English | Telugu

తులసిని మాటలతో గాయపరిచిన అభి

అంకిత అభి గురుంచి ఆలోచిస్తూ ఉంటుంది. దివ్య తనని నవ్విద్దాం అని ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ లో ఒక వీడియో చూపించి నవ్వించే ప్రయత్నం చేస్తుంది కానీ అంకిత మాత్రం నవ్వదు. తర్వాత పరంధామయ్య విచిత్ర వేషధారణలో వచ్చి నవ్వించడానికి చూస్తాడు. అది కూడా వర్కౌట్ అవదు. చివరికి తులసి కూడా వెళ్లి అంకిత దగ్గర జోక్ చెప్తుంది ఐనా నవ్వదు. ఫైనల్ గా ఏదో హెల్మెట్ గురుంచి తులసి చెప్పేసరికి అంకిత పక్కున నవ్వేస్తుంది.

ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలంటుంది తులసి. మరో వైపు నందు కోపంతో వచ్చి తులసిని పిలుస్తాడు. నందుతో పాటు గాయత్రీ, లాస్య కూడా తులసి ఇంటికి వస్తారు. వెంటను నువ్వు అంకితను గాయత్రితో పంపించు అంటూ తులసి మీద సీరియస్ అవుతాడు. నేను పిలిస్తే అంకిత రాలేదు..కాబట్టి తనను వెళ్ళు అనే అధికారం నాకు లేదు అంటుంది. దీనికి వెటకారంగా లాస్య తెలివిగా మాట్లాడుతున్నావ్ నాకు కూడా నేర్పించు అంటుంది. నీ అంగీకారం లేకుండా అంకిత నీ ఇంటికి వచ్చినప్పుడు మెడ పట్టుకుని బయటకు గెంటేయొచ్చు కదా అని సీరియస్ గా మాట్లాడుతుంది గాయత్రి. అది మీ సంస్కారం అంటుంది తులసి.

నాకు కోరుకున్న ప్రేమ దొరక్క ప్రేమను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అంటుంది అంకిత. ఇంతలో అభి అక్కడికి వస్తాడు. పిల్లల్ని ప్రేమించే తల్లుల్ని చూసాం కానీ కోడళ్లను బిడ్డలా కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిని నిన్నే చూస్తున్నా. నువ్వు అంకితను కాపాడడం లేదు ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నావు అని మాటలు విసిరేస్తాడు అభి. మొగుడికి విడాకులు ఇచ్చి నీలాగే ఒంటరి బతుకు బతికేలా చేస్తున్నావు. ఇంకో తులసిని తయారు చేస్తున్నావు అంటాడు. నీ మొండితనాన్నే నేర్పిస్తున్నావు అని తులసిని నిలదీస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.