English | Telugu

వేద ప్రెగ్నెంట్ కాద‌ని మాళ‌విక‌కు తెలిసిపోయిందా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా \లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు న‌టించారు. వేద క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డంతో వెంట‌నే డాక్ట‌ర్ ని పిలిపిస్తారు. ప‌రీక్షించిన డాక్ట‌ర్ .. వేద ప్రెగ్నెంట్ అని చెబుతుంది. దీంతో ఫ్యామిలీ మెంబ‌ర్స్ హ్యాపీగా ఫీలైతే య‌ష్ మాత్రం షాక్ కు గుర‌వుతాడు.

కాపుర‌మే చేయ‌కుండా ప్రెగ్నెంట్ ఏంటీ? అని వాపోతాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌నుందో ఒక‌సారి చూద్దాం. వేద ప్రెగ్నెంట్ అని తెలియ‌డంతో అత్త మాలిని, త‌ల్లి సులోచ‌న హ‌డావిడి చేస్తుంటారు. అపార్ట్ మెంట్ లో అంద‌రికి స్వీట్లు పంచిపెడుతూ వుంటారు. శ్రీ‌మంతం కేర‌ళ‌లో చేద్దామ‌ని, పుట్టే బాబుని క‌లెక్ట‌ర్ ని చేస్తాన‌ని ప్లాన్ చేస్తుంటారు. వేద త‌ల్లి కూడా పాప పుడితే డాక్ట‌ర్ని చేస్తానంటూ మురిసిపోతుంది. ఇదంతా చూసిన య‌ష్ కి చిరాకు పుడుతూ వుంటుంది.

వెంట‌నే వెళ్లి వేద‌ని నిల‌దీస్తాడు. 'ప్రెగ్నెంట్ కావ‌డం అబ‌ద్ధం అని తెలిసి వాళ్ల‌ని ఎందుకు మోసం చేస్తున్నావు?' అంటాడు. 'రిపోర్ట్ లో ఎలాగూ తెలిసిపోతుంది. అంత వ‌ర‌కు వాళ్ల‌ని అలాగే వుండ‌నివ్వండి' అంటుంది. అయినా స‌రే అబ‌ద్దం చెప్పావ‌ని త‌రువాత అంతా ఫీల‌వుతారంటాడు. ఇదంతా చాటు నుంచి వింటున్న కైలాష్ క‌రెక్ట్ గా దొరికావు వేదా ఇక ఆడుకుంటా.. అంటూ మురిసిపోతాడు. క‌ట్ చేస్తే సులోచ‌న‌, మాలిని ఇద్ద‌రు క‌లిసి వేద‌ని హాస్పిట‌ల్ కు చెక‌ప్ కోసం తీసుకెళ‌తారు. విష‌యం తెలిసిన మాళ‌విక అక్క‌డికి వ‌స్తుంది. ఎలాగైనా విష‌యం ఏంటో తెలుసుకోవాల‌ని ఆరాతీస్తుంది. ఇదే స‌మ‌యంలో తాను ప్రెగ్నెంట్ కాద‌ని, ఆ విష‌యం మా వాళ్ల‌కు చెప్ప‌మంటుంది వేద‌. ఈ విష‌యం విన్న మాళ‌విక సంబ‌ర‌ప‌డిపోయి వేద‌ని అవ‌మానిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.