ళారు.  సో.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం ముందు ముందు మరింతగా రక్తి కడుతుందని, రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఓటమి భయంతో ధర్మాన నోట ఉత్తరాంధ్ర ఉద్యమం

అధికార దాహం తలకెక్కితే, ఏమి జరుగుతుందో అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిరూపించాయి. అందుకు కళ్ళ ముందు కనిపిస్తున్నసాక్ష్యం  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా  ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిందే అయినా,  చివరకు రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత, ముఖ్యంగా రాష్త్రం ఏర్పడిన తర్వాత  ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో  ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుష్కరకాలం పైగా జరిగిన మలి దశ ఉద్యమంలోనే 1200 మందికి పైగా యువతీ, యువకులు ప్రాణ త్యాగం చేశారు. అమర వీరులయ్యారు. కానీ, అంత మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం,ఇప్పడు ఎట్లుంది .. అంటే .. అమర వీరుల ఆశయాలను ఏ మేరకు నిజం చేసింది? అంటే ... అమరుల అత్మఘోషే సమాధానం అవుతుంది. నిజమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏవో కొన్ని మేళ్ళు జరిగింది నిజమే కావచ్చును, అయినా ఇందుకేనా త్యాగాలు చేసింది? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అనే నిర్వేదం మాత్రం సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది.  ఇక అవశేష ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ బేహారులు మరో ప్రాంతీయ ఆందోళన తెర తీస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలమాట వినిపిస్తున్న సమయంలో రాజకీయ బేహారులు రంగ ప్రవేశం చేశారు. మూడు రాజధానుల వివాదాన్ని తెరమీదకు తెచ్చి, ప్రాంతీయ విద్వేషాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలైంది. ఇంకా చిత్రం ఏమంటే, ఆ రెచ్చగొట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందే వైసీపీ కావడం. నిజమే మూడు రాజధానుల పేరిట ప్రాతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతున్నా, ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు  ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం  డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు.అమరావతినే రాజధాని అని చంద్రబాబు అంటున్నారని.. అలా అయితే మా విశాఖను మాకిచ్చేయాలని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని ఆయన ప్రకటించేశారు.  ఎచ్చెర్లలో వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు ఇటీవలి పర్యటనలో.. ఒకే రాజధాని అమరావతి ఉండాలని ప్రజలతో నినాదాలు చేయించిన అంశాన్ని గుర్తు చేసుకుని ఆవేశాన్ని అభినయించారు.  ఉత్తరాంధ్ర పర్యటనలోనే  అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు చెప్పడం మన చేతులతో మన కళ్ళని పొడిచే ప్రయత్నమని ధర్మాన అభివర్ణించారు. అయితే ఇది ధర్మాన వ్యక్తిగత అభిప్రాయమా? వైసేపీ విధానమా? అనేది స్పష్టం కావలసి ఉంది. అయితే, మూడు రాజధానుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని గమనిస్తే, ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టి పబ్బం గడుపుకునే వ్యూహం దాగుందనేది కాదన లేని నిజం. అందుకే ఇది ధర్మాన సొంత అభిప్రాయం, అయినా, జగన్ రెడ్డి వ్యూహమే అయినా, ఇప్పటికే రాష్ట్ర విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి అనర్ధమే అవుతుందని విజ్ఞులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఒక సారి ప్రాతీయ విద్వేషాగ్ని రాజుకుంటే, ఆర్పడం అంత తేలిగ్గా అయ్యే పని కాదని, అందుకు మళ్ళీ తెలంగాణనే కళ్ళముందున్న ప్రత్యక్ష సాక్ష్యమని అంటున్నారు. పన్నెండేళ్ల అశాంతి అలజడి, పన్నెండు వందల ప్రాణాలు బలి, చివరకు మిగిలింది అదే రాజకీయ అరాచకం అని గుర్తు చేస్తున్నారు. అదలా  ఉంటే, ధర్మాన ప్రసాద్ రావు .. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గిరాజేస్తున్నారని ప్రజలు, ప్రజాసంఘాలు మేథావులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. నిజానికి, ఒకప్పుడు, మూడు రాజధానుల ఆలోచను ధర్మాన చాలా గట్టిగా వ్యతిరేకించారు.  అమరావతి ఒక్కటే రాజధాని అనే విధానాన్ని, ‘ఏకైక రాజధాని . .. అమరావతి’ నినాదాన్ని గట్టిగా సమర్ధించారు. కానీ ఇప్పడు అదే ధర్మాన రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదని అంటున్నారు. అయితే తెలంగాణ అనుభవం తర్వాత ప్రజలు మరో ప్రాంతీయ ఆందోళనను ఎట్టి పరిస్థితిలోనూ సమర్ధించరని అంటున్నారు. ప్రస్తుతానికి అది నిజమే కావచ్చును కానీ, ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడవలసి ఉందని అంటున్నారు. మరో వంక ఓటమి భయంతోనే  వైసీపీ, ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తోందనే అంటున్నారు. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి అధికారం కోసం హైదరాబాద్ లో మత  కలహాలను రెచ్చగొడితే, ఇపుడు జగన్ రెడ్డి అధికారాన్ని నిలుపుకునేందుకు.. ప్రాతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని అంటున్నారు.

