ఎండల్లో హాయిహాయిగా   ఎండాకాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు చర్మసౌందర్యం పట్ల మరింత శ్రద్ధ చూపించటం మొదలుపెడతారు. మిగిలిన కాలాల్లో కాంతులీనుతూ ఉండే చర్మం ఎండాకాలం వచ్చేసరికి మొహం పోడిబారిపోయినట్టు, జీవం లేనట్టు తయారవుతుంది. అలాంటప్పుడు రోజులో ఒక్క 10 నిమిషాలు ఈ సమస్య కోసం టైం కేటాయిస్తే చాలు,  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండచ్చు.   * ఎండలలో బయట తిరిగి ఇంటికి రాగానే ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకోవటం మంచిది. సబ్బులతో పనిలేకుండా ఇంట్లోనే క్లెన్శింగ్ మిక్స్ ను తయారుచేసుకోవచ్చు. కాస్త  బాదంపప్పు ,ఓట్స్, పాలు, రోస్ వాటర్ కలిపి మొహానికి పట్టించి  కాసేపు ఉంచుకుని కడిగేసుకుంటే చాలు. * కీరదోస కూడా మొహం మీద మురికి పోవటానికి చాల బాగా పనిచేస్తుంది. కీరా  పేస్టు లో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకుంటే మొహం మీదుండే మురికి మొత్తం పోతుంది.   *  ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అందరూ వాడతారు, అయితే అలా వాడేటప్పుడు దానిలో SPF అంటే sun protection factor కనీసం 15 ఉండేలా చూసుకోవాలి. ఇది మన చర్మాన్ని 15 శాతం ఎక్కువ కాపాడుతుంది. ఏమి అప్లయ్ చేయని చర్మం ఎండ బారిన పడటానికి 20 నిముషాలు పడుతుంది అదే సన్ స్క్రీన్ వాడితే 300 నిమిషాలు ఎండ మన మీద దాని ప్రభావాన్ని చూపించలేదు. * ఎక్కువగా  ఎండల్లో తిరగాల్సిన పని ఉన్నవాళ్ళు మొహం మీద జిడ్డు మొతాన్ని తొలగించుకోవటానికి స్ట్రాబెర్రీ లేదా బొప్పాయి పండు గుజ్జును మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత కడిగేసుకుంటే  కనిపిస్తుంది.   *   ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మొహానికి ఫేషియల్ చేయించుకోవటం కూడా చాలా అవసరం.  ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ చేసుకోవాలంటే అలొవెరా జెల్ లో ఆరెంజ్ జ్యూస్ కలిపి మొహానికి పట్టించి 20 నిమిషాల తరువాత కదిగేసుకోవచ్చు. * అరటి పండు, తేనే కలిపి మెత్తగా పేస్టులా చేసి మొహానికి పట్టించి అరగంట తరువాత కడిగేసుకున్నా చాలు మొహంలో మంచి నిగారింపు వస్తుంది.          ఇవన్ని ఎలా ఉన్నా ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండాలంటే టీ, కాఫీలకి దూరంగా ఉంటూ కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, బార్లీ, చోడుపిండి అంటే రాగి జావ, తాజా ఆకుకూరలు-కూరగాయలు, చక్కని ఫ్రూట్ జ్యూస్ లు తగిన విధంగా తీసుకుంటే చాలు ఎండ మన దగ్గరకి రావటానికి కూడా భయపడుతుంది. ..కళ్యాణి

హోలీ రోజు చర్మాని కాపాడుకోవడానికి ఇలా చేయాలి...   హోలీ పండుగ ఆనందంతో ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులను కూడా తీసుకొస్తుంది.. దానికి కారణం ఆ రోజు మనం చల్లుకునే రంగుల్లోని కొన్ని రసాయనాలు. ఈ మధ్య కాలంలో హోలీలోని రంగుల్లో హానికరమైన రసాయనాలను కలుపుతున్నారు. ఇలాంటివి మన శరీరంపై మీద పడితే అనేక చర్మసంబంధమైన సమస్యలు వస్తాయి కాబట్టి. ఇలాంటి సమస్యలు లేకుండా హోలీ రోజు చర్మాన్ని కాపాడుకోవాలంటే ఇలా చేయండి.  https://www.youtube.com/watch?v=aBZidu9lHFU

How to Maintain The Hair..!  

