జుట్టును స్మూత్ గా మార్చే అలోవెరా సీరమ్.. ఇలా తయారుచేసేయండి..! కలబంద ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఉంటుంది. మొక్కలు పెంచుకోవడానికి స్థలం లేనివారు చిన్న కుండీలలో అయినా సరే అలోవెరా మొక్కను పెంచుతూ ఉంటారు. చాలామంది దీన్ని పెంచడమే తప్ప దేనికి ఉపయోగించరు. కానీ అమ్మాయిలు మాత్రం బ్యూటీ చిట్కాలలో కలబందను విరివిగా వాడేస్తుంటారు. ముఖ సౌందర్య చిట్కాలలోనూ, జుట్టు సంరక్షణలోనూ కలబందను చాలా ఎక్కువగా వాడుతారు. జుట్టు స్మూత్ గా సిల్కీగా ఉండాలంటే అలోవెరాను వాడటం మంచిది. అలోవెరాలో కేవలం మూడు పదార్థాలు కలిపితే చాలు ఇంట్లోనే అలోవెరా సీరమ్ తయారైపోతుంది. దీనికోసం ఏం కావాలో.. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. తాజా అలోవెరా జెల్.. 1 స్పూన్.. రోజ్ వాటర్.. 2 స్పూన్లు.. బాదం నూనె.. 1 టీస్పూన్.. టీ ట్రీ ఆయిల్.. 4-5 చుక్కలు పై పదార్థాలను అన్నింటిని ఒక కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మరీ జిడ్డుగా, చిక్కగా ఉండకూడదు. అలా అనిపిస్తే మరికాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ ను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు జుట్టు మూలాలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే సాధారణ నీటితో జుట్టును కడిగేయాలి. ఈ సీరమ్ ను కొన్ని రోజులపాటూ వాడుతుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలోవెరా సీరమ్ ప్రయోజనాలేంటంటే.. అలోవెరా జెల్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. తల చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. ఈ సీరమ్ ను అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. చీలిపోయిన జుట్టు చివర్లను రిపేర్ చేస్తుంది. ఇందులో రసాయనాలు ఏమీ ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి హాని కలిగించదు. పైపెచ్చు జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగడంలో కూడా సహాయపడుతుంది. *రూపశ్రీ.
పొడవాటి కనురెప్పల కోసం అల్టిమేట్ ట్రిక్స్ ! అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కళ్ల అందం కోసం, వెంట్రుకలు నల్లగా, మందంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ వెంట్రుకలు నల్లగా, మందంగా చేయడానికి ఆర్టిఫిషయల్ ఐస్లాష్ వాడుతుంటారు. అయితే సహజసిద్ధంగా కూడా కనురెప్పలను అందంగా మార్చుకోవచ్చు. వెంట్రుకలను మందంగా, నల్లగా మార్చే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ హోం రెమెడీస్ తో మీరు వెంట్రుకలను ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ: కనురెప్పలు నల్లగా, మందంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, మందంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం, కనురెప్పల మీద అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు అందంగా తయారవుతాయి. విటమిన్ ఇ: విటమిన్ ఇ కనురెప్పల జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది. మీరు మార్కెట్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు వెంట్రుకలపై జుట్టు రాలడం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు కనురెప్పల పెరుగుదలకు సహాయపడతాయి. దీన్ని కనురెప్పలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా మందంగా, పొడవుగా మారుతాయి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కనురెప్పలకు కూడా మేలు చేస్తుంది.
మీ అందాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు! అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. స్పాట్ లెస్ బ్యూటీ సొంతం చేసుకోవడానికి.. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్‌లు, ఫేస్ ప్యాక్‌లు వాళ్ల చర్మతత్వానికి సరిపోతాయో? లేదో అన్న విషయం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఏదిపడితే అది బ్యూటీ కేర్‌లో యాడ్ చేసుకుంటే.. చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 1. మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడానికి.. రోజూ బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవడం తప్పనిసరి. సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది . మీ చర్మాతత్వానికి సరిపోయే సన్ స్క్రీన్ ని సరైన స్కిన్ కేర్ నిపుణులను అడిగి తెలుసుకుని మరి వాడండి .. ఏవి పడితే అవి వాడకూడదు .. దాని వల్ల మీ స్కిన్ డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి . 2. స్క్రబింగ్ వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్ సెల్స్, టాక్సిన్స్ తొలగుతాయి. స్క్రబ్ ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మగ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి. అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్ చేసుకుంటే.. చర్మం తాజా మారుతుంది. మొటిమలు ఎక్కువగా ఉంటే.. స్క్రబ్ చేయవద్దు. 3. నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయేటప్పుడు మన ముఖంపై పేరుకునే బ్యాక్టీరియాను తొలగించాలంటే ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మేకప్‌ని పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. 4. కొంతమంది ముఖం శుభ్రం చేసుకునేప్పుడు, రఫ్‌గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. గోళ్లతో గీరుకోవడం, ముఖాన్ని గట్టిగా రుద్దుకోవడం వల్ల.. చర్మ కణాలు దెబ్బతింటాయి. ఇలా చేయడం వల్ల మీ అందం దెబ్బ తింటుంది. మీ చర్మాన్ని సున్నితంగా ట్రీట్ చేయాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. 5. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీ డైట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఈ, ఏ, సీ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. బాదం, వాల్‌నట్స్‌లో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. 6. ఒత్తిడి, ఆందోళనలు అందంపై ప్రభావం చూపుతాయి. టెన్షన్ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జరిగే శారీరక మార్పుల వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్ట్రెస్ కారణంగా.. పిగ్మెంటేషన్, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సమయం గడపండి.
ఫేషియల్ తరువాత ఈ తప్పులు అస్సలు చేయొద్దు! అమ్మాయిలు ఆరోగ్యం కంటే కూడా చర్మసంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందం ఎప్పుడూ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి. మరీ ముఖ్యంగా ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. సూర్యరశ్మి కారణంగా చర్మం కమిలిపోవడం, రంగు మారడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మహిళలు తమ ముఖానికి ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగి, ముఖచర్మం శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా, ఇంట్లో సొంతంగానే పేషియల్ చేసుకున్నా.. ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న వయసులోనే ముసలితనం మొదలవుతుందని మీకు తెలుసా? చాలా మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించకపోతే.. ఫేషియల్స్ అందాన్ని ఇవ్వడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఫేషియల్ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. మేకప్‌కు దూరంగా ఉండాలి.. ఫేషియల్ చేసినప్పుడు ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటి సమయంలో వెంటనే మేకప్ చేస్తే, అది చర్మ సమస్యలను కలిగిస్తుంది.మేకప్ తాలూకూ రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి చర్మానికి నష్టం చేకూరుస్తుంది. సూర్యరశ్మికి గురికాకూడదు.. ఫేషియల్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలో, దుమ్ములో బయటికి వెళితే దుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాహనాల పొగ, సూర్యకిరణాల ప్రభావం అన్నీ కలిపి చర్మాన్ని తొందరగా పాడుచేస్తాయి. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్న తరువాత స్కూటీ ప్రయాణం మానుకోవాలి, ఆటోలో వెళ్లడం మంచిది. స్యూటీలో వెళ్ళాలి అంటే ముఖానికి స్కార్ఫ్ వాడటం మరచిపోకూడదు. ఫేస్‌వాష్‌తో అస్సలు చేయొద్దు.. ఫేషియల్ చేయించుకున్న తరువాత రోజు మొత్తం ఫేస్‌వాష్‌ని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. పొరపాటున ఫేస్ వాష్ ఉపయోగిస్తే ఫేషియల్ ద్వారా చర్మానికి అందిన మృదుత్వం పోతుంది. ఫలితంగా ఫేస్ వాష్ లో రసాయనాల వల్ల చర్మరంధ్రాలు దెబ్బతిని ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఫేషియల్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులను దూరంగా ఉంచాలి . ఫేషియల్ ముఖచర్మం లోపలివరకు ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో చర్మసంరక్షణ ఉత్పత్తులు వాడితే అందులో ఉన్న రసాయనాల వల్ల చర్మం మరింత సున్నితమైపోయి దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఫేషియల్ తర్వాత స్క్రబ్ చేయడం, ఇతర ఉత్పత్తులు వాడటం చేయకూడదు. ◆నిశ్శబ్ద.
