ముఖం మీద మచ్చలను మాయం చేసే సూపర్ టిప్ ఇది..! అందమైన ముఖాన్ని కూడా ఎబ్బెట్టుగా కనిపించేలా చేయడంలో ముఖం మీద మచ్చలు, గీతలు, మొటిమలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మచ్చలు లుక్స్ ను చాలా ప్రబావింత చేస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువ పడటం, మొటిమలు, పిగ్మెంటేషన్, హార్మోన్ల మార్పులు, స్కిన్ కేర్ సరిగా ఫాలో కాకపోవడం వంటి తప్పుల వల్ల ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల ఆశించిన ఫలితాలు అయితే ఉండవు. ఈ మచ్చలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో లభించే కొన్ని నేచురల్ పదార్థాలు, ఇంటి చిట్కాలు చర్మపు రంగును సహజంగా మెరుగుపరిచి మచ్చలు తగ్గేలా చేస్తాయి. చర్మానికి మెరుపును ఇస్తాయి. క్రమం తప్పకుండా వీటిని వాడితే చాలా గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. ఇంతకీ మచ్చలను తగ్గించే ఆ సూపర్ టిప్ ఏంటో తెలుసుకుంటే.. మచ్చలను తగ్గించే మ్యాజిక్ క్రీమ్.. మచ్చలను తగ్గించడంలో ఇంట్లోనే తయారు చేసే క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది. కావలసిన పదార్థాలు.. అలోవెరా జెల్.. 1 స్పూన్ నిమ్మరసం.. అరటీ స్పూన్ రోజ్ వాటర్.. ఒక టీస్పూన్.. తయారు విధానం.. ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేయాలి. అందులో ఒక అర స్పూన్ నిమ్మరసం వేయాలి. అందులోకే ఒక స్పూన్ రోజ్ వాటర్ కూడా వేయాలి. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. ఇది క్రీమీగా మారుతుంది. అలోవెరా జెల్ చర్మాన్ని రిపేర్ చేయడానికి, మచ్చలను లైట్ గా చేసి అవి తగ్గడానికి సహాయపడుతుంది. నిమ్మరసం సహజ బ్లీజ్ గా పనిచేస్తుంది. ఇది పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని కూల్ గా మారుస్తుంది. చర్మాన్ని తేమగా మృదువుగా మారుస్తుంది. ఎలా ఉపయోగించాలి? మొదటగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని పొడి టవల్ తో బాగా తుడుచుకోవాలి. ఇలా చేసిన తరువాత తయారు చేసుకున్న క్రీమ్ ను చేతి వేళ్లతో కొద్దిగా తీసుకుని ముఖం మీద మచ్చలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం ఈ క్రీమ్ ను వారానికి 3 నుండి 4 సార్లు ఉపయోగించాలి. జాగ్రత్త.. ఈ క్రీమ్ లో నిమ్మరసం ఉంటుంది. ఇది సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా చికాకు కలిగిస్తుంది. అందుకే దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ క్రీమ్ ను అప్లై చేసినప్పుడు మంట, దురద, లేదా చర్మం ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వాడటం మానేయాలి. ఈ క్రీమ్ చర్మానికి ఎలాంటి హాని కలిగించకపోతే దీన్ని ఉదయం సమయాల్లో కంటే రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది. రాత్రి సమయంలో దీన్ని ముఖానికి అప్లై చేసి అలాగే వదిలేయవచ్చు. పైన పేర్కొన్న క్రీమ్ ను రెగ్యులర్ గా వాడుతుంటే ముఖం మీద మచ్చలు మెల్లిగా తేలిక అవుతాయి. కలబంద చర్మాన్ని లోపలి నుండి పోషణ ఇస్తుంది. కొత్త చర్మ కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం చర్మం రంగును సమంగా చేస్తుంది. రోజ్ వాటర్ ముఖాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. కొన్ని వారాలు ఈ క్రీమ్ వాడితే చర్మం మీద స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. *రూపశ్రీ.
శీతాకాలంలో చర్మాన్ని రక్షించే టోనర్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేస్కోండి! శీతాకాలం చర్మాన్ని పొడిగా, గరుకుగా చేస్తుంది. కొన్ని సందర్బాలలో ఇది చర్మాన్ని ఎర్రగా మార్చి చర్మాన్ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా చర్మం నుండి కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది. ఇవన్నీ జరగకూడదు అంటే చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా తాజాగా ఉండాలి. ఇందుకోసం టోనర్‌ను ఉపయోగించడం చాలా అవసరం. మార్కెట్లో లభించే టోనర్లు చర్మాన్ని హాని చేసే రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి అలర్జీ, ఇరిటేషన్ కలిగిస్తాయి. అందుకే ఇంట్లో తయారుచేసిన టోనర్ చాలా మంచిది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టోనర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. టోనర్ చేసే మ్యాజిక్.. టోనర్ చర్మంలో ఉండే సహజ నూనెలను సమతుల్యం చేస్తుంది. చర్మానికి గ్లో ఇస్తుంది. మృదుత్వాన్ని పెంచుతుంది. చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది, పొడి చర్మాన్ని తగ్గించి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. ఇంట్లోనే టోనర్ తయారు చేసుకోవడం వల్ల కెమికల్ ఫ్రీ ఉత్పత్తి చర్మానికి వాడినట్టే. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోజ్ వాటర్, దోసకాయ టోనర్.. శీతాకాలంలో ముఖాన్ని వెంటనే చల్లబరచడానికి, రిఫ్రెష్ చేయడానికి రోజ్ వాటర్, దోసకాయ టోనర్ బెస్ట్ సొల్యూషన్. దోసకాయ సహజంగా హైడ్రేటింగ్ కలిగి ఉంటుంది, చర్మపు మంటను తగ్గిస్తుంది. తయారు చేసే విధానం.. దోసకాయను తురుమి దాని రసాన్ని తీయాలి. దోసకాయ రసానికి సమాన మొత్తం రోజ్ వాటర్. ఈ రెండింటి కలిపి ఒక స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని ప్రిజ్ లో ఉంచి వాడుకోవచ్చు. ఇదిచర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్రీన్ టీ టోనర్.. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో డల్ గా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి, చర్మానికి శక్తినిస్తాయి. తయారు విధానం.. గ్రీన్ టీని మరిగించి పూర్తిగా చల్లబరచాలి. దానిని స్ప్రే బాటిల్లో పోయాలి. ముఖంపై స్ప్రే చేయడం వల్ల చర్మం వెంటనే రిఫ్రెష్ అవుతుంది. చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతాయి. ఇది జిడ్డుగల, డల్ గా ఉన్న చర్మానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలోవెరా టోనర్.. పొడి చర్మం, చాలా రఫ్ గా ఉన్న చర్మానికి అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ తో చేసే టోనర్ కూడా అదేవిధంగా సహాయపడుతుంది. తయారు విధానం.. రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ను అర కప్పు నీటిలో వేసి బాగా కలపాలి. తేలికగా, చర్మాన్ని హైడ్రేట్ చేసే టోనర్ ఇది. ఈ టోనర్ చర్మపు చికాకు, ఎరుపును తగ్గించడమే కాకుండా చర్మం మీద పొలుసులను తగ్గిస్తుంది. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం సాఫ్ట్ గా మారుతుంది. అలాగే చల్లగా ఉంటుంది. లెమన్ వాటర్ టోనర్.. శీతాకాలంలో చాలా సార్లు ముఖ చర్మానికి ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. ఇందుకోసం లెమన్ వాటర్ టోనర్ చాలా బాగా పనిచేస్తుంది. తయారు విధానం.. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ టోనర్ రంధ్రాల నుండి మురికిని శుభ్రపరుస్తుంది. నూనెను నియంత్రిస్తుంది. ముఖానికి క్లియర్ రూపాన్ని ఇస్తుంది. చాలా పొడి చర్మం ఉన్నవారు దీనిని తక్కువ పరిమాణంలో ఉపయోగించడం బెటర్. పైన చెప్పుకున్న టోనర్ లు చాలా సహజంగా, తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. ఇవి చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో రసాయనాలు లేకపోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. *రూపశ్రీ.