Get Instant Glowing Skin In 15 Minutes   చర్మ సౌందర్యం గురించి ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే జాగర్తలు తీసుకునే వారు. కానీ ఈ తరం అబ్బాయిలు అమ్మాయిలతో పోటీగా చర్మ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అయితే, బయట దొరికే క్రీమ్స్ కన్నా ఇంట్లో చేసుకొనే పేస్ పాక్స్ చాలా ఉత్తమం. క్యారెట్, పొటాటో (ఆలూ) మరియు టమాటో తో పేస్ పాక్స్ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=U6GQhEhGODI

చిన్న కళ్లని పెద్దకళ్లుగా మార్చాలనుకుంటున్నారా..?   అమ్మాయిల అందంలో కీ రోల్ పోషించే వాటిలో కళ్లది ప్రముఖ స్థానం.. కళ్లు మనసులోని భావాలను ఎదుటి వారికి అద్భుతంగా తెలియజేస్తాయి. అలాంటి కళ్ల ఆరోగ్యంపైన జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే కొందరి అమ్మాయిల కళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. దీంతో వేరొకరి అందంతో తమను పోల్చుకొని తమ తమలో తాము కృంగిపోతుంటారు. ఇలాంటి వారు భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్‌గా వేసుకునే మేకప్‌ టిప్స్‌తో కళ్ల అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆ చీట్కాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?time_continue=3&v=Z_0qgDbf-Us   ;

బతుకమ్మ, దసరా, దాండియా వేడుకలతో దేశంలోని ఏ ప్రాంతం చూసినా సందడే సందడి..పండగంటే ఒక్కరే చేసుకొనేది కాదు..నలుగురితో కలిసి చేసుకునేది. మరి ఆ నలుగురి కంటిలో పడాలి. ఆడపిల్ల అంటే అందంగా, చూసే వారిని ఇట్టే ఆకర్షించేట్టు ఉండాలి. అందంగా ఉండకపోతే తమను ఎవరూ పట్టించుకోరని బాధపడుతుంటారు. ఆకర్షణీయంగా కనిపించడం వల్ల ఆత్మవిశ్వాసమూ రెట్టింపువుతుంది. అందుకే ఇటీవలి కాలంలో అందం మీద శ్రద్ద మరింత పెరిగింది. అందానికీ, ఆరోగ్యానికీ సంకేతం మృదువైన చర్మమే..కాబట్టి మెరిసే, మృదువైన స్కిన్‌టోన్ కోసం రకరకాల తంటాలు పడుతుంటారు. అయితే మన ఇంట్లో ప్రతీరోజు వినియోగించే వస్తువులతోనే అందాన్ని పెంచుకోవచ్చు..అలాగే అందాన్ని రెట్టింపు చేయడంలో పండ్లను మించినవి లేవంటున్నారు నిపుణులు. చర్మానికి మెరుపునందించి..కాంతివంతంగా, ఫ్రెష్‌గా ఉంచి..అందాన్ని రెట్టింపు చేసే కొన్ని చిట్కాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  

తెల్లజుత్తును తరిమేయాలంటే..?     ఒకప్పుడు వయసు మీద పడినప్పుడే వెంట్రుకలు తెల్లబడేవి. ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, జీవనశైలి వంటి వాటి వల్ల త్వరగా తెల్ల జుత్తు వచ్చేస్తోంది. యుక్త వయస్సులో వృద్ధాప్య ఛాయల్ని భరించడం ఎవరికైనా కష్టమే. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిని పాటిస్తే తెల్లబడిన జుత్తు మళ్లీ నల్లగా నిగనిగలాడటం ఖాయం! - గోరింటాకుని రుబ్బి... అందులో మూడు చెంచాల ఉసిరిక పొడి, ఒక చెంచాడు కాఫీ పొడి, పెరుగు కలిపి కుదుళ్లకు, జుత్తుకు బాగా పట్టించండి. ఆరిన తరువాత కుంకుడు రసంతో తలంటుకోండి. వారానికి ఒకట్రెండుసార్లు ఇలా చేయాలి. - బ్లాక్ టీలోఉప్పు కలిపి అప్పుడప్పుడూ జుత్తు కడుగుతూ ఉంటే నల్లబడిపోతుంది. - గోరింటాకు, మందార ఆకులు, కరివేపాకుల్ని సమపాళ్లలో తీసుకుని మెత్తగా రుబ్బాలి. దీన్ని తలకు పట్టించి, ఆరిన తరువాత మైల్డ్ షాంపూతో తలంటుకుంటే ఫలితముంటుంది. - తులసి ఆకుల్ని నీటిలో మరిగించాలి. ఇవి గోరువెచ్చగా అయ్యేవరకూ చల్లార్చి, ఆ నీటితో కుదుళ్లకు బాగా మసాజ్ చేస్తే మంచిది. - ఉసిరికపొడిలో నిమ్మరసం కలిపి కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత దీన్ని కుదుళ్లకు పట్టించి అరగంట పాటు వదిలేయాలి. తరువాత కుంకుడు రసంతో కానీ షీకాయ పొడితో కానీ తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే సమస్య తీరిపోతుంది. - రెండు చెంచాల గోరింటాకు పొడి, రెండు చెంచాల మెంతి పొడి, చెంచాడు పెరుగు, చెంచాడు కాఫీ పొడి, రెండు చెంచాల పుదీనా రసం, రెండు చెంచాల తులసి రసం కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు, జుత్తుకు బాగా పట్టించి తలకు ఏదైనా బట్ట చుట్టేయాలి. అరగంట నుంచి నలభై అయిదు నిమిషాలు అలానే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే బాలనెరుపు పోయి జుత్తు నల్లబడిపోతుంది. -Sameera  

