మృదువైన గులాబీ లాంటి పెదవులు కావాలా? ఈ టిప్స్ పాటించండి..!

 

వర్షాకాలం వస్తే చర్మ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారికి ఇది చాలా కష్టకాలం.  ముఖం పొడిబారి పగుళ్లు రావడమే కాకుండా పెదవుల మూలలు చీలుతుంటాయి. అలాగే పెదవులు  వాడిపోయి  నిస్తేజంగా కనిపిస్తుంటాయి.  అయితే ఇంట్లోనే కొన్ని ఈజీ టిప్స్ అయితే వాడిపోయిన పెదవులు గులాబీ రెక్కల్లా మృదువుగా, కోమలంగా మారిపోతాయి. ముఖ్యంగా ఇంట్లోనే లిప్ స్క్రబ్ లు తయారుచేసుకుని వాడవచ్చు.  అవేంటో తెలుసుకుంటే..


మిల్క్ రోజ్ పౌడర్..


మిల్క్ చర్మాన్ని కాంతివంతం చేయడంలో,  చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడంలో శక్తివంతంగా పనిచేస్తుంది.  పెదవులను పింక్ కలర్ లోకి తీసుకొస్తుంది. పెదవుల మీద మరకలు, మచ్చలు తొలగిస్తుంది.


అలోవెరా జెల్-కాఫీ..


అలోవెరా జెల్, కాఫీ రెండింటిని మిక్స్ చేయాలి.  ఈ మిశ్రమాన్ని రోజూ పెదవులకు అప్లై చేస్తుంటే పెదవుల మీద మృత చర్మం తొలగిపోతుంది. పెదవులు చాలా శుభ్రం అవుతాయి.  గులాబీ రంగులోకి వస్తాయి.


హనీ- ఓట్స్..

తేనె- ఓట్స్ కలిపి తయారుచేసిన లిప్ స్క్రబ్ ను ఉపయోగిస్తే పెదవుల మీద, పెదవుల చుట్టూ  టానింగ్ సమస్య ఉంటే అది తొలగిపోతుంది. పెదవులు మంచి రంగులోకి వస్తాయి.


లెమన్- గ్లిజరిన్..


నిమ్మకాయ డెడ్ స్కిన్ తొలగించడంలో సహాయపడుతుంది. గ్లిజరిన్ పెదవుల చర్మాన్ని లోతుగా తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.  ఈ  రెండింటిని పెదవులకు అప్లై చేస్తుంటే పెదవులు కోమలంగా మారతాయ.


కొబ్బరినూనె-తేనె..


కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్లు,  కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మానికి మంచి పోషణను అందిస్తాయి.  కొబ్బిరనూనె, తేనె మిక్స్ చేసి పెదవులకు రాసుకోవాలి. లేదంటే కొబ్బరిపాలు, తేనె కూడా అప్లై చేయవచ్చు.  ఇవి పెదవులను గులాబీ రంగులోకి మారుస్తాయి.


ఆరెంజ్ పీల్..


నారింజ తొక్కల పొడిలో విటమిన్-సి, యాసిడ్లు ఉంటాయి.  ఇవి పెదాలను మెరిచేలా చేయడంలో సహాయపడతాయి.


బీట్రూట్,  బాదం నూనె..


బీట్ రూట్ రసం,  బాదం నూనె రెండూ మిక్స్ చేసి దీన్ని రోజూ పెదవులకు అప్లై చేస్తుంటే కొద్దిరోజుల్లోనే  పెదాలు అందంగా, ఆకర్షణీయంగా, గులాబీ రంగులోకి మారతాయి.


విటమిన్-ఇ క్యాప్సూల్,  కొబ్బరినూనె..


విటమిన్-ఇ చర్మానికి చాలా మంచిది.  ఇది పెదవులను ఆరోగ్యంగా చేయడంలో సహాయపడుతుంది.  రెండు స్పూన్ల కొబ్బరినూనెలో ఒక విటమిన్-ఇ క్యాప్సూల్ కలిపి స్టోర్ చేసుకోవాలి. దీన్ని రోజూ పెదవులకు అప్లై చేస్తుంటే పెదవులు ఆరోగ్యంగా,  అందంగా మారతాయి. పెదవులు దృఢంగా,  మంచి షేప్ లో కూడా ఉంటాయి.


                                        *రూపశ్రీ.