ఆహారంలో న్యుట్రీషియన్లు ఉండేలా చూసుకోండి ఆరోగ్యంగా ఉండండి..   పచ్చి కూరాగాయలు పండ్లు తింటే 10,000  రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా పచ్చి పండ్లు తీసుసుకోవం  వల్ల  మరెన్నో లాభాలు ఉన్నాయని  వైద్యులు అంటున్నారు. అయితే పండ్లు పచ్చివే తినాలి. కూరగాయలు ఉడికించి తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు కోల్పోతున్నామని శరీరంలో పోషకాలు అక్కడక్కడా పేరుకు పోతున్నాయని, దీనివల్ల శరీరం సక్రమంగా పనిచేయదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి కేవలం మనం తీసుకుంటున్న ఆహార పదార్ధాలను ఇష్టం వచ్చినట్లు ఒండి వార్చడమే అని నిపుణులు పేర్కొన్నారు. మనం కొన్ని పళ్ళను  లేదా కూరగాయలను పచ్చిగా తిన్నప్పుడే ఉండే ఆ ఆనందం వేరని అంటారు . దీనివల్ల చాలా సున్నితంగా ఉండే  పైతో న్యుట్రియాంట్స్ వేడికి నాశనమౌతాయి. ప్రత్యేకంగా ఉండే ఎంజాయిమ్లు, ప్రోటీన్లు, కేటాలిస్టు గా పనిచేస్త్హాయి. మనం తీసుకున్న ఆహరం నుంచే విటమిన్లు , మినరల్స్ ఎమినో ఆసిడ్స్ అత్యవసరమైనా ఫెటీ ఆసిడ్లు మనా ఆహరం నుండే తీసుకుంటాయి . మనం తీసుకున్న ఆహారంనుండే పోషకాహారం బ్లాక్స్ ను నిర్మిస్తుంది. జీవితాన్ని శరీరాన్ని దృడంగా ఉంచడమేకాకుండా సమర్ధవంతంగా పనిచేస్తుంది ఆహారం వల్ల  వచ్చే ఎంజయిమ్స్ ఆహరం అరుగుదలకు సహకరిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండడానికి బ్లాకులు నిర్మిస్తుంది. ఎంజయిములు ఎప్పుడు శరీరాన్ని అంటిపెట్టుకుని  ఉంటాయి కాబట్టి వీటిని లివింగ్ న్యుట్రీషియన్స్ అని అంటారు. ఇవి మన శరీరానికి సహకరిస్తాయి. ఆహారంలో ఉండే ఎంజయిమ్లు మనం ఎప్పుడైతే వండుతామో అవి తరిగిపోవడం వల్లే వీటిని  మన శరీరంలో నిల్వచేసుకోనందు వల్లె వివిధరకాల సమస్యలు ఎదురుకుంటున్నట్లు  వైద్యులు విశ్లేషించారు.ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషక విలువలు లేనందు  వల్లే  మెటాబాలిక్ డిజార్దర్ సమస్యలు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. వివిధ రకాల రసాయనాల ద్వారా  ఉత్పత్తి చేస్తున్న కూరాగాయలు,పండ్లలో ఎకువగా రసాయనాలు ఉన్నాయని దీనివల్ల శరీరానికి దీర్గకాలంలో  మరిన్నిసమస్యలు తప్పవని    నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి సహజంగా వచ్చే ఎంజాయిములతోనే మేటాబాలిజం  డిటాక్సికెషన్   ఆధారపడి ఉన్నాయని అంటున్నారు శాస్త్రజ్ఞులు, మనం ప్రకృతి నుంచి వచ్చే సహజమైన కూరాగాయలు, పండ్లకు  ఎప్పుడో దూరమయ్యామని పచ్చికూరాగాయలు పండ్ల లో ఉండే సహజ విత్తనాలు ఎంజయిములను ఉత్పత్తి చేస్తుందని అందుకే పశువులు, పక్షులు గింజలను ఆకులను తింటాయని పరిసోదకులు వెల్లడించారు. ఆహారా పదార్ధాలలో ఆరోగ్యాని పెంచే న్యూట్రీషియన్స్ విషయంలో  కాస్త సర్దుకుపోతున్నామని దీనివల్ల ఆహారంలో ఉండాల్సిన విటమిన్లు విటమిన్ సి ,విటమిన్ బి 1 , బి 5 వంటి విటమిన్లు వండడం వల్ల కోల్పోతున్నాము. అదేపనిగా ఉడికించడం లేదా వేయించడం వల్ల, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ని కోల్పోతున్నామని ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు. కేబేజీ,కేలీ ఫ్లవర్, దుంపలు బ్రోకోలీ, ని 112 డిగ్రీల్లో  మండించడం వల్ల పూర్తిగా న్యుట్రీ షియన్లు,కోల్పోతున్నమని లేదా వాటిని తినడం మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే ఆహారంలో న్యుట్రీషి యన్లు ఉండేలా చూసుకోండి ఆరోగ్యంగా ఉండండి . 

ఎండలో వుండండి క్యాన్సర్‌కు చెక్ పెట్టండి! ఎండలో శ్రమించే మహిళలకు వక్షోజాల క్యాన్సర్ ప్రభావం తక్కువే. ముఖ్యంగా 50 సంవత్సరాల తరువాత మహిళల్లో క్యాన్సర్ ప్రభావం తక్కువే అని నిపుణులు తేల్చారు. అక్యుపెషనల్ ఇన్విరాన్మెంటల్  మెడిసిన్ జనరల్‌లో ఈ అంశాన్ని ప్రచురించింది. బయట ఎక్కువగా ఎండలో పని చేసే రైతులు, రైతు కూలీలు, ఇతర పనులు చేసే మహిళలకు డి విటమిన్ అందడం వల్లే వక్షోజాల క్యాన్సర్ ను నివారిస్తుందని నిపుణులు తేల్చారు. విటమిన్ డికు ఆధారం ఎండ మాత్రమే అని అందుకే మహిళల్లో క్యాన్సర్ రిస్క్ తక్కువే అంటున్నారు వైద్య నిపుణులు. ఉదాహరణకు చదుకున్న మహిళలు ఎండ బారిన పడకుండా  కార్పొరేట్ ఆఫీసులలో కంప్యూట‌ర్‌ల ముందు పనిచేసే మహిళల్లో ముఖ్యంగా ఎండ తగలకుండా పనిచేయడం వల్లే వక్షోజాల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ల బారిన పడుతున్నారని తెలుస్తోంది. 20వ శతాబ్దంలో వస్తున్న వక్షోజాల క్యాన్సర్ డి విటమిన్ లోపం వల్లే వివరిస్తున్నారు నిపుణులు. గత పరిశోధనలలో విటమిన్ డి రక్తంలో ఎక్కువ ఉంటె వక్షోజాల క్యాన్సర్ ప్రభావం తక్కువే అని తేల్చారు. ఉదయం 1౦ గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేసే మహిళల్లో విటమిన్ డి ఎక్కువగా అందడం వాళ్ళ బయట పని చేసేవా రికంటే లోపల  పనిచేసే వారిలోనే రిస్క్ ఎక్కువగా  ఉంటుందని తెలిపారు. 7 ౦ సంవత్సరాల లోపు ఉన్న మహిళల్లో 3 8. 3 7 5 సాధారణ వాక్సోజాల క్యాన్సర్ను గుర్తించామని ప్రతి ఒక్కరినీ పరిశీలించినప్పుడు 5 గురు మహిళల్లో అదేసంవత్సరంలో పుట్టడం గమనింఛామని నిపుణులు తెలిపారు. వివిధ స్థాయిల్లో పనిచేసే వారికి ఎండలో పనిచేయనందువలె క్యాన్సర్ ప్రమాదం వస్తుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. 5౦ సంవత్సరాల తరువాత క్యాన్సర్ ప్రమాదం తక్కువే అని తేల్చారు. విటమిన్ సుప్లిమెంట్లు ఇతర ఆహరం విషయంలో జీవన గతిని మార్చడం లేదా మందులు, హార్మోన్ రీప్లేస్ మెంట్ తెరఫీ, మద్యం, ఊబకాయం శారీర వ్యాయామం తప్పనిసరి  అని నిపుణులు సూచించారు. దీర్గాకాలంలో ఎండలో పనిచేసిన వారు క్యాన్సర్కు గురికారని, ఒత్తిడి ఇతర ఆనారోగ్య సమాస్యలు వారిని ఇబ్బంది పెడతాయని వైద్యులు విశ్లేషించారు. 

