ఐస్ ఫేషియల్ చేసే అలవాటు ఉందా? దీంతో ఎంత డేంజర్ అంటే..!

 


ఐస్ ఫేషియల్.. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యింది.  ఐస్ ముక్కలను ముఖం మీద రుద్దడం ఇందులో భాగం.  ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మెరుస్తుందని, ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగుంటుందని అంటారు.  చాలామంది అమ్మాయిలు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడానికి ఇష్టపడతారు కూడా. అయితే ఇది అందరూ చెప్పుకుంటున్నట్టు అంత ఆరోగ్యకరమైనది ఏమీ కాదని కొందరు చెబుతున్నారు. దీనికి కారణం ఐస్ ఫేషియల్ వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే..

చర్మం చాలా సున్నితంగా ఉండే వ్యక్తుల చర్మాన్ని ఇది మరింత దెబ్బతీస్తుంది. చాలా చల్లగా ఉన్న ఏదైనా ఎక్కువసేపు  చర్మానికి నేరుగా వర్తించినప్పుడు చర్మం రఫ్ తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం తొందరగా దెబ్బతింటుంది. పగుళ్లు రావడం,  ఎర్రగా మారడం జరుగుతుంది.


ఐస్ ఫేషియల్‌లో ఐస్  క్యూబ్‌ను నేరుగా ముఖంపై రుద్దితే అది చర్మంపై మంట లేదా చికాకు కలిగించవచ్చు. అందువల్ల కాటన్ లేదా హ్యాండ్‌కర్చీఫ్‌లో ఐస్ క్యూబ్‌ను ఉంచి దాంతో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా ముఖానికి ఐస్ క్యూబ్స్ ఫేషియల్ చేసుకున్న తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.


కొందరు ఐస్ పేషియల్ చేసుకోవాలనే  తొందరలో  ముఖం కడుక్కోకుండా ఐస్ ఫేషియల్ చేసుకుంటారు.  దీని వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ చర్మ రంద్రాలలో బ్యాక్టీియా చిక్కుకుంటుంది.


సున్నితమైన చర్మం ఉన్నవారికి ఐస్ ఫేషియల్ మంచిది కాదు.  ఇలా చేయడం వల్ల ముఖం మీద మంటగా అనిపిస్తుంది. అంతేకాకుండా ముఖం  చర్మం రంగు  కూడా నిస్తేజంగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజూ ఐస్ ఫేషియల్స్ చేస్తే  ముఖంపై పింక్ రాషెస్ ఏర్పడవచ్చు.

ఐస్ ఫేషియల్ చర్మంలో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.  ఇప్పటికే ఏదైనా చర్మ సంబంధిత సమస్యతో  ఇబ్బంది పడుతున్నట్లైతే ఐస్ ఫేషియల్ చేయకపోవడమే మంచిది.


ఐస్ ఫేషియల్ చేయడం వల్ల  చర్మం చాలా కఠినంగా మారుతుంది. చర్మం గీతలు పడిపోతుంది. ఐస్ ఫేషియల్ చెయ్యాలి అనుకుంటే ముఖం మీద నేరుగా ఐస్ ను అప్లై చేయకూడదు.


                                          *రూపశ్రీ.