చలికాలం కదా అని ముఖం మీద క్రీమ్స్ పూస్తున్నారా... ఈ షాకింగ్ నిజాలు తెలుసా! చలికాలం చర్మానికి పరీక్ష కాలం. చలి, చల్లగాలి కారణంగా చర్మం పగులుతుంది. చలి కారణంగా చాలామంది నీరు తక్కువ తాగుతారు. ఈ కారణంగా కూడా శరీరంలో నీరు తగ్గి చర్మం పొడిబారుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి చాలామంది మాయిశ్చరై జింగ్ క్రీములు, స్కిన్ కేర్ క్రీములు, స్కిన్ రిపేర్ క్రీములు అంటూ చాలా రకాలు పూస్తుంటారు. ఇవి చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని అనుకుంటారు. కానీ ఈ క్రీములను ఇష్టమొచ్చినట్టు వాడినా, లేక తప్పుగా ఉపయోగించినా చర్మానికి చాలా డేంజర్ అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. స్కిన్ క్రీమ్స్.. చర్మానికి ఉపయోగించే క్రీములలో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కొంతమంది చర్మంపై దద్దుర్లు, బ్లాక్ హెడ్స్ లేదా మొటిమలు వంటివి కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు, జిడ్డు చర్మం గలవారు ఈ క్రీమ్స్ ను వాడటం వల్ల అలెర్జీ కి గురికావడం లేదా చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మ సంబంధ సమస్యలు రావడం వంటి వాటికి కారణం అవుతుంది. స్కిన్ కోసం వాడే క్రీములు తాజాగా లేకపోయినా లేదా చర్మం మీద ఎక్కువ సేపు ఉంచినా అవి చర్మ ఇన్ఫెక్షన్లు, నల్లటి మచ్చలు రావడానికి కూడా కారణం అవుతుంది.అందుకే చర్మానికి వాడే క్రీములు తాజాగా ఉండాలి. అలాగే చర్మానికి క్రీమ్స్ రాసేటప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా చర్మానికి కేవలం వారంలో 2 లేదా 3 సార్లు మాత్రమే వాడటం మంచిది. క్రీమ్స్ ఉపయోగించేవారు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. క్రీమ్స్ ను జాగ్రత్తగా వాడినప్పుడే వాటి ఫలితం బాగుంటుంది. లేకపోతే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. *రూపశ్రీ.
న్యూ ఇయర్, క్రిస్టమస్ హడావిడిలో మిమ్మల్ని తళుక్కున మెరిపించే చిట్కాలు..! డిసెంబర్ నెలను పార్టీ సీజన్ అని చెప్పవచ్చు. ఒకవైపు క్రిస్మస్ వేడకలు, మరొకవైపు న్యూ ఇయర్ వేడుకలు.. ఈ పార్టీ సీజన్ దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతి అమ్మాయి ప్రతి చోట చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అది ఫ్రెండ్ పార్టీ అయినా, ఆఫీస్ పార్టీ అయినా, లేదా ఫ్యామిలీ మీట్ అయినా ప్రతి ఒక్కరూ తమ ఎంట్రీ స్టైలిష్‌గా, రాయల్ గా కనిపించాలని కోరుకుంటారు. అయితే వీటికి అటెండ్ అవ్వడానికి ఖరీదైన మేకప్ ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్మెంట్ ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేంటంటే అలాంటివి అవసరం లేదు. స్మార్ట్ స్కిన్ కేర్, సరైన మేకప్ చిట్కాలు, గ్లో ట్రిక్స్‌తో.. ఇంట్లోనే పర్పెక్ట్ పార్టీ లుక్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. అందాన్ని పెంచే సులభమైన గ్లో చిట్కాలు.. పార్టీకి ముందు.. ఏదైనా మేకప్‌కి బలమైన బేస్ అవసరం. ఇందుకోసం చర్మం ప్రిపేర్ కాకపోతే, మేకప్ ఎంత బాగున్నప్పటికీ, అది అంత బాగా కనిపించదు. పార్టీకి ముందు చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చర్మ రంధ్రాలను క్లియర్ చేయడానికి, చర్మాన్ని మృదువుగా చేయడానికి టోనర్‌ను అప్లై చేయాలి. దీని తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మేకప్ ఎక్కువసేపు ఉండటానికి కూడా సహాయపడుతుంది. బేస్ మేకప్.. బేస్ మేకప్‌లో ఫస్ట్ స్టెప్ ప్రైమర్ అప్లై చేయడం. ప్రైమర్ ఫౌండేషన్ సజావుగా కలపడానికి, క్రాక్స్ నివారించడానికి సహాయపడుతుంది. చర్మపు రంగుకు సరిపోయే ఫౌండేషన్‌ను ఎంచుకుని, దానిని పూర్తిగా బ్లెండ్ చేయాలి. నల్లటి మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉంటే వాటిని తేలికపాటి కన్సీలర్‌తో కప్పాలి. ఇది ముఖాన్ని తాజాగా, కంప్లీట్ గా కనిపించేలా చేస్తుంది. ఐ మేకప్.. పార్టీ లుక్ కోసం ఐ మేకప్ చాలా ముఖ్యం. కళ్ళకు మెరుపు, కళ్ల సైజ్, కళ్లు అట్రాక్షన్ గా కనిపించడానికి ఐషాడోను ఉపయోగించవచ్చు. ఐలైనర్ అంచులుగా ఉండేలా చేసి, హెవీ మస్కారాను అప్లై చేయడం ద్వారా కంటి మేకప్‌కు గ్లామర్‌ను జోడించవచ్చు. కావాలనుకుంటే లుక్‌ను డ్రామాటిక్ గా, పార్టీకి తగ్గట్టు మరింత హైలెట్ చేయడానికి ఐ లాషెస్ కూడా పెట్టుకోవచ్చు. మెరిసే లుక్ కోసం.. చర్మం సహజంగా, తాజాగా మెరిసిపోవాలంటే హైలైటర్, బ్లష్, డ్యూయ్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే చాలా ముఖ్యం. చెంప ఎముకలు, ముక్కు, గడ్డంపై తేలికపాటి హైలైటర్‌ను అప్లై చేయాలి. ఇది ముఖాన్ని మెరిసేలా చేయడమే కాకుండా పార్టీ లైట్లలో షైనింగ్ ఇస్తుంది. లుక్‌ను తాజాగా, యవ్వనంగా ఉంచడానికి బ్లష్‌ను లైట్ గా, నాచురల్ గా ఉంచాలి. మేకప్ ఎక్కువ సేపు ఉండాలంటే.. మేకప్ వేసుకున్న తర్వాత సెట్టింగ్ స్ప్రే వేయడం చాలా అవసరం. ఇది లుక్‌ను తాజాగా ఉంచుతుంది, అలాగే తొందరగా చెదిరిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. పార్టీ సమయంలో ముఖాన్ని పదే పదే తాకకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది మేకప్ ఎక్కువసేపు చెదిరిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
శీతాకాలంలో చుండ్రు పెరుగుతోందా...ఈ మిస్టేక్స్ చేస్తున్నట్టే..! జుట్టు ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు ఏదైనా ఉందంటే అది చుండ్రు. చుండ్రు తల చర్మాన్ని చాలా ఇర్రిటేట్ చేయడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలహీనం కావడానికి, హెయిర్ ఫాల్ కావడానికి కారణం అవుతుంది. అంతేకాదు చుండ్రు ఉన్నప్పుడు జుట్టు పెరుగుదల కూడా సాధారణం కంటే కూడా చాలా స్లోగా ఉంటుంది. ఈ కారణంగా జుట్టును చాలా దెబ్బతీయడంలో చుండ్రు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాంటి చుండ్రు సాధారణ రోజుల్లో కంటే శీతాకాలంలో విజృంభిస్తుంది. హెయిర్ ఫాల్ చలికాలంలో ఎక్కువ కావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే చలికాలంలో చుండ్రు పెరగడానికి రోజువారీ చేసే మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఈ మిస్టేక్స్ కారణంగా చుండ్రు పెరిగి జుట్టు నాశనం కావడానికి దారి తీస్తుంది. చుండ్రు పెరగడానికి కారణమయ్యే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే.. చల్లగాలి.. శీతాకాలం గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. తలపై చర్మపు తేమ వేగంగా తగ్గుతుంది. ఇది చర్మం రక్షణ పొరను బలహీనపరుస్తుంది. మలాసెజియా ఫంగస్ చురుగ్గా పెరుగుతుంది. దీని వల్ల మందపాటి పొరలు ఏర్పడతాయి. ఇదే చుండ్రు. వేడి నీటి స్నానం.. శీతాకాలంలో వేడి నీటి స్నానం చాలా మందికి ఊరటగా అనిపిస్తుంది. కానీ అది తలపై చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది. దీని ఫలితంగా దురద, ఎరుపు, ఫంగస్ పొరలు పెరగడం వంటివి జరుగుతాయి. తక్కువ తల స్నానం.. చలికాలంలో తలస్నానం చేయడం తగ్గిస్తుంటారు. దీనివల్ల నూనె పేరుకుపోతుంది, చర్మం మృతకణాలు పేరుకుపోతాయి, ఫంగస్ పెరుగుతుంది. నూనె వాడకం.. శీతాకాలంలో బరువుగా ఉన్న నూనెలు రాయడం వల్ల ఫంగస్ పెరుగుతుంది. ఫలితంగా దురద ఎక్కువగా రావడం, మందంగా పొలుసులు రావడం, చుండ్రు తగ్గినట్టే తగ్గి తిరిగి రావడం జరుగుతుంది. హెయిర్ క్యాప్.. చలి భరించలేక చాలామంది తలకు టోపి లేదా క్యాప్ లాంటివి ధరిస్తుంటారు. ఇవి ధరించినప్పుడు వేడి, చెమట పేరుకుపోతుంది. ఫంగస్ పెరగడానికి ఇది కారణం అవుతుంది. ఎక్కువ వేడి.. చలికారణంగా తేమ తక్కువగా ఉన్నప్పుడు.. ఆ చలి నుండి ఉపశమనం కోసం చాలామంది వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడుతుంటారు. దీనివల్ల మరింత పొడిబారి ఫంగస్ పెరుగుతుంది. హెయిర్ స్టైలింగ్ మిస్టేక్స్.. బ్లో డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు తల చర్మం నుండి తేమను తొలగిస్తాయి. దీని వలన చుండ్రు పెరుగుతుంది. కండిషనింగ్ మిస్టేక్స్.. చాలామంది తలకు కాకుండా కేవలం జుట్టుకు మాత్రమే కండిషనింగ్ చేస్తారు. దీనివల్ల తల చర్మం మరింత ఎండిపోతుంది. తక్కువ నీరు త్రాగడం.. శీతాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం, తల చర్మంలో తేమ తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారి చుండ్రు పెరుగుతుంది. విటమిన్ డి లోపం.. శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. దీని కారణంగా తలపై చర్మ రోగనిరోధక శక్తి బలహీనపడి ఇన్ఫెక్షన్ త్వరగా పెరుగుతుంది. *రూపశ్రీ.