ముఖం పొడిబారి వాడిపోయినట్టుందా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే! వాతావరణం మారేకొద్ది శరీరం కూడా మార్పులకు లోనవుతుంది. వర్షాల వల్ల వాతావరణం చలిగానూ, చిరాగ్గానూ మారుతుంది. ఈ వాతరణం దాటికి నీరు తక్కువగా తాగుతుంటారు. ఇక ముఖ చర్మం కూడా చాలావరకు పగులుతుంది, మరికొందరికి శరీరంలో నీటిశాతం తక్కువ ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది తొందరగా దురదలు, దద్దుర్లు, గాయాలకు దారితీస్తుంది. దీనికి విరుగుడుగా వీలైనంత వరకు నీటిని సమృద్దిగా తాగాలి. దీంతోపాటు తేమ కోల్పోయిన చర్మాన్ని, పగిలిన చర్మాన్ని తిరిగి రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మాయిశ్చరైజర్ లు, లోషనల్ లు అక్కర్లేదు. పొడిబారిన, పగిలిన ముఖ చర్మాన్ని పైసా ఖర్చు లేకుండా మన ఆహారంలో భాగమైన ఒక పదార్థాన్ని ఉపయోగించడం వల్ల చక్కదిద్దుకోవచ్చు. ఇంతకూ అందరికీ అందుబాటులో ఉండే ఆ పదార్థం ఏంటి?? దాన్ని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుంటే… ప్రతి ఇంటి వంటిట్లో తప్పనిసరిగా ఉండేది పెరుగు. పెరుగు కేవలం కడుపుకు చల్లదనాన్ని ఇవ్వటమే కాదు.. పొడిబారిన ముఖచర్మాన్ని రిపేర్ చేస్తుంది. చర్మాన్ని మృదువుగా తేమగా మారుస్తుంది. ఇందుకోసం పెరుగును ఎలా ఉపయోగించుకోవాలంటే.. పెరుగు, శనగపిండి.. చలికాలంలో చాలామంది సోప్ వాడటం మానేసి శనగపిండి ఉపయోగిస్తారు. అయితే ఈ శనగపిండి, పెరుగు రెండు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖానికి మెరుపును ఇవ్వటమే కాకుండా ముఖ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పెరుగు, శనగపిండి రెండు మిక్స్ చేసి పేస్ట్ చేసుకుని ముఖానికి పట్టించాలి. దీన్ని 15నిమిషాలు ఉంచి తరువాత కడిగేయాలి. పెరుగు, బియ్యం పిండి.. ఇది మంచి ఫేస్ ప్యాక్ కమ్ స్క్రబ్. పెరుగు, బియ్యం పిండి కలిపి మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. ఇది ప్యాక్. ఈ ప్యాక్ ఆరిన తరువాత దీన్ని స్క్రబ్ లాగా రుద్దుతూ తొలగించాలి పెరుగు, తులసి.. 7 నుండి 10 తులసి ఆకులను గ్రైండ్ చేసి దానికి పెరుగు కలపాలి. మందపాటి పేస్ట్‌లా చేసి, ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తాయి. ముఖాన్ని మృదువుగా చేస్తాయి. పెరుగు పసుపు పెరుగు, పసుపు రెండూ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల l ట్యానింగ్ తగ్గుతుంది. పెరుగు తేనె.. తేనెను ఉపయోగించడం ద్వారా, ముఖంపై తేమ లోపాన్ని తొలగించవచ్చు. ప్యాక్ చేయడానికి, రెండు పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకొని ముఖానికి 15 నిమిషాలు అప్లై చేయాలి. కొంత సమయం తరువాత దీని ఫలితం కనిపిస్తుంది. *నిశ్శబ్ద.
మచ్చలేని ముఖం కావాలా? ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..! ప్రతి ఒక్కరూ శుభ్రమైన, మొటిమలు లేని చర్మాన్ని కోరుకుంటారు. కానీ బిజీ రొటీన్‌లో చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో చర్మసంరక్షణకు బోలెడు రకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. వీటని చర్మంలో మెరుపు కనిపించాలని, చర్మం యవ్వనంగా కనిపించాలని వాడతారు. ఇవి వాడినప్పుడు నిజంగానే అనుకున్న ఫలితాలను కేవలం క్షణాలలో ఇస్తాయి. అయితే వీటని ముఖానికి పట్టింటి రిమోవ్ చేస్తే ఆ తరువాత ముఖం చాలా చండాలండా మారుతుంది. ముఖ చర్మం దారుణంగా మారుతుంది. డ్యామేజ్ అవుతుంది. అమ్మాయిలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, డేట్ నైట్లు మొదలైనవాటి కోసం చాలా అందంగా తయారవుతారు కూడా. అయితే అలాంటి సందర్భాలలో సహజంగానే అందంగా, మచ్చలేని చర్మంతో మెరిసిపోవాలంటే మాత్రం ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి. గంధం, గులాబీ రేకుల పేస్ట్.. గంధం, గులాబీ రేకుల పేస్ట్ శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉత్తమ ఎంపిక. ఇది సహజంగా మంచి సువానసను కలిగి ఉంటుంది. గంధం, గులాబీ రేకులతో తయారు చేసిన పేస్ట్ చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖంలోని మురికిని శుభ్రపరచడమే కాకుండా మృతచర్మాన్ని కూడా తొలగిస్తుంది. కావలసినవి - 2 టేబుల్ స్పూన్లు గంధపు పొడి ఒక పిడికెడు ఎండు గులాబీ రేకులు 1 టేబుల్ స్పూన్ పెరుగు ఎలా చేయాలి ముందుగా ఎండిన గులాబీ రేకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గంధపు పొడికి గులాబీ రేకుల పొడి కలపాలి. దీన్ని పేస్ట్ చేయడానికి పెరుగును ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. దీని తర్వాత పొడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకుని ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కుంకుమ పువ్వు, పాలు.. సహజ పదార్థాలు ఎల్లప్పుడూ ముఖ సంరక్షణ కోసం చాలా మంచి ఎంపిక. కుంకుమపువ్వు అలాంటి సహజ పదార్ధాలలో ఒకటి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. కుంకుమపువ్వు కేవలం రంగు మాత్రమే కాదు.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇక పాలలోని పోషక గుణాలు చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. ఈ రెండూ కలిస్తే ముఖ చర్మానికి చక్కగా పనిచేస్తాయి. కావలసినవి: కుంకుమపువ్వు రేకలు 2 టేబుల్ స్పూన్ల పాలు 1టేబుల్ స్పూన్ శనగపిండి ఎలా చేయాలి.. కుంకుమపువ్వు రేకలను పాలలో కొన్ని నానబెట్టాలి. ఇప్పుడు శనగపిండిని అందులో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. వేప తులసి పేస్ట్.. వేప, తులసితో చేసిన పేస్ట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుపుతో కూడిన ఆరోగ్యకరమైన చర్మం సొంతం అవుతుంది. కావలసినవి.. ఒక పిడికెడు వేప ఆకులు ఒక పిడికెడు తాజా తులసి ఆకులు 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి ఎలా చేయాలి.. వేప, తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ముల్తానీ మట్టిని పేస్ట్‌లో కలపాలి. ఈ పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో కడిగి, టవల్ తో తుడుచుకుని మైల్డ్ లోషన్ లేదా క్రీమ్ రాయాలి. గంధం, బాదం పేస్ట్.. గంధం, బాదంతో తయారుచేసుకున్నపేస్ట్ చర్మ కాంతిని పెంచడమే కాకుండా చర్మానికి చలువదనాన్ని ఇస్తుంది కావలసినవి.. 2 టేబుల్ స్పూన్ గంధపు పొడి 1 టేబుల్ స్పూన్ బాదం పొడి 1 టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల పాలు ఎలా తయారు చేయాలి.. గంధం బాదం పేస్ట్ కోసం చందనం, బాదం పొడి ఒక గిన్నెలో వేయాలి. దీన్ని పేస్ట్ చేయడానికి తేనె, తగినంత పాలు జోడించాలి. దీన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న స్క్రబ్స్ చర్మానికి మెరుపు అందించడానికి, చర్మం మీద మురికి తొలగించడానికి సహజమైన చిట్కాలలా పనిచేస్తాయి. ఇవన్నీ సహజ పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండటం కోసం . వీటిని ఉపయోగించే ముందు చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. *నిశ్శబ్ద.