కళ్ల కింది వలయాలు కనబడవిక!     కళ్ల కింద నల్లని వలయాలు... కొన్ని రకాల శారీరక సమస్యలు, నిద్ర లేమి, మానసిక ఆందోళన, ఒత్తిడి, ధూమపానం మద్యపానం లాంటి చెడు అలవాట్లు... ఇలా రకరకాల కారణాల వల్ల ఇవి వస్తాయి. కారణం ఏదైనా ఒక్కసారి వచ్చాయంటే మాత్రం మన అందానికి మచ్చలా అనిపిస్తాయి. మనల్ని పేషెంట్ లా కనిపించేట్టు చేస్తాయి. అందుకే వీటిని వెంటనే పోగొట్టుకోవాలి. దానికి ఈ చిట్కాలు బాగా పనికొస్తాయి. - బంగాళాదుంప రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీనిలో దూదిని ముంచి నల్ల వలయాలు ఉన్నచోట కాసేపు రుద్ది కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే వలయాలు వేగంగా మాయమవుతాయి. - పుదీనా ఆకుల్ని పేస్ట్ చేసి, దాన్ని కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. - కళ్ల చుట్టూ తేనెను రాసి, పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నా ఫలితముంటుంది.  - ఆరెంజ్ జ్యూస్ లో కొన్ని చుక్కల వెనిగర్ వేసి కలపాలి. మునివేళ్లను ఈ రసంలో ముంచి, కళ్ల చుట్టూ మెల్లగా మర్దనా చేయాలి. పది నిమిషాల పాటు అలా చేసిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే రెండు మూడు వారాల్లో సమస్య తొలగిపోతుంది. - టొమాటోను గుజ్జులా చేసి... ఇందులో నిమ్మరసం, కొద్దిగా శెనగపిండి కలపాలి. దీనితో కళ్ల చుట్టూ ప్యాక్ వేసుకుని, పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. - రోజూ పడుకునేముందు ఆలివ్ ఆయిల్ తో డార్క్ సర్కిల్స్ ఉన్నచోట మసాజ్ చేసి రాత్రంతా వదిలేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే కొద్ది రోజుల్లో సర్కిల్స్ పోతాయి. - టీ బ్యాగ్ ని కాసేపు ఫ్రిజ్ లో పెట్టండి. చల్లబడిన తరువాత తీసి కళ్లపై పెట్టుకోండి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కూడా సమస్య పరిష్కారమవుతుంది. -Sameera  

మృదువైన పాదాల కోసం...!     అందంగా ఉండటం అనగానే ముఖాన్ని పట్టించుకుంటాం తప్ప పాదాలను పట్టించుకోం. అవి కూడా అందంలో భాగమనే విషయం మర్చిపోతాం. అది కరెక్ట్ కాదు. చీర కట్టుకుంటే పాదాలు కనిపించకపోవచ్చు కానీ మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మాత్రం పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు పాదాలు అందంగా లేవనుకోండి... మన గ్లామర్ కి మార్కులు తగ్గిపోయినట్టే. కాబట్టి కాస్త పాదాలను కూడా పట్టించుకోండి.   * పాదాలు పొడిబారి చిట్లిపోతుంటే... రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెను వేడి చేసి దానితో పాదాలను బాగా మర్దనా చేయండి. ఆ తరువాత సాక్స్ వేసుకోవాలి. ఉదయం లేచిన తరువాత నలుగుపిండి పెట్టి బాగా రుద్ది కడిగేసుకోవాలి. కొన్నాళ్లపాటు ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలు అందంగా, మృదువుగా తయారవుతాయి. * ఉప్పు, నిమ్మరసం కలిపి బాగా రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోయి పాదాలు చక్కగా మెరుస్తాయి. మృదువుగానూ ఉంటాయి. * బొప్పాయి గుజ్జులో తేనె కలిపి పాదాలకు ప్యాక్ వేయాలి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుని, మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాసుకోవాలి. * ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ ను కలిపి పాదాలకు పూయాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసి మరోసారి వట్టి రోజ్ వాటర్ ను రాయండి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  * వేడినీటిలో నిమ్మరసం వేసి పాదాలను అందులో ముంచండి. పదిహేను నిమిషాల పాటు అలా ఉంచాక బైటికి తీసి ఫ్యూమిస్ స్టోన్ తో బాగా రుద్ది కడగండి. తరువాత బట్టతో తుడుచుకుని మాయిశ్చరయిజింగ్ క్రీమ్ రాయండి. రోజు విడిచి రోజు ఇలా చేస్తుంటే పాదాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి. -Sameera  