పాదాలు బాగా పగిలి ఇబ్బంది పెడుతున్నాయా... అయితే మీకోసమే ఈ టిప్స్! మహిళలు ఆరోగ్యం కంటే ఎక్కువగా అందానికి ప్రాముఖ్యత ఇస్తారు. జుట్టు, ముఖం, పెదవులు, కనుబొమ్మలు, గోళ్లు ఇలా చాలా విషయాల్లో ఎన్నెన్నో టిప్స్ పాటిస్తారు. అయితే ఇన్ని టిప్స్ ఫాలో అయ్యే మహిళలు తమ పాదాల సంరక్షణలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. ఏ చెప్పుల షాపుకో వెళ్ళినప్పుడు, పట్టీలు వంటివి దరిస్తున్నపుడు తప్ప కాళ్ళ వైపు చూసేవారు కూడా తక్కువే అనుకోవచ్చు. ఈ కారణంగా మహిళల్లో పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఇది పాదాలు పొడిబారడంతో మొదలయ్యి మడమలు పగుళ్లు, కాల్లస్‌లకు దారితీస్తుంది. పగిలిన మడమల వల్ల అంతగా ఆందోళన చెందాల్సిన పని లేకపోయినా అవి ఎబ్బెట్టుగానూ, కొన్నిసార్లు నొప్పి పుట్టి ఇబ్బందిని కలిగిస్తాయి. పాదాల పగుళ్లు సాధారణం కంటే లోతుగా ఉన్నప్పుడు నడవడం కూడా పెద్ద ఇబ్బంది అవుతుంది. కొందరి పాదాలు ఎంతో సుకుమారంగా, అందంగా ఎలాంటి పగుళ్లు లేకుండా ఉంటాయి. అది అందరికీ సాధ్యం కాదేమో అని అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. పాదాల పగుళ్లు తగ్గి, ఆరోగ్యంగా మారేందుకు మూడే మూడు చిట్కాలు పాటిస్తే చాలు. స్నానం చేసిన తరువాత పాదాలను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఉదయం రాత్రి రెండు పూటలా పాదాలకు కూడా మాయిశ్చరైజర్ రాయాలి. మాయిశ్చరైజర్ వల్ల సరిపడినంత మృదుత్వం లభించడం లేదని అనిపిస్తే వెజిలైన్ లేదా ఇతర వైట్ పెట్రోలియం జెల్లీని పాదాలకు అప్లై చేయాలి. దీన్ని రోజూ క్రమం తప్పకుండా పాటిస్తుంటే తొందరలోనే మిగిలిన పాదాలు సాధారణ స్థితికి వస్తాయి. బాగా పొడిబారి, పగిలిన మడమల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన సాక్స్‌లను ఉపయోగించవచ్చు. వీటిని మాయిశ్చరైజింగ్ సాక్సులు అంటారు. వీటిలో కలబంద, విటమిన్ ఇ, షియా బటర్ వంటి పదార్థాలు ఉంటాయి, ఇవి పాదాల చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచగలుగుతాయి. కాలి పగుళ్లు నయం అయిన తర్వాత, పాదాలకు పెడిక్యూర్ చేసుకోవాలి. ఇది బ్యూటీపార్లర్లలోనే లభిస్తుందని అనుకుంటే పొరపాటే. వారంలో ఒకసారి అయినా ఇంటి పట్టున ఉన్నప్పుడు పెడిక్యూర్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం తక్కువ ధరలోనే కావలసిన పదార్థాలు లభిస్తాయి. వీటన్నింటికి బదులుగా పాలు, తేనె మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు .పాదాలను నానబెట్టిన తరువాత , ప్యూమిస్ స్టోన్ ను ఉపయోగించడం వల్ల పాదాలను నునుపుగా మార్చవచ్చు. సాధారణమైన ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే చర్మసంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది. కొన్నిసార్లు ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలాటి సమస్యలు ఎదురవుతాయి. మిగిలిన పాదాల చర్మాన్ని చేత్తో లాగడం చేయకూడదు. పాదాల సంరక్షణకు ఓపిక చాలా ముఖ్యం కాబట్టి మొదట్లో ఓపికగా పగుళ్లను నివరించుకుంటే.. ఆ తరువాత దాన్ని కాపాడుకోవడం సులువు అవుతుంది. ◆నిశ్శబ్ద.
ముఖం మీద మచ్చలను వదిలించుకోవడానికి గ్లైకోలిక్ యాసిడ్‌ను ఎలా వాడాలంటే..! మచ్చలు లేదా చాలా ఎక్కువగా ఉన్న టాన్ ముఖ చర్మాన్ని చాలా దెబ్బతీస్తాయి. వికారంగా కనిపించేలా చేస్తాయి. చాలామంది వీటిని తొలగించుకోవడానికి, చర్మాన్ని క్లియర్ గా, అందంగా కనిపించం కోసం వివిధ రకాల ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఎక్కువగా గ్లైకోలిక్ యాసిడ్ అనే పేరు వినబడుతోంది. ముఖ చర్మం మీద ఉండే అతి చిన్న రంధ్రాలను కూడా లోతుగా శుభ్రపరిచే లక్షణం ఉండటం వల్ల ఇది చర్మం మీద మచ్చలు, చాలా ఎక్కువగా ఉండే టాన్ వంటివి కూడా సులువుగా తొలగిస్తుంది. అసలు గ్లైకోలిక్ యాసిడ్ అంటే ఏంటి? దీన్నెలా వాడాలి? దీనివల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. గ్లైకోలిక్ ఆమ్లం.. గ్లైకోలిక్ ఆమ్లం చెరకు నుండి తీసుకోబడిన ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం (AHA). చాలా చిన్న అణులుసు కలిగి ఉండటం దీని ప్రత్యేక లక్షణం చిన్న. ఇవి చర్మం పై పొరలలోకి సులభంగా చొచ్చుకుపోతాయి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తాజాగా, ప్రకాశవంతంగా ఉన్న చర్మాన్ని తిరిగి ఇవ్వడంలో చాలా సహాయపడుతుంది. అందుకే ఇది పిగ్మెంటేషన్, టానింగ్, మొటిమల గుర్తులను తగ్గించడంలో చాలా ప్రబావవంతమైన పదార్థంగా పరిగణించబడుతోంది. మచ్చలకు గ్లైకోలిక్ యాసిడ్.. నల్లటి మచ్చలు, ఎండ కారణంగా చర్మం రంగు మారడం, వయసు పెరిగే కొద్ది వచ్చే మచ్చలు లేదా మొటిమల గుర్తులు అన్నీ మెలనిన్ పేరుకుపోవడం వల్ల వస్తాయి. గ్లైకోలిక్ యాసిడ్ చనిపోయిన చర్మాన్ని సున్నితంగా తొలగిస్తుంది. మెలనిన్ పొరను తగ్గిస్తుంది. మచ్చలను కాంతివంతం చేస్తుంది. కొన్ని వారాల పాటు రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల చర్మపు రంగు మొత్తం బాలెన్స్డ్ గా ఉంటుంది. ముఖ చర్మం మెరుస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ ఎలా వాడాలి? టోనర్‌గా.. 3% నుండి 7% వరకు బలం కలిగిన గ్లైకోలిక్ యాసిడ్ టోనర్లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కాటన్ ప్యాడ్ మీద కొంత టోనర్ తీసుకోవాలి. ముఖం అంతా సున్నితంగా అప్లై చేయాలి. ఇది వాడటం మొదలుపెట్టిన రోజుల్లో వారానికి 2-3 సార్లు మాత్రమే వాడాలి. ఇది చర్మాన్ని ఎక్కువ చిరాకు కలిగించకుండా మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. సీరం.. మచ్చలు లోతుగా ఉంటే 5% నుండి 10% గ్లైకోలిక్ ఆమ్లం కలిగిన సీరం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రిపూట చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ముఖంపై 2-3 చుక్కలు అప్లై చేసుకోవాలి. చర్మం పొడిబారకుండా ఉండటానికి దానిపై మాయిశ్చరైజర్ రాయాలి. ఈ సీరం కొంచెం బలంగా ఉంటుంది. అందుకే మొదట్లో వారానికి 1-2 సార్లు మాత్రమే అప్లై చేసి క్రమంగా ఫ్రీక్వెన్సీని పెంచాలి. పీల్.. 10% వరకు పీల్స్ ఇంట్లో వాడటానికి సేఫ్ గా ఉంటాయి. ముఖం మీద 5-10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మృత చర్మాన్ని తొలగించి కొత్త మెరుపును ఇస్తుంది. జాగ్రత్తలు.. గ్లైకోలిక్ యాసిడ్ అప్లై చేసిన తర్వాత సన్‌స్క్రీన్ అవసరం. లేకుంటే సన్‌బర్న్, పిగ్మెంటేషన్ పెరుగుతుంది. చర్మం చాలా సున్నితంగా ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే దీన్ని ముఖం మీద వాడాలి. మొదట్లో తక్కువ పవర్ ఉన్న గ్లైకోలిక్ యాసిడ్ ను వాడటం మొదలుపెట్టాలి. ఆ తరువాత క్రమంగా దా బలంగా ఉన్నదాని వైపు వెళ్లాలి. అంతేకానీ మొదట్లోనే చాలా స్ట్రాంగ్ గా ఉన్నవి వాడకూడదు. *రూపశ్రీ.
