English | Telugu

రెచ్చిపోయిన విష్ణుప్రియ... డాన్స్ మాస్ అంతే!

విష్ణుప్రియ మరోసారి రెచ్చిపోయింది. అందాలు ఒలకబోయడం, గ్లామర్ షో విషయంలో హీరోయిన్లకు... స్టార్ యాంకర్లు అనసూయ, రష్మీకి ఏమాత్రం తీసిపోనని అన్నట్టు మాస్ పెర్ఫార్మన్స్‌తో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హుషారుగా డాన్స్ చేసింది. ఐటమ్ సాంగ్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా స్టెప్పులు వేసింది.

విష్ణుప్రియ ఈమధ్య గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మొన్నామధ్య సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది. 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' వెబ్ సిరీస్ ప్రెస్‌మీట్‌కి క్లీవేజ్ కనిపించేలా డ్రస్ వేసుకుని వచ్చింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో ఇంతకు ముందు ఓసారి అభితో కలిసి చేసిన పెర్ఫార్మన్స్‌లో నాభి అందాలు కనిపించేలా డాన్స్ చేసింది. ఇప్పుడు అంతకు మించి అనుకునేలా 'కుర్రాడు బాబోయ్' పాటకు డాన్స్ వేసింది.

విష్ణుప్రియ డాన్స్ ప్రోమోలో కాసేపు చూస్తేనే 'మాస్ అంతే' అనేలా ఉంది. ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. డాన్స్‌కు ఇంద్రజ జడ్జ్‌మెంట్ ఇవ్వబోతుంటే విష్ణుప్రియ ఎగ్జైట్ అయ్యింది. 'ఇంద్రజగారు... నమస్కారం. ఐ లవ్యూ వెరీ మచ్. మీరు అద్భుతమైన నటి. గొప్ప ప్రతిభ కల మనిషి' అని చెబుతూ వెళుతుంటే... 'అమ్మా! ఆవిడ మీకు జడ్జ్‌మెంట్ చెప్పాలి. నువ్వు ఆమెకు చెబుతున్నావ్' అని ఆది సెటైర్ వేశాడు. సండే టెలికాస్ట్ కానున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో హిమజతో కలిసి ఆది స్కిట్ చేశాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.