నెల్లూరులో హోరాహోరీ

      నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం, వైకాపా హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ జిల్లాలో రెండు పార్టీల బలాలు సమానంగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం ఆరు మునిసిపల్ స్థానాలున్నాయి. గూడూరులోని 33 వార్డుల్లో 16 తెలుగుదేశం గెలుచుకోగా 15 వార్డులు వైకాపా గెలుచుకుంది. వామపక్షాలు, ఇతరులు ఒక్కో స్థానాన్ని పొందారు. కావలిలోని 40 వార్డుల్లో కాంగ్రెస్ 2, తెలుగుదేశం 16, వైకాపా 20, ఇతరులు 2 స్థానాలు గెలిచారు. వెంకటగిరిలోని 25 స్థానాల్లో 1 కాంగ్రెస్, 21 తెలుగుదేశం, 2 వైకాపా, 1 ఇతరులు గెలిచారు. ఆత్మకూరులోని 23 వార్డుల్లో కాంగ్రెస్ 8 వార్డులు గెలిచింది. తెలుగుదేశం 4, వైకాపా 10, ఇతరులు 1 వార్డు గెలిచారు. సూళ్ళూరుపేటలోని 23 వార్డుల్లో 2 కాంగ్రెస్, 8 తెలుగుదేశం 10 వైకాపా, 2 ఇతరులు గెలిచారు. నాయుడుపేటలోని 20 వార్డుల్లో 14 తెలుగుదేశం, 6 వైకాపా గెలిచాయి.

గుంటూరు జిల్లాలోనూ తెలుగుదేశానిదే ఆధిక్యం

      గుంటూరు జిల్లాలో కూడా మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో మొత్తం 12 మునిసిపల్ స్థానాలున్నాయి. వీటిలో 11 మునిసిపల్ స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెనాలిలోని 40 స్థానాల్లో ఇప్పటి వరకు 10 స్థానాలను తెలుగుదేశం, మూడు స్థానాలను వైకాపా గెలుచుకుంది. నరసరావుపేటలోని 40 స్థానాల్లో 18 తెలుగుదేశం, 15 తెలుగుదేశం గెలవగా ఒక స్థానంలో వామపక్షాలు విజయం సాధించాయి. బాపట్లలోని 34 స్థానాల్లో ఒక స్థానాన్ని కాంగ్రెస్, 8 స్థానాలను తెలుగుదేశం, 6 స్థానాలను వైకాపా, ఒక స్థానాన్ని ఇతరులు గెలిచారు. రేపల్లె మునిసిపాలిటీలోని 28 స్థానాల్లో మూడు స్థానాలను కాంగ్రెస్, పదహారు స్థానాలను తెలుగుదేశం, తొమ్మిది స్థానాలను వైకాపా గెలిచాయి. చిలకలూరిపేటలోని 34 స్థానాల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 15 స్థానాలు వైకాపా గెలిచాయి. ఒక స్థానాన్ని ఇతరులు సొంతం చేసుకున్నారు. పొన్నూరులోని 31 స్థానాల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 13 స్థానాలు వైకాపా గెలిచాయి. మంగళగిరిలోని 32 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 14, వైకాపా 8, వామపక్షాలు 6, ఇతరులు 1 స్థానం గెలిచారు. మాచర్లలోని 29 స్థానాల్లో తెలుగుదేశం 20, వైకాపా 8, ఇతరులు 1 స్థానాన్ని గెలిచాయి. సత్తెనపల్లిలోని 30 స్థానాల్లో 1 కాంగ్రెస్, 15 తెలుగుదేశం, 13 వైకాపా, 1 ఇతరులు గెలిచారు. వినుకొండలోని 26 స్థానాల్లో మూడు కాంగ్రెస్, ఆరు తెలుగుదేశం, ఎనిమిది వైకాపా, నాలుగు వామపక్షాలు, ఐదు ఇతరులు గెలిచారు. ఇక్కడ ఎవరికీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. పిడుగురాళ్ళలోని 30 స్థానల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 12 స్థానాలు వైకాపా గెలిచాయి. తాడేపల్లిలోని 23 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 3, వైకాపా 18, ఇతరులు ఒక స్థానం గెలిచారు.

విజయనగరంలో తెలుగుదేశం విజయఢంకా

      విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించింది. జిల్లాలోని నాలుగు మునిసిపల్ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. బొబ్బిలి స్థానం విషయంలో మాత్రం ఏ పార్టీకి ఆధిక్యం లభించలేదు. విజయనగరంలోని 40 స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీడీపీ 22 స్థానాల్లో విజయం సాధించగా, వైకాపా ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు ఒక స్థానాన్ని పొందారు. బొబ్బిలిలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, తెలుగుదేశం 13 స్థానాల్లో గెలవగా, వైకాపా 15 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఛైర్మన్ అవుతాడో అర్థం కాని పరిస్థితి వుంది. పార్వతీపురంలోని 30 స్థానాల్లో తెలుగుదేశం 14 స్థానాలు, వైకాపా 10 స్థానాలు పొందాయి. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. సాలూరులోని 29 స్థానాల్లో మూడు కాంగ్రెస్, పదిహేడు తెలుగుదేశం, వైకాపా తొమ్మది స్థానాల్లో గెలిచాయి.