మెరిసే చర్మం కావాలా... ఈ పండ్లు తినండి చాలు..! అందంగా, ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపించే చర్మం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఇదంతా కలగానే ఉంటుంది. చాలామంది ఇలా మెరిసే చర్మం కోసం బోలెడు ట్రీట్మెంట్లు, మరింత ఖరీదైన చర్మ ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికంగా చర్మాన్ని మెరిపిస్తాయి. అంతేకానీ వీటితో దీర్ఘకాలం మెరిసే చర్మం లభించదు. అయితే అయితే చర్మం అందంగా, ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించాలంటే కొన్ని పండ్లు తింటే చాలని అంటున్నారు వైద్యులు. ఇంతకీ చర్మాన్ని మెరిచేలా చేసే పండ్లు ఏంటి? అసలు పండ్లు చర్మాన్ని మెరిపించడంలో ఎలా సహాయపడతాయి? తెలుసుకుంటే.. చర్మాన్ని మెరిపించడంలో పండ్లు.. చర్మాన్ని మెరిపించడంలో పండ్లు అద్బుతంగా సహాయపడతాయని, ఇది చాలా సీక్రెట్ మెథడ్ అని చర్మ సంరక్షణ నిపుణులు, వైద్యులు అంటున్నారు. పండ్లు తింటే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాదు.. కేవలం తినడానికే కాకుండా నేరుగా చర్మం పైన ఉపయోగించినా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. అరటిపండు.. అరటిపండు చర్మాన్ని లోపలి నుండి, వెలుపలి నుండి కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే ఎక్స్ఫోలియేషన్ లక్షణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. మొటిమలను కూడా తగ్గిస్తాయి. నారింజ.. నారింజలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్లు, ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది సహజ బ్లీచ్ గా పనిచేస్తుంది. మచ్చలు, గుర్తులను తొలగిస్తుంది. బొప్పాయి.. బొప్పాయి చర్మానికి చాలా అద్బుతంగా పనిచేస్తుంది. చర్మం పై మృత కణాలను తొలగించి కొత్త కణాలు ఏర్పడటంలో సహాయపడుతుంది. ఇది మెటిమలు, పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యువి కిరణాల నుండి రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్కిన్ కేర్ లో చాలా మంది స్ట్రాబెర్రీని ఎంచుకుంటారు. కీర దోస.. కీర దోసకాయ చర్మాన్ని హెడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంలో ఉండే అధిక వేడిని తగ్గిస్తుంది. ఇది చలువ గుణం కలిగి ఉండటం వల్ల వడదెబ్బ, చికాకు తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచుతుంది. కెవి.. కివిలో విటమిన్-సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా, హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ.
జుట్టు కుదుళ్లను బలంగా ఉంచే విటమిన్లు ఇవే..! మందంగా, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జుట్టు సంబంధిత ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి అయినా, హెయిర్ ట్రీట్మెంట్ గురించి చెప్పేటప్పుడు అయినా ఖచ్చితంగా ఈ విషయాలే పేర్కొంటూ ఉంటారు. చాలా తొందరగా రిజల్ట్ ఉంటుందంటూ ఇచ్చే ప్రకటనలు, ఖరీదైన ట్రీట్మెంట్లు, ఖరీదైన హెయిర్ ఉత్పత్తులు.. ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా, వేగంగా, బలంగా పెరగడంలో సహాయపడతాయని చెప్పే మాటలు అస్సలు నిజం కాదు. జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా, పొడవుగా మందంగా పెరగాలన్నా, జుట్టు కుదుళ్లు బలంగా ఉండటం ముఖ్యం. జుట్టు కుదుళ్లు బలంగా లేకపోవడం వల్లనే జుట్టు పలుచ బడటం, జుట్టు రాలడం, జుట్టు తెలుపు రంగులోకి మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే జుట్టు కుదుళ్లు బలంగా ఉండటంలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచే విటమిన్లు ఏంటో తెలుసుకుంటే.. విటమిన్-బి7.. జుట్టు పెరుగుదలకు ప్రమోట్ అయ్యే విటమిన్లలో బయోటిన్ ప్రముఖమైనది. బయోటిన్ ఉత్పత్తులంటూ చాలా ఉత్పత్తులు మార్కెట్లో వస్తుంటాయి. బయోటిన్ శరీరానికి కెరాటిన్ తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా నిర్మించే ప్రోటీన్. ఇది తగినంతగా లేకపోతే జుట్టు కుదుళ్లు బలహీనంగా, పెళుసుగా మారి విరిగిపోవడం, రాలిపోవడం వంటివి జరుగుతాయి. విటమిన్-డి.. బలమైన ఎముకల కోసం విటమిన్ డి చాలా అవసరం. కాని జుట్టు కుదుళ్లు వాస్తవానికి విటమిన్ డి గ్రాహకాలతో నిండి ఉంటాయట. విటమిన్-డి లోపం ఉన్నప్పుడు జుట్టు పెరుగుదల మందగిస్తుందట. కొన్ని అధ్యయనాలు విటమిన్ డి లోపం వల్ల అలోపేసియా అరేటా వంటి సమస్యలకు కూడా కారణం అవుతుందట . ఐరన్.. ఐరన్ జుట్టుకు విద్యుత్ సరఫరా లాంటిదని చెబుతారు. తగినంత ఐరవ్ లేకపోతే జుట్టు ఫోలికల్స్ కు ఆక్సిజన్ సరఫరా కష్టమవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా, జుట్టు పలుచగా మారుతుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం. రక్తం ఎక్కువగా పోవడం వంటివి జరుగుతాయి. అందుకే ఐరన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. జింక్.. జింక్ దెబ్బతిన్న జుట్టు కణజాలాన్ని మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్ల చుట్టూ ఉన్న నూనె గ్రంథులు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. జింక్ లోపం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉండటం వంటివి జరుగుతాయి. విటమిన్-ఇ.. విటమిన్ ఇ గొప్ప యాంటీఆక్సిడెంట్. ఇది తల చర్మాన్ని, జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, బచ్చలికూర, అవోకాడోలలో విటమిన్-ఇ ఉంటుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్.. జుట్టు పొడిగా, పెళుసుగా ఉంటే అది ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ల లోపమే. ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టుకు పోషణ ఇస్తాయి. జుట్టును హైడ్రేట్ గా ఉంచుతాయి. విటమిన్-ఎ.. విటమిన్ ఎ నెత్తిమీద చర్మ గ్రంథులలో ఉండే సహజ కండీషనర్ అయిన సెబమ్ తయారీకి సహాయపడుతుంది. ఇది లోపిస్తే జుట్టు పొడిబారడం, దురద, జుట్టు పెరుగుదల మందగించడం వవంటివి ఎదురవుతాయి. అయితే విటమిన్-ఎ ఎక్కువైతే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. *రూపశ్రీ.