కాస్మోటిక్స్ తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం   కాస్మోటిక్స్, సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నారా? అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అందంగా కనబడడం కోసం అమ్మాయిలు తెగ తాపత్రయ పడిపోతారు. బ్యూటీపార్లర్లు, కాస్మోటిక్స్, పేస్ మాస్క్ అప్లై చేయడం.. ఒకటికాదు నానా తంటాలు పడుతూ వుంటారు. ఇటీవలికాలంలో స్త్రీలకు అందంపై మరింత మోజు పెరిగింది. అందం పెంచే సౌందర్య సాధనాల కోసం నెట్లో వెతుకుతూ ఉంటారు. చిట్కాలు ప్రయోగిస్తూనే ఉంటారు. అందం పెంచే సౌందర్య సాధనాల ఉత్పత్తులు మరింత పెరిగాయి. క్లినిక్లు పెరిగాయి. ఏమైతే ఏమి స్త్రీ సౌందర్య సాధనాలలో వాడే కాస్మోటిక్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలొ చెప్పాలంటే మేకప్ లిప్ స్టిక్ లేకుండా స్త్రీలు బయటికి రావడం లేదంటే అతిశయోక్తికాదు. ఇక్కడే సమస్య. మీరువాడే కాస్మోటిక్స్, సన్ స్క్రీన్ లోషన్లలో రసాయనాలు విచ్చలవిడిగా వాడుతూ ఉండడం వల్ల క్యాన్సర్ వస్తుందని నిపుణులు తేల్చారు. స్త్రీ సౌందర్య సాధనాలలో కాస్మోటిక్స్, లిప్ స్టిక్స్, ఎండాకాలం వాడే సన్ స్క్రీన్ లోషన్ లలో రసాయనాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. రసాయన కారకాల వల్ల స్త్రీలలో ఉండే కణాలు డి ఎం ఏ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో జనవరి 15 న ఈవిషయం వెల్లడించించింది. ఈస్ట్రోజెన్స్ - ఎంస్ట్రోజెన్స్ బయట ఉండే రసాయనాలు కలిసి క్యాన్సర్ కారకాలుగా నిర్ధారించారు. ఆమ్ హెర్ట్స్ కు చెందిన మసాచూట్స్ విశ్వ విద్యాలయానికి చెందిన పసు శాస్త్ర విభాగం డాక్టర్ జోసఫ్ జర్రీ ఈ విషయం వెల్లడించారు. డాక్టర్ జోసఫ్ జర్రీ వ్యాలీ లైఫ్ సైన్సు కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రైన్ ఆఫ్ హోప్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ పై ఉమ్మాస్ ఆమ్ హర్ట్స్ సెంటర్ సంయుక్తంగా పరిశీలించినట్లు తెలిపారు. ఈ మేరకు బయటి నుంచి వచ్చే రసాయనాలు వల్ల ఎక్కువ టాక్సిట్స్ ఉన్నట్లు గా ఎఫ్ డి ఏ గుర్తించింది. కొనుగోలు దారులకు సొందర్య సాధనాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. కాస్మోటిక్స్ లో 1నుండి 10% -1నుండి 30% రసాయనాల ఈస్ట్రోజన్ రిసెప్టర్స్ రసాయనాల సాంద్రతను తట్టుకునే స్థితిలో ఉండదు. తద్వారా వక్స్లోజాల క్యాన్సర్ కు కారణం అవుతున్నట్లు గుర్తించామని, దీనివల్ల డి ఎన్ ఏ డ్యామేజ్ అవుతున్నట్లు నిపుణలు డాక్టర్ జెర్రీ వెల్లడించారు.

రుతుస్రావాన్ని అంగీకరిద్దాం..   రుతు స్రావం అనేది ఒక సిగ్గుపడే ప్రక్రియగా ఆడవారి మనస్తత్వాన్ని చాలా బాగా మార్చేశారు. ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా, ఇంకెన్ని గొప్ప పనులు సాధించినా దీని గురించి మాట్లాడడానికి ఇప్పటికీ సంకోచమే.  ఆడదానికి సిగ్గు అలంకారమట. జననేంద్రియాల ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడకూడదట. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి కూడా ఆడవారికి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. హార్మోన్లను విపరీతంగా ప్రభావితం చేసే మందులను దొంగ చాటుగా, తప్పు చేస్తున్న వారిలా వేసుకుంటూ, తమ శరీరాలను గుల్ల చేసుకుంటున్న ఆడవారు చాలా మంది ఉన్నారు. కుటుంబ నియంత్రణ వస్తువులను బహిరంగంగా, ధైర్యంగా కొనుగోలు చేసుకునే అవకాశం కూడా మన స్త్రీలకు ఇవ్వలేని మన సమాజానికి జోహార్లు. విశృంలత్వం, విచ్చలవిడితనం కాదిది. తమ శరీర అవసరాలను గుర్తించి, తల ఎత్తుకుని తమకు కావాల్సినవి సాధించుకోవడం. మీకు గుర్తుందా?! గుజరాత్ కళాశాలలో ఒక అమ్మాయి తన బహిష్టు సమయంలో వంటగదిలోకి వెళ్ళింది అని 68 మంది విద్యార్థినుల ప్యాంటీ లను చెక్ చేసి, వారిని క్షోభకు గురి చేశారు. 21వ శతాబ్దంలో పురోగతి దిశగా అడుగులు వేస్తూ ఉన్న మనం, స్త్రీల పట్ల ఇంకా అదే మూస ధోరణిలో ఉండిపోలేదూ!  కిచెన్ లోకి వెళ్ళకూడదు, అందరితో కలిసి తినకూడదు..ఇలా ఇంకెన్నో ఆంక్షలు అదే కళాశాలలో మరొక ప్రబుద్ధుడు ఆడవారు బహిష్టు సమయంలో మగవారికి అన్నం వండితే వారు మరుజన్మలో కుక్కగా పుడతారు అని జ్ఞాన బోధ చేసాడు. ఇటువంటి సమాజం లోనా మనం బతుకుతున్నది అని అనిపించింది. అతడిని సపోర్ట్ చేస్తూ , మిగతా వారు కూడా వంత పాడడం శోచనీయం. ఈ సిగ్గు అనే మానసిక జడత్వం ఎంతగా మన ఆడవారిలో చొప్పించారు అంటే, వాటిని వ్యాపారానికి ముడి సరుకులా చేసుకుని వ్యాపారులు తమ జేబులు నింపుకునేంత ◆ వెంకటేష్ పువ్వాడ      

మహిళల కోసం మూడురోజుల ప్రామిస్!!   ఈ ప్రపంచం ఎంత డవలప్ అయిందంటే మహిళలు మూడురోజులు అని చెప్పగానే ఠక్కున అది నెలసరి సమస్యనే కదా!! అని 90% మంది ఎంతో సులువుగా గ్రహించేస్తారు. ఆడవాళ్ళ పీరియడ్స్ గురించి, పడక గదిలో సెక్స్ గురించి మాట్లాడినంతగా ఈమధ్య కాలంలో వేరే ఏ విషయం మాట్లాడటం లేదు ప్రజలు, సెలెబ్రెటీలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు ఇట్లా అందరూ కూడా. అయితే ఆడవారి నెలసరి అనే విషయం గురించి మాట్లాడిన  వ్యక్తులు, దాని గురించి ఎంతో అవగాహనా ప్రసంగాలు చేసే వ్యక్తులు సామాజిక మాద్యమలలో కూడా ఈ విషయం గురించి సపోర్ట్ ఇచ్చేవారు కూడా చివరికి తమ తమ ఇళ్లలో ఆడవాళ్లు అదే నెలసరి సమస్యలో ఉన్నపుడు వారి బాధను, వారి పరిస్థితిని అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువేనని చెప్పవచ్చు. దీనిని బట్టి చూస్తే ఏ విషయం అయినా మాటలు చెప్పడం ఎంతో తేలిక అని అర్థమవుతుంది. ఇకపోతే మహిళల నెలసరి విషయం ఒకప్పుడు ఎంతో గోప్యత కలిగినది. ఆ తరువాత దాని గురించి స్వేచ్ఛగా మాట్లాడినా ఆ నెలసరిని ఎదుర్కొనే మహిళలు మాత్రం దాన్ని ఎదుర్కొని తీరాల్సిందే. మగవాళ్ళు, సామాజిక కార్యకర్తలు, అవగాహనా సదస్సులు ఇట్లా ఎందరు ఎన్ని మాట్లాడినా, స్త్రీల నెలసరి గురించి, వారి సమస్యల గురించి ఎంత నీతులు చెప్పినా అవేవి కూడా స్త్రీల నెలసరి సమయంలో వారి సమస్యలు పరిష్కరించలేవు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మాటల సమాజం అయినపుడు, కేవలం మాటల్లో ఏదేదో చెప్పేసి తరువాత వారి మానాన వారిని వదిలేస్తే, నెలసరి వల్ల కలిగే ఎమోషన్స్, చిరాకు, అసహనం, ఆ మూడు రోజులు శరీరంలో కలిగే మార్పులు ఇవ్వన్నీ కూడా వాళ్ళను వదిలిపోవు. కేవలం సమాజం మాట్లాడుకోడానికి ఈ టాపిక్ అన్నట్టుగా ఉంటాయి సమాజం మాటలు. అందుకే ఈ విషయంలో స్త్రీల పట్ల కావాల్సింది మాటల పరంపర కాదు చేతల తోడ్పాటు.  మూడ్స్ ను అర్థం చేసుకోవాలి!! మూడ్ అనగానే ఏదో పడకగదిలో రొమాన్స్ గుర్తొస్తే అంతకంటే అథములు లేరని అనుకోవచ్చు. ఇక్కడ మూడ్ అంటే మానసిక పరిస్థితి. మహిళల నెలసరి సమయంలో అది మారుతూ ఉంటుంది. ఎంతగా అంటే కోపం, చిరాకు, అసహనం, ఏడుపు, బాధ వంటివి వెంటవెంటనే మారిపోతూ ఉంటాయి. శరీరంలో జరిగే హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం. కాబట్టి నెలసరిలో ఇలాంటివి ఉంటాయని మాటలు చెప్పకుండా, ఆ స్థితిలో ఉన్న ఇంట్లో ఆడవాళ్లకు కోపరేట్ చెయ్యాలి. సాధారణ సమయాల్లో మాదిరిగా చిన్నవాటికి ఆడవాళ్ళ మీద కొప్పడటం, విమర్శించడం, తిట్టడం వంటివి చేయకూడదు. ఆ సమయంలో మరీ సున్నితంగా ఉంటారు చాలా తొందరగా బాధపడిపోతారు.  విశ్రాంతి ఆవశ్యకత తెలుసుకోవాలి!! ఇటీవల కాలంలో నెలసరి అయితేనేం, సాధారణ రోజుల్లానే గడిపేయచ్చు ఇదిగో ఈ ఎనర్జీ డ్రింక్, ఇదిగో ఈ టాబ్లెట్స్, ఇవిగో ఈ సానిటరీ పాడ్స్ అంటూ ఎన్నో యాడ్స్ టీవీ లలో వస్తుంటాయి. ఇంకా సామాజిక మాద్యమలలో కూడా దీని గురించి ఓ తెగ చర్చిస్తారు. నెలసరిలో ఆడవాళ్లు అన్నీ చేయచ్చు అని ఊదరగొడతారు. అయినా నెలలో మూడు రోజులు శరీరంలో కలిగే మార్పులతో ఎంత దృఢమైన ఆడవాళ్లు అయినా ఎంతో కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నపుడు ఆ మూడు రోజులను ఆడవారి విశ్రాంతికి వదిలేస్తే ఏమి నష్టం వస్తుంది ఈ సమాజానికి. ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఆ మూడు రోజులు కూడా ఎలాంటి పని చేసుకోలేక పేలుతున్న ప్రసంగాలేనా మహిళలు ఆ రోజుల్లో కూడా అన్ని చేయవచ్చు అని చెప్పడం వెనుక ఉద్దేశం. శరీరంలో మార్పులు కలిగే ఆ మూడురోజులు శరీరానికి కష్టం లేకుండా విశ్రాంతి ఇవ్వడం వల్ల మిగిలిన రోజులను ఎంతో ఉల్లాసంగానూ, మరెంతో చురుగ్గానూ గడిపేయచ్చు. ఇంకా మరొక ముక్కలో చెప్పాలంటే ఒక వెహికల్ ను రిపేర్ చేయిస్తూ డ్రైవ్ చేయడం చేస్తామా?? లేదు కదా. అలాంటిదే ఇది కూడా.  ఆరోగ్యం విషయంలో తోడ్పాటు!!  ఆరోగ్యం ఎప్పుడు ఎలా దెబ్బతింటుందో చెప్పలేం. ముఖ్యంగా మహిళలకు వచ్చే సమస్యలలో 90% ఈ నెలసరి క్రమం తప్పడం, హార్మోన్ల సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి వాటి వల్లనే వస్తాయి. కాబట్టి మహిళలు నెలసరి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు.  ఆహారం ఔషధం!! నెలసరి సమయంలో కోల్పోయే రక్తం తిరిగి అభివృద్ధి చెందడానికి ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు అన్ని కూడా తాజా పదార్థాల నుండి లభ్యమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నాక  మహిళలకు ఆ మూడు రోజులు తోడ్పాటు అందిస్తామని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. ఆ మాట మీద నిలబడి సపోర్ట్ ఇవ్వండి. మీ ఇంటి మహాలక్ష్ములు నెలసరిని ఒత్తిడి లేకుండా దాటేస్తారు.  ◆ వెంకటేష్ పువ్వాడ