జీతాలడిగితే శత్రువులేనా? జగన్ సర్కార్ పై ఉద్యోగులు ఫైర్

ఆడ లేక మద్దెలు ఓడు అన్నట్లు తయారైంది ఏపీలో జగన్ సర్కార్ పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, విధ్వంసక  పాలన, అన్నిటినీ మించి ఆర్థిక అరాచకత్వం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా  రాష్ట్రం దివాళా అంచుకు చేరింది. ఇంత కాలం అప్పులు చేసి పబ్బం గడుపుకున్న జగన్ సర్కార్ కు రానున్న మూడు నెలల కాలం.. అంటే బడ్జెట్ వరకూ చిల్లు కానీ కూడా ఖర్చు చేయడానికి సొమ్ములు లేని పరిస్థితిలో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కాదు కదా, రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో సొమ్ములు లేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎదురు  కావడానికి జగన్ సర్కార్ విధానాలే కారణమనడంలో సందేహం లేదు. అయినా వాస్తవాలను దాచి పెట్టి మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తోంది. సమయానికి జీతాలందని ఉపాధ్యాయుులు వేతనాలెప్పుడని నిలదీస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వేతనాలివ్వండి అని ఉద్యోగులు అడుగుతుంటే.. ప్రభుత్వం మాత్రం అలా అడిగినందుకు ఉద్యోగులపై కారాలూ మిరియాలూ నూరుతోంది. అసలు వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వారికి ఇవ్వాల్సిన రాయితీలు, అలవెన్నుల మాట దేవుడెరుగు జీతాల కోసమే దేబిరించాల్సిన పరిస్థి కల్పించింది. అక్కడితో ఆగకుండా వేతనాలు అడిగినందుకు ఎదురు అసలు మీరు పని చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తోంది. సమయపాలన ఏదీ అంటూ నిలదీస్తోంది. జనవరి 1నుంచి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కు అమలు చేస్తోంది. తన తప్పు కప్పిపుచ్చుకుని ఎదురు ఉద్యోగులను పని చేయకుండా జీతాలు తీసుకుం టున్నారన్నట్లుగా మీరు ఏ రోజు సమయానికి వచ్చారని నిందలేస్తోంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు ను ఉద్యోగులు తమ ఫోన్లలో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామనిన హెచ్చరిస్తోంది. పది నిముషాలు ఆలస్యం చేస్తే ప్రభుత్వం జీతం కట్ చేస్తుంది సరే.. మరి వేతనం ఆలస్యంగా ఇస్తున్న ప్రభుత్వానికి ఏం కట్ చేయాలన్న ప్రశ్న ఎదురౌతోంది. పవర్ కట్ చేయడమొక్కటే మార్గమని అధిక శాతం మంది ఉద్యోగులు అంటున్నారు. హాజరు విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరి వేతనాలు ఇచ్చే విషయంలో ఎందుకు అంత కచ్చితంగా ఉండటం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొదటి నుంచీ కక్ష పూరితంగనే వ్యవహరిస్తోంది. వేతనాలు జాప్యం, పీఎఫ్ తదితర ప్రయోజనాల విషయంలోనూ అలసత్వం, ఏకంగా ఉద్యోగుల పీఎఫ్ ను వాడేసుకుని తిరిగి ఇవ్వకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. తమ హక్కుల పరిరక్షణ కోసం, వేతనాల కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టివేయడం, అణచివేతకు గురి చేయడం వంటి చర్యలతో దమనకాండకు తెగపడుతోంది. సమస్యలు పరిష్కరించడం మాట అటుంచి వారిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ తీరు మారకుంటే సంక్రాంతి తరువాత నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. హక్కుల పరిరక్షణ కోసం తగ్గేదేలే అని ఉద్యోగులు అంటున్నారు. ముందు ముందు ప్రభుత్వం ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగితే ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటున్నారు. 

రాహుల్ భారత్ జోడో యాత్రలో గులాంనబీఆజాద్.. హోం కమింగ్ కు సంకేతమేనా?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సత్ఫలితాలను ఇస్తోంది. పార్టీ అధిష్ఠానంతో విభేదించి బయటకు వెళ్లిన వారు ఒక్కొక్కరుగా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. రాహుల్ పాదయాత్రతో పార్టీకి పునర్వైభవం సిద్ధిస్తుందని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కు ఏ మాత్రం పట్టు లేని రాష్ట్రాలలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన లభించడం, జనం పెద్దగా రావడం దేశంలో కాంగ్రెస్ కు జనాదరణ పెరుగుతోందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఈ కారణంగానే పార్టీకి దూరమైన నాయకులు కూడా ఒక్కరొక్కరుగా ఘర్ వాపసీకి రెడీ అవుతున్నారని చెబుతున్నారు. గతంలో నేరుగా రాహుల్ గాంధీపైనే విమర్శలు గుప్పిస్తూ అప్పటి అధినేత్రి సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాసి మరీ పార్టీ నుంచి బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో  యాత్ర జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించగానే గులాం నబీ ఆజాద్  ఆయనతో అడుగు కలుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్ర పడిన జీ-23 నాయకులు కూడా ఒక్కరొక్కరుగా తమ రాహుల్ నాయకత్వాన్ని ఆమోదిస్తూ పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఆ కారణంగానే జీ-23 నాయకుడు  అఖిలేష్ ప్రసాద్ సింగ్ ను బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ హై కమాండ్ నియమించింది. అలాగే మరో అసమ్మతి నాయకుడు భూపీందర్ సింగ్ హుడాకు హర్యానా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. ఇక పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొంది.. అధిష్టానం వైఖరిపై అసంతృపతి వ్యక్తం చేసి పార్టీ వీడిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అడుగులు కూడా మళ్లీ కాంగ్రెస్ దిశగానే పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీఆజాద్ డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ దేశంలో బీజేపీని ఎదుర్కొనగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆ యాత్ర కన్వీనర్ దిగ్విజయ్ సింగ్ గులాం నబీ ఆజాద్ ను కోరారు. అలాగే ఎంపీ అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. గులాంనబీ ఆజాద్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలను బట్టి త్వరలో గులాం నబీ ఆజాద్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు, 

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి విదితమే. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేశారు.  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు.  శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రపతికి మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన సంగతి విదితమే. నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కడ విడిది చేశారు. ఆ నాలుగు రోజులూ ఆమె బిజీగా గడిపారు.   డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను విజిట్ చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. అలాగే ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. అలాగే వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. గురువారం (డిసెంబర్ 27) నారాయణమ్మ కాలేజ్ ను విజిట్ చేశారు. ఆ తర్వాత ముచ్చింతల్ లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. శనివారం( డిసెంబర్ 29) ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు . మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ముర్ము.. 3గంటల 40 నిమిషాలకు హకీంపేట నుంచి ఢిల్లీ పయనమయ్యారు.