హెయిర్ ను పాడు చేసే రోజువారీ అలవాట్లు ఇవి..! జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అబ్బాయిలు కూడా జుట్టు గురించి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అమ్మాయిలకే జుట్టు మీద కేరింగ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా చాలా మందికి హెయిర్ అంత హెల్తీగా ఉండదు. దీనికి కారణం ఏంటో తెలియక చాలా మంది గందరగోళానికి లోనవుతుంటారు. కానీ కొన్ని రోజువారీ అలవాట్లు హెయిర్ ను చాలా డ్యామేజ్ చేస్తాయి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. షాంపూ వాడకం.. తలస్నానం చేయడం వల్ల జుట్టు శుభ్రంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. నిజానికి సల్ఫేట్లు, పారాబెన్లు, ఫార్మాల్డిహైడ్ లేని pH-బ్యాలెన్స్డ్ షాంపూలను వాడినంతవరకు వారానికి 4–5 సార్లు తలస్నానం చేసి జుట్టుకు కండిషనర్ వాడుతూ ఉంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది. సెన్సిటివ్ ఫార్ములాలతో తయారు చేయబడిన షాంపూలు జుట్టుకు ఉండే సహజ మృదుత్వాన్ని కోల్పోకుండా, చెమట, నూనెలను శుభ్రం చేయడంతో పాటు బయటి వాతావరణం, కాలుష్యం, ఎండ, ముఖ్యంగా దుమ్ము, తేమ లేదా కలుషితమైన గాలి వంటి వాటి వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. కానీ చాలామంది కఠినమైన షాంపూలు వాడుతుంటారు. ఇవి జుట్టును చాలా తొందరగా డల్ గా చేస్తాయి. జుట్టుకు సహజంగా ఉండే మృదుత్వాన్ని నాశనం చేస్తాయి. జుట్టు కుదుళ్లను కూడా బలహీనపరుస్తాయి. అందుకే షాంపూ సరిగా లేకపోతే జుట్టు పాడవుతుంది. హెయిర్ స్టైలింగ్.. చాలామంది అమ్మాయిలకు జుట్టు స్టైల్ గా ఉండాలంటే చాలా ఇష్టం. రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు లేదా కర్లింగ్ వాండ్స్ వంటివి వాడతారు. వేడి మీద ఉపయోగించే ఈ పరికరాల కారణంగా జుట్టు బలహీనపడి క్రమంగా పెళుసుగా మారుతుంది. హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడాల్సి వస్తే చాలా తక్కువగా ఉపయోగించడం, వాటిని ఉపయోగించే ముందు జుట్టు మీద హీట్ ప్రొటక్షన్ స్ప్రే ఉపయోగించడం చాలా ముఖ్యం. టైట్ హెయిర్ స్టైల్స్.. జుట్టును గట్టిగా లాగడం, గట్టిగా టై చేయడం, ఎప్పుడూ పోనీటెయిల్ తరహా హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల జుట్టు మూలాలపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ట్రాక్షన్ అలోపేసియా అంటారు. జుట్టును పైకి కట్టుకోవడం, గట్టిగా బిగించడం, మరీ ముఖ్యంగా రాత్రి పడుకొనేటప్పుడు జుట్టును గట్టిగా బిగించిన హెయిర్ స్టైల్ తో నిద్రపోవడం వంటివి చేయకూడదు. తలచర్మం.. జుట్టు గురించి ఆలోచించేవారు తల చర్మం గురించి కూడా ఆలోచించాలి. తలచర్మం పొడిగా, పొరలుగా లేదా పేరుకుపోయినట్టు ఉంటే జుట్టు పెరుగదు. జుట్టు శుభ్రం చేసుకోవడం గురించి ఆలోచించినట్టే తలచర్మానికి హాని కలిగించని షాంపూలు ఎంచుకోవాలి. ప్రతి రోజూ కొన్ని నిమిషాలపాటు చేతి వేళ్ల కొనలతో తలచర్మాన్ని సున్నితంగా మసాజ్ చేస్తుండాలి. ఇది జుట్టు మూలాలకు బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది. పోషణ, హైడ్రేషన్.. జుట్టు బలంగా పెరగడానికి ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లతో సహా సరైన పోషకాహారం అవసరం. భోజనం స్కిప్ చేయడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం లేదా తగినంత నీరు త్రాగకపోవడం వంటి చెడు ఆహారపు అలవాట్లు జుట్టును నిస్తేజంగా, బలహీనంగా చేస్తాయి. తగినంత ప్రోటీన్ కలిగిన సమతుల్య భోజనం, ముఖ్యంగా గుడ్లు, చేపలు, కాయధాన్యాలు తినాలి. హైడ్రేటెడ్ గా ఉండాలి. *రూపశ్రీ.
బాడీ లోషన్ సీక్రెట్స్.. పొడి చర్మం ఉన్నవారికి ఏ లోషన్ మంచిది... శీతాకాలం ప్రారంభమైంది. ఇది చర్మానికి పరీక్షలు పెట్టే కాలం. ముఖ్యంగా సున్నితమైన చర్మం, పొడి చర్మం ఉన్నవారు చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పొడి చర్మం శీతాకాలంలో తేమ లేకపోవడం, సాగిన గుర్తులు, దురద, పాచెస్ వంటి సమస్యలకు గురవుతుంది. సరైన లోషన్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించగలదు. అందువల్ల పొడి చర్మం ఉన్నవారు ఎక్కువసేపు చర్మాన్ని హైడ్రేట్ గా, హెల్తీగా ఉండే లోషన్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్లో వివిధ రకాల లోషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రతి ఉత్పత్తి అన్ని చర్మ రకాలకు సరిపోదు. అందువల్ల బాడీ లోషన్ కొనడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు సరైన లోషన్ ఎందుకు ఎంచుకోవాలి? సరైన లోషన్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుంటే.. సరైన లోషన్ ఎందుకు ఎంచుకోవాలి? సరైన లోషన్ పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పొడి చర్మం ఉన్నవారు బాడీ లోషన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటే.. లోషన్ కొన్న తర్వాత ఎలాంటి అసంతృప్తికి లోను కాకుండా, డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. బాడీ లోషన్.. తయారీ పదార్థాలు.. బాడీ లోషన్ కొనుగోలు చేసేటప్పుడు, దాని తయారీకి వాడిన పదార్థాలను చెక్ చేయాలి. ఉదాహరణకు.. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, షియా బటర్, కోకో బటర్, సెరామైడ్లు, బాదం నూనె వంటి హైడ్రేటింగ్ పదార్థాలు పొడి చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బాడీ లోషన్‌లో ఈ పదార్థాలు ఏవైనా ఉంటే, దానిని ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. ఫార్ములా.. పొడి చర్మం ఉన్నవారు ఎల్లప్పుడూ బాగా మాయిశ్చరైజింగ్ ఫార్ములాను ఎంచుకోవాలి. ఎందుకంటే హెవీ మాయిశ్చరైజింగ్ ఫార్ములా ఉన్న బాడీ లోషన్ క్రీమీగా, అంటుకోకుండా ఉంటుంది. పొడి చర్మానికి ఎక్కువ సేపు తేమను అందిస్తుంది. ఇది చర్మం జిడ్డుగా అనిపించకుండా నిరోధిస్తుంది. లోషన్ లో ఇవి ఉండకూడదు.. పొడి చర్మం ఉన్నవారు ఆల్కహాల్ లేదా కఠినమైన రసాయనాలు కలిగిన బాడీ లోషన్లను వాడకూడదు. ఆల్కహాల్, కఠినమైన రసాయనాలు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. చర్మ సమస్యను తగ్గించే బదులు మరింత తీవ్రతరం చేస్తాయని స్కిన్ కేర్ నిపుణులు అంటున్నారు. సీజన్ ముఖ్యం.. చర్మ రకాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు, బాడీ లోషన్‌ను కొనుగోలు చేసే సీజన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు.. శీతాకాలంలో బాగా మాయిశ్చరైజింగ్ ఫార్ములా ఎంచుకోవడం మంచిది. వేసవిలో తేలికపాటి మాయిశ్చరైజింగ్ ఫార్ములా బాగుంటుంది. ఇది చర్మం జిడ్డుగా అనిపించకుండా చేస్తుంది. ఇది గమనించాలి.. పొడి చర్మం ఉన్నవారు బాడీ లోషన్ కొనే ముందు బాక్స్ మీద ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. చర్మం చాలా పొడిగా ఉంటే "డీప్ నూరిషింగ్" లేదా "ఇంటెన్స్ మాయిశ్చర్" అని రాసి ఉన్న లోషన్ కొనాలి. ఇది రాసిన లోషన్లు చర్మాన్ని ఎక్కువ కాలం మృదువుగా ఉంచుతాయి. *రూపశ్రీ.