అందమైన గోళ్లు కావాలా ఇదిగో అయిదు టిప్స్ పాటిస్తే చాలు! అందమైన గోళ్లు ఎంతోమంది అమ్మయిలకు ఇష్టం. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా మెరుస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అందంగా నెయిల్ పాలిష్ వేసుకుని అట్రాక్షన్ గా కనిపించడం కొందరికి ఇష్టమైతే సాధారణంగా గులాబీరంగులో ఉన్న గోళ్లను చూసి మురిసిపోవడం మరికొందరికి ఇష్టం. మొత్తానికి గోళ్ల వల్ల ఏదైనా సమస్య ఉంటే అబ్బాయిలు బెంగ పడిపోతారు. గోళ్లకు ప్రత్యేక శ్రద్ధ అవసరం, ఎందుకంటే రోజులో వేడి, తేమ గోళ్లకు తగులుతూ ఉంటాయి. వీటి కారణంగా అవి పొడిగా, పెళుసుగా మారి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన గోళ్ల రహస్యం ఏమిటా ని చాలా మంది నెట్టింట్లో వెతికేస్తూ ఉంటారు. బలమైన, ఆరోగ్యకరమైన, మెరిసే గోళ్లు కావాలంటే దోసకాయలు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలలో నీరు బాగా ఉంటుంది. అలాగే వీటితో పాటు శరీరానికి సరిపడినంత నీరు తీసుకోవాలి. గోర్లు మరియు క్యూటికల్స్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి వాటికి మాయిశ్చరైజింగ్ హ్యాండ్ లోషన్ లేదా నెయిల్ ఆయిల్‌ను అప్లై చేయవచ్చు. గోరు సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు: చేతి తొడుగులు ధరించాలి.. కఠినమైన రసాయనాలు, దుమ్ము, ధూళి చేతులకు తగిలే పరిస్థితులు ఉన్నప్పుడు గోళ్లను రక్షించడానికి గ్లౌజులు ధరించాలి. సింకులో పాత్రలు కడగడం, టాయిలెట్ క్లినింగ్, రసాయనాలు ముట్టుకోవడం వంటి సందర్భాల్లో గ్లౌజులు బెస్ట్ ఆప్షన్. ఇదంతా విదేశాల్లో చేస్తారు మనకెందుకు అనుకుని తీసిపారేయాల్సిన అవసరం లేదు. మంచి చేకూర్చే అలవాటు ఏదైనా పాటించడంలో తప్పులేదు. విటమిన్ డి.. విటమిన్ డి ఆరోగ్యకరమైన గోళ్లను అందిస్తుంది. సూర్యరశ్మి ద్వారా ఇది మనకు లభిస్తుంది. అయితే ఎక్కువ ఎండకు గోర్లు గురైనప్పుడు గోళ్లు పెళుసుబారతాయి. మీ గోర్లు ఎండిపోవచ్చు, రంగు మారవచ్చు లేదా ఎక్కువ సూర్యరశ్మితో పగుళ్లు రావచ్చు. బయట ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, మీ చేతులు మరియు గోళ్లకు సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోకండి.. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల గోళ్లు, క్యూటికల్స్ కూడా ప్రయోజనం పొందుతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, గోళ్లకు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి, మృదువైన నెయిల్ బ్రష్ లేదా బాడీ స్క్రబ్ ఉపయోగించాలి. అదనంగా, ఇది మీ క్యూటికల్స్ ఆరోగ్యంగా కనిపించేలా, పెరుగుదల లేకుండా ఆగిపోయిన గొళ్లను మళ్ళీ పెరిగేలా చేస్తుంది. గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి.. పొడవాటి గోళ్లు అందంగా అనిపించవచ్చు, కానీ గాఢత కారణంగా అవి విరిగిపోయి, గీసుకోవడం కోసుకోవడం జరిగి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. దీనివల్ల గోళ్ల పరిశుభ్రతను కొనసాగించడం సులభం అవుతుంది. నెయిల్ పాలిష్ నుండి విరామం తీసుకోవాలి.. నెయిల్ పాలిష్ వేసుకోవడం చాలామందికి ఇష్టం. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ నెయిల్ పాలిష్ నుండి గోళ్లకు విరామం ఇవ్వడం చాలా ముఖ్యం. అన్ని సమయాల్లో నెయిల్ పాలిష్ ధరిస్తే గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారవచ్చు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తుండాలి. ◆నిశ్శబ్ద.
ఎన్నేళ్లొచ్చినా యూత్ లాగా కనబడాలా? చియా గింజలను ఇలా వాడడండి..! వయసు పెరిగే కొద్దీ యవ్వనం తగ్గిపోవడం కామన్. కానీ ప్రజలు మాత్రం అందం మీద ఆశ, దానికోసం పడే ఆరాటం మాత్రం వదలరు. ఇందుకోసం వందలు, వేల రూపాయలను పోసి క్రీములు, థెరపీలు తీసుకోవడం నుండి ఇంటి చిట్కాలను పాటించడం వరకు ప్రతిదీ ఫాలో అవుతారు. అయితే వయసు పెరిగినా యూత్ లాగా కనబడాలంటే మాత్రం చియా గింజలు చక్కని ఆప్షన్. చియా గింజలను ఇలా ఉపయోగిస్తే యవ్వనంగా ఉండే చర్మం సొంతమవుతుంది. చియా గింజలు పోషకాలకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, కాల్షియం, మాంగనీస్ మొదలైనవి ఈ గింజల్లో ఉంటాయి. చియా సీడ్స్‌ను ముఖానికి సరిగ్గా వాడితే చర్మం మచ్చలు లేకుండా మెరుస్తూ ఉండటమే కాకుండా చర్మం యాంటీ ఏజింగ్ గుణాలను కూడా పొందుతుంది. చియా విత్తనాలు, తేనె ఫేస్ ప్యాక్.. చియా గింజలు, తేనె, పెరుగు సమకూర్చుకోవాలి. అన్నింటిలో మొదటిది, చియా విత్తనాలను నీటిలో కలపాలి. ఈ గింజలు ఉబ్బినప్పుడు, వాటిని విడిగా గిన్నెలో ఉంచాలి. ఈ గింజలకు తేనె, కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం కాంతివంతంగా మారుతుంది. చియా గింజలు, కొబ్బరినూనె.. చియా గింజలు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. ఇందు కోసం, రెండు పదార్థాలను కలపాలి. మందపాటి పేస్ట్ తయారుచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ స్క్రబ్ లా కూడా అప్లై చేసుకోవచ్చు. స్క్రబ్ చేయడానికి ముందుగా నీళ్లతో ముఖాన్ని తడిపి, తర్వాత ఈ పేస్ట్‌ను ముఖంపై సర్క్యులేషన్ మోషన్‌లో 2 నిమిషాల పాటు రుద్దాలి. తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోవడం ప్రారంభమవుతుంది. చియా సీడ్స్ అలోవెరా.. ఈ ఫేస్ ప్యాక్‌తో చర్మం చియా విత్తనాలతో పాటు కలబందలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ హైడ్రేటింగ్ లక్షణాలను పొందుతుంది. ఒక చెంచా నానబెట్టిన చియా గింజల్లో ఒక చెంచా అలోవెరా జెల్ కలపాలి. అందులో విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం నుండి ముడతలు, గీతలు తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
వేసవి ట్యానింగ్ ను మంత్రించినట్టు మాయం చేసే ఫేస్ మాస్క్.. ట్యానింగ్ అమ్మాయిలకు చాలా సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇక వేసవికాలంలో అయితే దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. వేసవి ఎండకు జస్ట్ అలా బయటకు వెళ్లి రాగానే చర్మం రంగు మారిపోయి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు పక్కపక్కనే పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యానింగ్ తొలగిపోయి ముఖం సాధారణ రంగులోకి రావాలన్నా.. ముఖ చర్మం చల్లగా ఉండాలన్నా ఈ కింద చెప్పుకునే మ్యాజికల్ ఫేస్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది. అదేంటో ఓ లుక్కేస్తే.. గుడ్డు శరీరానికి మంచి పోషణ ఇవ్వడమే కాదు.. సౌందర్య సాధనంగా వాడితే చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. వేసవిలో ఎదురయ్యే ట్యానింగ్, పిగ్మెంటేషన్ కు గుడ్డు బెస్ట్ ఆప్షన్. బంగాళాదుంప ఎగ్ మాస్క్ వేయడం వల్ల ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. ఎగ్, బంగాళాదుంప ఫేస్ మాస్క్.. పచ్చి బంగాళాదుంపను తురమాలి. దీన్ని వడగడితే బంగాళాదుంప రసం వస్తుంది్. ఈ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక గుడ్డును తీసుకుని దాన్ని పగలగొట్టి దాన్నుండి తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. తెల్లసొనను బంగాళాదుంప రసంలో వేసి బ్లెండర్ సహాయంతో బాగా గిలక్కొట్టాలి. ఇది బాగా గిలక్కొట్టాక మెత్తని పేస్ట్ లాగా తెల్లని క్రీమ్ లాగా మారుతుంది. మొదట ముఖాన్ని శుభ్రమైన నీటితో కుడుక్కుని తుడుచుకోవాలి. శుభ్రం చేసుకున్న ముఖం మీద గుడ్డు పేస్ట్ ను ప్యాక్ లాగా వేసుకోవాలి. దీన్ని 20 నిమిషాల పాటూ అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖ చర్మం మెరుస్తుంది. ట్యానింగ్ మంత్రించినట్టు మాయమవుతుంది. *నిశ్శబ్ద.