Acne అంటే ఏమిటి...    మొటిమలు వయస్సు వచ్చిందంటే ముఖం పై వచ్చే మొటిమల ను acne అని వైద్య పరిభాషలో అంటారు.మొటిమలు అనగానే మొలిచినట్టు గా ఎర్రటి  టికురుపులు ,లేదా తెల్లటి కురుపుల మాదిరిగా ఉంటాయి.దీనికి మరో పేరు పిమ్ పుల్స్ చర్మం వస్తాయి.మొటిమలు కారణంగా శాశ్వతంగా ఉండి  మచ్చలు ఏర్పడతాయి. మొటిమలు లక్షణాలు... మొటిమలు 1౦ నుండి 13 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి వస్తూ ఉంటాయి.లేదా 5నుండి 1౦ సంవత్సరాల స్త్రీ పురుషులలో వస్తుంది.అయితే పురుషులకంటే స్త్రీలే దీనిబారిన పడుతూ ఉంటారు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు ఎక్కువగా మొటిమల తో బాధ పడుతూ ఉంటారు.అయితే దీనికి కారణం వారు ఎక్కువగా వాడె సౌందర్య సాధనాల వల్ల,లేదా స్తీలలో వచ్చే నెలసరి సమస్యల వల్ల  హార్మోన్లలో వచ్చే మార్పు మొటిమలు వస్తూ ఉంటాయి. ము ఖం పైన మొటిమలు రావడం సహజం అయితే కొన్ని సందర్భాలలో మెడ,చాతి, వీపు వెనుక భాగం,భుజాలు, తల లోన కన పడే ప్రాంతం లో. మొటిమలకు చికిత్స... ఈ మధ్య కలం లో అన్నిటా వ్యాపారాత్మక ధోరణి పెరగడం వల్ల మొటి మకు చేసే చికిత్స,చాలా చికిత్సలు వైద్య పరంగా పెద్దగా ప్రభావ వంతంగా పని చేసిన దాఖలాలు లేవు.చాలా తీవ్రంగా మొటిమలు వచ్చిన కొరికొస్తెరొయిడ్స్. ఇసొత్రెతిఒనొఇన్,యంటి బాయిటిక్స్,ఓరల్ కాంట్రాసెప్టివ్ రెటి నోఇడ్స్.వాడతారు. అసలు మొటిమలు అని ఎలా పరీక్షించాలి... సారీరక పరీక్ష ద్వారా పరేక్షిస్తారు.దీనికోసం ఏ ఇతర పరీక్ష పద్దతులు లేవు. ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన మొటిమలకు సరైన చికిత్స లేదని చెప్పాలి.

గర్భస్థ దశలో స్త్రీ ఆరోగ్యం? గర్భిణిగా ఉన్నప్పుడు తల్లులు వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెతేస్ద్ ఎం డి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెల్లడించారు. ఒత్తిడి నిరాశకు గురికావడాన్ని గమ నించారు.ఒత్తిడి,నిరాశకు గురి అయ్యే గర్భిణీ లలో పిండం పై తీవ్ర ప్రభావం పడుతుందని పలు మార్పులు పిల్ల వాడి ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచించారు.ఈ మార్పులు ఎపి జనోమిక్స్ లో ప్రచురించారు.జీన్ ఎక్టివీటిలో మార్పులు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి,నిరాశ స్త్రీలలో సహజమని అది ప్రతి మందిలో ఒకరికి ఈసమస్య వస్తోందని.అమెరికాకు సంబందించిన ఓబీ ట్రీ షియన్,గైనకాలజిస్ట్ పేర్కొన్నారు. ఒత్తిడి,లేదా నిరాశ అన్నది ప్రసవ అనంతరం పుట్టిన బిడ్డ పై ఉంటుందని.అతని జీవితాంతం మనస్తత్వం,బావోద్వేగాలపై తీవ్రప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గర్భిణిగా ఉన్న మహిళ ఒకరకమైన భావోద్వేగాల డిజార్దర్ బాల్యం లోనే ఎదుర్కోక తప్పదు.18 సంవత్సరాల వయస్సులోనే ఒత్తిడి నిరాశ లు అవరించించింది.గర్భిణిగా ఉన్న సమయం లో ఒత్తిడి అన్న అంశం పై చేసిన పరిశోదన 312 మంది  మహిళల పై నిర్వహించారు.ఈ పరిశోదన 126 ఆసుపత్రులలో నిర్వహించారు.అమెరికా సంయుక్త రాష్ట్ర్రాలలో  చేసిన పరిశోదనలో పాల్గొన్నారు. నైతికంగా డైవర్స్ తీసుకున్న వారు.34% హిస్పానిక్ 26% నాన్ హిస్పానిక్ 24% నాన్ హిస్పానిక్ బ్లాక్ 17% ఆశియా పసిఫిక్ దీవులకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. పరిశోదన ప్రారంభం లో స్త్రీలకు ఒక ప్రశ్నావళి మీ పూర్తి చేయమన్నారు.ఒత్తిడి,నిరాశ ను పరీక్షించేందుకు సమాచార సేకరణ జరిపారు.5 సార్లు ఆ ప్రశ్నావళిని పూర్తి చేసారు.ఒక్కొక్కరు ఒక్కొకరికి జన్మనిచ్చారు.పరి శోదకులు టిష్యు సంమ్పుల్ ను స్వీకరించారు.పిండం నుండి సేకరించారు.ఈ అంశంపై మార్కోస్ తెస్ఫయే గర్భిణీ లలో పిండంలో వచ్చిన రాసాయనమార్పులు గుర్తించారు.పిండం లో మెదడు నిర్మాణం పిండం బయట 16 సంవత్సరాలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. న్యూరో లాజికల్ సైక్రి యాటిక్ ఇల్ నెస్ వస్తే వారిని వారి బిడ్డను ఇబ్బందికి గురి కాక తప్పదని తేల్చారు. అయితే గర్భి నీలు ముఖ్యంగా వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని వారే నియంత్రించుకోవాలి.గర్భిణీలు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు.

బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి రావచ్చు...  అందులో రిస్క్ ఎంత ?   బ్రెస్ట్ క్యాన్సర్ వయస్సు పై బడుతున్న కొద్ది మంది స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 3౦ ఏళ్ల లోపు స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అరుదు.మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో 3౦ ఏళ్ల లోపు  వాళ్లకు వచ్చే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుంది. 4౦ ఏళ్ల స్త్రీలకు -21 7 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 5౦ ఏళ్ళు -5౦ మందిలో ఒకరికి. 85 ఏళ్ళు దాకా జీవించే స్త్రీలకు 8 మందిలో ఒకరికి వచ్చే అవకాశం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అంతార్జాతీయంగా వచ్చిన పరిశోధనలలో ఈ క్రింది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. సామాజికంగా,ఆర్ధికంగా హై స్టేటస్ లో ఉండే స్త్రీలు వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు,అవివాహిత స్త్రీలు. పిల్లలు కలగని స్త్రీలు,వక్షోజం లో అసాధారణ లక్షణాలు కల స్త్రీలు. నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలు, ప్రసవ సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు. పిన్న వయస్సులోనే 12 ఏళ్ల వయస్సులోపు రసజ్వల అయిన వాళ్ళు 55 ఏళ్ల తరువాత ముట్లుదిగిన స్త్రీలు. గర్భాశయం, జీర్ణాశయం, రెక్టం, అందాసాయాల క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న స్త్రీలు. కొవ్వు పదార్ధాలు అధికంగా తినే స్తూల కాయం గల స్త్రీలు. దీర్ఘకాలం పాటు హార్మోన్లతోకూడుకున్న గర్భ నిరోధక మాత్రలు వాడిన స్త్రీలు. అమ్మ,అమ్మమ్మ అక్క చెల్లెళ్ళు కూతుళ్ళలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటె వాళ్ళ లో ఎంత మందికి  ఏ ఏ వయస్సులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అన్న అంశం పై బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్  ఆధార పది ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ లో దశలు --- ప్రాధమిక దశ... వక్షోజం లోని గడ్డ 2 సెంటి మీటర్లు లోపున ఉంటె అంటే 3 /4 వంతు అది ప్రాధమిక దశ.కిందికి వస్తుంది.దీనిని స్టేజ్ ౦ గా నిర్ధారిస్తారు.క్యాన్సర్ గడ్డ చిన్నగా ఉంటె అవతలకు వ్యాపించే స్థాయిలో లేకపోతే ౦ దశగానే నిర్ధారిస్తారు. మొదటి దశ... గడ్డ రెండు సెంటిమీటర్ల కు మించి ఉండక పోవడం క్యాన్సర్ ఇంకా లింఫ్ నోడ్స్ వరకూ  వ్యాపించిఉండక పోవడం క్యాన్సర్ వక్షోజాన్ని దాటి అవతలికి వెళ్లక పోవడం. రెండవ దస... గడ్డ 2 నుండి 5 సెంటీ మీటర్లు మధ్య ఉండడం క్యాన్సర్ చంకలోని లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉండవచ్చు. వ్యాపించక పోవచ్చు.లేదా గడ్డ 2 సెంటీ మీటర్ల లోపు ఉండి కూడా చంకలో 3 మీటర్లకు మించని లింఫ్ నోడ్స్ కి వ్యాపించడం లేదా వక్షోజం లో అసలు గద్దె ఉండక పోవచ్చని క్యాన్సర్ కణాలు చంకలో 3 కు మించని లింఫ్ నోడ్స్ లో కనిపించడం. మూడవ దశ... స్థానికంగా ముదిరి పోయిన క్యాన్సరు.కిందకు వస్తుంది.దీనిని క్యాన్సరు కణాలు వక్షోజాలకు దగ్గరగా ఉండే లింఫ్ నోడ్స్ కి ఉదాహరణకు చంకలోను కాలర్ బోన్ వద్ద ఉండే లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉంటాయి గాని ఇంకా అవతలి అవయవాలకు పాకవు.గడ్డ 5 సెంటీ మీటర్లు మించి ఉండదు కాని చంకలోని లింఫ్ నోడ్స్ లో వరసగా కాకుండా అక్కడక్కడా కనిపించడం. 5సెంటీమీటర్ల నున్చిలోపు ఉంటుంది కాని దగ్గరలోని లింఫ్ నోడ్స్ లో ప్రవేశించడమే కాక గడ్డ పక్క కణాలకు కూడా పాకి దాని మూలంగా అక్కడి లింఫ్ నోడ్స్ ఒకదాని తో ఒకటి కలిసిపోవడం.క్యాన్సర్ కణాలు కాలర్ బోన్  పైభాగాన ఉండే లింఫ్ నోడ్స్ కి కూడా వ్యాపించడం ఇంఫ్లామేటరీ బ్రెస్ట్ క్యాన్సర్... ఇది మూడవ దశ కిందకి వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ లో గడ్డ ఉండక పోవచ్చని క్యాన్సర్ కణాలు లింఫ్ వ్యవస్థకు చెందిన నాళాలను మూసేస్తాయి దీనివల్ల వక్షోజం ఉబికి సాగిపోతాయి పై చర్మం ఎర్రగా గరుకుగా అయి గట్టి పడిపోతుంది.దీనిని కూడా డాక్టర్లు స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ కిందే పరిగ నిస్తారు. నాల్గవ దశ... ఇది పూర్తిగా ముదిరి పోయిన దశ,క్యాన్సరు కణాలు వాక్షోజానికి దూరంగా ఉండే ఎముకలు,ఊపిరి తిత్తులు లివర్,లాంటి శరీర భాగాలకు ఆడారి దాపుల్లో ఉండే లింఫ్ నోడ్స్ కి వ్యాపించి ఉంటాయి. నాల్గవదశ బ్రెస్ట్ క్యాన్సర్ ను మేటా స్టా టిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. నాలుగు దశలలో సోకే బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స సరైన సమయం లో తీసుకుంటేనే క్యాన్సర్ నుండి విముక్తి  అన్నిటి కన్నా మానసికంగా కుంగి పోక దృడంగా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.విజయం సాధించాలి.   

బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మొదలవుతుంది   శరీరంలో ఏ భాగం లో అయినా అసాధారణ కణాలు ఒకే చోట గుమిగూడి గడ్డగా తాయారు కావడం ద్వారా క్యాన్సర్ ప్రారంభ మౌతుంది.కొంత కాలం గడిచేసరికి ఈ అసాధారణ కాణాలు రూపాన్ని మార్చుకుంటూ అసంఖ్యా కంగా వృద్ధి చెంది ఆ భాగాన క్యాన్సర్లు పరిమితం కావడం లేక రక్త ప్రవాహం ద్వారా,లింఫ్,వ్యవస్థ ద్వారా ఇతర భాగాలకు వ్యాప్తి చెందితే క్యాన్సర్ గా మారుతుంది.వక్షోజాలాలో బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలు కూడా ఇలాగే ఏర్పడతాయి. సాధారణంగా వక్షోజాలలో ఏర్పడే చాలా భాగం గడ్డలు ప్రామాడం లేనివి బినైన్ వి అయి ఉంటాయి. అంటే ఇవి ప్రామాదం లేనివి అయి ఉంటాయి.కాని ఇలాంటి గడ్డలలో కొన్ని తరువాత తరువాత ఆ స్త్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ ని కలిగించే అవకాసం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు... బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాధమిక దశలో ఉన్నప్పుడు సాధారణంగా నొప్పి అంటూ ఉండదు.లక్షణాలలో  మొదటిది వక్షం లోపల గడ్డ ఏర్పడడం.సాధారణం గా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. వక్షం లో గాని చంకలో గాని గడ్డ లేక వాపు ఉండడం.నిపుల్ లోపలికి వంపు తిరిగి ఉండడం. లేదా నిపుల్ సజులో మార్పు. నిపుల్ చర్మం మందం కావడం లేదా సొట్ట బడడం. వక్షోజపు చర్మం బత్తాయి తోలు మీద ఉన్నట్లు గుంటలు గుంటలు గా గరుకుగా ఉండడం. బ్రెస్ట్ బరువెక్కడం. నిపుల్ నుంచి రక్తం తో కూడుకున్న డిశ్చార్జ్ కావడం. క్యాన్సర్ నిర్ధారణ... బ్రెస్ట్ క్యాన్సర్నే కాదు ఏ క్యాన్సర్ నైనా గాని ప్రాధమిక దశలో గుర్తిస్తే ప్రాణా పాయం నుంచి తప్పించడం కుదురు తుంది. 2౦ నుంచి 49 సంవత్సరాల వయస్సుగల ప్రతి స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించి రెండేళ్ళ కొకసారి 5౦ ఏళ్ళు దాటిన తరువాత యాడాది కి ఒక సారి పరీక్ష చేయించుకోవడం అవసరమని నిపుణులు బోధించారు. శారీరకంగా పరీక్షించే సమయం లో డాక్టర్లు స్త్రీలను రెండు చేతులు పైకి ఎత్తమని పక్కకి వదిలి పెట్టమనడం. పిరుదల మీద కొట్టుకోమని చెప్పి వివిధ కోణాలలో ఆమె వక్షోజాల సైజ్ ,షెపులు నిశితంగా పరిశీలిస్తారు. అలాగే వక్షోజాల పై చర్మం గురుకుగా అయిందా,గుంటలు పడిందా వంటి అసాదారణ చిహ్నాల కోసం చూస్తారు. నిపుల్స్ మీ నొక్కి ఏమైనా ద్రవం కారుతున్నదేమో చూస్తారు. అలాగే వక్షోజాలను వెల్ల నొక్కడం ద్వారా లోపల గడ్డలు తగులు తున్నా యేమో పరిశీలిస్తారు.ఒక వేళ గడ్డ తగిలితే దాని సైజు,షేపు,అటుఇటూ కడుతున్దాలేదా అని మరీ పరిశీలిస్తారు. వక్షోజం లోని గడ్డలలో అపకారం లేని హానికరం కాని,హానికారక మైన గడ్డలు క్యాన్సర్ గడ్డలకు తేడాలు ఉంటాయి. హాని కలిగించని సాధారణ గడ్డలు మృదువుగా మెత్తగా గుండ్రంగా ఉంటాయి.తేలికగా అటూ ఇటూ కదిలేట్లు ఉంటాయి. క్యాన్సర్ గడ్డలు గట్టిగా ఉండి.గుండ్రంగా కాకుండా వంకర టింకర గా ఉండి అటు ఇటూ కదల కుండా ఉన్న చోటే  పట్టుకునే ఉంటాయి. అయితే క్యాన్సర్ గడ్డ అవునా కాదా అన్నది నిర్ధారించుకోడానికి చేసే నిర్ధారణ పరీక్షలు.... మామోగ్రామ్... వివిధకోణాలలో వక్షోజం లోపలి తక్కువ పవర్ గల ఎక్స్ రే కిరణాలు పంపి అక్కడి కనజాల చిత్రాలను తీయడం మామోగ్రామ్ మామూలు  పరీక్షలో చేతికి తగలని గడ్డలు.మామో గ్రామ్ లో కనిపిస్తాయి.అలాగే సూక్షంగా కాల్షియం డిపాజిట్లు ఉన్నా తెలుస్తాయి. ఈ కాల్షియం డిపాజిట్లను మైక్రో కల్సిఫికేషన్స్ అంటారు.ఇవి అవి తరువాత తరువాత క్యాన్సర్ కు దారి తీసే అవకాసం ఉంది లేదా క్యాన్సర్ కు సంబందించినవి అయి ఉండవచ్చు. అల్త్ర్రా సౌండ్... వక్షోజాల లోపలి గడ్డ గట్టిగా ఉందా లేదా ద్రవం తో కూడుకుని ఉన్న సిస్టా లేక ఈ రెండిటి కలయికతో కూడుకుని ఉందా అన్న విషయం తెలుస్తుంది. సిస్ట్ అయితే సాధారణ క్యాన్సర్  ఉండదు.సాలిడ్ గా ఉన్న గడ్డలు మాత్రం క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాసం ఉంది. ఎం ఆర్ ఐ... ఎం ఆర్ ఐ స్కాన్ ద్వారా వచ్చే చిత్రాలలో సాధారణ కణాల కంటే భిన్నంగా ఉండే రోగ పూరిత కణాలు తెలుస్తాయి. బయాప్సి... శరీరంలో ఉన్న కణజాలపు ముక్కను బయటికి తీసి పరీక్షించడం బాయప్సి అంటారు.క్యాన్సర్ అవునా కాదా అన్నది ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉన్న ఒకే ఒక సాధనం బ యాప్సి లోపల అసాధారణ మైన కణజాలం ఉన్నట్లుగా పైన పేర్కొన్న టేస్ట్లలో ద్వారా తేలినప్పుడు బయాప్సి చేయాల్సిన అవసరం వస్తుంది.అసాధారణ కణజాలం ఉన్నట్లు తేలిన ప్రదేశం నుంచి కాణ జాలాని లేదా,ద్రవాన్ని,గాని బయటికి తీయించి.అది ఏ రకంసైన క్యాన్సర్ అన్నది తెలుసుకోడానికి ల్యబోరేట రీలో పరీక్ష చేస్తారు.బయాప్సి లో నీడిల్ బయాప్సి, కోర్ బయాప్సి ,స్కిన్ బయాప్సి,సర్జికల్ బయాప్సి లో వక్షోజం లోపలి గడ్డలో కొంత భాగాన్ని బయటకి తీసి లేక గడ్డ మొత్తాన్ని బయటికి తీయడం లాంటివి ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కు చికిత్స... మిగతా అన్ని క్యంసర్ల లాగానే బ్రెస్ట్ క్యాన్సర్ కు మూడు ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. శాస్త్ర చికిత్స,రేడియేషన్,తెరఫి,కీమో తెరఫి  బ్రెస్ట్ ,క్యాన్సర్ దశను బట్టి హార్మోన్ సున్నితంగా ఉంటాయి కాబట్టి.రోగి ఇతర అవయవాల పనితీరు ఉంది అన్న అంశాల పనితీరును బట్టి చికిత్సను నిర్ణ యిస్తారు. క్యాన్సర్ దసలు వివిధ దశల్లో చికిత్సలు మీకు అందిస్తాం.

