వాము గింజలు ఇలా వాడితే ఒత్తైన జుట్టు మీ సొంతం..!
వాము వంటింట్లో తరచుగా వాడే పదార్థం. వాము గింజలను మిర్చి బజ్జీలు, సమోసా, ఇతర స్నాక్స్ తయారుచేసేటప్పుడు వాడుతుంటారు. కారంగానూ, ఘాటుగానూ ఉండే వాము మంచి సువాసనతో ఆహ్లాదంగా ఉంటుంది. వామును వంటల్లోనే కాకుండా జుట్టు పెరుగుదల కోసం కూడా ఉపయోగిస్తారట. వాము గింజలను వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం అంటున్నారు. ఇంతకీ జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే వామును ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే..
వాము నూనె..
జుట్టు పెరుగుదలకు నూనెలు ఒక థెరపీలా పనిచేస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ పెంచి జుట్టు ఆరోగ్యంగా ఉండేలానూ, జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేలానూ చేస్తాయి. అయితే వాము గింజలను ఉపయోగించి నూనె తయారుచేసుకుని వాడటం వల్ల జుట్టు పెరుగుదలలో ఊహించని రీతిలో మార్పులు ఉంటాయి. దీని కోసం వాము నూనె ఎలా తయారు చేసుకోవాలంటే..
వాము నూనె..
వాము నూనె తయారుచేసుకోవడం చాలా సులభం. ఏదైనా హెయిర్ ఆయిల్ తీసుకోవాలి. సహజమైన నూనెలు అయితే మంచిది. ఈ నూనెలో వాము గింజలు వేసి బాగా ఉడికించాలి. ఆ తరువాత చల్లారిన తరువాత నూనెను ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి. ఈ నూనె జుట్టుకు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.
ఉపయోగించే విధానం..
వాము నూనెను మిగతా అన్ని నూనెల లాగే జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని మునివేళ్లతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ జుట్టు కుదుళ్లలోకి నూనె ఇంకేలా సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. గంట ఆగిన తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. లేదంటే ఈ నూనెను రాత్రి సమయంలో అప్లై చేసి మరుసటి రోజు జుట్టు తలస్నానం చేయవచ్చు.
వాము నూనె ఉపయోగిస్తే కలిగే లాభాలు..
వాము నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. చుండ్రు సమస్యలు ఉన్నా, జుట్టు పొడిబారడం వంటి సమస్యలున్నా తగ్గుతాయి. మరీ దారుణంగా తలలో చుండ్రు పొలుసుల్లా ఉన్నవారు ఈ నూనెను వాడితే అద్బుతమైన ఫలితాలు ఉంటాయి. చుండ్రు వల్ల తలలో వచ్చే దురదను కూడా ఇది తగ్గిస్తుంది.
వాము నూనె జుట్టుకు ఉపయోగిస్తే నెత్తి భాగానికి రక్తప్రసరణ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
వాము నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టును శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. జుట్టు పొడిగా ఉన్నవారికి ఈ నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వాడిన 15రోజుల లోపే జుట్టు పెరుగుదలలో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది.
*నిశ్శబ్ద.