వేసవి కాలంలో ముఖ సౌందర్యాన్ని చెక్కు చెదరనివ్వని కొరియన్ బ్యూటీ టిప్స్! ఈ మధ్యకాలంలో కొరియన్ అమ్మాయిల అందం వైపు ప్రపంచమంతా దృష్టి సారిస్తోంది. కొరియన్ అమ్మాయిల ముఖం గాజు లాగా మెరిసిపోతూ ఉంటుంది. అలాంటి అందం కోసం రకరకాల ప్రయోగాలు చేసే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పుకునే అయిదు బ్యూటీ టిప్స్ ఫాలో అయితే అచ్చం కొరియన్ అమ్మాయిల్లా యవ్వనంగా, మచ్చలేని గాజు లాంటి చర్మం సొంతమవుతుంది. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. డబుల్ క్లెన్సింగ్ .. కొరియన్ చర్మ సంరక్షణలో డబుల్ క్లెన్సింగ్, సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్ కీ పాయింట్స్. డబుల్ క్లెన్సింగ్ అంటే ముందుగా ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌ని, తర్వాత నీటి ఆధారిత క్లెన్సర్‌ని ఉపయోగించడం. ఇలా చేయడం ద్వారా మీ చర్మాన్ని పొడిబారకుండా మలినాలను, మేకప్‌ను, అదనపు నూనెను తీసివేయడం సులువుగా ఉంటుంది. భారతీయుల చర్మం ఎక్కువగా కాలుష్యానికి, నూనె, మలినాలకు గురవుతూ ఉంటుంది. అందుకే ఈ రకమైన చర్మానికి డబుల్ క్లీన్సింగ్ బాగా పనిచేస్తుంది. చర్మాన్ని పొడిగా లేదా చికాకు కలిగించకుండా శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎక్స్‌ఫోలియేషన్ అనేది డెడ్ స్కిన్ సెల్స్‌ని వదిలించుకోవడానికి, చర్మం తాజాగా కనిపించేలా చేయడానికి ముఖ్యమైన దశ. స్కిన్ హైడ్రేషన్.. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం రంగు కావాలంటే చర్మానికి హైడ్రేషన్ కీలకం. తేలికైన, హైడ్రేటింగ్ ఉత్పత్తులైన ఎసెన్స్‌లు, సీరమ్‌ల వినియోగం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కొరియన్లు ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులలో సోయాబీన్ పదార్దాలు, బియ్యం నీరు, గెలాక్టోమైసెస్ వంటి పులియబెట్టిన పదార్ధాలు ఉంటాయి. ఇవి మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం మీద హెవీగా లేకుండా, జిడ్డు కలిగించకుండా లోతుగా చొచ్చుకుపోతాయి. బయో-రీమోడలింగ్, హైడ్రోస్ట్రెచ్ థెరపీ వంటి అధునాతన పద్ధతులు తేమ నిలుపుదలని మరింత మెరుగుపరుస్తాయి. ముఖం మీద గీతలను, ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు.. వాతావరణ కాలుష్యం కారణంగానూ, జీవనశైలి కారణంగానూ ఎదురయ్యే అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని రక్షించడంలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొరియన్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు తరచుగా విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్, నియాసినామైడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉంటాయి. ఈ పదార్థాలు ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడానికి, మంటను తగ్గించడానికి, చర్మం రంగును ప్రకాశవంతం చేయడానికి సహాయపడతాయి. షీట్ మాస్క్‌లు.. షీట్ మాస్క్‌లు కొరియన్ చర్మ సంరక్షణ అలవాట్లలో ఒక ముఖ్యమైన భాగం. హైలురోనిక్ యాసిడ్, కొల్లాజెన్, గ్రీన్ టీ, దోసకాయ, రాయల్ జెల్లీ, బొగ్గు, ముత్యాలు వంటి సహజ పదార్ధాలు ఇందులో ఉపయోగించబడతాయి. షీట్ మాస్కులు ఇన్స్టంట్ అందాన్ని కూడా ఇస్తాయి. లేయరింగ్ పద్ధతులు కొరియన్ బ్యూటీ పద్దతులలో లేయరింగ్ పద్దతి ముఖ్యమైనది. ముందుగా టోనర్‌లు, ఎసెన్స్‌లు, సీరమ్‌లు, క్రీమ్‌ల వంటి మందమైన తేలికపాటి ఉత్పత్తులను లేయరింగ్ చేయడం ద్వారా చర్మాన్ని యంగ్ గా ఉంచుకోవచ్చు. దీని వల్ల ముఖ చర్మం యవ్వనంగా, డీహైడ్రేట్ కాకుండా తేమతో కూడి ఉంటుంది. *రూపశ్రీ.