గర్భస్రావానికి 24 వారాలు... ' ఇక మహిళలు గర్భస్రావానికి 24 వరాలు మాత్రమే గడువు విదిస్తూ కేంద్రం ఎం టి పి చట్టం 19 71 ని సవరించింది.ఈ మేరకు టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి చట్టం 2౦21 ని సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి తెచ్చింది. గతం లో ఉన్న 1971 ఎం టి పి ప్రకారం గర్భస్రావానికి 2౦ వరాలు మాత్రమే గడువు ఉండగా దీనిని సవరిస్తూ మరో నాలుగు వారాలు గడువును పెంచింది. అయితే గర్భ శ్రావం చేసుకోడానికి గల కారణాలను సూచిస్తూ ఎవరు గర్భ స్రావాన్ని చేసుకో వచ్చో చట్టంలో పేర్కొంది.ముఖ్యంగాలైంగిక దాడులకు గురి అయిన వారు.  మానభంగానికి గిరి అయిన వారు.మైనర్లు అంగవైకల్యం గల మహిళలు. మానసిక రోగులు,ఎవరైతే మానసిక సమాస్యలతో బాధ పడుతున్నారో.ఆయా సందర్బాన్ని బట్టి గర్భం లో ఉన్న పిండాన్ని తొలగించడం ప్రమాదం తో కూడుకున్నదని ఒక్కో సారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని సవరణ చట్టం లో పేర్కొన్నారు.కాగా సవరణ చట్టం లో ఎవరైతే పిల్లలు శారీరకంగా మానసిక తీవ్ర అంగ వైకల్యం తో బాధ పడుతున్నారో,లేదా ఇతర అనారోగ్య సమస్యల తో బాధ పడేవారు,వివాహం లో ఇబ్బందులు,ఆతరువాత వచ్చిన మార్పు పరిణామాల నేపధ్యం లో అవాంచిత గర్భం వచ్చినప్పుడు అది తీవ్ర సమస్యగా మారవచ్చు. ఆసమయంలో అత్యవసరంగా గర్భ శ్రావం చేయాల్సి వస్తే చట్ట ప్రకారం వారు గర్భ శ్రావం చేసుకో వచ్చని కేంద్రం చట్టం లో పేర్కొంది.వైద్య పరంగా గర్భస్రావం టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి యాక్ట్ 2౦21 సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి వస్తుందని చట్టం లో పేర్కొన్నారు. 

Healthy Heart Diet Tips You can lower your chances of getting heart disease by eating healthy. For a healthy heart, Weight control and regular exercise are critical for keeping your heart in shape but the food you eat may matter just as much. * Eat a diet low in fat, especially animal fats and palm and coconut oils. (These foods contain saturated fat and cholesterol. Saturated fat and cholesterol can cause heart disease.) * Choose a diet moderate in salt and sodium. * Maintain or improve your weight. * Eat plenty of grain products, fruits and vegetables. * Choose milk with 1% fat or skim milk instead of whole milk. * Eliminate fried foods and replace them with baked, steamed, boiled, broiled, or microwaved foods. * Cook with oils which are low in fat and saturated fat like corn, safflower, sunflower, soybean, cottonseed, olive,canola, peanut and sesame oils. Stay away from oils and shortenings that are high in fat and saturated fat. * Smoked, cured, salted and canned meat, poultry and fish are high in salt. Eat unsalted fresh or frozen meat, poultry and fish. * Replace fatty cuts of meat with lean cuts of meat or low-fat meat alternatives. * In recipes requiring one whole egg try two egg whites as a lower fat alternative. * Replace sour cream and mayonnaise with plain low-fat yogurt, low-fat cottage cheese, or low-fat sour cream and mayonnaise. * Substitute hard and processed cheeses for low-fat, low-sodium cheeses. * Use herbs and spices as seasoning for vegetables and potatoes instead of salt and butter. * Replace salted crackers with unsalted or low-sodium whole-wheat crackers. * Substitute canned soups,bouillons and dry soup mixes which are high in salt for sodium-reduced soups and bouillons. * Replace white bread, white rice, and cereals made with white flour with whole-wheat bread, long-grain rice, and whole-grain cereals. * Substitute snacks high in salt and fat with low-fat, low salt snacks. Cut-up vegetables and fruits are a quick healthy snack.    