ఏపీలో ముందస్తు తథ్యం.. మేలోనే ముహూర్తం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అయితే ఎందుకు వెళ్లారు? వెళ్లి ఏమి చేశారు? ఎవరిని కలిశారు, ఏమి మాట్లాడారు? ఏమి సాధించారు, ఏమి తెచ్చారు? అంటే  మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.  గతంలో ఆ ఇద్దరికి ఇంకొందరు కేంద్ర మంత్ర్రులకు అనేక మార్లు ఇచ్చిన, వినతి పత్రం అనబడే కోర్కెల చిట్టా   డేట్ మార్చి మరో మారు కేంద్ర నాయకులకు సమర్పించారు. నిజానికి ప్రదాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ఇచ్చిన వినతి పత్రంలో ఏదైనా ఒకటీ అరా కొత్త కోర్కెలు ఉంటే ఉన్నాయేమో కానీ, మిగిలివన్నీ సేమ్ టూ సేమ్  అదే ఇది ఇదే అది. మూడున్నరేళ్ళుగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లి పెద్దలకు ‘సమర్పించు’ కుంటున్న వినతులే ఇందులోనూ ఉన్నాయి.  అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది, ఇప్పటికే అనేక మార్లు సమర్పించిన వినతి పత్రాన్ని మరోమారు సమర్పించడానికి కాదు ముందస్తు ఎన్నికలకు ‘పెద్దల’ అనుమతి తీసుకునేందుకేనని అంతర్గత వర్గాల సమాచారం. నిజానికి, ప్రజలు వైసీపీకి ఐదేళ్లకు అధికారం ఇచ్చినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అరాచక పరిపాలన, అన్నిటినీ మించి ఆర్థిక రంగంలో క్రమశిక్షణ రాహిత్యం పుణ్యాన మూడున్నరేళ్ళకే రాష్ట్రం దివాళా అంచులకు  చేరుకుంది.  పూర్తి కాలం బండి లాగడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి అయ్యే పని కాదని ఇప్పటికే తేలిపోయింది. అందుకే,. ముందస్తుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  నిజానికి మిగిలిన కాలం సంగతి ఎలా ఉన్నా, ముందున్న మూడు నెలలు మహా గడ్డు కాలం. జీతాలకు కాదు కదా, కనీసం చాయి బిస్కెట్  వంటి రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో కాసులు లేవు. అందుకే  ఈ మూడు నెలలు కొత్త అప్పుల కోసం కేంద్రం కరుణించి అనుమతి ఇస్తే మార్చిలో బడ్జెట్ ఓకే చేసుకుని, మే  ఎన్నికల కసరత్తు ప్రారంభించాలనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అందుకే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి మోడీ, షాలకు పరిస్థితిని వివరించి...ఈ మూడు నెలలు ఆదుకుంటే ... కొత్త బడ్జెట్  ఆమోదం పొందిన తర్వాత కొత్త అప్పులతో ‘సంక్షేమ’ పథకాలు కొనసాగించి అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళతానని, అందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే  అందుకు మోడీ, షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే, మచిలీపట్నం,రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం పేరిట రూ.12 వేల కోట్ల ఋణం ఇచ్చేందుకు, గ్రామీణ విధ్యుదీకర్ణ సంస్థ ( ఆర్ఈసీ), పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ( పీఎఫ్’సీ) సూత్ర ప్రాయంగా అంగీకరించి నట్లు తెలుస్తోంది. ఇందులో 20 శాతం అంటే, అంటే దాదపు రూ.2.400 కోట్లు తక్షణం ఏపీ మ్యారిటైం బోర్డుకు ఆర్ఈసీ ఇస్తుందని అధికార వర్గాల సమాచారంగా తెలుస్తోంది. ఏ నేపధ్యంలోనే వైసీపీ సర్కార్ నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగిసిన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు చోట చేసుకోబోతున్నాయని చెప్తున్నారు. అందుకు తగినట్లుగానే ప్రభుత్వం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది.  ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పూర్తి స్థాయిలో  ఎన్నికల మూడ్  లోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఓ వంక మార్చిలో  గడప గడప చివరి రివ్యూ తర్వాత అభ్యర్ధులను ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా పేర్కొన్నారు. మరో వంక ఆయన ప్యాలెస్ గడప దాటి, బయటకు వచ్చారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాలను గమనిస్తే, ఎలక్షన్ టోన్  స్పష్టంగా వినిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూనే,  ప్రతిపక్ష పార్టీలు నాయకులు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీలో కీలక నేతలు అంతర్గతంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బయటికి మాత్రం ముందస్తు ఎన్నికల సమస్యే లేదని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు అంతర్గంతగా మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సన్నిహితుల ద్వారా  తెలుస్తోంది.  అదలా ఉంటే మంత్రి బొత్స సత్యనారాయణ  శుక్రవారం(డిసెంబర్ 29) విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ఇద్దరు గృహ సారథులను నియమించాం..వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నాం  అని కుండబద్దలు కొట్టారు. అంతే కాదు,జనవరి 1 నుంచి కన్వీనర్లు., గృహ సారథులు క్రియాశీలంగా వ్యవహరిస్తారని చెప్పారు. అంటే కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని బొత్స చెప్పకనే చెప్పారు.   అదలా ఉంటే  జగన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జనవరి 8న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. జనవరి 26 తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న గ్రామీణ ప్రాంత  పాదయాత్రలకు సన్నాహకంగా, జనవరి 8న  కర్నూలులో.. హిందూపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో అమిత షా పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. అలాగే, జనవరి 26 తర్వాత రాష్ట్రంలోని  13 వేల గ్రామాల్లో బీజేపీ చేపట్టే సంపర్క పాదయాత్రలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. సో .. అటు వైసీపీ, ఇటు బీజేపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ కదలికలు ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన సంకేతాలని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఏపీలో ముందస్తు ఎన్నికలు తథ్యమని  ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుగానే పసిగట్టారు. వచ్చే ఏడాది మే లేదా అక్టోబర్‌లో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మరోమారు ముందస్తు ప్రస్తావన చేశారు. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఓటమి భయంతో ముందస్తుకు వెళ్లనున్నారని అన్నారు. మరో వంక ముందస్తు ఎన్నికలను ముందుగా పసిగట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పటికే జిల్లాల పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. బాదుడే బాదుడు.. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. సో.. అటు అధికార పార్టీ అడుగులను గమనించినా , ఇటు ప్రతిపక్షం దూకుడు  గమించినా , ముందస్తు ఎన్నికలు తథ్యం ... అంటున్నారు విశ్లేషకులు.