శ్రీకాకుళంలో రెండేసి స్థానాలు పంచుకున్నారు

      శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మునిసిపల్ స్థానాల్లో టీడీపీ రెండు స్థానాల్లో గెలవగా, వైకాపా రెండు స్థానాల్లో గెలిచింది. పలాస, పాలకొండ స్థానాలను తెలుగుదేశం గెలుచుకోగా, ఆముదాల వలస, ఇచ్ఛాపురం స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. ఆముదాల వలసలో మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ (3), తెలుగుదేశం (7), వైకాపా (11), ఇతరులు (2) స్థానాల్లో గెలిచారు. ఇచ్ఛాపురంలో 23 స్థానాలుంగా తెలుగుదేశం (8), వైకాపా 13 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు రెండు స్థానాలు పొందారు. పలాసలోని 25 స్థానాల్లో తెలుగుదేశం 17 స్థానాల్లో, వైకాపా 8 స్థానాల్లో గెలిచాయి. పాలకొండలోని 20 స్థానాల్లో తెలుగుదేశం 12 స్థానాలు, వైకాపా 3, ఇతరులు 5 స్థానాలు పొందారు.

తెలంగాణలో కౌన్సిలర్ స్థానాల్లో అగ్రస్థానంలో కాంగ్రెస్

      రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో నేలమట్టమైపోయింది. తెలంగాణ మాత్రం ఈ పార్టీ టీఆర్ఎస్‌ కంటే ముందంజలో వుంది. మొత్తం కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో మొత్తం 1399 కౌన్సిలర్ స్థానాలు వున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1321 కౌన్సిలర్ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 485 స్థానాలు గెలుచుకుంది. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి 306 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈ పార్టీ 147 వార్డుల్లో గెలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ వైపు మొగ్గిన ఓటరు

      సీమాంధ్రలో సర్వనాశనమైపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం రాష్ట్రం ఇచ్చిన క‌ృతజ్ఞతలు పొందుతోంది. ఇప్పటి వరకు వెల్లడయిన మునిసిపల్, కార్పొరేషన్ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌తో పోటాపోటీగా వుంది. తెలుగుదేశం పార్టీ గౌరవప్రదమైన సంఖ్యలు కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థానాలు పొందుతున్నప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా తమదే హవా నడుస్తుందని భావించిన టీఆర్‌ఎస్‌కి మాత్ర మునిసిపల్ ఎన్నికలలో ఓటర్లు షాక్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితిని చూస్తే ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టు ప్రాథమిక ఫలితాలు చెబుతున్నాయి.

కడప జిల్లాలో బద్వేలు టీడీపీదే

      కడప జిల్లాలో వైఎస్సార్ బతికి వున్నంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం వుండేది. వైకాపా ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో అగ్రస్థానాన్ని వైకాపా సొంతం చేసుకుందని ఆ పార్టీ నాయకులు భావిస్తూ వస్తున్నారు. అయితే అవన్నీ భ్రమలనే విషయాన్ని ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కడప జిల్లాలో వైసీసీ కీలకమైన స్థానంగా భావిస్తున్న బద్వేలు మునిసిపల్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడున్న పద్నాలుగు కౌన్సిలర్ల స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 13 స్థానాలు కైవసం చేసుకోగా వైసీపీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే సొంతం చేసుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఏలూరులో పుంజుకున్న తెలుగుదేశం

      ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. ఈ కార్పొరేషన్‌లో కౌంటింగ్ మొదలైన కాసేపటికి వైసీపీ ఆధిక్యం కనిపించింది. తెలుగుదేశం పార్టీ వెనుకబడిపోయింది. సీమాంధ్ర అంతటా తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు సాధిస్తున్న దశలో ఏలూరు కార్పొరేషన్‌లో మాత్రం వైకాపా అనుకూలత కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొంత సమయం గడిచిన తర్వాత ఏలూరులో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ వైకాపాని దాటుకుని ముందుకు వెళ్ళింది. ఏలూరు కార్పొరేషన్‌‌లోని 45 స్థానాల్లో ‌16 స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యంలో వుండగా, వైకాపా 5 స్థానాల్లో ఆధిక్యంలో వుంది.