చక్కెర చిక్కులు తగ్గించుకోండిలా!   డయాబెటిస్ ఒక్కటి వస్తే చాలు... దాని వెనకాల తట్టెడు రోగాలు చుట్టుముడతాయి. అందుకే దాని పేరు చెబితే చాలు ప్రపంచమంతా వణికిపోతోందిప్పుడు. అలా అని వస్తుందేమో అని భయపడుతూ కూర్చుంటే ఎలా? రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా! వీలైనంత వరకూ చక్కెరను ఒంట్లోకి వెళ్లకుండా ఆపగలిగితే మంచిది. అందుకోసం మొత్తం నోరు కట్టేసుకోనక్కర్లేదు. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు... * స్వీట్ల మోతాదు తగ్గించండి. ఒకవేళ తిన్నా చక్కెరతో చేసిన వాటికంటే బెల్లంతో చేసిన వాటినే తీసుకుంటూ ఉంటే కాస్త బెటర్. *ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి పోవద్దు. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. వాటి బదులు ఫ్రూట్స్ తో చేసే ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ చాట్ లాంటివి ఎంచుకోండి.  * కూల్ డ్రింక్స్ బదులు జ్యూసులు, బటర్ మిల్క్ లాంటివి తాగండి. * కేక్స్, కుకీస్ లాంటివి కూడా ఎక్కువ తినకూడదు. తినాలనిపిస్తే అప్పుడప్పుడూ ఓ చిన్న ముక్క. అంతే తప్ప ఒకేసారి నాలుగైదు ముక్కలు లాగించేశారో... అంతే సంగతులు. * పాలు, పెరుగు వంటి వాటిలోని చక్కెర త్వరగా కొవ్వుగా మారిపోతుంది. కాబట్టి బయట పెరుగు కొనకండి. అవి రోజుల తరబడి నిల్వ ఉంచుతారు కదా! ఇంట్లోనే ఎప్పటికప్పుడు పెరుగు తోడు పెట్టుకుని తాజాగా ఉండగానే తినేస్తే మంచిది. * సాస్ లనీ, డిప్స్ అనీ ఏవేవో దొరకుతున్నాయి మార్కెట్లో. అస్సలు టెంప్ట్ అవ్వొద్దు.  * ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకండి. అంతగా టెంప్ట్ అవుతుంటే నీళ్లశాతం ఎక్కువగా ఉండి, ఏదో కొద్దిగా ఫ్లేవర్ ఉండే ఐస్ ఫ్రూట్స్ ఉంటాయి. అవి తిని సరదా తీర్చుకోండి. అలాగే చాక్లెట్లు కూడా. మితిమీరి తినవద్దు. అంతగా తినాలనిపిస్తే మామూలు చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ తినండి. * తినగలిగితే మామూలు రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టండి. మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ మెల్లగా అలవాటైపోతుంది. అలాగే బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ తింటే ఏ భయమూ ఉండదు.       ఇవన్నీ మనం చేయగలిగినవే. ఫుడ్ విషయంలో అవసరం కంటే టెంప్టేషన్ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. అందుకే ఆకలి లేకపోయినా తినాలనిపించి తినేస్తుంటాం. టెంప్ట్ అవ్వడం మానేస్తే అసలు సమస్యే ఉండదు. అబ్బే లేదు అంటే మాత్రం పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. చక్కెరతో చిక్కులు రాకుండా ఉంటాయి.   

శానిటరీ నాప్కిన్స్ ఎలా కొనాలి?   ఒకసారి ఆలోచించండి.. మీరు సానిటరీ ప్యాడ్ కొనేటప్పుడు దాని కోసం ఉపయోగించిన రసాయనాల గురించి, ఎప్పుడైనా ఆలోచించారా?! మనకు ఏది తక్కువ ధరకు వస్తుందో, లేదా దేని సైజ్ పెద్దగా ఉండి, ఎక్కువ సేపు తడి కాకుండా ఉంచుతుందో అని మాత్రమే చూస్తున్నాం కానీ ఆ కెమికల్స్ మన శరీరానికి మంచిదేనా అని ఆలోచించలేదు. ఇదే అదనుగా భావించి వ్యాపారులు పబ్బం గడుపుతున్నారు. అన్నీ విషయాలలో సిగ్గు మంచిది కాదని తెలుసుకోండి. సిగ్గు అనే ఊబిలో కూరుకు పోయి, మన శరీరాల్ని మనమే అసహ్యించుకునే స్థితికి చేరుకున్నాం. మన దేహానికి ఏది మేలు చేస్తుంది అని ఆలోచించ లేక పోతున్నాం. ఎప్పుడో 1980 లో రూపొందిన ప్రమాణాలు ఆధారంగానే ఇప్పటికీ సానిటరీ ప్యాడ్ లు తయారు చేస్తున్నారు. మన దేశంలో సానిటరీ ప్యాడ్ శుభ్రత గురించి, దానిలో వాడే కెమికల్స్ గురించి యెటువంటి ప్రమాణాలు లేకపోవడం వలన , తయారి ఖర్చులను తగ్గించుకోడానికి పరిశ్రమలు నాసిరకం కెమికల్స్ వాడుతున్నారు. వీటి వలన ఇన్ఫెకషన్లు, క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులకి మహిళలు గురి అవుతున్నారు. వాటిలో కాటన్ ప్యాడ్లలో ఎక్కువగా ఉపయోగించే డీఆక్సిన్ అనే రసాయనం గర్భస్రావం, డియాబెట్స్, వ్యందత్వం, మరియు రోగ నిరోధక శక్తిని పాడుచేస్తుంది.  ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ ప్యాడ్లలో చాలా మటుకు నాసిరకం ప్లాస్టిక్ లను ఉపయోగిస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా మనమే. మన దేశంలో కేవలం 12% స్త్రీలు మాత్రమే సానిటరీ ప్యాడ్ ఉపయోగిస్తున్నారు. వారిలో కూడా అధిక శాతం వీటిలో వాడుతున్న కెమికల్స్ గురించి పట్టించుకోరు. వీటి గురించి మాట్లాడటం తప్పు అన్నట్టు ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. ప్రశ్నించినా అదో సిగ్గు పడాల్సిన విషయం అన్నట్టు , ప్రచారం అసలే చెయ్యరు. 12% శాతం స్త్రీలు ప్యాడ్స్ వాడి రోగాలకు గురి అవుతుంటే మిగతా స్త్రీలు ప్యాడ్స్ ధరించకుండా, పాత గుడ్డలను, ఆకులను ఉపయోగిస్తూ రోగాల భారిన పడుతున్నారు. దీనికి కారణం సరైన అవగాహన గాని, ఈ దిశగా విలువైన పరిశోధనలు గాని లేక పోవడం. ప్యాడ్ మాన్ గా ప్రసిద్ది చెందిన పద్మశ్రీ అరుణాచలం మురుగునాథం ఈ విషయం గురించి ఎన్నో అవగాహనా సదస్సులు నిర్వహించారు. "ప్రతీ స్త్రీ తమ జీవితంలో సుమారు 11000 నుండి 17000 వరకూ ప్యాడ్స్ ఉపయోగిస్తారు. మరి తన శరీరంలో చేరుతున్న కెమికల్స్ గురించి పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సానిటరీ ప్యాడ్ విక్రయదారులు తమ విజ్ఞాపనల్లో ఏ ప్యాడ్ ఎంత సేపు పొడిగా ఉంచుతుందో చెబుతున్నారు కానీ రోజుకి ఎన్ని ప్యాడ్లు వాడాలో చెప్పకుండా దాస్తున్నారు. ఒక ప్యాడ్ కేవలం నాలుగు గంటలు మాత్రమే వాడాలి. దాని వల్ల ఇన్ఫెకషన్లు రాకుండా కాపాడుకోవచ్చు. దీని గురించి ప్రశ్నించకపోగా , కనీస అవగాహన కూడా స్త్రీలలో కల్పించకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం కూడా స్పందించి, ప్యాడ్స్ సేఫ్టీ గురించి ఆలోచించాలి. " అని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో 100% biodegradable pads, సానిటరీ కప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని వాడటం చాలా సులభం. అవి యెటువంటి హానీ చెయ్యవు. వాటినీ ప్రయత్నిద్దాం. అయితే కెమికల్స్ ఫ్రీ ప్యాడ్స్ ఉన్నా, అవి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నవి. ఆరోగ్యానికి హానీ చేసే ఎన్నో వస్తువులపై సబ్సిడీలు ఇచ్చే ప్రభుత్వం , వీటి గురించి అసలు పట్టించుకోదు. కెమికల్స్ ఫ్రీ తెంపొన్స్ ఉంటాయి. అవి దూదితో చేసిన గొట్టాలు. అయితే వాటిలో కూడా సువాసన కోసం రసాయనాలు సమృద్ధిగా వాడుతున్నారు. dioxin లేని తెంపోన్స్ కొనడానికి ప్రయత్నించండి. reusable సానిటరీ ప్యాడ్ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని ఉతికి బయట ఆరబెట్టుకునే స్వేఛ్చ, ధైర్యం భారత నారికి ఇంకా రాలేదు. మన దౌర్భాగ్యం.  మన శరీరాన్ని మనం ప్రేమిద్దాం. మనల్ని సిగ్గు పడేలా చేసే హక్కు ఎవ్వరికీ లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన గురించి, మన హక్కుల గురించి తల ఎత్తుకుని ప్రశ్నిద్దాం. ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదు. మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం కాపాడుకుందాం. ◆ వెంకటేష్ పువ్వాడ