శీతాకాలం వచ్చేసింది.. లిప్ బామ్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి..! శీతాకాలంలో చర్మ సంరక్షణ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా చర్మం సున్నితంగా ఉండే పెదవుల విషయంలో కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లని గాలి, పొడి వాతావరణం వల్ల పెదవులు పగుళ్లు, పొడిబారడం లేదా నొప్పి కలుగుతాయి. ఈ కారణంగా చాలామంది అమ్మాయిలు లిప్ బామ్ కొనుగోలు చేస్తారు. కానీ సరిగా గమనిస్తే అన్ని లిప్ బామ్ లు పెదవుల పగుళ్లను నయం చేయలేవు. మార్కెట్లో చవకైన లిప్ బామ్ లు ఉంటాయి. నాణ్యత లేకుండా ఉండే లిప్ బామ్ లు లేదా నకిలీ లిప్ బామ్స్ ఉంటాయి. ఇవి పెదవులకు హాని కలిగిస్తాయి. మార్కెట్ లో లభ్యమయ్యే చాలా లిప్ బామ్ లలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి పెదవుల తేమను కోల్పోయేలా చేసి సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల లిప్ బామ్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. సరైన లిప్ బామ్ పెదాలను మృదువుగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంచుతుంది. లిప్ బామ్ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. తయారీ పదార్థాలు.. సరైన పదార్థాలతో తయారు చేసిన లిప్ బామ్‌ను కొనుగోలు చేయాలి. లిప్ బామ్‌లో కొబ్బరి, బాదం, షియా బటర్ వంటి సహజ నూనెలు ఉండటం చాలా ముఖ్యం. ఇవి లేకపోతే పెదవుల సమస్యలు వస్తాయి. ఈ పదార్థాలు పెదవులపై చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. SPF తప్పనిసరి లిప్ బామ్ లో SPF ఉండటం కూడా ముఖ్యం. SPF చర్మాన్ని సూర్య కిరణాల నుండి రక్షిస్తుంది. సూర్యుని హానికరమైన కిరణాల నుండి పెదాలను రక్షించే లిప్ బామ్‌ను కొనడం మంచిది. శీతాకాలంలో తేలికపాటి సూర్య కిరణాలు కూడా హానిచేసే అవకాశం ఉంటుంది. కలర్, ఫ్లేవర్.. లిప్ బామ్ కొనుగోలు చేసేటప్పుడు తరచుగా దాని సువాసన, రంగును చెక్ చేస్తారు. అయితే సింథటిక్ కలర్స్, ఫ్లేవర్స్ కలిగి ఉన్న లిప్ బామ్స్ పెదవులకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి లిప్ బామ్స్ వాడకుండా ఉండాలి. బ్రాండ్.. చవకగా ఉందని ఏది పడితే ఆ బ్రాండ్ లిప్ బామ్ ని కొనుగోలు చేసి వాడకూడదు. వీటిలోని పదార్థాలు పెదవులపై ఉన్న సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తాయి. పెదవులకు హాని కలిగించకుండా ఉండటానికి ఎల్లప్పుడూ మంచి బ్రాండ్ ను ఎంచుకోవాలి. జాగ్రత్త.. ఎంత మంచి లిప్ బామ్ కొన్నా, దాన్ని పదే పదే వాడటం వల్ల పెదవులు దెబ్బతింటాయి. దాన్ని అతిగా పూయడం వల్ల పెదవులపై పొర సున్నితంగా మారి దెబ్బతింటుంది. కాబట్టి వాడకాన్ని పరిమితం గా ఉంచుకోవాలి. *రూపశ్రీ.
వాటర్ ప్రూఫ్ మస్కారా వాడుతున్నారా.. ఈ నిజాలు తెలుసా! మేకప్ ట్రెండ్స్ చాలా ఫాస్ట్ గా ఛేంజ్ అవుతున్నాయి. అమ్మాయిలు తమ కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాజల్, ఐ లైనర్, మస్కారా, ఐ మేకప్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ మస్కారా అమ్మాయిలకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉంటుంది. నీటిలో లేదా చెమటలో కూడా పాడవ్వకుండా నిలిచి ఉంటుంది. కానీ అందం కోసం వాడే ఈ వాటర్ ప్రూఫ్ మస్కారా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. వాటర్ ప్రూఫ్ మస్కారా వెంట్రుకలకు మందాన్ని, ముదురు రంగును ఇస్తుంది. అయితే ఇది కళ్ళు, వెంట్రుకలకు తీవ్రమైన నష్టాన్ని కూడా కలిగిస్తుందట. ఎలాగో తెలుసుకుంటే.. కనురెప్పలు కోల్పోవడం.. వాటర్ ప్రూఫ్ మస్కారాను తొలగించడం అంత సులభం కాదు. దీనికోసం మేకప్ రిమూవర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది, లేదా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఇది వెంట్రుకల మూలాలను బలహీనపరుస్తుంది. క్రమంగా వెంట్రుకలు రాలిపోవడానికి దారితీస్తుంది. వాటర్ ప్రూఫ్ మస్కారాను ఎక్కువగా ఉపయోగిస్తే వెంట్రుకలు మునుపటి కంటే సన్నగా, బలహీనంగా మారతాయి. కంటి అలెర్జీలు.. వాటర్ ప్రూఫ్ మస్కరాల్లో కళ్ళకు హాని కలిగించే రసాయనాలు ఉంటాయి. ఇవి చికాకు, దురద కలిగిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. డ్రైనెస్.. వాటర్ ప్రూఫ్ మస్కారా కనురెప్పలను ఎండిపోయేలా చేస్తుంది. ఎక్కువసేపు అలాగే ఉంచినప్పుడు అది తేమను కోల్పోయేలా చేసి కనురెప్పలను నిస్తేజంగా, పొడిగా చేస్తుంది. దీనివల్ల కనురెప్పలు సహజ మెరుపును కోల్పోతాయి. మస్కారా వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ప్రతిరోజు వాటర్ ప్రూఫ్ మస్కారాను ఉపయోగించడడం మంచిది కాదు. ప్రత్యేక సందర్భాలలో లేదా ముఖ్యమైన సమయాల్లో మాత్రమే దాన్ని ఉపయోగించడం మేలు. మంచి నాణ్యత గల మస్కారాను మాత్రమే కొనడం మంచిది. ఇది నష్టాన్ని అరికడుతుంది. మస్కారాను తొలగించడానికి, కనురెప్పలు ఎక్కువగా దెబ్బతినకుండా ఉండటానికి ఆయిల్ ఆధారిత మేకప్ రిమూవర్‌ను ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించడం మర్చిపోకూడదు. కళ్ళలో ఏదైనా అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అందం ముఖ్యమే. కానీ కళ్ళు అంతకంటే ముఖ్యం. కళ్ళు ఎక్కువ కాలం అందంగా కనిపించాలంటే, వాటర్ ప్రూఫ్ మస్కారాను తెలివిగా వాడాలి. కొంచెం జాగ్రత్త తీసుకుంటే అందంగా కనిపిస్తూనే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. *రూపశ్రీ.
ముఖ చర్మం రంధ్రాలు తగ్గించడం ఎలాగో తెలుసా... కొందరికి ముఖం మీద చర్మం రంధ్రాలలా కనబడుతుూ ఉంటుంది. ఇది చర్మ గంధ్రులు తెరచుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ తెరచుకున్న రంధ్రాల కారణంగా మొటిమలు, మచ్చలు, దుమ్ము, ధూళి పేరుకోవడమే కాదు.. చర్మం చాలా తొందరగా ముడుతలు పడినట్టు, వృద్దాప్యం మీద పడినట్టు అనిపిస్తుంది. చర్మం మీద ఉన్న ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించడం కష్టమే కానీ అసాద్యం మాత్రం కాదు. చాలా మంది వీటని తగ్గించుకోవడానికి వాణిజ్య ఉత్పత్తులను వాడుతుంటారు. ఇవి వాడినంత సేపు చర్మం బిగుతుగా, రంధ్రాలు లేకుండా ఉంటుంది. కానీ తరువాత మళ్లీ మొదటికి వస్తుంది. అలా కాకుండా ఇంటి పట్టునే సులువైన చిట్కాలతో ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించుకోవచ్చు. అందుకోసం ఫాలో కావాల్సిన చిట్కాలు ఇవీ.. ఐస్.. ఓపెన్ పోర్స్ తగ్గించుకోవడానికి మంచు ముక్కలు బాగా సహాయపడతాయి. ఒక క్లాత్ లో మంచుముక్కలు ఉంచి ఆ క్లాత్ ను 15 నుండి 30 సెకెన్ల పాటు ముఖ చర్మం మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మాన్ని బిగుతుగా చేయడం, చర్మ రంధ్రాలు మెల్లిగా తగ్గడం జరుగుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్.. నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమాన భాగంలో తీసుకోవాలి. దీంట్లో కాటన్ బాల్ ముంచి ఈ ద్రావణాన్ని ముఖమంతా పట్టించాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత ముఖాన్ని కడిగేయాలి. యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే అస్ట్రింజెంట్ గుణాలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడంలో సహాయపడతాయి. గుడ్డు తెల్ల సొన.. గుడ్డులో ఉండే తెల్లసొన చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. గుడ్డు తెల్ల సొనను చర్మానికి అప్లై చేసి 15నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో, రంధ్రాలను చిన్నగా చేయడంలో సహాయపడతాయి. టమోటా మాస్క్.. మిక్సీలో టమోటా వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ వేయాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. టమోటాలో ఉండే సహజ ఆమ్లత్వం చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా స్క్రబ్.. కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి వృత్తాకారంగా చర్మం మీద స్క్రబ్ చేయాలి. ఆ తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మృతకణాలను తొలగిస్తుంది. మూసుకుపోయిన చర్మరంధ్రాలను క్లియర్ చేస్తుంది. గ్రీన్ టీ.. గ్రీన్ టీ చర్మానికి చాలా మేలుచేస్తుంది. కాటన్ బాల్ ఉపయోగించి గ్రీన్ టీని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆ తరువాత 15 నిమిషాలు అలాగే ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రంధ్రాలను బిగించి జిడ్డును తగ్గించడంలో సహాయపడతాయి. రంధ్రాలను బిగుతు చేస్తాయి. కలబంద.. స్వచ్చమైన కలబంద తెరుచుకున్న రంధ్రాలను తిరిగి సాధారణం చెయ్యడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జును అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కలబందలో ఉండే గుణాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి. రంధ్రాలను బిగుతుగా ఉంచుతాయి. *నిశ్శబ్ద.