అమ్మాయిల ముఖం ఎప్పుడూ కాంతివంతంగా మెరవాలంటే ఈ చిట్కాలు బెస్ట్! అందం కోసం ఆరాటపడని అమ్మాయిలు ఉండరు. ఇందుకోసం ఎన్నెన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా వాడతారు. కానీ ఇవన్నీ తాత్కాలిక అందాన్ని మాత్రమే ఇస్తాయి. ఈ విషయం గ్రహించిన తరువాత అమ్మాయిలు సహజంగా అందంగా కనిపించడం గురించి చాలా ప్రయోగాలు చేస్తారు. మరీ ముఖ్యంగా వేసవికాలంలో అమ్మాయిలు ఎండల ధాటికి తొందరగా పువ్వుల్లా ఉన్నవాళ్లు కాస్తా వాడిపోయినట్టు అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే ఈ కింది చిట్కాలు పాటించాల్సిందే.. నీరు తాగాలి.. ప్రతిరోజూ కనీసం 2గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కేవలం వేడి నీరు 2 గ్లాసులు మాత్రమే కాదు.. సాధారణ నీరు కనీసం 4లీటర్ల వరకు తాగాలి. ఎందుకంటే వేసవిలో ఏ చిన్న పని చేసినా, కొద్ది దూరం నడిచినా శరీరంలో తేమ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. గోరువెచ్చని నీరు తాగితే రక్తప్రసరణను మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడం ద్వారా ముఖంలో మెరుపు తెస్తుంది. కీరదోసకాయ.. అటు కూరగాయ గానూ, ఇటు స్నాక్ గానూ, సాధారణంగా తినడానికి ఇష్టపడేది కీరదోసకాయ. దోసకాయలలో నీటిశాతం ఎక్కువ. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. లోపలి నుండి శరీరాన్ని చల్లబరిచి చర్మానికి మెరుపు ఇస్తుంది.దోసకాయలో ఉండే సమ్మేళనాలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. స్క్రబ్ వాడాలి.. వేసవి కాలంలో అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే భయపడతారు. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం ట్యానింగ్. చర్మంలో సూర్యుడి ఎండకు బహిర్గతం అయ్యే భాగం అంతా రంగు మారి నల్లగా అవుతుంది. పాదాలు, చేతులు, ముఖం, మెడ ఈ సమస్యకు లోనవుతాయి. అందుకే వేసవిలో స్కిన్ ట్యాన్ తొందరగా వస్తుంది. దీన్ని తొలగించడానికి బియ్యంపిండి, కాఫీ, పంచదార, పెసరపప్పు నూక వంటి పదార్థాలతో స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ట్యాన్ తొలగిపోయి చర్మానికి మెరుపు వస్తుంది. ఇంటి చిట్కాలు.. ముఖం అందంగా కనిపించడానికి ఇంటి చిట్కాలు పాటించడం అమ్మాయిలకు ఎప్పటినుండో ఉన్న అలవాటు. చాలామంది ఇంటినే బ్యూటీ సెలూన్ గా మార్చేస్తుంటారు. ఇంట్లోనే ఆరోగ్యవంతమైన మార్గంలో ముఖాన్ని మెరిపించాలంటే పెసరపప్పు, ముల్తానీ మట్టి, శనగపిండి, పసుపు, పచ్చిపాలు, క్యారెట్, దోసకాయ, టమోటా వంటివి వాడాలి. ఇవి చర్మానికి మంచివి. అలోవెరా.. అలొవెరాను కలబంద అని కూడా అంటాం. తాజా కలబంద అయినా మార్కెట్లో దొరితే జెల్ అయినా బ్యూటీ టిప్స్ లో బాగా ఉపయోగిస్తారు. తాజా కలబంద జెల్ ను ముఖానికి రాసి 10-15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది చర్మానికి పోషణ ఇస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఆహార జాగ్రత్తలు.. శరీరం హైడ్రేట్ గా ఉండటానికి నీరు అధికంగా ఉన్న పండ్లు, సిట్రస్ పండ్లు, యాంటీ ఏజింగ్ కు దోహదం చేసే పండ్లు, కూరగాయలు, ఆకుకూరరలు తీసుకోవాలి. నూనె ఆహారాలు, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు, శీతలపానీయాలు, స్వీట్లు నివారించాలి. జాగ్రత్తలు.. స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే ముఖం అందంగా ఉంటుంది. బయట నుండి ఇంటికి రాగానే ముఖం కడుక్కోవడం, బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ఉపయోగించడం, ముఖ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ముఖానికి రోజ్ వాటర్, మాయిశ్చరైజర్ వంటివి ఉపయోగించడం ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేస్తే చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది. *రూపశ్రీ
సమ్మర్ లో మహిళలు తీస్కోవాల్సిన జాగ్రత్తలు... సమ్మర్ హీట్ మోతెక్కిస్తోంది. బయటికి వెళ్లాలంటేనే భయం వేసేంతగా వాతావరణం మారిపోయింది. ఎక్కువగా బయట తిరిగే మహిళల చర్మం ఈ సమ్మర్ ఎఫెక్ట్ కు నల్లగా మారిపోవడం, మేని ఛాయ తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నపు ఎండ చర్మానికి తీవ్రమైన హాని కలుగజేస్తుంది. మహిళల మృదువైన చర్మంలో ఉండే సాగే గుణాన్ని, సమ్మర్ హీట్ ధ్వంసం చేస్తుంది. అందుకే మరీ అవసరమైతే తప్ప, మహిళలు బయటికి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఒక వేళ తప్పనిసరైతే మాత్రం, స్కార్ఫ్, గ్లోవ్స్ తో పాటు, సాక్స్ కూడా వేసుకోవడం తప్పనిసరి. ఉదయం ఏడింటి వరకూ వచ్చే ఎండ చాలా మంచిది. ఇది చర్మానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తితో పాటు, డి విటమిన్, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కానీ ఆ తర్వాతి నుంచి మాత్రం భానుడి భగభగలు మొదలవుతాయి. అందుకే సమ్మర్ లో బయటికి వెళ్లేప్పుడు మాయిశ్చరైజర్ కంపల్సరీ. రెండు మూడు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పెదాలు పొడిబారిపోయి, పగిలిపోకుండా లిప్ బాప్ వాడుతుండాలి. సన్ స్క్రీన్ రాసుకున్నంత మాత్రాన ఎండలో తిరగచ్చు అనుకుంటే పొరబాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంట గొడుగో లేక స్కార్ఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒక వేళ ఎండ వేడికి చర్మంపై రాష్ లు గానీ దురదలు గానీ వస్తుంటే, కలబందతో తయారైన జెల్ వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కుటుంబ ఆరోగ్యచరిత్రలో చర్మకాన్సర్ ఉన్నవాళ్లు వీలైనంత వరకూ ఎండలో తిరగడాన్ని నివారించాలి. సమ్మర్ అంతా బి, సి, ఇ, విటమిన్లు, కెరోటిన్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్నే ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, ఆపిల్, గ్రీన్‌టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతిపండ్లు లాంటి ఫ్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల శరీరంలో తేమ శాతం పెరుగి అలసట దూరమవుతుంది.