  ఇక మీ చర్మం పొడిబారదు   వర్షాలు తగ్గుముఖం పట్టాయి. శ్రావణమాసం కూడా వచ్చేసింది. ఇక చలి కూడా మొదలైపోతుంది. చలి మొదలైందంటే రకరకాల చర్మసమస్యలూ పలకరిస్తాయి. ముఖ్యంగా చాలామంది పొడిబారిన చర్మంతో బాధపడుతూ ఉంటారు. గాలిలో తేమ తక్కువగా ఉండే హైదరాబాద్ వంటి నగరాలలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మరి పొడిబారిన చర్మం నుంచి కాపాడే చిట్కాలే లేవా అంటే లేకేం! బోలెడు ఉన్నాయి.... ఇలా స్నానం చేయండి మనం స్నానం చేసే తీరుతో చర్మం ప్రభావితం అవుతుందని ఎప్పుడన్నా గమనించారా! - మరీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీద ఉండే కాస్త తేమ కూడా ఆవిరైపోయి, మరింత పొడిబారిపోతుంది. స్నానానికి చల్లటి నీరు లేదా గోరువెచ్చటి నీటిని మాత్రమే వాడాలి. - చాలా సబ్బులు మన చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి మాయిశ్చరైజర్లలా పనిచేసే సబ్బులనే వాడే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకూ పొడిబారిన ప్రదేశాల మీద సబ్బుని ఎక్కువగా రుద్దకపోవడం మంచిది. - పొడిబారిన చర్మం ఉన్నవారు స్నానాన్ని కాస్త త్వరగా ముగించడమే మంచిది. ఎంత ఎక్కువసేపు నీటిలో నానితే, మన చర్మం అంత ఎక్కువగా దెబ్బతినే ప్రమాదం ఉంది. - స్నానం తర్వాత ఒంటిని తుడుచుకోవడంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. పొడిబారిన ప్రదేశాల మీద తువాలుని అదిమితే సరిపోతుంది. తువాలుతో గట్టిగా రుద్దడం వల్ల కూడా చర్మం తన సహజసిద్ధమైన తేమని కోల్పోయే ప్రమాదం ఉంది. నీళ్లు ఎక్కువగా తాగండి చలికాలం దాహం తక్కువగా వేసే మాట నిజమే! అందుకనే మనం అసలు నీరు తాగడమే మర్చిపోతుంటాము. కానీ దాహం వేసినా వేయకున్నా, తరచూ నీరు తాగుతూ ఉండాల్సిందే! లేకపోతే ఒంట్లోని విషపదార్థాలు (toxins) ఒంట్లోనే ఉండిపోతాయి. చర్మం, గోళ్లు, వెంట్రుకలకి తగినంత తేమ లభించక అవి పొడిబారిపోతాయి. చలిగాలుల నుంచి దూరం కాళ్లు, చేతులు పొడిబారిపోయే ఇబ్బంది ఉన్నవారు.... ఈ చలికాలం దాటిపోయేదాకా వాటిని కాపాడుకోవాల్సిందే. ఇంట్లో ఏసీ వేసినా, బయట చలిగాలిగా ఉన్నా... కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉండేలా చూసుకోవాలి. అవసరం అనుకుంటే కాస్త పొడవాటి సాక్స్ (stockings) వేసుకోవడానికి కూడా మొహమాటపడకూడదు. సహజసిద్ధమైన ఆయిల్స్ పొడిబారిన చర్మం ఉందనగానే చాలామంది రకరకాల లోషన్లు పూసేస్తూ ఉంటారు. వీటికంటే సహజసిద్ధమైన ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, బాదం నూనె లాంటి నూనెలను పొడిబారిన చర్మానికి పట్టిస్తే చాలా ఉపయోగం అంటున్నారు నిపుణులు. ఇవి కూడా ఉపయోగమే! - పాలల్లో దూది ముంచి పొడిబారిన ప్రాంతంలో ఆ దూదిని అద్దితే ప్రభావం కనిపిస్తుంది. - చర్మానికి తేనెని మించి దివ్యౌషధం లేదు. కాబట్టి చర్మం గరుకుతేలిన చోట ఓ పదినిమిషాల పాటు తేనె రాసి కడిగేసుకోండి. - చర్మానికి తిరిగి జీవం తీసుకురావడంలో అలోవెరాని మించినదేముంది! కాసిని అలోవెరా చక్రాలని పొడిబారిన ప్రదేశంలో ఉంచి చూడండి. - పెట్రోలియం జెల్లీ (వేజ్లైన్) రాయడం వల్ల కూడా చర్మానికి తగినంత తేమ దొరుకుతుంది. ఇంతేకాదు! తరచూ వ్యాయామం చేయడం, మంచి పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా, కాంతిమంతంగా ఉంటుంది. - నిర్జర.    