తేనెతో పెదాలకు మరింత అందం! మొహానికి అందాన్ని తెచ్చి పెట్టేవి పెదాలంటే మీరూ ఒప్పుకుంటారు కదూ. అలాంటి పెదాలు మరింత ఎర్రగా మెరిసిపోవాలంటే వాటిని మరికాస్త ఎక్కువగా పట్టించుకోవాల్సిందే. కొంతమందికి టెన్షన్ లో పెదాలు కోరికే అలవాటు ఉంటుంది. అది మానుకుంటే చాలు పెదాలు బండగా తయారవ్వకుండా ఉంటాయి. కొంత మంది పెదాలు నల్లగా ఉండి అందాన్ని తగ్గిస్తాయి. అలాంటివారు రాత్రి పడుకునే ముందు నిమ్మరసాన్ని రాసుకుని పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదాలపై ఉండే నల్ల మచ్చలు కూడా మాయమవుతాయి. ఇలాగే ఇంకొన్ని చిట్కాలని చూద్దామా. * మూడు స్పూన్ల పంచదార పొడిలో రెండు స్పూన్ల వెన్న కలిపి పేస్ట్ లా చేసి పెదాలకి పట్టించి ఉంచి ఒక గంట తర్వాత చన్నీళ్ళతో కడుగుకోవాలి.పంచదార డెడ్ స్కిన్ సెల్స్ ని తీసేస్తుంది,వెన్న మృదుత్వాన్ని ఇస్తుంది. * బీట్రూట్ పేస్టు ని రాత్రి పడుకునే ముందు పెదాలకి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకున్నా పెదాలు ఎరుపురంగులోకి మారతాయి. * ఒక స్పూన్ నిమ్మరసం, కొబ్బరి నూనె, రెండు స్పూన్ల పంచదార పొడి కలిపి పేస్ట్ లా చేసి ఉంచుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది. ఈ పేస్ట్ పెదాలకి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. * ఒక స్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్ లో రెండు స్పూన్ల పెట్రోలియం జెల్లీ కలిపి పెదాలకి పట్టిస్తే పెదాలు స్ట్రాబెర్రీ రంగులోకి మారిపోతాయి. * మనకి సులువుగా దొరికేవి గులాబి రేకులు. వాటిని ముద్దలా చేసి పెదాలకి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే చాలు అందమైన పెదాలు మీ సొంతమవుతాయి. ఇలాంటివి చేస్తూ వీటితో పాటు తగినంత నీళ్ళు తాగటం వాళ్ళ కూడా పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. నీళ్ళతో పాటు ఆయా కాలాల్లో దొరికే పళ్ళు తినటం వల్ల కూడా పెదాలు అందంగా కనిపిస్తాయి. ఇలా కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే చాలు మాములుగా ఉండే మీ పెదాలు ఎర్రని ద్రాక్ష పళ్ళలా మెరిసిపోతాయి. కళ్యాణి...
ఈ ఆసనాలు వేస్తే జుట్టు పెరుగుతుందా... జుట్టు దృఢంగా, అందంగా ఉంటే శరీర ఆరోగ్యం చాలా బాగున్నట్టు. అందులోనూ శరీరానికి అదనపు అందాన్ని ఇచ్చేది జుట్టు. జుట్టు పెరుగుదల కోసం ఎన్నో రకాల మందులు, చిట్కాలు, నూనెలు వాడుతుంటారు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి యోగ గొప్ప మార్గం. యోగాలో కొన్ని ఆసనాలు జుట్టు అద్భుతంగా పెరిగేలా చేస్తాయి. వాటిలో కొన్ని ఆసనాలు ఇక్కడున్నాయి.. అధో ముఖ స్వనాసన జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. తలలో రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఈ ఆసనం ఇతర భౌతిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఉదాహరణకు, ఇది మనస్సును శాంతపరచడానికి, శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి, శరీరానికి కొత్త శక్తినివ్వడానికి సహాయపడుతుంది. కపాలభాతి శ్వాస వ్యాయామం మెరుగైన ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది, ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను దోహదం చేస్తుంది. అంతేకాకుండా, ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు రాలే సమస్యకు కూడా గొప్ప పరిష్కారం. సర్వాంగాసనం ఇది శరీరాన్ని బ్యాలెన్స్ గా ఉండేలా చేస్తుంది, తలపై రక్త ప్రసరణను పెంచుతుంది. సర్వంగాసనం లేదా షోల్డర్ స్టాండ్ అనేది పూర్తి శరీర వ్యాయామం, ఇది వివిధ కండరాల సమూహాలపై పనిచేస్తుంది. బాలసనం ఇది జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఒత్తిడి మరియు జీర్ణ సమస్యలకు తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాంగ్జైటీ సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శీర్షాసనం శీర్షాసనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది మరియు జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. ఇది నిద్రాణమైన వెంట్రుకల ఫోలికల్స్ ను ఉత్తేజపరుస్తుంది. ఈ కారణంగా జుట్టు పెరుగుదల సామర్థ్యాన్ని చేరుకోవడానికి, తద్వారా జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. వజ్రాసనం వజ్రాసనం లేదా థండర్ బోల్ట్ భంగిమ సరళమైనది అయినప్పటికీ చాలా శక్తివంతమైనది. ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. చివరికి జుట్టు పెరుగుదలకు దారితీసే పోషకాలను పెంచడంలో సహాయపడుతుంది. ఉత్తనాసన జుట్టు నాణ్యత మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. జుట్టు మెరిసేలా మరియు దోషరహితంగా కనిపించేలా చేస్తుంది. ఈ యోగ భంగిమ శరీరాన్ని సాగదీయడంతో పాటు కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇది ఆక్సిజన్ స్థాయిలను పెంచడం ద్వారా తలకు రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మత్స్యాసనం జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో మత్స్యాసనం ది బెస్ట్ అని చెప్పవచ్చు. బలమైన, పొడవాటి మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ యోగా ఆసనం రోజువారీ సాధనతో చాలా జుట్టు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఎనిమిది ఆసనాల్లో వీలైనన్ని రోజూ వేస్తుంటే జుట్టు సంబంధ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. ఇంకెందుకు అలద్యం మీరూ ట్రై చెయ్యండి. ◆నిశ్శబ్ద.