సీమాంధ్ర జిల్లాల్లో 10 గంటల వరకు కౌన్సిలర్ల ఫలితాలు

      సీమాంధ్ర జిల్లల్లో సోమవారం ఉదయం 10 గంటల వరకు వివిధ పార్టీలు గెలిచిన కౌన్సిలర్ల సంఖ్య వివరాలు ఇలా వున్నాయి.   శ్రీకాకుళం - కాంగ్రెస్ (1), తెలుగుదేశం (33), వైకాపా (28), వామపక్షాలు (0), ఇతరులు (9) విజయనగరం -  కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (0), వామపక్షాలు (0), ఇతరులు (5) విశాఖపట్నం - కాంగ్రెస్ - (1), తెలుగుదేశం 22), వైకాపా (3), వామపక్షాలు (0), ఇతరులు 0) తూర్పు గోదావరి - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (75), వైకాపా (46), వామపక్షాలు (1), ఇతరులు 5) పశ్చిమ గోదావరి - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (0)  వైకాపా (0), వామపక్షాలు (0), ఇతరులు (0) కృష్ణ - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (5), వైకాపా (4), వామపక్షాలు (0), ఇతరులు (1) గుంటూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (42), వైకాపా (23), వామపక్షాలు (4), ఇతరులు (0) ప్రకాశం - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (27), వైకాపా (13), వామపక్షాలు (0), ఇతరులు (0) నెల్లూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (26) వైకాపా (15), వామపక్షాలు (0), ఇతరులు (4) చిత్తూరు - కాంగ్రెస్ (3), తెలుగుదేశం (14) వైకాపా (24), వామపక్షాలు (0), ఇతరులు (4) కడప - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (27), వైకాపా (40), వామపక్షాలు (0), ఇతరులు (3) కర్నూలు - కాంగ్రెస్ (0), తెలుగుదేశం (8), వైకాపా (13), వామపక్షాలు (0), ఇరులు (0) అనంతపురం - కాంగ్రెస్ (1), తెలుగుదేశం (6), వైకాపా (0), వామపక్షాలు (1), ఇతరులు (0)

కేసీఆర్ ఇలాకాలో టీడీపీ ముందంజ

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు అనుమానమే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెలువడుతున్న మునిసిపల్ ఫలితాలలో టీడీపీ ముందంజలో వుండటం విశేషం. గజ్వేల్ మునిసిపల్ ఫలితాలలో ఇప్పటి వరకూ ఆరు కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. వీటిలో తెలుగుదేశం నాలుగు స్థానాలను సొంతం చేసుకుని ముందంజలో వుంది. మిగిలిన రెండు స్థానాలను ఒకటి కాంగ్రెస్, మరొకటి తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకున్నాయి. ఇక్కడ ఫలితాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా వుండే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మునిసిపల్ ఫలితాలలోనే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుందంటే, అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

చిత్తూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం విజయం ఖాయం

      సీమాంధ్రలో తెలుగుదేశం హవా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ బలం పెరుగుతూ వుంది. సీమాంధ్రలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని మునిపిపాలిటీలను గెలుచుకుంది. చాలా మునిసిపాలిటీలలో ముందంజలో వుంది. అలాగే కార్పొరేషన్ ఫలితాలలో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో వుంది. చిత్తూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్తూరులోని 50 కొర్పొరేషన్ స్థానాల తెలుగుదేశం పార్టీ 20 స్థానాలను ఇప్పటికే గెలుచుకుంది. ఈ కార్పొరేషన్ మీద బాగా ఆశలు పెట్టుకున్న వైకాపా 3 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలిచి వైకాపా కంటే అగ్రస్థానంలో వున్నారు.

తెలంగాణలో ఫలితాలు.. 9.30 సమయానికి...

      పురపాలక ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలలో వివిధ పార్టీలు గెలుచుకున్న కౌన్సిలర్ల సీట్లను గమనిస్తే.. ఆదిలాబాద్: కాంగ్రెస్ (4), తెలుగుదేశం (1), తెరాస (5), వామపక్షాలు (2), ఇతరులు (6). కరీంనగర్: కాంగ్రెస్ (24), తెలుగుదేశ౦: (3), తెరాస (34), ఇతరులు (16), వరంగల్: కాంగ్రెస్ (22), తెలుగుదేశం (2), తెరాస (15), ఖమ్మం: కాంగ్రెస్ (2), తెలుగుదేశం (1), వామపక్షాలు (1), ఇతరులు (1), నల్గొండ: కాంగ్రెస్ (30) తెలుగుదేశం: (11), తెరాస (3), నిజామాబాద్: వామపక్షాలు (2), ఇతరులు (1), మెదక్: కాంగ్రెస్ (6), తెలుగుదేశం (3), తెరాస (4), వామపక్షాలు (1), ఇతరులు (1), రంగారెడ్డి: కాంగ్రెస్ (22), తెలుగుదేశం (1), తెరాస (2), వాపమక్షాలు (1), ఇతరులు (9), మహబూబ్ నగర్: కాంగ్రెస్ (9), కాంగ్రెస్ (2), తెరాస (7), ఇతరులు (4). ఉదయం తొమ్మిదిన్నర వరకు వరకు తెలంగాణలో కాంగ్రెస్ 119, తెలుగుదేశం 47, తెరాస 71, వామపక్షాలు 16, ఇతరులు 64 స్థానాలు గెలుచుకున్నారు.