Puffy Eyes!   Puffy eyes are every girl’s nightmare! Personally even I am scared to walk out from home with large puffy eyes, they basically pull all the attention away from the other good things to the puffy eyes.  The most common causes of the puffy face look are harmless and not to worry much about, they do sometimes point out an underlying medical condition. Puffy eyes are a reliable sign of thyroid disease called Graves disease and sometimes also kidney failure which is accompanied by gross swelling of the body. Puffy, swollen eyelids and dark circles under the eyes can occur when the eye is infected with conditions like conjunctivitis. While the other causes are: The obvious reason can be crying. Heat which causes the membranes to become drier around eye, tissues become parched and thickened causing irritation and puffiness. When you are stress and devoid of the full quota sleep then the cortisol and adrenal levels increase causing changes in salt and water retention, showing up as puffiness. It is a warning sign of the allergic season. It can be also because of PMS, during which our body bloats up. When you had some extra alcohol last, this usually dries up the membranes causing puffiness the following morning. How to get rid of Puffy eye? First of all rule out any medical conditions by consulting a physician. Get a good sound sleep. Keep yourself well hydrated. Limit alcohol. Stay indoors and take medication after consulting a doctor for allergies. For instant relief, soothe your eyes with cucumbers or cold tea a bag for about 15 minutes, cold usually reduces the inflammation and reduces release of histamine and thus swelling.   -Koya Satyasri

  వేసవి జిడ్డును వదిలించుకోండిలా!     ఎండ ఉన్నంతకాలం జిడ్డు మన వెంటే ఉంటుంది. ఎన్నిసార్లు కడిగినా ముఖాన్ని వదలకుండా మారాం చేస్తూ ఉంటుంది. దాంతో కళను కోల్పోయిన ఫేస్ తో డల్ గా తిరగాల్సి వస్తుంది. ఈ సమస్య తీరాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించండి. - జిడ్డును వదిలించడంలో ముల్తానీ మట్టి నంబర్ వన్. అందుకే కాస్త ముల్తానీ మట్టి తీసుకుని, అందులో కాసింత తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోండి. జిడ్డు వదిలిపోతుంది. - టొమాటోను పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు, కాసింత పసుపు కలిపి ముఖాన్ని బాగా రుద్ది, ఆరిన తర్వాత కడిగేసుకుంటే జిడ్డు అన్నదే కనిపించదు. - పచ్చకాయ జ్యూస్ లో దూదిని ముంచి... ముఖం, మెడ బాగా క్లీన్ చేసుకోండి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజులకి ముఖం జిడ్డెక్కడమే మానేస్తుంది. - బియ్యప్పిండిలో పచ్చి బంగాళాదుంప రసం కలిపి పేస్ట్ లా చేసుకోండి. దీనితో నలుగుపిండి మాదిరిగా రుద్దుకుంటే జిడ్డుతో పాటు ఎండ వల్ల వచ్చిన నలుపు కూడా పోతుంది. - క్యారెట్ పేస్ట్ లో కాసింత బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకున్నా ఫలితం ఉంటుంది. - అరటిపండు తొక్కతో ముఖం బాగా రుద్దుకుని, ఆరిన తర్వాత కడిగేసుకున్నా జిడ్డు మాయమవుతుంది. - పాలలో చిటికెడు తేనె కలిపి, దానిలో ముంచిన నూనెతో రుద్దుకున్నా మంచిదే. - Sameera      

  Your lipstick can reveal your psychology     Have you ever wondered that the shape of your lipstick can reveal a lot about yourselves? But yes! Some experts argue that the way you use the lipstick can be a symbol of your personality. Just look at the shape of your lipstick after using it a few days and its shape might hint something about you. Well! This is not scientifically proven. But can just be a funny reminder to ponder upon. Long Rounded Tip – When you keep using the lipstick, but if it tends to retain the shape even in thinnest form.... you are ought to be a daring personality. No matter what others think about you, you wish to have your own opinion and dare to say it loud. Such personality might keep some people away from you and make some others like you. Devoid of such hatred and charm... you wish to be yourselves forever. Short rounded tip - You are creative and love to lead your life in an artistic manner. But that doesn’t mean you are rebellious. You stick to rules of the society. You are a family person and friendly as well. Pencil rounded tip – If your lipstick is sharp angled on all sides with a pointed tip... then you are on the go. You are beautiful, intelligent and can be deadly attractive. You are unique and adventurous. And beware! All these traits would make your friends jealous about you.     Slanting tip –When it comes to organising a party or bringing colour to it... you are the one that could add your Midas touch. Being a natural leader, you have an influence on every person who steps into your arena. Flat Top – You are funny and have a sharp sense of humour. But when it comes to argument, you are not the one who would step back. Though being humorous, you have an attitude that’s closer to reality. Flat top with a dent – If your lipstick have a flat top, but with a dent in concave manner... then you are stubborn in achieving your goal. You are never afraid to ask questions and raise objections. You would never step back from the task you have undertaken. Curved tip – You are lovable and creative as well. You tend to believe everyone around you and would love helping them. When it comes to relations.... you are loyal and caring. - Nirjara