పిల్లలలో ఐక్యూ ఎంతుందో ఎలా తెలుసుకోవాలి..వారి ఐక్యూ ఎలా పెంచాలంటే? తల్లిదండ్రులు తమ బిడ్డ తెలివిగా, చురుగ్గా ఉండాలని కోరుకుంటారు. దీని కారణంగా పిల్లలు విజయం సాధిస్తారు. పిల్లలు చురుగ్గా తయారుకావడానికి తల్లిదండ్రులు వారికి మంచి వాతావరణాన్ని అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఆహారం నుండి పానీయాల వరకు, మంచి అలవాట్ల నుండి మంచి పాఠశాలను కనుగొనడం వరకు తల్లిదండ్రులు కృషి చేస్తారు. కానీ పిల్లవాడు తెలివిగా ఉండటానికి, అతని IQ స్థాయి బాగా ఉండటానికి చాలా తేడా ఉంది. IQ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. ఇది పిల్లలను సాధారణ పిల్లల నుండి భిన్నంగా చేస్తుంది. చిన్నతనం నుంచి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే పిల్లల ఐక్యూ స్థాయిని పెంచవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా పిల్లల ఐక్యూ స్థాయి 90 నుంచి 110 మధ్య ఉంటుంది. పిల్లల IQ స్థాయి 125 నుండి 130 వరకు ఉంటే అతనిని మేధావిగా పరిగణిస్తారు. అయితే దీనికి ముందు పిల్లల ఐక్యూ ఎంతో తెలుసుకోవడం ముఖ్యం. దీన్ని తెలుసుకోవడం కష్టమేమీ కాదు, పిల్లవాడిని కొంచెం గమనించాలి, అతని ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. పిల్లలలో గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే.. మాట్లాడటం.. అన్నింటిలో మొదటిది పిల్లవాడు ఏ వయస్సులో మాట్లాడటం ప్రారంభించాడో గమనించాలి. పదాలను పట్టుకోవడంలో అతని సామర్థ్యం ఏమిటి? అతను ఏ పదాలు తక్కువ తప్పులతో మాట్లాడుతున్నాడు లేదా అతనికి పదే పదే చెప్పాల్సివస్తోందా? అతను పూర్తి వాక్యాలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడు? ఇవి చిన్న విషయాలు, కానీ అవి పిల్లల భవిష్యత్తు జీవితం గురించి మీకు చాలా చెప్పగలవు. త్వరగా మాట్లాడటం, పదాలను గ్రహించడం, వాక్యాలుగా మాట్లాడటం అధిక IQకి సంకేతాలుగా చెబుతారు. నేర్చుకోవాలనే ఆత్రుత.. నేర్చుకోవాలనే బలమైన కోరిక పిల్లల్లో మంచి IQకి సంకేతం. వారి మనస్సులో చాలా గందరగోళం ఉంటుంది, దానిని శాంతపరచడానికి వారు ప్రశ్నలు అడగవచ్చు. ఆ ప్రశ్నలకు వీలైనంత వరకు సమాధానమివ్వడానికి ప్రయత్నించండి, తద్వారా పిల్లవాడు సంతృప్తి చెందుతాడు. పిల్లవాడు ఆ చర్యలను పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తుంటే, అది అతనిలో ఉన్నత మానసిక స్థాయికి సంకేతం కావచ్చు. సంక్లిష్టమైన విషయాలపై ఆసక్తి.. పిల్లలు గణితం, సైన్స్ వంటి విషయాలపై ఆసక్తిని కనబరుస్తున్నట్లయితే అది చాలా సంతోషకరమైన విషయం. ఒకరి వయస్సు కంటే క్లిష్టమైన విషయాలపై ఆసక్తి చూపడం కూడా అధిక IQకి సూచికగా పరిగణించబడుతుంది. పరిశోధనాత్మక స్వభావం.. జిజ్ఞాస కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులను వింత ప్రశ్నలు వేస్తూంటారు. ఉదాహరణకు, కుళాయి నుండి నీరు ఎందుకు వస్తుంది? కాఫీ ఎందుకు రాదు? పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది? నది ఎందుకు ప్రవహిస్తుంది? చాలా సార్లు తల్లులు, తండ్రులు ఆందోళన చెందుతారు. అయితే కాస్త ఓపికగా వారి ప్రశ్నలకు వీలైనంత సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఏకాగ్రత.. పిల్లవాడు ఒక పనిపై ఏకాగ్రతతో ఉంటే, అతను తన పనిని ఆనందిస్తున్నాడని రుజువు చేస్తుంది. చదరంగం ఆడటం లేదా డ్రాయింగ్ ఇలాంటి అధిక ఏకాగ్రత కలిగిన విషయాలు పిల్లలలో అధిక IQకి సూచిక. సెన్స్ ఆఫ్ హ్యూమర్.. ఎవరైనా తమాషా చేసినా, అవతలి వ్యక్తి చెప్పేదానికి సరైన, ఆసక్తికరమైన సమాధానం ఇచ్చినా కూడా పిల్లవాడు చిరాకు పడకుంటే, అది కూడా అధిక IQని కలిగి ఉండడానికి సంకేతం. మంచి హాస్యం అనేది సంతోషకరమైన వ్యక్తి యొక్క గుర్తింపు. మంచి జ్ఞాపకశక్తి.. పిల్లలకు ఏదైనా నేర్పిస్తే వారు మరుసటి రోజు దానిని మరచిపోతారు. కానీ ఆ విషయాలు గుర్తుంచుకుంటే అది మంచి విషయమే. కష్టమైన పదాలు, రైమ్స్, పండ్లు, కూరగాయల పేర్లు గుర్తుంచుకోవడం, ఇంటి చిరునామా, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడం అధిక మానసిక సామర్థ్యానికి సంకేతాలు. పిల్లలలో iq ని ఎలా పెంచాలంటే.. పిల్లల ముందు దుర్భాషలాడకూడదు, వారని కొట్టకూడదు. పిల్లలను వీలైనంత ఎక్కువ సమయం ప్రకృతి మధ్య గడపనివ్వాలి. పిల్లవాడు ప్రశ్నలు అడగడం ప్రారంభించినప్పుడు, అతని ప్రశ్నలకు సాధ్యమైనంతవరకు సరైన, శాస్త్రీయ సమాధానాలు ఇవ్వాలి. దెయ్యాలు, దెయ్యాలు, జంతువులు, మర్మమైన వ్యక్తులు లేదా ఇతర విషయాలతో పిల్లలను ఎప్పుడూ భయపెట్టవద్దు. ఎల్లప్పుడూ పిల్లల కళ్ళలోకి చూస్తూ వారితో మాట్లాడాలి. వారు మీతో మాట్లాడేటప్పుడు వారు కూడా మీ కళ్ళలోకి చూసేందుకు ప్రయత్నించండి. ఏదైనా వాయిద్యం నేర్పండి.. పిల్లలకు గిటార్, హార్మోనియం వంటి ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించడం నేర్పించవచ్చు. ఇది అతని IQ స్థాయిని పెంచడమే కాకుండా గణిత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తుంది. బ్రెయిన్ గేమ్స్ సహాయపడతాయి.. పిల్లల ఉత్సాహం IQ స్థాయిని పెంచడానికి ఉపకరిస్తాయి. పిల్లలతో బ్రెయిన్ గేమ్స్ ఆడాలి. మెదడు వ్యాయామ ఆటలను ఆడనివ్వాలి. అతని మానసిక, శారీరక అభివృద్ధికి కూడా ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లలు ఆడేటప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. చెస్, క్యారమ్ లేదా బిజినెస్ ఆటలు ఆడటం నేర్పించవచ్చు. గణిత ప్రశ్నలు.. పిల్లల మానసిక వికాసానికి, గణిత ప్రశ్నలను పరిష్కరించేలా చేయాలి. వాటిని సరదా మార్గంలో పట్టికలు లేదా కూడిక, తీసివేత సమస్యలను పరిష్కరించేలా చేయండి. ఇలా రోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు చేస్తే వారి ఐక్యూ స్థాయి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేయడానికి లోతైన శ్వాస.. లోతైన శ్వాస మనస్సుకు మంచి ఆలోచనలను తెస్తుంది. ఇది పిల్లలకి ప్రతిదానిపై దృష్టి పెట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది, ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాకుండా, మీరు పిల్లలకు తేలికపాటి యోగా ఆసనాలను కూడా నేర్పించవచ్చు. *నిశ్శబ్ద.