మెరుపుతీగలా మెరిసిపోతారు ఇలా చేస్తే... ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?? అని సినిమాలలో హీరో పాట పాడితే.. హీరోయిన్ తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతుంది. ఆమె అందం కూడా నిజంగానే చూపరులను ఆకట్టుకుంటూ మెరుస్తూ ఉంటుంది. హీరోయిన్లు తాము అందంగా కనిపించడానికి పడని పాట్లు ఉండవంటే నమ్మండి. చర్మాన్ని, శరీర ఆకారాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటేనే వారికి అవకాశాలు వచ్చేది. అయితే అందమంటే హీరోయిన్లే కాదు. సాధారణ అమ్మాయిలు కూడా హీరోయిన్ అంత అందంగా ఉండచ్చు. సహజంగానే కాస్త ఖరీదైన బట్టలు వేసుకుని, ఖరీదైన వస్తువులు పెట్టుకుని, మంచి మేకప్ వేస్తే ప్రతి అమ్మాయీ హీరోయిన్ లాగే ఉంటుంది. కానీ… ఈ పూతలు పూయడం, ట్రీట్మెంట్ లు ఇవ్వడం వంటివి వదిలేసి సహజంగా అందంగా మెరిసిపోతే ఎంత బావుంటుంది కదా… ప్రతి అమ్మాయి మనసులో ఏదో ఒక సందర్భంగా అనుకునే ఉంటుంది ఈ మాట. అయితే అలా అనుకోవడం అత్యాశ ఏమి కాదు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా.. ఎలాంటి కృత్రిమ పూతల జోలికి వెళ్లకుండా అద్భుతమైన దేహకాంతిని సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే..ఇదిగో ఇలా… ◆విటమిన్ ఎ ను పుష్కలంగా కలిగి ఉండి, కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే దుంప కూరగాయ క్యారెట్. ఇది సహజంగానే ఆకర్షణగా ఉంటుంది. ఈ క్యారెట్ ను కూరల్లోనూ, స్వీట్ చేయడానికి, జ్యుస్ చేసుకుని తాగడానికి, మరికొందరు నేరుగా డైటింగ్ పేరుతో తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ క్యారెట్ ను ఇలా కాకుండా విభిన్నంగా ఉపయోగిస్తే కాంతులీనే చర్మం సొంతమవుతుంది. క్యారెట్ ను బాగా ఉడికించాలి. ఆ తరువాత బాగా మెదిపి గుజ్జులాగా చేయాలి. ఈ గుజ్జును శరీరమంతా పట్టించి అరగంట సేపు ఆరనివ్వాలి. ఈ గుజ్జు బాగా ఆరిన తరువాత కొన్ని పాలు తీసుకుని ఈ ఎండిన క్యారెట్ గుజ్జుమీద కొద్ధికొద్దిగా పాలు వేసి మర్దనా చేస్తూ క్యారెట్ గుజ్జును తొలగించాలి. దీని తరువాత సాధారణంగా స్నానం చేయాలి. స్నానానికి ఎలాంటి సోప్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా మారి మంచి రంగులోకి వస్తుంది. ◆కొరియన్ స్కిన్.. సాధారణంగా ఇప్పట్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొరియన్ ప్రాంత అమ్మాయిల్లా చర్మం కావాలంటే ఇలా చేయండి అలా చేయండి అంటూ బోలెడు టిప్స్ చూపిస్తూ ఉంటారు. అయితే కొరియన్ స్కిన్ కావాలంటే కింది చిట్కా ఫాలో అవ్వాలి. బఠానీ పువ్వులు ( బఠానీ కాయలు కాయడానికి ముందు పువ్వులు కాస్తాయి) తీసుకుని వాటిని ఎండబెట్టి పొడి చేయాలి, ఓట్స్ పొడి తీసుకోవాలి, ఇందులో పన్నీరు కలిపి మెత్తగా గుజ్జులాగా చేయాలి. దీన్ని శరీరమంతా పట్టించి బాగా ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే రబ్బరు బొమ్మలగా కొరియన్ స్కిన్ సొంతమవుతుంది. ◆అందరికీ అందుబాటులో దొరికేది బొప్పాయి కాయ. బాగా పండిన బొప్పాయి కాయను తీసుకుని పొట్టు తీసేసి బాగా మెదిపి గుజ్జు చేయాలి. బొప్పాయి కాయ గుజ్జును శరీరమంతా పట్టించి ఆరిపోయిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే… క్రమంగా చర్మంలో జీవం పెరుగుతుంది. చర్మం మీద మచ్చలు, మంగు, మొటిమల తాలూకూ గుర్తులు వంటివి అన్నీ పోయి చర్మం స్పష్టంగా తయారవుతుంది. ◆నారింజ కాయ గురించి తెలియనిది ఎవరికి?? తింటాం తొక్కలు పడేస్తాం. అయితే ఈ నారింజ తొక్కలను కూడా ఉపాధి వనరుగా మార్చేసుకున్నాయి నేటి వ్యాపార పోకడలు. నారింజకాయ తొక్కను ఎండబెట్టి పొడిచేసి నిలవచేసుకోవాలి. నారింజ తొక్క పొడి, ఓట్స్ పొడి, పాలమీగడ మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి శరీరమంతా పట్టించాలి. సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీర చర్మం నునుపుగా, కాంతివంతంగా తయారవుతుంది. పై చిట్కాలు పాటిస్తే హీరోయిన్ లాగా మీరూ తయారవుతారు అందంగానూ… మెరిసిపోతూనూ… ◆నిశ్శబ్ద.
అందమైన గోళ్లు కావాలా ఇదిగో అయిదు టిప్స్ పాటిస్తే చాలు! అందమైన గోళ్లు ఎంతోమంది అమ్మయిలకు ఇష్టం. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా మెరుస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అందంగా నెయిల్ పాలిష్ వేసుకుని అట్రాక్షన్ గా కనిపించడం కొందరికి ఇష్టమైతే సాధారణంగా గులాబీరంగులో ఉన్న గోళ్లను చూసి మురిసిపోవడం మరికొందరికి ఇష్టం. మొత్తానికి గోళ్ల వల్ల ఏదైనా సమస్య ఉంటే అబ్బాయిలు బెంగ పడిపోతారు. గోళ్లకు ప్రత్యేక శ్రద్ధ అవసరం, ఎందుకంటే రోజులో వేడి, తేమ గోళ్లకు తగులుతూ ఉంటాయి. వీటి కారణంగా అవి పొడిగా, పెళుసుగా మారి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన గోళ్ల రహస్యం ఏమిటా ని చాలా మంది నెట్టింట్లో వెతికేస్తూ ఉంటారు. బలమైన, ఆరోగ్యకరమైన, మెరిసే గోళ్లు కావాలంటే దోసకాయలు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలలో నీరు బాగా ఉంటుంది. అలాగే వీటితో పాటు శరీరానికి సరిపడినంత నీరు తీసుకోవాలి. గోర్లు మరియు క్యూటికల్స్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి వాటికి మాయిశ్చరైజింగ్ హ్యాండ్ లోషన్ లేదా నెయిల్ ఆయిల్‌ను అప్లై చేయవచ్చు. గోరు సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు: చేతి తొడుగులు ధరించాలి.. కఠినమైన రసాయనాలు, దుమ్ము, ధూళి చేతులకు తగిలే పరిస్థితులు ఉన్నప్పుడు గోళ్లను రక్షించడానికి గ్లౌజులు ధరించాలి. సింకులో పాత్రలు కడగడం, టాయిలెట్ క్లినింగ్, రసాయనాలు ముట్టుకోవడం వంటి సందర్భాల్లో గ్లౌజులు బెస్ట్ ఆప్షన్. ఇదంతా విదేశాల్లో చేస్తారు మనకెందుకు అనుకుని తీసిపారేయాల్సిన అవసరం లేదు. మంచి చేకూర్చే అలవాటు ఏదైనా పాటించడంలో తప్పులేదు. విటమిన్ డి.. విటమిన్ డి ఆరోగ్యకరమైన గోళ్లను అందిస్తుంది. సూర్యరశ్మి ద్వారా ఇది మనకు లభిస్తుంది. అయితే ఎక్కువ ఎండకు గోర్లు గురైనప్పుడు గోళ్లు పెళుసుబారతాయి. మీ గోర్లు ఎండిపోవచ్చు, రంగు మారవచ్చు లేదా ఎక్కువ సూర్యరశ్మితో పగుళ్లు రావచ్చు. బయట ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, మీ చేతులు మరియు గోళ్లకు సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోకండి.. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల గోళ్లు, క్యూటికల్స్ కూడా ప్రయోజనం పొందుతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, గోళ్లకు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి, మృదువైన నెయిల్ బ్రష్ లేదా బాడీ స్క్రబ్ ఉపయోగించాలి. అదనంగా, ఇది మీ క్యూటికల్స్ ఆరోగ్యంగా కనిపించేలా, పెరుగుదల లేకుండా ఆగిపోయిన గొళ్లను మళ్ళీ పెరిగేలా చేస్తుంది. గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి.. పొడవాటి గోళ్లు అందంగా అనిపించవచ్చు, కానీ గాఢత కారణంగా అవి విరిగిపోయి, గీసుకోవడం కోసుకోవడం జరిగి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. దీనివల్ల గోళ్ల పరిశుభ్రతను కొనసాగించడం సులభం అవుతుంది. నెయిల్ పాలిష్ నుండి విరామం తీసుకోవాలి.. నెయిల్ పాలిష్ వేసుకోవడం చాలామందికి ఇష్టం. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ నెయిల్ పాలిష్ నుండి గోళ్లకు విరామం ఇవ్వడం చాలా ముఖ్యం. అన్ని సమయాల్లో నెయిల్ పాలిష్ ధరిస్తే గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారవచ్చు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తుండాలి. ◆నిశ్శబ్ద.





