  మీ షాంపూలో ఉప్పు ఉందా!   అందంగా కనిపించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.... జుట్టు కనుక ఆరోగ్యంగా లేకపోతే, కష్టమంతా వృధా అయిపోతుంది. జుట్టుకి ఇంత ప్రాముఖ్యత ఉంది కనుకనే టీవీల్లో కనిపించే ప్రకటనల్లో ఎక్కువశాతం షాంపూలవే ఉంటాయి. కానీ ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఖరీదైన షాంపూలతో కూడా పొందలేని అందమైన జుట్టు మన సొంతమంటున్నారు. అదే- షాంపూతో పాటుగా సముద్రపు ఉప్పుని (రాతి ఉప్పు) కూడా ఉపయోగించడం! డాండ్రఫ్ తొలగిపోవాలంటే.. పొల్యూషన్, జిడ్డు చర్మం, ఒత్తిడి... ఇలా డాండ్రఫ్ వచ్చేందుకు ఎన్ని కారణాలన్నా చెప్పవచ్చుగాక! కానీ అది ఒకరకమైన ఫంగస్ వల్ల ఏర్పడుతుందన్నది అందరూ ఒప్పుకునే మాటే! షాంపూ చేసేముందు జుట్టుని పాయలు పాయలుగా విడదీసి మాడుకి కాస్త ఉప్పుని పట్టించి, ఓ పదినిమిషాల పాటు రుద్దితే డాండ్రఫ్ సమస్య తీరిపోతుందంటున్నారు. ఉప్పుతో రుద్దినప్పుడు ఫంగస్ ఎలాగూ తొలగిపోతుంది. మాడు మీద ఉండే మృతకణాలన్నీ కూడా వదిలిపోతాయి. దాంతో డాండ్రఫ్ దూరమైపోతుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే... జుట్టు రాలిపోతుంటే కాస్తంత ఉప్పుతో మర్దనా చేసే చిట్కా చాలా ఏళ్ల నుంచి కనిపించేదే! జుట్టు కుదుళ్ల దగ్గర తగినంత రక్తప్రసారం లేకపోవడం కానీ, ఆ రక్తప్రసారంతో పాటుగా తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కానీ అనేక సమస్యలు ఏర్పడతాయి. జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు సన్నగా మారిపోవడం, తెల్లబడటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. షాంపూకి ముందు ఉప్పుతో కాస్త మసాజ్ చేయడం వల్ల మాడు మీద రక్తప్రసారం మెరుగవుతుంది. మృదువైన జుట్టు కోసం... కొంతమంది అసలు నూనె రాయకపోయినా కూడా నిరంతరం జుట్టు జిడ్డోడుతూ ఉంటుంది. దీనివల్ల డాండ్రఫ్ లాంటి సమస్యలు ఎలాగూ తప్పవు. చూసేందుకు కూడా వారి జుట్టు అంత ఆరోగ్యంగా ఉండదు. షాంపూలో సగందాకా ఉప్పుని కలిపి రుద్దుకోవడం వల్ల మురికి, జిడ్డు అన్నీ వదిలిపోతాయని అంటున్నారు. పైగా మాడు మీద ఉండే నూనెగ్రంధులలోని జిడ్డునంతా ఈ ఉప్పు లాక్కుని వచ్చేస్తుందని భరోసా ఇస్తున్నారు. షాంపూ చేసేటప్పుడు ఉప్పుని కూడా ఉపయోగించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. అయితే ఇలా ఉప్పుని మాడుకి రుద్దేటప్పపుడు అది మరీ గరుగ్గా లేకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నారు. పైగా షాంపూ చేసే ప్రతిసారీ ఇలా ఉప్పుతో రుద్దుకుంటూ ఉండే అసలుకే మోసం వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. మనకి కనిపిస్తున్న ఫలితాన్ని బట్టి ముందూవెనుకగా అప్పుడోసారి, అప్పుడోసారి ఈ చిట్కాను పాటించి చూస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. - నిర్జర.    

  Amazing benefits of Glycerin     Glycerin isn’t new for any of us. Glycerin is widely used in food processing industry as sweetner and preservation agent. From film industry to Pharmecy.. glycerin is applied in numerous occasions. But we often forget it’s usage as abeauty product. Glycerin is one of the cheapest and natural product available that can do wonders to our skin. Moisturizer It’s not surprising that glycerin is considered as one of the best moinsurizers... some times more effective than expensive cosmetic products. It can even get rid of chronic dry skin problem. Glycerin acts as a `Humectant’- which means that it draws moisture onto the surface. Shiny lips Glycerin would cure chapped lips and make them soft and shiny. As it is of non-toxic nature, glycerin could be applied to mouth ulcers for instant relief. Gleaming nails With regular usage of nail polish and household chores... nails might become dry and get dull. Applying glycerin to such dry nails would retain moisture and on them and make them bright. Dry hair Applying a few drops of glycerin before a head bath would make our hair smooth and shiny. A dab of glycerin can also be applied while styling your hair to retain its form. Skin problems Glycerin when applied to skin can give immense relief from various problems. From diaper rash to radiation theraphy... glycerin could be certainly soothing. It can be helpful even in cases of psoriasis and eczema. Cracked heels Soak your feet in warm water and scrub them. Apply glycerin to them and leave them overnight. Repeat this for a few days and you could feel the difference! Makes you younger Glycerin is known to reduce wrinkles and ease stretch marks. It is believed that glycerin would act as a skin tones by cleansing and shrinking the pores. - Nirjara.