పండగ సమయంలో అందంగా కనిపించాలంటే? 1. దుస్తుల ఎంపికలో చాలా రిచ్ గా కనబడేటప్పుడు అందుకు మినిమమ్ మేకప్ టిప్స్ అవసరం. ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దుస్తులు వేసుకొన్నప్పుడు సింపుల్ మేకప్ సరిపోతుంది. అదే లైట్ కలర్ డ్రెస్ వేసుకొన్నప్పుడు మేకప్ తో బాగా కవర్ చేయాలి. కాబట్టి మీరు ధరించే దుస్తులను బట్టే మేకప్ ఎంత మోరకు అవసరమో తెలుసుకొని వేసుకోవడం మంచిది. 2. ముందుగా ముఖం శుభ్రం చేసి తర్వాత టోనర్ ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మ శుభ్రపడుతుంది. టోనర్ ను అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా వేసుకొన్న మేకప్ చాలా సేపు అలాగే ఉండేలా చేస్తుంది. 3. మేకప్ వేసుకొనే ముందు ఫౌడేషన్ తో మొదలు పెట్టాలి. ముఖం మీద ఏదేని నల్లని మచ్చలు, మొటిమలు తాలూకు మచ్చలు ఉన్నట్లైతే కన్సీలర్ ను తప్పనిసరిగా వాడాలి. కన్సీలర్ ను ఉపయోగించడం వల్ల నల్ల మచ్చలు చర్మ రంగుతో కలిసిపోయినట్లు కనబడుతుంది. ఫౌండేషన్, కన్సీలర్ రెండూ కొనే ముందు మీ చర్మతత్వానికి సరిగ్గా సరిపోయేది మాత్రమే ఎంపిక చేసుకోవాలి. 4. లైట్ మేకప్ వేసుకొనేటప్పుడు చాలా సింపుల్ గా ఉండాలి. తర్వాత కళ్ళకు వేసుకొనే మేకప్ లిప్ స్టిక్, లిప్ గ్లాస్ వాడే కలర్ సూట్ అయ్యేవిధంగా ఉండాలి. కళ్ళు ఆకారం స్పష్టంగా పెద్దవిగా కనబడాలంటే ఐలైనర్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. తర్వాత మస్కార అప్లై చేయడంతో ఐమేకప్ పూర్తి చేయండి. అలాగే మీరు వేసుకొనే డ్రెస్ కలర్ పెన్సిల్ ను లైట్ ఐలైనర్ వేసుకోవచ్చు. 5. పెదాలకు డార్క్ కలర్ షేడ్ కలిగినటువంటి కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. ముఖం చాలా సింపుల్ గా, సహజ అందంతో మేకప్ వేసుకోని సమయంలో లిప్స్ ను డార్క్ కలర్ లిప్ స్టిక్స్ తో హైలైట్ చేయండి. 6. డార్క్ కలర్ మేకప్ వేసుకొనేటప్పుడు కళ్ళ మీద కానీ, లేదా పెదాల మీద కానీ మరింత ప్రత్యేకత తీసుకోవాలి. డార్క్ మేకప్ తో మరింత అందంగా కనబడవచ్చు. అయితే డార్క్ మేకప్ వేసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 7. డార్క్ మేకప్ వేసుకొనేటప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్, కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఐషాడోను అప్లై చేస్తే మరింత ఆకర్షనీయంగా కనబడుతారు. ఐషాడో మీద డ్రెస్ కలర్ కాంట్రాస్ట్ కలర్ వేస్తే అందంగా ఉంటుంది. 8. డార్క్ మేకప్ వేసుకొనే వారికి ఐషాడో బ్లూ, గ్రీన్, పర్ఫుల్, బ్లాక్ మరియు గ్రే కలర్స్ ఐ మేకప్ కి బాగా సూట్ అవుతాయి. అవికూడా మీరు ధరించే దుస్తులకు మ్యాచ్ అవుతాయో లేదా ఒక సారి చూసుకొని మరీ ధరించాలి. ఐలైనర్ తో కంటిదగ్గర పలుచగా లైన్ గీసి దాని లోపలగా ఐ షాడోను అప్లై చేయాలి. 9. డార్క్ మేకప్ కోసం న్యూడ్ కలర్స్ ఎంపిక చేసుకోవడం వల్ల మేకప్ అధికంగా కనబడదు. స్కిన్ కలర్, లేదా డ్రెస్ కలర్ మేకప్ టిప్ప్ చాల అద్భుతంగా ఉంటాయి. 10. ఒక వేళ మేకప్ లైట్ గా వేసుకొన్నట్లైతే మరింత అందంగా కనబడేందుకు మేకప్ కు తగ్గ అందమైన భారీ చెవిపోగులు ధరించాలి. అప్పుడు మరింత అట్రాక్షన్ గా కనబడుతారు. కేశాలంకరణ కూడా ఫ్రీగా లూజ్ హెయిర్ లేదా జడ అల్లిక లేదా స్టైల్ బన్స్ లా అలంకరణ చేసుకొంటే సాంప్రదాయంగా కనిపిస్తారు.
మొహాన్ని మెరిపించే గోల్డ్ ఫేషియల్! ఈ మధ్య కాలంలో గోల్డ్ ఫేషియల్ చేయించుకోవటం కామన్ అయిపొయింది. ఒకప్పుడు బంగారం కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేవాళ్ళు మన పెద్దవాళ్ళు. అలాంటిది మారుతున్న కాలంతో పాటు బంగారాన్ని వాడే విధానంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అసలీ గోల్డ్ ఫేషియల్ వల్ల మనకొచ్చే లాభమేంటి అని ఆలోచిస్తే, చాలా లాభాలే ఉన్నాయి అని చెప్పచ్చు. బంగారం పూతలా మొహానికి వేసుకోవటం వల్ల మొహం మీద వచ్చే ముడతలు మాయం అవుతాయట. అలాగే ఏవైనా మచ్చలు ఉన్నా అవి కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. చాలా మందికి చిన్న వయసులోనే వత్తిడి వల్ల మొహం మీద చర్మం జీవం లేకుండా వాడి పోయినట్టు తయారవుతుంది. అలాంటివాళ్ళు ఈ గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే మోహంలో నిగారింపు వచ్చి ఎంతో అందంగా కనపడే అవకాశం ఉంది. బంగారం వల్ల ఒంట్లో రక్త ప్రసరణ చక్కగా అయ్యి, శరీరానికి కావాల్సిన ప్రాణవాయువు కూడా తగిన విధంగా అందుతుందిట. బంగారాన్ని ముక్కుపుడకగా కుట్టించుకోవటం వల్ల ఆడవారికి గర్భశోక వ్యాధులు తగ్గుతాయట. అలాగే బంగారు గాజులు, ఉంగరాల వల్ల కూడా అనేక శారీరిక రుగ్మతల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ గోల్డ్ ఫేషియల్ విషయానికి వస్తే ఈ కిట్స్ ఇప్పుడు మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. ఒక కిట్ లో క్లెన్సర్, స్క్రబ్, మాయిశ్చరైజర్, మాస్క్ ఉంటాయి. ఒక మంచి క్వాలిటి కిట్ ని ఇంటికి తెచ్చుకుని మనమే అప్లై చేసుకోవచ్చు కూడా. ఫేషియల్ చేసే ముందు చేతులని శుభ్రంగా కడుగుకోవాలి. ఆ కిట్ లో వాటితో వేరే కంపెనీల ప్రొడక్ట్స్ ని కలపకూడదు. ముందుగా క్లెన్సర్ తో మొహాన్ని శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుని ఆరనివ్వాలి. అలా ఆరిన తరువాత స్క్రబ్బర్ ని అప్లై చేసి సర్కులర్ మూవ్మెంట్స్ ఇస్తూ మొహాన్ని మసాజ్ చెయ్యాలి. ఇలా చేసేటప్పుడు మెడని కూడా స్క్రబ్ చేయటం మర్చిపోకండి. అలా ఒక 2 నిమిషాలు చేసాకా గోరు వెచ్చటి నీటితో మొహం కడుక్కుని ఆరనివ్వండి. గోల్డ్ మాస్క్ ని తీసుకుని మొహం మీద మెల్లిగా వేసి అది ఆరేదాకా ఉంచి తరువాత తీసేసి కాస్త క్రీం రాసుకుంటే చాలు. మొహం బంగారంలా మెరిసిపోతుంది. 3 నెలలకోసారి ఈ ఫేషియల్ చేసుకుంటే చాలు. మరీ తక్కువ వ్యవధిలో అస్తమాట్లు వేసుకోవటం కూడా అంత మంచిది కాదు. ఇంకేంటి ఆలస్యం మార్కెట్ లో దొరికే బెస్ట్ గోల్డ్ ఫేషియల్ ఏంటో తెలుసుకుని మీ మొహాన్నికూడా బంగారంలా మెరిసిపోయేలా మార్చెయ్యండి. ..కళ్యాణి
ముఖాన్ని మెరిపించే ఫేస్ సీరమ్.. ఇంట్లోనే ఇలా రెడీ! అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. కానీ ఎన్ని బ్యూటీ ఉత్పత్తులు వాడినా ముఖంలో రవ్వంత అయినా తేడా లేక నిరుత్సాహపడే అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు ఈ కాలంలో. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కొరియన్స్ స్కిన్ మీద అమ్మాయిలకు చెప్పలేనంత మోజు. అయితే ఈ కొరియన్ స్కిన్ కు ఇంటి చిట్కాలు కొన్ని హెల్ప్ చేస్తాయి. ఇంట్లోనే తయారుచేసిన విటమిన్-ఇ సీరమ్ వాడితే ముఖం యవ్వనంగా, గాజులా మెరిసిపోతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. నిజానికి చాలా బ్యూటీ ప్రోడక్స్ట్ విటమిన్-ఇ ఆధారితంగా తయారుచేస్తారు. ఇంట్లోనే ఈజీగా విటమిన్-ఇ సీరమ్ ఎలా తయారుచేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. విటమిన్-ఇ క్యాప్సూల్స్ .. 3-4 జోజోబా ఆయిల్.. 1 స్పూన్. రోజ్ షిప్ ఆయిల్.. 1స్పూన్ ఆర్గాన్ ఆయిల్.. 1స్పూన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్.. ఐదారుచుక్కలు తయారుచేసే విధానం.. మొదట గ్లాసు డ్రాపర్ బాటిల్ తీసుకోవాలి. ఇందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నీ వేయాలి. జొజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, రోజ్ షిప్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుశ్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషకాన్ని అందిస్తాయి. ఇక లావెండర్ ఆయిల్ చర్మాన్ని కాపాడుతుంది. చర్మం మీద వాపులు, అలర్జీలు, దురద వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. చర్మానికి కొత్తదనాన్ని ఇస్తుంది. గ్లాసు డ్రాపర్ బాటిల్ లో అన్ని వేసి బాగా కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని ఎండ తగలని ప్లేస్ లో పెట్టాలి. ప్రతిరోజు రాత్రి కొన్ని చుక్కల సీరమ్ ను ముఖానికి రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. మొత్తం నూనె ముఖ చర్మంలోకి ఇంకేవరకు మసాజ్ చేసుకోవాలి. రాత్రి సమయంలో అయితే మరింత మంచి ఫలితం ఉంటుంది. ప్రయోజనాలు.. ఈ సీరమ్ రాసుకోవడం వల్ల ముఖ చర్మం మీద మచ్చలు తగ్గుతాయి. ముఖంలో గ్లో వస్తుంది. ఇందులో వాడిన పదార్థాలు అన్నీ సహజమైనవే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయినా సరే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడటం మంచిది. *నిశ్శబ్ద.
