English | Telugu

Karthika Deepam2 : పూజలో శివన్నారాయణ‌ కోపం.. అంతా కార్తీక, దీపల మంచికేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -188 లో......దీప పెట్టిన కండిషన్ కి కాంచన ఒప్పుకొని శ్రీధర్ ని పిలవడానికి వెళ్తుంది. నేను రాకుంటే ఏం చేస్తావని శ్రీధర్ అనగానే.. కార్తీక్ తండ్రిగా మీరు వస్తారని కాంచన అంటుంది. మీరు ఒక్కరే రండీ రెండో భార్య అంటే చులకనగా చూస్తారని కావేరిని ఇండైరెక్ట్ గా రాకని అనసూయ చెప్తుంది. ఈవిడ ఎవరు ఇలా మాట్లాడుతుందని కావేరి అనగానే.. తనతో పెట్టుకోకు అని శ్రీధర్ అంటాడు. నువ్వు వెళ్తావా అని కావేరి అడుగుతుంది. వెళ్తావా కాదు కచ్చితంగా వెళ్ళాలని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత దీప దగ్గరికి శౌర్య బట్టలు తీసుకొని వస్తుంది. ఎవరు కొనిచ్చారని దీప అడుగుతుంది. నానమ్మ కొన్నది.. రేపు పూజ కదా... ఏది వేసుకోవాలని శౌర్య అనగానే.. రేపు పూజ జరగదని దీప అంటుంది. జరుగుతుందని శౌర్య అంటుంది.

మరొకవైపు కుబేర్ ఫోటో పట్టుకొని వెతుకుతాడు దాస్. ఆ తర్వాత వీళ్లంతా ఎక్కడికి వెళ్లారని దీప అనుకుంటుంది. అప్పుడే కాంచన వాళ్ళు వస్తారు. రేపు పూజలో మీ దంపతులని ఆశీర్వదించడానికి మా దంపతులం వస్తున్నామని కాంచన అనగానే.. దీప షాక్ అవుతుంది. మీ అత్త కోపం పక్కన పెట్టి మీ కోసం వెళ్లి పిలిచిందని అనసూయ చెప్తుంది. దీప లోపలికి వెళ్తుంది . ఆ తర్వాత దీప బయట బాధపడుతుంటే అనసూయ వచ్చి.. మీ అత్త మీ కోసం ఇంత చేస్తుందంటూ కాంచన, కార్తీక్ ల గురించి గొప్పగా చెప్తుంది.

ఆ తర్వాత దాస్ కి ఫోన్ చేస్తుంది పారిజాతం. సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నామని దాస్ అంటాడు. అప్పుడే ఫోన్ తీసుకొని కార్తీక్, దీప అక్కలు పూజ చేస్తున్నారు. పిలిచారు వెళ్తున్నామని కాశీ చెప్తాడు. దాంతో పారిజాతం కోప్పడుతుంది. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి‌ దీప వచ్చి.. ఎప్పుడు మీ శ్రేయోభిలాషిని అంటారు కదా మీ పక్కన కూర్చొని పూజ చేయలేను.. ఆపండి అని దీప చెప్తుంది. తరువాయి భాగంలో పూజ జరిగాక జ్యోత్స్న వచ్చి దీపని తిడుతుంది. నా కొడుకు, కోడలిని ఆశీర్వదించండి నాన్న అని శివన్నారాయణ‌తో కాంచన అంటుంది. శివన్నారాయణ‌ కోపంగా అక్షింతలు విసిరేస్తాడు. అవి దీప, కార్తీక్ లపై పడతాయి. కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.