వెంట్రుకలకు రైస్ వాటర్ అప్లై చేస్తే నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు నిజాలేంటంటే..!
జుట్టు పెరుగుదలకు సంబంధించి చాలా రకాల టిప్స్ వైరల్ అవుతుంటాయి. వాటిలో ఉల్లిపాయ జ్యూస్ నుండి హెయిర్ ప్యాక్ లు, హెయిర్ డైలు, హెన్నా ట్రిక్స్ తో పాటూ జుట్టుకు బియ్యం నీరు ఉపయోగించడం వరకు చాలా ఉన్నాయి. అయితే జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదేనని చాలా మంది అంటారు. జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేస్తే జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందని, జుట్టు పట్టు కుచ్చులా మారుతుందని అంటుంటారు కూడా. అయితే జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేస్తే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? దీని వెనుక నిజమెంత తెలుసుకుంటే..
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రైస్ వాటర్ ఒక గొప్ప మార్గమని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. నిజానికి జుట్టు పెరుగుదలకు ఈ సాధారణ పద్ధతి అంత ఉపయోగపడదు. జుట్టు బాగా పెరగాలంటే వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయాలి. దీని తరువాత జుట్టు పెరుగుదలను, దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి రైస్ వాటర్ రెసిపీని ఫాలో కావచ్చు. బియ్యం నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే వేసవిలో వెంట్రుకలకు రైస్ వాటర్ అప్లై చేసే సరైన విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
రైస్ వాటర్ ఎలా చేయాలి..
ముందుగా బియ్యాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. నీరు క్లీన్ గా కనిపించేవరకు బాగా కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కడిగిన బియ్యాన్ని వేసి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. దీని తరువాత నీటిని ఫిల్టర్ చేసి ఒక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని గాజు పాత్రలో నింపి 12 నుండి 24 గంటలపాటు మూసి క్లోజ్ చేసి ఉంచాలి. దీన్ని 1 వారం రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.
ఎలా అప్లై చేయాలంటే..
హెయిర్ వాష్ తర్వాత బియ్యం నీటిని కండీషనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది కాకుండా దీన్ని హెయిర్ మాస్క్‌గా కూడా అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ చెయ్యవలసిన ముఖ్యమైన పని ఏంటంటే బియ్యం నీటిలో కొన్ని చుక్కల కలబంద, ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి హెయిర్ మాస్క్‌గా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత జుట్టు కడుక్కోవాలి.
*నిశ్శబ్ద.