అవిసె గింజలను ఈ మూడు విధాలుగా వాడితే జుట్టు పెరుగుదల అద్బుతమే! అమ్మాయిల అందంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందంగా ఉన్న కురులు అదనపు ఆకర్షణ తెస్తాయి. దుమ్ము, పెరుగుతున్న కాలుష్యం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మం, జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో సహజ మార్గాల్లో జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చడానికి అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అవిసె గింజలను మూడు మార్గాలలో ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అవిసె గింజలతో ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ జెల్.. అవిసె గింజలను హెయిర్ జెల్‌గా ఉపయోగించవచ్చు . ఈ జెల్‌ను ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. అవిసె గింజలను ఉడికించి జెల్ తీసుకోవాలి. అందులో అలోవెరా జెల్ కలపాలి. ఈ హెయిర్ జెల్‌ను కొద్ది మొత్తంలో తీసుకొని మీ జుట్టు మొత్తం పొడవునా అప్లై చేయాలి. తర్వాత తలంతా మసాజ్ చేయాలి. దీన్ని 15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై సాధారణ షాంపూతో కడగాలి. హెయిర్ మాస్క్.. అవిసె గింజలను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. కేవలం ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. దీనితో స్కాల్ప్‌కు మసాజ్ చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడిగేయాలి. హెయిర్ ఆయిల్.. జుట్టుకు నూనెగా అవిసె గింజలను ఉపయోగించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టు కోసం అవిసె గింజల ఆయిల్ ఉపయోగించాలి. దీనితో స్కాల్ప్‌ని ఐదు నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అలాగే జుట్టు మెరుపును తీసుకురావడానికి కూడా అవిసె గింజల నూనె అప్లై చేయవచ్చు. అవిసె గింజల ప్రయోజాలు.. అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇది స్కాల్ప్ సెన్సిటివిటీ, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అవిసె గింజలు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి జుట్టుకు సరైన పోషకాహారాన్ని అందిస్తాయి. అవిసె గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను పెంచడానికి మంచి మార్గం కోసం చూస్తున్నట్లయితే, అవిసె గింజలు సహాయపడతాయి. చుండ్రు సమస్యకు కూడా అవిసెగింజలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తాయి, తద్వారా చుండ్రు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. *నిశ్శబ్ద.
ఎండల్లో మేను మెరవాలంటే ... ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పకర్లెద్దు. బయటకి వెళ్ళాలంటే చాలు మొహం ఎక్కడ పాడయిపోతుందో అనే భయం. అలాంటి భయాలు దూరం చేసి ఎండల్లో కూడా మీ మేనూ మెరిసిపోవాలంటే...... ఈ జ్యూస్ లు తాగి చూడండి. మన శరీరం ఎందుకు వెలిగిపోదో చూద్దాం. ఎండాకాలం మామూలు ఆహారం కన్నా కూరగాయలు, ఆకుకూరలు తినటం మంచిదని అందరికి తెలుసు. వాటిలో కొన్ని మనకి ఎంతో మేలు చేస్తాయి అవేంటో చూద్దామా. బేబీ కార్న్ జ్యూస్: బేబీ కార్న్ సూప్ తింటాం కాని జ్యూస్ ఎక్కువగా తాగం. కాని ఈ జ్యూస్ తాగటం వల్ల శరీరానికి ఎంతో నిగారింపు వస్తుంది. ఇందులో పీచు పదార్ధం ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది తాగటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కూడా వెయ్యదు. డైటింగ్ చేసేవాళ్ళకి ఇది ఒక మంచి జ్యూస్. స్వీట్ కార్న్ లో కొన్ని పాలు కలిపి జ్యూస్ లా తయారుచేసుకుని తాగటం వల్ల ఎండకి కూడా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. టమాటా జ్యూస్: ఇది అందరి ఇళ్ళల్లో మనం కామన్ గా చూసే జ్యూస్. ఇందులో శరీరంలోని కొవ్వుని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. సన్నబడాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి ఉండటం వల్ల చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. గ్రీన్ పీస్ జ్యూస్: గ్రీన్ పీస్ కూరల్లో ఎంత రుచిగా ఉంటుందో, జ్యూస్ లా చేసినా అంతే రుచిగా ఉంటుంది. ఈ పచ్చి బఠాణిలో విటమిన్ K, ఇంకా విటమిన్ B6 సమృద్దిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. అంతేకాక యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఒక మంచి పౌష్టికాహారం కూడా. మరీ పచ్చి వాసన వస్తోందనిపిస్తే అందులో కాస్త ఉప్పు కలిపి తాగితే బాగుంటుంది. కేరట్ జ్యూస్: విటమిన్ A పుష్కలంగా ఉండే కేరట్లు కళ్ళకి మాత్రమే కాదు చర్మం నిగారింపుకు కూడా బాగా ఉపయోగపడతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే కేరట్ జ్యూస్ తాగటం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది. దీర్ఘకాలం పాటు చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే క్రమం తప్పకుండా కేరట్ జ్యూస్ తీసుకోవాలి. మీ వయసు కనపడనీయకుండా మిమల్ని యంగ్ గా కనిపించేలా చేస్తుంది. పాలకూర జ్యూస్: పాలకూర ఎండాకాలంలో మనకి తల్లిలాంటి మేలు చేస్తుంది. విటమిన్ K పుష్కలంగా లభించే పాలకూర ఎముకులని దృడంగా ఉంచటంలో సహాయపడుతుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉండే ఈ పాలకూర తినటం వల్ల ఎర్ర రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి. ఈ పాలకూర జ్యూస్ వాసన నచ్చక తాగలేని వాళ్ళు ఇందులో ఒక కేరట్, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగచ్చు. మన శరీరం మంచి నిగారింపు సంతరించుకుని వయసులో చిన్నగా కనిపించాలంటే ఇలాంటి జ్యూస్ లు ట్రై చేయక తప్పదు. అందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. మరి మీరు?ట్రై చేయటానికి రెడీగా ఉన్నారా ? ..కళ్యాణి