English | Telugu

Vishnupriya : పృథ్వీకి విష్ణుప్రియ కిస్ పెట్టిన వీడియో వైరల్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

బిగ్ బాస్ సీజన్-8 లో విష్ణుప్రియ బీబీ గర్ల్ అని నెటిజన్లు అంటున్నారు. అలా అనడానికి చాలా కారణాలే ఉన్నాయి. అసలు విష్ణుప్రియ మెగా ఛీఫ్ ఏంటి? మొన్న సండే ఎపిసోడ్ లో తన డెసిషన్ మార్చుకుంటున్నట్టు పృథ్వీని మార్చమని చెప్పగానే.. నిఖిల్-విష్ణు ఒక జోడీ, యష్మీ-పృథ్వీ ఒక జోడీగా మార్చి లెటర్ పంపించాడు బిగ్ బాస్. ఇక తను తప్పులు చేసిన సరిచేస్తున్నాడంటూ లైవ్ చూసిన బిబి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.

ఈ సీజన్ ఇన్‌ఫినిటీ (అంతులేనిది) అని నాగార్జున ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఆడియన్స్‌కే అర్థం కాలేదు. అయితే ఈ ఇన్‌ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఏమో అనుకొని భ్రమ పడ్డ ఆడియన్స్‌కి అబ్బే కాదు కాదు.. రొమాన్స్‌లో అంటూ కళ్లు తెరిపిస్తున్నారు కొందరు కంటెస్టెంట్లు. ముఖ్యంగా విష్ణుప్రియ అయితో మాములుగా రెచ్చిపోవడం లేదు. వీకెండ్ ఎపిసోడ్‌లో అదీ నాగార్జున కళ్ల ముందే పృథ్వీ మీద పడి కిస్ ఇచ్చింది విష్ణు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. బిగ్‌బాస్ ఆదివారం ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లను సేవ్ చేసే క్రమంలో ఈ సన్నివేశం రికార్డ్ అయింది. నామినేనషన్స్‌లో ఉన్న పృథ్వీ సేవ్ అయిన వెంటనే వచ్చి విష్ణు పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో కంటెస్టెంట్ల చేతిలో ఉన్న బాక్సులను కలెక్ట్ చేయమని నబీల్‌కి చెప్పారు నాగార్జున. దీంతో తన చేతిలో ఉన్న బాక్స్‌ను నబీల్‌కి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది నయని. ఆ చిన్న గ్యాప్‌లో ఠక్కున పృథ్వీ బుగ్గపై ముద్దు పెట్టేసింది విష్ణు.

యుద్ధం కూడా ఆరు తర్వాతే ఆపేస్తారు. కానీ విష్ణుప్రియ మాత్రం యుగాంతం వచ్చినా ఆపదు. హోస్ట్ చెప్పాడు. వైల్డ్ కార్డులు చెప్పారు. కంటెస్టెంట్స్ చెప్పారు. సండే రోజు వచ్చిన హైపర్ ఆది చెప్పాడు. ఆఖరికి పృథ్వీనే వద్దని చెప్పినా మినిమమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఓ ఆడది అని కూడా మర్చిపోయి విష్ణుప్రియ రొమాన్స్ తో రెచ్చిపోతుంది. ఏంటో ఈ విష్ణుప్రియకి అంత కక్కుర్తి, నాగ్ చూసి వార్నింగ్ ఇవ్వాల్సింది, ఏందిరా ఇలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి హౌస్ లో విష్ణుప్రియ బిహేవియర్ మీకెలా అనిపిస్తోందో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.