  అదిరే అదరాల కోసం..   ఎవరి ముఖమైనా చూడగానే మొదట కనిపించేది పెదాలు...ఎర్రని పెదవుల మధ్య నుంచి చిరునవ్వులు చిందించగానే ఎదుటివారికి అదో ఆత్మీయ పలకరింత. పెదాలు అందంగా ఉంటేనే మొహం అందంగా కనిపిస్తుంది. మొహం తెల్లగా ఉన్నా కూడా పెదాలు అంద విహీనంగా ఉంటే ఉపయోగం లేదు. అదే ముఖం నల్లగా ఉన్నా పెదాలు ఎర్రగా ఉంటే ఆ కళే వేరు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పెదాలను మరింత అందంగా ఉంచుకోవటానికి ముఖ్యంగా అమ్మాయిలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. మార్కెట్లో కొత్తగా వచ్చిన లిప్‌బామ్‌లు, లిప్‌స్టిక్‌లు పూయడమే పనిగా పెట్టుకుంటారు...వీటి వల్ల అందం పెరగటం మాట అటుంచితే ధీర్ఘకాలంలో పెదవుల సౌందర్యం పాడయ్యే అవకాశం ఉంది. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువల సాయంతోనే పెదాలను అందంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం.. * బీట్‌రూట్ రసం తీసుకుని, దానికి మీగడ కలిపి పెదాలపై రుద్దాలి. కొద్ది సమయం తర్వాత చల్లని నీటితో దానిని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్‌గా అవ్వడంతో పాటు ముడతలు పోతాయి. * మరీ పోడిబారిన చర్మతత్వం ఉన్నవారు ఒక చెంచా సెనగపిండిలో తగినంత బాదం నూనె కలిపి పొడిబారిన పెదాల దగ్గర రాసి ఆరిన తర్వాత కడిగేయొచ్చు. నెమ్మదిగా సమస్య తగ్గుముఖం పడుతుంది. * నిమ్మరసాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి రాత్రంతా ఉంచేయాలి. తెల్లవారిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో తేనే కలిపి రాసిన ప్రయోజనం ఉంటుంది. * తాజాగా తీసిన కలబంద గుజ్జుని పెదాలపై అప్లై చేసి రాత్రంతా ఉంచి తెల్లారి కడిగేయటం వల్ల పెదాల తగ్గుతుంది. * పెదాలు రంగు మారడంతో పాటు తరచూ పగులుతుంటే రాత్రి పోడుకునే ముందు నెయ్యితో మర్ధన చేసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది. * గులాబీ రెమ్మలను పేస్ట్‌గా చేసి, ఆ పేస్ట్‌కు కాసిన్ని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ వర్ణంలోకి మారి అందంగా ఉంటాయి. * తరచూ నాలుకతో పెదాలను తడుపడం మానండి..దీని వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. * నీరు, తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

  ముఖ సౌందర్యాన్ని పాడు చేసే బ్లాక్ హెడ్స్     మామూలుగా ఏ స్త్రీ లేదా పురుషుని అందాన్ని గురించి మాట్లాడేటప్పుడు ముఖాన్ని గురించి ముందుగా ప్రస్తావిస్తారు. ముఖమే ఎవరి అందానికైనా కొలబద్దగా ఉంటుంది. అందమైన ముఖానికి చక్కటి ముక్కు ఒక ఆకర్షణగా నిలుస్తుంది. కాని ఈ అందమైన నాసికా సౌందర్యాన్ని తగ్గిస్తాయి బ్లాక్ హెడ్స్. మిగిలిన వారిలో కూడా ఇది కనిపించినా, ప్రధానంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వీటివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఇవి చికాకును తెప్పిస్తాయి. ఎంతో అందమైన ముఖం వున్నా వీటి వల్ల ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా ఇవి ఒకసారి తీసేసినా పడే పడే వస్తూ ఉంటాయి. దీని వల్ల మానసికంగా కొంచెం దిగులు ఏర్పడుతుంది. పడే పడే అద్దంలో వీటిని చూసుకుంటూ ఉండటం కంటే తీసివేసే మార్గాన్ని చూడటం ఉత్తమం. వీటి నివారణోపాయం ఏమిటంటే బ్యూటీషియన్ దగ్గరకు వెళ్ళి వాటిని తగిన విధంగా తీసి వేయించుకుంటూ ఉండటం. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ తీసివేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. బ్యూటీ పార్లర్ లో లేదా స్వంతంగా వారానికి రెండు సార్లు ముల్తానా మట్టి ప్యాక్ వేయించుకోవడం ఒక పధ్ధతి మరో పధ్ధతి ఏమిటంటే రోజూ మర్చి రోజు రాత్రి పూట నిద్రపోయే ముందు ట్రెటినాయిన్ ను పల్చగా ముక్కుకు తాసుకోవడం. దీని అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కు పై భాగంలో ఏర్పడే సన్నని పొరలు తొలగిపోతాయి. అక్కడి చర్మం ప్రకాశవంతంగా , అందంగా తయారవుతుంది. ఈ కారణం వల్ల బ్లాక్ హెడ్స్ రావడం బాగా తగ్గిపోతుంది. బ్యూటీ పార్లర్ కు వెళ్ళే విషయంలో కొంత పరిశీలన అవసరం. అనుభవం ఉన్న బ్యూటీషియన్ దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కొంచెం నైపుణ్యం అవసరం . పరిశుభ్రతను పాటించే బ్యూటీ పార్లర్ లను ఎంచుకోవాలి. బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం కొంత ఖరీదైన వ్యవహారం కాబట్టి నెలకు ఒకసారి వెళ్ళినా సరిపోతుంది. కొంతమందికి ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ తో పాటుగా వైట్ హెడ్స్ కూడా వస్తాయి. అయితే ఇవి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. వీటిని నివారించాలంటే ఆస్ట్రిన్జెంట్ లోషన్ లో దూదిని ముంచి, ముక్కు చుట్టూ రాసుకుంటే సరిపోతుంది. దీంతో వైట్ హెడ్స్ రావడం తగ్గిపోతుంది.      