సొంత విమానాలు, చాపర్లపై సీఎంల మోజు

పార్టీ అధినేతలూ, ముఖ్యమంత్రులకు ఇటీవలి కాలంలో సొంత చాపర్లు, విమానాల మీద మోజు పెరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కనీసం పట్టించుకోకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా చాపర్లు, విమానాల కొనుగోలుకు వినియోగించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.  తెరాసను భారాసగా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేసిన కేసీఆర్ ఇక  దేశ వ్యాప్తంగా చేసే పర్యటనల కోసం.. అవును కేవలం ఆయన పర్యటనల కోసమే రూ.80 కోట్లతో సొంత చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటి వరకూ దేశంలో  ఏ రాజకీయ నాయకుడూ చేయని సాహసం ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నెల నెలా ఒకటో తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఎత్తి చూపుతూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఆయన సొంత విమానం కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. పైగా ఆ విమానం ఖర్చు పార్టీ నేతలు కొందరు బరిస్తారంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె పేరు బయటకు రావడంతో... ఇక ఇలా కాదు.. నాకు విమానం వాళ్లూ, వీళ్లూ కొనిచ్చేదేమిటి..తానే కొనేస్తే పోలా అనుకున్నారు. కాగా ఇలా ప్రత్యేక విమానంలో, అంటే సొంతంగా తన కోసమే ఏర్పాటు చేసుకున్న విమానంలో జాతీయ పర్యటనలు చేసిన చరిత్ర గతంలో మోడీకి మాత్రమే ఉంది. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశ మంతటా ప్రత్యేక విమానంలో పర్యటనలు చేశారు. అయితే ఆ విమానాన్ని ఆయన కొనుగోలు చేయలేదు. ఆయనకు సన్నిహితుడిగా, మిత్రుడిగా ఉన్న ఓపారిశ్రామిక వేత్త మోడీ కోసం దానిని సమకూర్చారు.   ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్ కూడా ప్రభుత్వంలోని వీవీఐపీలు తిరిగేందుకు జెట్ విమానాలు, చాపర్లు కొనాలని నిర్ణయించారు. ఈ కొనుగోలు ప్రభుత్వం తరఫున చేయాలని నిర్ణయించేశారు. కేసీఆర్ సొంత విమానం కొనడంపై ఎలాగైతే విమర్వలు వెల్లువెత్తాయో, ఇప్పుడు నితీష్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ప్రభుత్వం జెట్ విమానాలు, చాపర్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయంపై కూడా అలాగే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం 250కోట్ల రూపాయల ఖర్చుతో జెట్  విమానాలు, చాపర్లు కొనుగోలు చేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. 

మారియన్ బయోటెక్ లో ఉత్పత్తి నిలిపివేత

ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారుల మరణాలకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడా ఫార్మా కంపెనీ మారియన్ బయోటెక్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం దగ్గు మందులే కాకుండా అన్ని రకాల మందుల ఉత్పత్తి నిలిచిపోయింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) మారియన్ బయోటెక్ ప్లాంట్ ను తనిఖీ చేసి,  ఔషధ తయారీని నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.  కాగా మారియన్ బయోటెక్ లో ఉత్పత్తిని నిలిపివసినట్లు  ఆ సంస్థ కూడా ధృవీకరించించింది.   మారియన్ బయోటెక్ కు చెందిన డాక్-1 అనే దగ్గు మందును   తీసుకున్న  18 మంది  మరణించినట్టు ఉజ్బెకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, ఔషధ నియంత్రణ, ప్రమాణాల మండళ్లు స్పందించాయి.  డాక్-1 దగ్గు మందు శాంపిళ్లను రీజినల్ డ్రగ్ లేబరేటరీకి పంపించినట్టు మాండవీయ ప్రకటించారు. వచ్చిన నివేదిక ఆధారంగా   చర్యలు తీసుకుంటామన్నారు.  దగ్గు మందు సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్‌ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ఉజ్బెకిస్థాన్ ప్రకటించింది.   దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో డాక్ 1 మ్యాక్స్ ట్యాబ్లెట్లు, సిరప్ ను  అన్ని మందుల షాపుల నుంచి విత్ డ్రా చేస్తున్నట్లు పేర్కొంది. 2022లో ఇలా భారత్ లో తయారైన దగ్గు మందు సేవించి చిన్నారులు మరణించటం ఇదే మొదటి సారి కాదు.   ఇంతకు ముందు అంటే అక్టోబర్ లో అక్టోబర్‌లో   గాంబియాలో 70 మంది చిన్నారులు మేడ్ ఇన్ ఇండియా కాఫ్ సిరప్ కారణంగా మరణించారు. దీనికి కారణమైన హర్యానా లోని మైడెన్ ఫార్మాను అప్పట్లో కేంద్రం సీజ్ చేసింది కూడా.   ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు భారతీయ కంపెనీ   దగ్గు మందు కారణంగా పిల్లలు మరణించినట్లు అధికారిక ధృవీకరణ లేదు. తాజాగా  ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు మందు తాగి  చిన్నారులు మృతి చెందడంపై తదుపరి పరిశోధనలకు సహకరించేందుకు డబ్ల్యుహెచ్ ఓ చర్యలకు ఉపక్రమించింది.  చ 

