ఎర్ర చందనం ముఖానికి చేసే మేలు తెలుసా?

 

 

ఎర్ర చందనం..  భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరిగే ఈ వృక్షాలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది.  పుష్ప సినిమా వల్ల ఎర్ర చందనం గురించి తెలియని వారికి కూడా చాలా స్పష్టంగా దీని గురించి తెలిసొచ్చింది.  అయితే దీనికి మార్కెట్లో ఉన్న విలువ, మార్కెటింగ్ రాజకీయల గురించి పక్కన పెడితే ఎర్ర చందనం ఆరోగ్యపరంగానూ,  సౌందర్య పరిరక్షణలోనూ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎర్ర చందనం వాడటం వల్ల చర్మానికి కలిగే లాభాలేంటంటే..


చర్మాన్ని కాంతివంతం చేస్తుంది..

ఎర్రచందనం చర్మానికి  మెరుపును ఇస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఛాయ చేకూర్చడంలో సహాయపడుతుంది. ఎర్రచందనాన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే వాడిపోయిన చర్మానికి పునరుజ్డీవాన్ని ఇస్తుంది.  చర్మం  సహజ కాంతితో మెరిసిపోయేలా చేస్తుంది.


మొటిమలు తగ్గిస్తుంది..


మొటిమలు చాలా మందికి చాలా చిరాకు తెప్పిస్తాయి.  అయితే ఎర్ర చందనంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇది మంటను , ఎరుపును తగ్గించడానికి..  మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.  మొటిమల బారినపడే చర్మాన్ని సమర్థవంతంగా ట్రీట్ చేస్తుంది.


మచ్చలు తగ్గిస్తుంది..

మొటిమల మచ్చలు, మచ్చలు,  చర్మం మీద నలుపు, ఎరుపు రంగు గుర్తులు ఉంటే ఎర్ర చందనం వాటిని క్రమక్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది.  చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇవి చర్మపు రంగును సమం చేయడంలో సహాయపడతాయి.  మచ్చల పరిమాణాన్ని కూడా తగ్గిస్తాయి, కాలక్రమేణా  మృదువైన,   మచ్చలేని చర్మం సొంతమవుతుంది.


జిడ్డు అరికడుతుంది..

చర్మంలో చాలా రకాలుంటాయి. వీటిలో జిడ్డు చర్మం కూడా ఒకటి. అధిక జిడ్డు రంద్రాలు మూసుకుపోయి పగుళ్లకు దారి తీస్తుంది. ఎర్రచందనం సహజ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది, సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.  చర్మం సహజమైన తేమను తొలగించకుండా జిడ్డును నియంత్రిస్తుంది.  చర్మ సంరక్షణ దినచర్యలో ఎర్రచందనం కలపడం వల్ల  చర్మం సమతుల్యంగా,  రిఫ్రెష్‌గా ఉంటుంది.


యాంటీ ఏజింగ్..


సన్నని గీతలు, ముడతలు,  చర్మం వాడిపోవడం వంటి వృద్ధాప్య సమస్యలు  చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఎర్ర చందనం వాటిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఎర్ర చందనాన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటూ ఉండే ముడతలు వచ్చే ప్రక్రియ నెమ్మదిస్తుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

                                                    *రూపశ్రీ.