  సమ్మర్‌లో జుత్తుని కాపాడుకోవాలంటే...     సమ్మర్ వస్తోందనగానే ఆడపిల్లలకి మొదట కలిగే టెన్షన్... స్కిన్ పాడైపోతుందేమోనని. అందుకే ఒంటిని జాగ్రత్తగా కవర్ చేసేస్తుంటారు. క్రీములవీ పూసేస్తుంటారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే చాలాసార్లు జుత్తు విషయం మర్చిపోతుంటారు. వేసవి వేడికి స్కిన్ తో పాటు హెయిర్ కూడా పాడైపోతుంది. పొడిబారిపోతుంది. చిట్లిపోయి విరిగిపోతుంది. అందుకే సమ్మర్ లో హెయిర్ మీద కూడా శ్రద్ధ పెట్టండి. ఆయిల్ ట్రీట్ మెంట్ వల్ల హెయిర్ కి ఎప్పుడూ మంచే జరుగుతుంది. జుత్తు పొడిబారిపోకుండా తేమగా ఉంటుంది. అందువల్ల వేసవికాలంలో తరచుగా నూనె పెట్టుకోండి. ఒకవేళ నూనె పెట్టుకుని బయటికి వెళ్లడం ఇబ్బంది అనుకుంటే రాత్రిపూట పెట్టేసుకుని, పొద్దున్నే తలంటుకోండి చాలు. తలస్నానం చేశాక హెయిర్ డ్రయ్యర్ ను వాడొద్దు. జుత్తుని గాలికే ఆరబెట్టుకోండి. లేదంటే మరింత డ్రై గా అయిపోయి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అయితే వేసవిలో మరీ ఎక్కువ సువాసన వచ్చే నూనెలు వాడకూడదు. చెమట ఎక్కువగా పట్టడం వల్ల ఒక్కోసారి వెగటుగా అనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ వాసన లేని మామూలు నూనెను ఉపయోగించండి. అలాగే వీలైనంత వరకూ ఈ సీజన్లో హెయిర్ జెల్స్, స్ప్రేస్ వాడకుండా సింపుల్ చిట్కాల ద్వారా జుత్తుని జాగ్రత్త చేసుకోవడమే మంచిది. కలబంద జెల్ మంచి మాయిశ్చరైజర్. అందుకే వారానికి రెండుసార్లయినా దీన్ని తలకు పట్టించి, రెండు గంటల పాటు ఉంచుకుని తలంటుకోండి. తేనె, ఆలివ్ నూనె కూడా జుత్తుకి మంచి రక్షణ. అందుకే ఈ రెండిటినీ కలుపుకుని వారానికోసారైనా తలకు పట్టించండి. బాగా ఆరిన తర్వాత శుభ్రంగా తలంటుకోండి. పెరుగు, కోడిగుడ్డు కలిపి ప్యాక్ వేసుకోవడం కూడా ఉపకరిస్తుంది. ఇవన్నీ చేయమని కాదు... వీటిలో మీకు అనుకూలమైనది ఏదో ఒకటి అనుసరిస్తూ ఉంటే హెయిర్ ను వీలైనంతవరకూ కాపాడుకోవచ్చు. ఈ చిట్కాలు పాటించడంతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని... వీలైనంత ఎక్కువ నీరు తాగడం. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మానికే కాదు... జుత్తుకి కూడా తేమ అందుతుంది. పొడిబారడం తగ్గుతుంది. అలాగే ఆహారం విషయంలో కూడా కాస్త శ్రద్ధ అవసరం. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, పొటాసియం, జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా బైటికి వెళ్లినప్పుడు తప్పకుండా టోపీ కానీ, స్కార్ఫ్ కానీ ధరించండి. లేదంటే కనీసం పల్లూనో చున్నీనో కప్పుకోండి. నేరుగా సూర్యరశ్మి హెయిర్ ని తాకిందో... ఆ డ్యామేజ్ ని ఆపడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సమ్మర్ తో మీ హెయిర్ కి వచ్చిన చిక్కేమీ లేదు.  -Sameera