లింగ వివక్షతో అమ్మాయిలను హత్య చేసారు...   లింగ వివక్షతో4.7 మిలియన్ల బాలికలను హత్య చేసారు.జన్మ  నివ్వకుండా చంపేశారు. కొడుకు పై ఉన్న వ్యామోహం తల్లి గర్భంలో నుండి బయటకు రాకుండా అంటే ఈప్రపంచం లోకి రాకుండానే బ్ర్రోన్న హత్యకు గురి అయ్యింది.ఆడపిల్లకు జన్మనివ్వకుండా అబార్ షాన్ చేసుకున్న తల్లి తండ్రుల ను చూసి సిగ్గు తో తలవంచుకోవాలి.సమాజం మారింది ఆధునిక త భావాలు విద్యావంత్తులైన వాళ్ళు విచక్షణ తో ఆలో చిస్తారని భావించిన ప్పటికి ప్రపంచంలో  ఆడపిల్లల పుట్టుజను అడ్డుకోడం అన్నది మహాపాపం అని అంటారు.ఈ పాపాల పట్టికలో మొదటి రెండు స్థానాలాలో చైనా భారాత్ లు ఉండడం విశేషం.మనది ఖర్మ భూమి అని పుణ్య భూమి అని చెపుతారు .యత్ర నార్యస్తు - పూజ్యంతే,త్సత్ర దేవత రమంతే అని మన ఉపైశాత్తులులలో పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఎక్కడైతే స్త్రీలు పూజిమ్పబడ తారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు.లేదా దేవతలు నివాసం ఉంటారు.అని కానీ అన్డుజు భిన్నంగా దేశంలో ఆడ బిడ్డలను పురిట్లోనే చ్చంపెస్తున్న ఘటన వెలుగు చూడడం మనమందరం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం అని చెప్పక తప్పదు. ఇది ఆరోపనా మాత్రం కాదు ప్రపంచవ్యాప్తంగా జరిపిన  సర్వేలో వెలువడ్డ పచ్చి నిజం. కొన్ని దేశాలలోని సంఘాలు మగ పిల్లకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఆడపిల్లపట్ల వివక్షచూపడం దురదృష్టకరం. మగపిల్లలు అయితే ముద్దు ఆడపిల్ల అయితే వద్దు అన్న ఆలోచన 197౦ లోనే పురుడుపోసుకుంది.మగపిల్లలను మరీ ఎంపిక చేసుకుని ఆడపిల్ల అని తెలియగానే బ్రూణ హాత్యలకు పాల్పడం అబార్షన్ చేయించుకున్న తల్లి- తండ్రులు నిర్ణయం తీసుకున్న ఫలితం నేడు కనిపిస్తుంది.అని నేడు ఆడపిల్లల కొరత ఏర్పడుతోందని అది పురుషులకు అనుగుణంగా  నిర్ణయాలు జరుగు తున్నాయని అంటున్నారు విమర్శకులు. ఇలాంటి వివక్ష దుస్థితి నేటికి చాలా దేశాలలో కొనసాగుతోంది.ఒక నూతన పరిశోదన లో అంచనా ప్రకారం దాదాపు 4.7 మిలియన్ల బాలికలను ప్రపంచ వ్యాప్తంగాకోల్పోయామని.ఇది 2౦3౦ నాటికి 21 ౦౦ అంటే సతాబ్దానికి డని సంఖ్య 22 మిలియన్లు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఈ పద్ధతి ఇలాగే కొనసాగే అవకాసం ఉందని దీని పరిశోదనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు పురుషులే   అధిక సంఖ్యలో ఉంటె పెళ్ళిళ్ళు జరుగు తయా లేదా అన్నది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పురుషులే అధిక సంఖ్యలో ఉండడం మూలంగా సంఘ వ్యతిరేఖ శక్తులుగా మారే అవకాసం ఉందనిఒకరకమైన వైలెన్స్ ఏర్పడే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాగా యు ఎన్ ఓ ఇప్పటికే పిల్లలను ఎంపిక చేసుకుని జన్మ నిచ్చే విషయంలో ఇది అత్యంత ప్రమాదకర ప్రక్రియ గా పేర్కొంది.స్త్రీ పురుషుల వివక్ష చూపడం అన్యాయమని పేర్కొంది. 2౦2౦ న యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్స్ లో ఈ అంశాన్ని ప్రచురించింది.తమకు పుట్టిన బిడ్డ  మగబిడ్డ ఆడబిడ్డ అన్న విషయాన్ని స్కాన్ లో తెలుసుకుని మరుక్షణం కొడుకతే ముద్దు ఆడపిల్లైతే వద్దు అని అనుకుంటున్నారేమో.మగపిల్ల వాడికి ప్రాధాన్యత  లేదా ఆడపిల్లకు జన్మనిచ్చేందుకు నిరాకరించడం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేమన్న భావన కలిగి ఉండడం దురదృష్టకరం. ఒక వేళ ఆడపిల్ల ఉన్నప్పటికీ మళ్ళీ ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడి కోసం ప్రయత్నించడంగమనించవచ్చు.మగపిల్ల వాడికోసం ప్రయత్నించడం గమనించవచ్చు.మగపిల్లల పట్ల ప్రేమ చూపడం,మొగ్గుచూపడం వివక్ష చూపడం అత్యంత ప్రమాదకరమని రచయితలు నిశితంగా విమర్శించారు. 197౦ -2౦ 17 మధ్యలో జరిగిన పరిశోదనలో 45 మిలియన్ల ఆడపిల్లలను పుట్టకుండానే మరణించారని తల్లి తండ్రుల ఎంపిక ప్రకారం జరిగిందని పేర్కొన్నారు.ఇలా ఆడపిల్లలు పుట్టకుండా మిస్ అయిన ఘటనలో జాబితాలో 95% ఎక్కువకేసులు చైనా భారాత్ లోనే జరగడం ఆస్చార్యాన్ని కలిగిస్తుంది. కొంత మంది శాస్త్రజ్ఞులు 1 2 దేశాలాలో జననాల పై రేషన్ విధించినట్లు సమాచారం.మరల 4.7 మిలియన్ల ఆడపిల్లలు జన్మకు నోచుకోక  పోవడం అలాగే పురుషులకు అధిక సంఖ్యలో జన్మ నిచ్చారని అంచనా. గతంలో జరిగిన ఘటనలు బాలురు బాలికల పుట్టుక పై వివక్ష చూపడం వల్ల పురుషులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల కొందరు కొందరు ఫిమేల్ గా మార్పిడులు చేయించుకున్న ఘటనలు చూసాం సెక్స్ మార్పిడికి పాల్పడడం లేదా హోమో సెక్స్ పెర్సానాలితీకి మారడం వంటి ఘటనలు విన్నాం.ఒకో సారి స్త్రీలు వద్దనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.చైనా భారాత్ లో ఈ పరిస్థితి కి దారి తీస్తుందని యు ఎన్ ఆ నివేదికలో పేర్కొంది. ఈ రకమైన ఆలోచన హానికారక మై నప్పటికీ రచయితల అభిప్రాయం ప్రకారం  21౦ ౦ నాటికి పురుషుల సంఖ్య తగ్గి  ఆడపిల్ల పుట్టుక మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అవిదాదాపు 5.7 మిలియన్లకు చేరవచ్చు.అని తేల్చి చెప్పారు. రానున్నది బహాయంకరం కలామేనా?----- రానున్నది అత్యంత భయంకరమైన కాలంగా పేర్కొన్నారు రానున్న భావిష్యత్తు  ఊహించుకోజలమని ఆడపిల్లల కొరత కారణంగా ఈ కొరత ప్రపంచం మొత్తంలో 2 2 మిలియన్లుగా చేరవచ్చని అంచనా వేస్తున్నారు.శతాబ్దం చివరికి మరో 17 దేశాలు స్త్రీపురుషుల వ్యత్యాసం పెరిగే అవకాసం ఉందని మగ ఆడపిల్లల మధ్య రేషియో మరింత పెరిగే అవకాసం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పుట్టుకలలో సెక్స్ రేషియో కొంత పెరిగి తగ్గినప్పటికీ చాలా ఘటనలు తీవ్రంగా ఉండవచ్చు.ఇతర దేశాల పై ప్రభావం పడే అవకాసం ఉంది. పాకిస్తాన్ నైజీరియా కు చెందిన డాక్టర్ ఫ్రెంగ్క్యూయింగ్ చావు స్టేటస్ తేశియన్ కింగ్ అబ్దుల్లా యూనివెర్సిటి సైన్స్ అండ్ టే క్నాలజీ మక్కా సౌదీ అర్రేబియా కు చెందినా మరికొంతమంది రచయితలు పాల్గొన్నారు. డాక్టర్ చావ్ సాస్త్జ్హరగ్నుల ద్వారా అంచనా వేయగల మోడల్స్ యునైతేడ్నేషన్స్ పోపులేషణ్ విభాగం న్యూయార్క్.జాతీయ విశ్వ విద్యాలయం  సింగపూర్ సెంటర్ డి సైన్స్ హ్యుమన్స్ డిల్లి,మసాచూత్స్ వ్విశ్వవిద్యలయం వారికి చెందిన డాటాబేస్ 3.26 రికార్డులను 2౦4 దేసాలా నుండి తీసుకున్నారు.ప్రపంచ జనాభాలో 3 వ వంతు  పురుషుల జనాభా అని తేల్చారు. ఆర్ధిక సాంఘిక సామాజిక పర్నమాలపై ప్రభావం చూపిస్తుంది. స్త్రీలు దొరకరు ----- పుట్టుకలలో స్త్రీపురుషులలో వివక్ష బాలికల మరణాలు ఎక్కువ కావడం వల్ల స్త్రీలు తగ్గిపోతారు. సహజంగా పురుషులు ఎక్కువగా ఉంటారు. చాలామంది పురుషులకు భార్యలు దొరకని స్థితి లేదా భార్యలు కోల్పోయే స్థితి.సంఘ వ్యతిరేక శక్తులుగా మారే స్థితి దీర్ఘకలంగానిలదోక్కుకోలేక పోవడం సామాజిక వరూధి సాధించలేక పోవడం.జెండర్ వివక్ష లో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం నిలువరించేందుకు చట్ట పరంగా కొన్ని నిబందనలు రూపొందించాల్సిన అవదరం ఉంది.  

