English | Telugu

"యు ఆర్ మైన్.. అయామ్ యువర్స్".. శ్వేత‌తో ష‌న్ను!

'బిగ్ బాస్'లో ప్రేమకథలకు, రొమాంటిక్ ముచ్చట్లకు కొదవ ఉండటం లేదు. రవి, లహరి మిడ్ నైట్ హగ్ ఇష్యూ ఇంట్లో సభ్యులను ఓ కుదుపు కుదిపింది. అది మరువకముందే మరో గొడవ మొదలయ్యేలా ఉంది. హీరోయిన్ శ్వేతా వర్మను యూట్యూబర్ షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ ప్రేమలో దింపే ప్రయత్నాలు చేస్తున్నాడు. అది స్కిట్ లో భాగమే!

శ్వేతా వర్మను పడేసే క్రమంలో షన్ను నోరు జారాడు. దాంతో శ్వేతా వర్మ బాధపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాలి. షన్ను, శ్వేతా వర్మ మధ్య ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే...

'మనకు వచ్చే డీల్ లో లోబోకు హ్యాండ్ ఇచ్చి... మనిద్దరం చెక్కులతో చెక్ అవుట్ అయిపోతే మనీ అంతా మనకే' అని శ్వేతా వర్మ ముందు షన్ను ఓ ప్రతిపాదన పెడతాడు. 'మీకు 50, నాకు 50... 50-50పర్సెంట్' అని ఆమె అంటుంది. 'పెళ్లి చేసుకుందాం శ్వేతా! యు ఆర్ మైన్. అయామ్ యువర్స్' అని షన్ను అన్నాడు. అందుకు ఆమె సరే అంది.

ఆ తర్వాత 'ఐ లవ్యూ శ్వేతా' అని లోబో ప్రపోజ్ చేస్తుంటే మెలికలు తిరిగింది. ఇది చూసిన షన్ను ఫైర్ అవుతాడు. "శాస్త్రిగారూ" అంటూ షన్ను వెనుక శ్వేతా వెళ్ళింది. అప్పుడు 'ఏమైనా అందాం అంటే ముఖం మీద పెయింట్ వేసి కొడుతుంది' అని గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసేలా షన్ను సెటైర్ వేశాడు. అందుకు శ్వేతా వర్మ బాధపడింది. 'దట్ వాజ్ నాట్ ఫన్నీ' అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. షన్ను సారీ చెప్పాడు. తర్వాత ఏమవుతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.