మీ అమ్మ మాకూ అమ్మే.. మోడీకి మమత సంతాప సందేశం

రాజకీయ పక్షాలు శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా వ్యవహరించాలి. అయితే తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం ఉందా అన్నట్లుగా వారి విమర్శలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ విమర్శలు కాదు దూషణలకు పాల్పడుతున్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఒక మానవీక కోణం ఉందన్నసంగతిని మరచిపోతున్నారు. మంచి జరిగినప్పుడు అభినందించడం.. ఏదైనా విషాదం జరిగినప్పుడు సానుభూతి వాక్యాలు చెప్పడం.. విజ్ణత అనిపించుకుంటుంది.  అలాటి విజ్ణతను   పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూపారు. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉండి కూడా ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ లో  హౌరా నుంచి న్యూ జల్పాయిగురి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీకి పంపింన సంతాప సందేశంలో హృద్యంగా స్పందించారు. తల్లి పోయిన బాధలో ఉన్నారు. అయినా పశ్చిమ బెంగాల్ కు వందే భారత్ రైలును ప్రారంభించారు. అందుకు దన్యవాదాలు అని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న మీకు ప్రగాఢ సాను భూతి. మీకు తల్లి మాకు కూడా తల్లే.. మీకు భగవంతుడు ఈ విషాదాన్ని తట్టుకునే మనో బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి అని ట్వీట్ చేశారు.   మీకు ఈ రోజు ఎంతో విచారకరమైనది. అయినప్పటికీ, ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరు కావడం అదొక గౌరవం.   మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు  అని మమతా బెనర్జీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  

మాణికం ఠాకూర్ కు ఉద్వాసన

కొత్త సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులకు హైకమాండ్ శ్రీకారం చుట్టనుందా అన్న ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభానికి కారణమైన సీనియర్, జూనియర్ల మధ్య అగాధాన్ని పూడ్చేందుకు మధ్యే మార్గంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుందని  అంటున్నారు. సీనియర్లలో అసంతృప్తి ఒకింత తగ్గించి, అదే సమయంలో  జూనియర్లను చిన్నబుచ్చకుండా పార్టీలో మార్పులు, చేర్పులూ చేసేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేసిందని చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ఈ మార్పులు జరుగుతాయని చెబుతున్నారు.  ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్లకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూరుకు కొత్త సంవత్సరం తొలి నెలలోనే ఉద్వాసన పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ లో అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. అసలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఇటీవల రాష్ట్ర పార్టీలో సంక్షోభ నివారణకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ నే నియమించాలన పార్టీ హైకమాండ్ భావించినా అందుకు డిగ్గీ రాజా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరో సమర్ద నేత కోసం అన్వేషణ మొదలైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   సీనియర్లతో పాటుగా పార్టీ మారిన నేతలు కూడా మాణికం ఠాకూర్ పై  తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, అలాగే    పార్టీలో సంక్షోభ నివారణ కోసం రాష్ట్రానికి వచ్చిన డిగ్గీ రాజా ఎదుట సీనియర్లు  ఠాగూర్‌పై ఫిర్యాదులు చేయడంతో అధిష్ఠానం  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కొత్త వ్యక్తిని నియమించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  పార్టీలో విభేదాల పరిష్కారం విషయంలో మాణికంఠాకూర్ విఫలమయ్యారన్న అభిప్రాయం పార్టీ హైకమాండ్ లో వ్యక్తం అవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పై కూడా సీనియర్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనను మార్చే విషయంలో ఏఐసీసీ సుముఖంగా లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   ప్రస్తుతం సీనియర్ల తిరుగుబాటు నేపథ్యంలో వారిని చల్లబరిచేందుకు  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను తప్పించడమే మార్గమని పార్టీ హైకమాండ్ భావిస్తోందంటున్నారు  డిగ్గీ రాజా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన నేపథ్యంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు  రణదీప్ సుర్జేవాలా,  పీ పన్నాలాల్ పునియా పృథ్వీరాజ్ చౌహాన్​ పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మాణికం ఠాకూర్ ను మార్చడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడుతుందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.