గోళ్ల రంగుకి అమ్మాయిల బరువుకి లింకేంటి..?     గోళ్ల రంగు..ఇదివరకటి రోజుల్లో పెళ్లిళ్లకో, వేరే ఏదైనా శుభాకార్యాల కోసమో అందంగా రెడీ అవ్వడానికి అమ్మాయిలు గోళ్ల రంగు వేసుకునేవారు. కానీ కాలం మారింది..గోళ్లరంగు వేసుకోవడానికి ప్రత్యేకంగా సందర్భం ఏమీ అక్కర్లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. ఏ రోజుకు ఆ రోజు డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా పాత నెయిల్ పాలిష్‌ని రిమూవ్ చేసి కొత్తది వేసుకుంటున్నారు మగువలు. అయితే ఇలాంటి వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల బరువు పెరుగుతారట. డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో నివ్వెరపరిచే వాస్తవాలు బయటపడ్డాయి..ముఖ్యంగా నెయిల్ పాలిష్‌లో ఉండే ట్రైఫీనైల్ ఫాస్ఫేట్ అనే పదార్థం వల్ల గోళ్ల రంగులు ఎక్కువ కాలం మన్నుతాయి. ఫ్లాస్టిక్ పదార్థాలు, ఫోమ్ ఫర్నిచర్‌కు త్వరగా మంటలు అంటుకోకుండా ఈ రసాయనాన్ని వాడుతారు. కానీ ఇది అంతిమంగా హార్మోన్లపై ప్రభావం చూపెడుతోందని పరిశోధకులు నిర్థారించారు. పశువుల మీద చేసిన పరీక్షలలో వాటికి సంతానోత్పాత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అయితే మనుషుల్లో బరువు పెరిగే లక్షణాన్ని గుర్తించారు. మార్కెట్లో దొరుకుతున్న సుమారు 3 వేల రకాల నెయిల్ పాలిష్‌లు సేకరించి వాటిని పరీక్షించగా వాటిలో 49 శాతం ట్రైఫీనైల్ ఉంది. గోళ్ల రంగు వేసుకున్న 10-14 గంటల తర్వాత వాళ్ల శరీరంలోని టీపీహెచ్‌పీ మోతాదు దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోళ్లు పెట్టుకుని, వాటికి మాత్రమే రంగులు వేసుకున్న వాళ్లకు మాత్రం అలా పెరగలేదు. అందువల్ల తరచు గోళ్ల రంగులు వేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని..దానివల్ల శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తప్పనిసరైతే చర్మానికి తగలకుండా చూసుకోవాలని, అలా తగిలితే రక్తంలోకి వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు..కాబట్టి బీ కేర్ ఫుల్..

చెప్పుకోలేని సమస్యకు చెప్పుకోదగ్గ పరిష్కారం!     పైల్స్... ఈ సమస్య ఉందని పైకి చెప్పుకోడానికే సిగ్గు చాలామందికి. ముఖ్యంగా మహిళలు అయి మరీ ఇబ్బంది పడతారు. దురద, నొప్పి, మంట వేధిస్తున్నా చూపించుకోడానికి సిగ్గేసి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లరు. అలా అని నిర్లక్ష్యం చేస్తే ఇది సర్జరీ వరకూ తీసుకెళ్తుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటించండి. పైల్స్ ని మీ నుంచి దూరంగా పంపించేయండి. - ముందు ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తగ్గించేయండి. పీచు పదార్థాలను పెంచండి. రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని తాగండి. ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోండి.  - తగినంత నిద్రపోండి. మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా పైల్స్ ఇబ్బంది పెడతాయి. - స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లకు చెక్ పెట్టండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ కూడా తగ్గించండి. - అంజూరపు పండ్లను రాత్రంతా నీటిలో నాబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఆ నీళ్లు తాగితే సుఖ విరేచనం అవుతుంది. రోజూ అలా చేయడం వల్ల మెల్లగా పైల్స్ తగ్గిపోతాయి. - నీటిలో నాలుగు బిర్యానీ ఆకులు, మూడు వెల్లుల్లి రేకులు వేసి మరిగించాలి. ఈ నీటిని రోజుకు మూడుసార్లు పైల్స్ ఉన్న చోట రాస్తే మెల్లగా వాపు, నొప్పి తగ్గిపోతాయి. - టీ ట్రీ ఆయిల్ లో ఆముదం కానీ బాదం నూనె కానీ కలిపి రాసినా ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జు రాసినా మంచిదే. - పైల్స్ నొప్పి భరించలేనిదిగా ఉంటే... వేడిపాలలో నిమ్మరసం కలుపుకుని మూడు గంటలకోసారి చొప్పున రోజంతా తాగండి. బాధ తగ్గుముఖం పడుతుంది. - రోజూ పడుకునే ముందు నిమ్మరసంలో దూది ముంచి పైల్స్ మీద పెట్టుకోండి. దీనివల్ల కొద్ది కాలానికి సమస్య తీరిపోతుంది.      ఇన్ని చేసినా తగ్డకపోతే సమస్య ముదిరినట్టు లెక్క. అప్పుడు మాత్రం సిగ్గు పడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లండి. లేదంటే మరీ ముదిరిపోయి పరిస్థితి చేయి దాటవచ్చు! -Sameera  

వ్యాయామం చేయకపోతే గుండె నొప్పి..   ఎవరైతే శరీర వ్యాయామం  చేయరో వాళ్ళు గుండె నొప్పితో మరణిస్తున్నారని ఒక అధ్యనంలో తేలింది. ప్రతి రోజు చాలా చురుకుగా ఉంటారో వాళ్ళలో గుండె నొప్పితో చనిపోయే అవకాశం తక్కువే  అని  వైద్యులు తేల్చిచెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో గుండె సమస్యలతోనే ఎక్కువమంది మరణిస్తున్నారని కనుగొన్నారు.  ఈ పరిశోదన పై యురోపియన్  జనరల్ లో ప్రచురించారు . శరీర వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని.  అది మనకు మేలు చేస్తుందని నిపుణులు తేల్చారు. శరీరవ్యాయామం గుండెకు వచ్చే వ్యాధులను గుండె పోటును నివారిస్తుందని అన్నారు. దీనిపై చేసిన  అధ్యయనంలో చైతన్యంగా అంటే యాక్టివ్ గా ఉన్న వారిలో గుండె నొప్పి వచ్చే అవకాసం తక్కువే అని  సెడన్ ట్రీ లైఫ్  వల్లే గుండె నొప్పికి ప్రధాన కారణంగా వైద్యులు పేర్కొన్నారు. యూరప్ లోని  ఆరోగ్య వంతులు శరీర వ్యాయామం చేసేవారు అప్పటికే గుండె నోప్పి వచ్చిన వారు 2 8 1 4 ౦  మంది వ్యక్తులపై చేసిన అధ్యయనం లో పలు అంశాలు కనుగొన్నారు. ఈ అధ్యయనం లో పాల్గొన్న వారిని వివిధ విభాగాలుగా  విభజించి అందులో అనువైన సమయంలో శరీర వ్యాయామం చేసేవారు తక్కువ, మధ్య తరగతి, ఉన్నత వర్గాల జీవన ప్రమాణాలు ఉన్నవారిని వేరువేరుగా విభజించారు. ఇందులో వారంలో ఒక రోజు వారు వచ్చే విధంగా నిర్ణయించారు. శరీర వ్యాయామం గుండె పోటు వల్ల మరణించే శాతం ఎంత ఉండవచ్చు అన్న అంశం పైనా 2 8 రోజుల పాటు అన్ని వర్గాల వారిని కేటగిరీల వారిని పరిశీలించామన్నారు . వచ్చిన వారి వయస్సు స్త్రీ, పురుషులు వేరుగా విభజించి వారిలో డయాబెటిస్ , బి పి.  వారి కుటుంబాల చరిత్ర, వారి గుండె సంబందిత  సమస్యలు  ఉన్నయా లేదా ? వారి పొడవు , ఎత్తు ఇతర అలవాట్లు సిగరెట్లు , మధ్య  పానం, కొలస్ట్రాల్ వారి సాంఘిక ఆర్ధిక పరిస్థితుల పై అధ్యనం చేసారు. 4 9 7 6 ( 1 7 .7%) మంది 2 8 రోజుల్లో మరణించినట్లు. కనుగోన్నారు. 3, 1 ౦ 1 ( 6 2 . 3 % ) అప్పటికప్పుడే మరణించారని అధ్యనంలో వెల్లడించారు. ఎక్కువ శాతం శరీర వ్యాయామం చేసిన వారిలో గుండె నొప్పి ఇన్స్ స్టాంట్  హార్ట్ అట్టాక్  వచ్చే అవకాశం  తక్కువే అని నిర్ధారించారు. 2 8 రోజులలో 3 6 % ,2 8 % వారిలో ఎక్కువగా మార్పు కనపడలేదని  డాక్తర్ కిం వాదేల్ట్ హాన్సెన్ బిస్ పబ్ జేర్గ్ అసుపత్రికి చెందిన సుపెన్ హగ్గెన్ డెన్మార్క్ మాట్లాడుతూ దాదాపు 1 8 % మంది రోగులు గుండె నొప్పితోనే 2 8 రోజుల్లో మరణించారని వారికీ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉండడం వల్లే మరణించారని తేల్చి చెప్పారు. అయితే వారు శరీర వ్యాయామం కొంత అయినా చేసి ఉంటె  బతికి ఉండే అవకాశం ఉండేదని అన్నారు. మా  అధ్యయనం ద్వారా  తక్కువ సమయంలో నైనా అంటే కొంతసేపు అయినా  వ్యాయామం చేస్తే కొంతైనా లాభం పొందవచ్చని వారంలో ఒక్క రోజు అయినా  శరీర వ్యాయామం  అంటే తక్కువలో తక్కువ 7 5 నిమిషాలు ఏరోబిక్  చేయవచ్చని దీనికోసం పెద్దగా డబ్బు ఖర్చు చేయల్సిన అవసరం ఏమి లేదని  కొంత సమయం మాత్రం వ్యాయామం చేయాల్సిందే అని నిపుణులు సూచించారు.  కాగా శరీర వ్యాయామం పై మరిన్ని అధ్యనాలు చెయ్యాల్సిన అవసరం ఉందని  డాక్టర్ హాన్సెన్  అభిప్రాయ పడ్డారు.