నలుపు ఈజీగా పోగొట్టే చిట్కాలు తెలుసా..?

 


అమ్మాయిలలో అందం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే అమ్మాయిలు చాలా అందంగా, హుందాగా తయారు కావడానికి ఇష్టపడతారు. కొందరు ప్యాషన్ దుస్తులు ధరించడానికి, ముఖ్యంగా స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. దీనికి కారణం అండర్ ఆర్మ్ నల్లగా ఉండటం.  చంకల కింద నలుపు కారణంగా కొన్ని అందమైన దుస్తులు వేసుకోలేక బాధపడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. అయితే ఈ నలుపును ఇంటి దగ్గరే ఈజీగా తొలగించుకోవచ్చు. అందుకోసం కింది టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.


కావలసిన పదార్థాలు..


కాఫీ పొడి..
కోల్గేట్ టూత్ పేస్ట్..
పసుపు..  
రోజ్ వాటర్..

పైన చెప్పుకున్న మిశ్రమాలలో కాఫీ పొడిని ఒక చిన్న కప్పులో తీసుకుని అందులో కోల్గేట్ పేస్ట్,  చిటికెడు పసుపు,  రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్స్ చేయాలి.  దీన్ని చంకల కింద నలుపు ఉన్న ప్రాంతంలో పట్టించి 10నిమిషాలు అలాగే వదిలేయాలి.  తరువాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.  ఈ టిప్ ను వారానికి ఒక్కసారి అయినా ఫాలో అవుతుంటే కేవలం 15 రోజులలోనే తేడా స్పషంగా కనిపిస్తుంది.

చంకల కింద, మెడ వెనుక భాగంలో ఉండే నలుపు తగ్గించుకోవడానికి మరొక చిట్కా కూడా ఉంది.  ప్రతి రోజూ తాజా కలబంద జెల్ ను చంకల కింద నలుపు ఉన్న ప్రాంతంలో, మెడ వెనుక నల్లగా ఉన్న ప్రాంతంలో పూయాలి. 15 నుండి 20 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.


ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా టూత్ పేస్ట్,  అర చెంచా ఉప్పు వేసి మెడ వెనుక నలుపు ఉన్న ప్రాంతంలో,  చంకల కింద నలుపు ఉన్న చోట అప్లై చేయాలి. వారానికి ఒక్కసారి ఇలా చేస్తే 15 రోజుల్లోనే ఫలితం ఉంటుంది.

                                     *రూపశ్రీ.