రోజూ ఫౌండేషన్ వేసుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
అమ్మాయిలు అందం మీద చాలా కమిట్‌మెంట్ తో ఉంటారు. ఈ కారణంగానే మేకప్ అనేది అమ్మాయిల లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయింది. ప్రస్తుతం అమ్మాయిలు చాలా సింపుల్ గా రెఢీ కావడం అంటే ఫౌండేషన్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, పౌడర్ మొదలైనవన్నీ అప్లై చేస్తుంటారు. అయితే రోజూ ఫౌండేషన్ అప్లై చేయడం మంచిదేనా? చర్మ సంర7ణ నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారంటే..
మేకప్ అనేది ముఖం ఎంత అందంగా కనబడేలా చేస్తుందో దాని కోసం ఉపయోగించే ఉత్పత్తులు ముఖ చర్మాన్ని అంత పాడు చేస్తాయి. ముఖ్యంగా చాలామంది ఫౌండేషన్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ ను హైడ్ చేయడం కోసం, ముఖ ఛాయను మెరుగ్గా కనిపించేలా చేయడం కోసం ఫౌండేషన్ ఉపయోగిస్తారు. అయితే కొన్ని ఫౌండేషన్లలో SPF ఉంటుంది. ఇది హానికరమైన సూర్య కిరణాలను ప్రేరేపిస్తుంది. రోజూ గంటల తరబడి ఫౌండేషన్ ను వేసుకునే ఉండటం వల్ల చర్మానికి హాని కలుగుతుంది.
ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్యను పెంచుతుంది. కొన్ని ఫౌండేషన్ లు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి అలెర్జీలు కూడా కలిగిస్తాయి. కేవలం ఇది మాత్రమే కాదు.. ఎక్కువ ఫౌండేషన్ ను అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది.
రాత్రి పడుకునేముందు ఫౌండేషన్ ను తప్పనిసరిగా తొలగించాలి. లేకపోతే చర్మం దారుణంగా దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా అవసరమైతే తప్ప మేకప్ వేసుకోకూడదు. చర్మ సంరక్షణ కోసం సహజమైన ఉత్పత్తులను ఉపయోగించాలి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహజ చిట్కాలు పాటించాలి.
*రూపశ్రీ.