కొత్త సంవత్సరంలోకి పాత పంచాయతీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన సంవత్సరాలు ఒకెత్తు అయితే  2022 సంవత్సరం ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  కేంద్ర రాష్ర్త ప్రభుత్వాల మధ్య దూరం పెరిగింది. సంవత్సరం ఆరంభంలో కేంద్రం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన యుద్ధం, చినికి చినికి గాలి వానగా మారింది. మరో వంక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత సంవత్సరం చివర్లో ( నవంబర్ 2021) జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఉత్సాహంతో  రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించింది. జులైలో బీజేపీ జాతీయ కార్యవర్గ  సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించి... రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసకు సవాల్ విసిరింది. మరో వంక జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు తెరాస అధినేత , ముఖ్యమంత్రి కేసిఆర్ బీజేపీ యేతర, కాంగ్రెస్సే తర పార్టీలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగించారు.. అయితే, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక పోవడం వల్లనో ఏమో .. కూటమి ప్రయత్నాలు పక్కన పెట్టి, తెరాస పేరును భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) గా మార్చి జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం  చేశారు.  అయితే ఆ ప్రయత్నాల సంగతి ఎలా ఉన్నా..  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన దూరం రాజకీయంగా  బీజేపీ, బీఆర్ఎస్  మధ్య పెరిగిన వైరం  సంవత్సరం చివరకు వచ్చే సరికి మూడు వివాదాలు .. ఆరు కొట్లాటలు చందంగా మారింది. స్కాములు, సిబిఐ విచారణలు, ఈడీ దాడులు, కోర్టు విచారణలు, అరెస్టులుగా కథ నడుస్తోంది.  ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్రంలో  చోటుచేసుకున్న మద్యం స్కామ్ తెలంగాణను కుదిపేసింది. మద్యం స్కాంలో భాగంగా తెలంగాణ వైపు దర్యాప్తు సంస్థలు తిరిగి చూశాయి.  హైదరాబాదులో ముడుపులు పట్టుకున్నాయి. ముడుపులు, పర్మిట్ల బాగోతంలో ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోయినపల్లి అభిషేక్ రావు తదితరుల పేర్లు ఛార్జీషీటులోకి ఎక్కాయి.   నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ తరపున కొందరు ప్రయత్నించడం ఈ ఏడాది తెలంగాణ రాజకీయాల్లో మరో హైలైట్ గా నిలిచింది. గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి బీజేపీలో చేరితే వందల కోట్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ ఉంటుందని నిందితులు చెప్పిన ఆడియోలు, వీడియోలు వెలుగు చూశాయి. బీజేపీ ప్రతిష్ట మసకబారింది, అయితే .. సంవత్సరం చివర్లో అటు లిక్కర్ కేసు, ఇటు ఎమ్మెల్యేల బేరసారాల కేసు మలుపులు తిరుగుతోంది ..  కొత్త సంవత్సరంలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో .. ఎక్కడికి చేరుతుందో .. 

రౌండప్ 2022..గుజరాత్ లో మళ్లీ బీజేపీ ప్రభంజనం

డిసెంబర్  కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. డిసెంబర్ 1..  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 189 స్థానాలకు గానూ 89 నియోజక వర్గాల్లో జరిగిన మొదటి విడత పోలింగ్లో 56.8 శాతం పోలింగ్ జరిగింది . రెండవ తుది విడత పోలింగ్ డిసెంబర్ 5 న జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు.  భారత దేశం జీ 20 అధ్యక్ష పదవిని స్వీకరించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలు నిర్వహించారు. కాగా, విదేశాంగ సఖ మంత్రి జైశంకర్ జీ 20 అధ్యక్ష పీఠం నుంచి  భారత దేశం, ప్రపంచానికి తన గళాన్ని వినిపిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచారు. డిసెంబర్ 3.. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. భారత టేబుల్ టెన్నిస్ వెటరన్ ఆటగాడు శరత్ కమల్ కు అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో అతను 3 బంగారు పతకాలు, ఒక రజతం సాధించాడు. డిసెంబర్ 4.. నేడు భారత నౌక దినోత్సవం .. నేవీ డే ..ఈ సందర్భంగా...దేశమంతా నేవీ సేవల్ని స్మరించుకుంటోంది. 1971లో భారత్, పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో "ఆపరేషన్ ట్రిడెంట్" తో  విజయం సాధించింది నావికా దళం. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత నౌకా దళ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖులంతా నేవీ సేవలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  డిసెంబర్ 5.. గుజరాత్ రెండవ దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. రెండవ దశలో మొత్తం 2.54 కోట్ల ఓటర్లు (59శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.  డిసెంబర్ 8.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీ 156 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 17, ఆమాద్మీ 5 సీట్లలో విజయం సాధించింది. ఇతరులకు 4 స్థానాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్‌ లో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ.. ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని..అక్కడి ప్రజలు ఈసారి కూడా కొనసాగించారు. బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు.  డిసెంబర్ 10.. ప్రపంచ  మానవ హక్కుల దినోత్సవం. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన రోజు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన వెలువడిన రోజు. ఈ సంవత్సరం దరికీ సమాన గౌరవం, స్వేచ్ఛ సమ న్యాయం’ అనే థీమ్’ ప్రధాన అంశంగా జరుపుకుంటున్నారు.   డిసెంబర్ 15.. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం రాజ్యాంగ పద్ధతుల ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని, రహదారిపై కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇరు రాష్ట్రాలను కోరారు.కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలతో సమావేశం అనంతరం షా మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల మంత్రులతో ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. డిసెంబర్ 22.. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కొవిడ్ కేసుల పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఈ మేరకు అయన లోక్ సభలో ఒక ప్రకటన్ చేశారు  ముఖ్యంగా రాబోయే పండుగలు,నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. డిసెంబర్ 26... ప్రజల్లో న్యూనతాభావాన్ని కలిగించడానికి చరిత్ర పేరుతో కల్పిత కథనాలు బోధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వీటిని అధిగమించి ముందుకు సాగాలంటే తొలుత సంకుచిత భావజాలం నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలంలో కోల్పోయిన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు గతంలో చోటుచేసుకున్న తప్పిదాలను నవీన భారత్‌ సరిదిద్దుతోందని అన్నారు. గురు గోవింద్‌ సింగ్‌ వారసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. తొలిసారి నిర్వహించిన ‘వీర్‌ బాల్‌ దివస్‌’ కార్యక్రమంలో ప్రధాని మోడీ  పాల్గొని ప్రసంగించారు. డిసెంబర్ 26..భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపిన చైనా, పాకిస్థాన్‌లు మన దేశంపై ఎప్పుడైనా దాడి చేయొచ్చని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యపై స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాహుల్‌ గాంధీ ఇంకా 1962ల్లోనే జీవిస్తున్నారని విమర్శించారు. డిసెంబర్27.. దేశంలో కోవిడ్ ఎమర్జెన్సీ సన్నద్ధతను అంచనా వేసేందుకు దేశంలోని  అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. జమ్మూ మరియు కాశ్మీర్ నుండి అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీర్ల మొదటి బ్యాచ్ భారత సైన్యంలో చేరింది.భోపాల్‌లో జరిగిన మహిళల బాక్సింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో లోవ్లినా బోర్గోహైన్ మరియు నిఖత్ జరీన్ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. డిసెంబర్ 29.. బ్రెజిల్‌ దిగ్గజం, ఫుట్‌బాల్‌ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే సావోపాలోలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 29.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం పార్టీని నడుపుతారని, గాంధీ కుటుంబం చేతిలోనే నాయకత్వం ఉంటుందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన మాటలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీకి అస్త్రంగా మారాయి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ పై  సీఆర్ పీఎఫ్ స్పందించింది. సెక్యూరిటీ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంలేదని, రాహుల్ గాంధీ భద్రతా మార్గదర్శకాలను తరచూ ఉల్లంఘించారని పేర్కొంది. 2020 నుంచి ఇప్పటి వరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను రాహుల్ అతిక్రమించారని, ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసినట్లు వివరించింది. తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెరలేచింది. మొత్తం 783 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్ సీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగ ఖాళీలు ఉండగా, 126 మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్టులు, 98 తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి. మధ్యాహ్నం 12:27 గంటలకు గౌహతికి ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం యొక్క లోతు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. డిసెంబర్ 30.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలు

శుక్రవారం ఉదయం  జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళుతుండగా రూర్ఖీ వద్ద రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొంది. దీంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తొలుత పంత్కు రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంత్ కు వీపు, నుదురు మీద, కాలికి గాయాలయ్యాయి . కారులో మంటలు చెలరేగుతున్న సమయంలో కారు విండో పగలగొట్టుకుని రిషభ్ పంత్ బయటకు దూకేశాడు. కారు పూర్తిగా దగ్ధమైంది.  రిషబ్ పంత్ ఒక్కడే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు.  మంగ్లౌర్ పీఎస్ పరిధిలోని నేషనల్ హైవే-58లో జరిగిన ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని   పంత్‌ను రూర్కీలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం రిషభ్ పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. పంత్ కు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టీమ్ ఇండియా వికెట్ కీపర్ గా ఇప్పుడిప్పుడే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న పంత్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకూ టీమ్ ఇండియా జట్టుకు 33 టెస్టులు, 30 వన్డేలు, 66 టి20లకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 56 ఇన్నింగ్స్ లో రెండు 2271 పరుగులు చేశాడు. అత్యదిక స్కోరు 159 నాటౌట్. వన్డేల్లో 30 మ్యాచ్ లు ఆడి  865 పరుగులు చేశాడు. ఇక టి20లలో అయితే 66 మ్యాచ్ లు ఆడి 987 పరుగులు చేశాడు.  

ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

ఫుట్ బాల్ లెజండ్ పీలే కన్నుమూశారు. 82 ఏళ్ల పీలే క్యాన్సర్ తో పోరాడుతూ గురువారం(డిసెంబర్ 29) అర్ధరాత్రి  సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.  సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ క్రీడాకారుడిగా పీలే గుర్తింపు పొంందారు.  అలాగే మూడు ప్రపంచ కప్ విజయాలలో భాగస్వామిగా ఉన్న ఏకైక సాకర్ క్రీడాకారుడు పీలేయే.   1958, 1962, 1970లలో ప్రపంచ సాకర్ విజేత బ్రెజిల్ జట్టులో పీలో సభ్యుడు .  నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ కు ప్రాతినిధ్యం వహించిన పీలే ప్రత్యర్థి జట్ల డిఫెన్స్ ను ఛేదించి  మెరుపు వేగంతో బంతిని గోల్‌ పోస్టులోకి పంపేసి క్రీడాభిమానులు, ప్రేక్షకులనే కాకుండా ప్రత్యర్థి క్రీడాకారులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచేసే వాడు. 1966లో నే సాకర్ కు గుడ్ బై చెప్పాలని భావించినా, ఆ నిర్ణయాన్ని మార్చుకుని  మళ్లీ జట్టులోకి వచ్చాడు. 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి అందుకున్నాడు.   ప్రపంచకప్‌లలో 14 మ్యాచుల్లో 12 గోల్స్ సాధించాడు. పీలే మృతి పట్ల  సాకర్ ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.  

కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కులు

కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కు మొదలైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో హస్తం పార్టీకి ఇంటా బయట చిక్కులు ఎదురవుతున్నాయా అంటే, అవునన్న సమాధానమే వస్తోంది. ఓ వంక  గాంధీ కుటుంబ విధేయుడు,  కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు  పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీని మానవాతీతుడిగా అభివర్ణించిన సల్మాన్ ఖుర్షీద్  తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  పేరుకే అధ్యక్షుడు, పవర్స్ మాత్రం గాంధీల చేతుల్లోనే ఉన్నాయి. ఉంటాయి ..  అంటూ పార్టీ అధ్యక్షుడు, గాంధీల రిమోట్  కంట్రోల్ తో పనిచేస్తారని బీజీపే చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. నిజానికి  ఖుర్షిద్ చెప్పింది కొత్త విషయం కాదు. ఒకప్పుడు చిదంబరం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీ రోజు వారీ కార్యకలాపాలు ఖర్గే చూస్తారు. విధాన పరమైన నిర్ణయాలు, ఇతరత్రా ముఖ్య నిర్ణయాలు గాంధీలను సంప్రదించే తీసుకుంటారని అన్నారు. ఇప్పడు అదే విషయాన్ని ఖుర్షిద్,  ఖుల్లం ఖుల్లాగాబయట పెట్టారు.    కాంగ్రెస్ పార్టీ సారథి గాంధీ కుటుంబమే  అందులో సందేహం లేదు. కేవలం పార్టీ కార్యకలాపాలపైన దృష్టి సారించేందుకే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారని తెలిపారు. అయితే అది నిజమే అయినా ఇప్పడు ఖుర్షిద్ యాదృచ్చికంగా, ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనే చర్చ జరుగుతోంది.  నిజానికి  బీజేపీ ఎప్పటి నుంచో ఇదే ఆరోపణ చేస్తోంది. ఇపుడు సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్య  ను ఆసరా చేసుకుని ఖర్గే కాంగ్రెస్ పార్టీకి రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడా? రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడా? అని ప్రశ్నించింది. ఖుర్షిద్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అసలు నిజం బయటపడిందన్నారు. భజనపరత్వం, వంశపారంపర్య రాజకీయాలనే కాంగ్రెస్ నమ్ముకుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నారనేదానితో సంబంధం లేదని పగ్గాలు మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చేతుల్లోనే ఉంటాయన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా? రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అని పిలవాలా? అని నిలదీశారు. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఎటువంటి అధికారం ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేదన్నారు. గాంధీలు ఏం చెబితే దానినే ఖర్గే చేస్తారన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికలు ఓ బూటకమని విమర్శించారు. మరో వంక మనీలాండరింగ్ కేసులో తనపై దర్యాప్తును రద్దు చేయాలని రాబర్ట్ వాద్రా చేసిన దరఖాస్తును రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ మరో మారు గాంధీ కుటుంబాని టార్గెట్ చేసింది. భారత రాజకీయాల్లో గాంధీ కుటుంబం అత్యంత అవినీతిపరుల కుటుంబమని దుయ్య బట్టింది. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనం వీడాలని బీజేపీ డిమాండ్ చేసింది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈ అవినీతి జరిగిందన్నారు. భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం ఇది. అవినీతికి పాల్పడటం, భూములను కబ్జా చేసి రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే దాని పని. కుటుంబంలో ముగ్గురు సభ్యులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారని ఎద్దేవా చేశారు.  అదలా ఉంటే రాహుల గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, రాహుల్ గాంధీ, విపక్షాల ముఖ్యనేతగా  ఆమోదం పొందుతున్నారని, కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్న వేళ, ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భారత్ జోడో యాత్రకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని తెగేసి చెప్పారు. అంతే కాదు, తమ పార్టీ సిద్ధాంతం, భావజాలం ప్రత్యేకమైనవన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని వ్యాఖ్యానించారు.   మరో ఐదారు రోజుల్లో జనవరి 3 న యాత్ర ఉత్తర ప్రదేశ్ లో ప్రవేశిస్తున్నవేళ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ యాత్రలో పాల్గొనాలని బీజేపీ యేతర పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నేతలు ఇటీవల చెప్పారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్‌డీ నేత జయంత్ చౌదరిలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలోనే  అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. జోడో యాత్రలో పాల్గొనాలని తమకు ఆహ్వానమే అందలేదన్నారు.  నిజానికి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాకపోయినా, యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తం వచ్చి చేరుతుందని, తద్వారా కాంగ్రస్ పార్టీ బలపడడంతో పాటుగా, రాహుల్  గాంధీ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని, ఆశించారు. అయితే, భారత్ జోడో యాత్ర ఈ లక్ష్యాన్ని  చేరుకుందా ? అంటే, కొంత వరకు మాత్రమే అనే సమాధానం వస్తోంది.

దేవుని పాదాల చెంతకు చేరిన వందేళ్ల అద్భుత కాలం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి, 100ఏళ్ల హీరాబెన్ మోదీ.. గుజరాత్ అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఒక అద్భుతమైన 100ఏళ్ల కాలం.. దేవుడి పాదాల వద్దకు చేరింది. అమ్మలో నిస్వార్థ కర్మయోగి, జీవితానికి కావాల్సిన విలువలను చూశాను. 100వ జన్మదినం నాడు నేను అమ్మని చూసినప్పుడు నాకు ఒక విషయం చెప్పింది. అది నేను ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాను. ఇంటెలిజెన్స్ తో పని చేయ్యి, స్వచ్ఛతగా జీవించు అని చెప్పింది," అని మోదీ అన్నారు. 100ఏళ్ల హీరాబెన్ మోదీ.. అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం అహ్మదాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ వార్త తెలుసుకున్న ప్రధాని.. ఢిల్లీ నుంచి వెంటనే అహ్మదాబాద్కు వెళ్లి ఆమెను పరామర్శించారు. వైద్యులతో ఆమె ఆరోగ్యం గురించి చర్చించారు. హీరాబెన్ మోదీ కోలుకుంటున్నారని, ఒకటి- రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్ఛ్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె మరణవార్తను శుక్రవారం ఉదయం వెల్లడించారు మోదీ. యూఎన్ మెహ్తా హార్ట్ హాస్పిటల్ వర్గాల ప్రకారం.. హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ సోదరుడు పంకజ్ మోదీతో కలిసి గాంధీనగర్లని రాయ్సన్ అనే గ్రామంలో నివాసముండేవారు హీరాబెన్ మోదీ. హీరాబెన్ మోదీతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పుడు గుజరాత్ వెళ్లినా.. తల్లితో గడుపుతారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో.. కచ్చితంగా ఆమె ఆశీర్వాదాలు తీసుకుని వెళతారు. పుట్టిన రోజు సందర్భంగానూ.. తల్లి వద్దకు వెళ్లి మిఠాయిలు తినిపించే వారు మోదీ.ఇక తల్లి మరణవార్త తెలుసుకున్న మోదీ.. గుజరాత్  బయలుదేరారు.ప్రధాని మోదీ తల్లి మరణం పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్‌ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి అంజనీకుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్‌ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమిస్తూ, ఆయనకు విజిలెన్స్‌ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్‌ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగానూ, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ డీజీగా బదిలీ చేశారు. హైదరాబాద్‌ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా.. ప్రొవిజన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు.  డీజీపీ మహేందర్‌రెడ్డి  అనారోగ్యంతో  కొంతకాలం సెలవులో ఉన్న సమయంలోనూ అంజనీకుమార్‌ ఇన్‌చార్జి డీజీపీగా ఉన్నారు.