పొడవాటి కనురెప్పల కోసం అల్టిమేట్ ట్రిక్స్ !
అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కళ్ల అందం కోసం, వెంట్రుకలు నల్లగా, మందంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ వెంట్రుకలు నల్లగా, మందంగా చేయడానికి ఆర్టిఫిషయల్ ఐస్లాష్ వాడుతుంటారు. అయితే సహజసిద్ధంగా కూడా కనురెప్పలను అందంగా మార్చుకోవచ్చు. వెంట్రుకలను మందంగా, నల్లగా మార్చే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ హోం రెమెడీస్ తో మీరు వెంట్రుకలను ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవచ్చు.
పెట్రోలియం జెల్లీ:
కనురెప్పలు నల్లగా, మందంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, మందంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం, కనురెప్పల మీద అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు అందంగా తయారవుతాయి.
విటమిన్ ఇ:
విటమిన్ ఇ కనురెప్పల జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది. మీరు మార్కెట్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు వెంట్రుకలపై జుట్టు రాలడం సమస్య నుండి కూడా బయటపడవచ్చు.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు కనురెప్పల పెరుగుదలకు సహాయపడతాయి. దీన్ని కనురెప్పలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా మందంగా, పొడవుగా మారుతాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కనురెప్పలకు కూడా మేలు చేస్తుంది.