బొప్పాయి పండు మాత్రమే కాదండోయ్.. దాని తొక్కలు, విత్తనాలు కూడా అద్భుతం చేస్తాయ్..!

 

 


బొప్పాయి ఆరోగ్యకరమైన పండు. ఎర్రగా పండిన బొప్పాయి రుచిని మాటల్లో చెప్పలేం.  అయితే అందరూ బొప్పాయి  పండు తిని తొక్క, విత్తనాలు పడేస్తుంటారు.  కానీ బొప్పాయి పండు మాత్రమే కాకుండా తొక్క, విత్తనాలు కూడా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  అవేంటో తెలుసుకుంటే ఇక మీదట బొప్పాయి తొక్కలు, విత్తనాలు పడేయకుండా ఉపయోగించుకోవచ్చు.


బొప్పాయి తొక్కల ప్రయోజనాలు..


బొప్పాయి తొక్కలను మెత్తగా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలపాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ఆరిన తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బొప్పాయి ఫేస్ ప్యాక్‌ని కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.


బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ అవాంఛిత రోమాలు పెరగడాన్ని తగ్గిస్తుంది.  ముఖంపై వెంట్రుకలను వదిలించుకోవాలనుకుంటే బొప్పాయి తొక్కను ఉపయోగించవచ్చు.

బొప్పాయి తొక్కలో ఉండే ఎంజైమ్‌లు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి తాజాదనాన్ని కలిగిస్తుంది. ఈ పీల్స్‌ను స్క్రబ్‌గా వాడచ్చు, ఆ తరువాత ముఖాన్ని కడగాలి.

బొప్పాయి తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు ఉన్న ప్రదేశంలో  బొప్పాయి తొక్కను రుద్ది 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బొప్పాయి తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు,  ఎంజైమ్‌లు చర్మం  వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. తద్వారా ముడతలు తగ్గుతాయి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.


బొప్పాయి గింజల ప్రయోజనాలు..

బొప్పాయి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ స్క్రబ్ లా పనిచేస్తుంది. దీంతో చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది.

బొప్పాయి గింజల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని లోతుగా తేమగా ఉంచి మృదువుగా ఉంచుతాయి. సీడ్ పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడగాలి.

బొప్పాయి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంలో మంటను తగ్గించి చర్మాన్ని కూల్ గా  ఉంచుతాయి.  బొప్పాయి గింజల పేస్ట్ ను మంట ఉన్న ప్రాంతాలలో పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


                                                        *రూపశ్రీ.