తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్
posted on Dec 30, 2022 5:58AM
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు.
అంజనీకుమార్ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమిస్తూ, ఆయనకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగానూ, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌ను సీఐడీ డీజీగా బదిలీ చేశారు.
హైదరాబాద్ శాంతిభద్రతల అదనపు కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా.. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి అనారోగ్యంతో కొంతకాలం సెలవులో ఉన్న సమయంలోనూ అంజనీకుమార్ ఇన్‌చార్జి డీజీపీగా ఉన్నారు.