ట్విట్టర్ అకౌంట్ వుందా? మీకో శుభవార్త...
posted on May 13, 2014 @ 5:04PM
ఈరోజుల్లో ట్విట్టర్ అకౌంట్ లేనివారు చాలా తక్కువ. ట్విట్టర్ వల్ల ఎన్నో ఉపయోగాలనున్నాయి. అలాగే కొన్ని తలనొప్పులు కూడా వున్నాయి. ట్విట్టర్ అకౌంట్లో ఒక్కోసారి మనకి ఇష్టంలేని ట్విట్‌లు పదేపదే మన వాల్ మీద ప్రత్యక్షమవుతూ చిరాకు తెప్పిస్తూ వుంటాయి. ఫేస్‌బుక్‌లో మాదిరిగా వాటిని అన్ ఫ్లో చేసే అవకాశం ఇప్పటి వరకూ లేకపోవడం వల్ల ట్విట్టర్ అకౌంట్ ఉపయోగించేవారు ఇబ్బందిపడేవారు. ఈ ఇబ్బందిని గ్రహించిన ట్విట్టర్ సంస్థ ఇప్పుడు ‘మ్యూట్ బటన్’ ఆప్షన్‌ని ప్రవేశపెట్టింది. వద్దన్నా వచ్చే ట్విట్‌లను ఈ ఆప్షన్ ద్వారా నిలిపేయొచ్చు. మన అకౌంట్‌ని ఫాలో అయ్యేవారి ట్విట్‌లను ఈ ఆప్షన్ ద్వారా తాత్కాలికంగా బ్లాక్ చేయొచ్చు. మనకు కావలసినంతకాలం మనకు ఇష్టంలేని అకౌంట్లను మ్యూట్‌లో పెట్టొచ్చు. మళ్ళీ అవసరం అనుకుంటే అన్ మ్యూట్ చేస్తే సదరు అకౌంట్ల నుంచి మళ్ళీ మనకి ట్విట్‌లు వస్తూ వుంటాయి. ట్విట్టరోళ్ళు భలే మంచి పని చేశారు కదూ!