English | Telugu

`కార్తీక‌దీపం`ని క్యాష్ చేసుకునే ప‌నిలో `వంట‌ల‌క్క‌`

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక‌దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగి ఈ సీరియ‌ల్ వంట‌ల‌క్క కార‌ణంగా టాప్‌లోకి వెళ్లి పాపుల‌ర్ అయింది. అంతే కాకుండా `కార్తీక‌దీపం` టైటిల్ ఎంత పాపుల‌ర్ అయిందో `వంట‌ల‌క్క‌` పేరు కూడా అంతే పాపుల‌ర్ అయింది. దీంతో ఇదే పేరుని త‌మ త‌దుప‌రి సీరియ‌ల్ కి వాడేసుకుంటూ కొత్త సీరియ‌ల్ ని ప్రారంభించ‌బోతున్నారు `కార్తీక‌దీపం` నిర్మాత గుత్తా వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈ సీరియ‌ల్ కూడా స్టార్ మా లో ప్ర‌సారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు.

అత్యాశ‌కు మంచి త‌నానికి మంచిత‌నం అవ‌కాశంగా మార‌నుందా? అంటూ తాజాగా `వంట‌ల‌క్క‌` ప్రోమోని విడుద‌ల చేశారు. ఓ ఇంటికి లైటింగ్ చేసుకునే ఓ యువ‌కుడు అదే ఇంటి య‌జ‌మాని కూతురిని న‌మ్మించి బుట్ట‌లో వేస్తాడు.. డ‌బ్బు, ఆస్తీ, హోదా కోసం త‌న ట్రాప్ లో ప‌డిన‌ ఆ అమ్మాయి ఎలా వంట‌ల‌క్క‌గా మారింది?.. లేక వంట‌ల‌క్క‌కు, ఈ సీరియ‌ల్ కు ఏదైనా సంబంధం వుందా? అన్న‌ది తెలియాలంటే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ సీరియ‌ల్ చూడాల్సిందే. అత్య‌ధిక భాగం త‌మిళ న‌టులు న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ `వంట‌ల‌క్క‌` పేరుని ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలి.

ఈ సీరియ‌ల్ ప్రోమోని `కార్తిక‌దీపం` ఫేమ్ శోభాశెట్టి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. అమాయ‌కురాలైన వ‌ర‌ల‌క్ష్మీకి.. డ‌బ్బు కోసం లైటింగ్ లు సెట్ చేసే యువ‌కుడికి మ‌ధ్య ఎలా ప్రేమ క‌థ పుట్టింది. అది ఆమె జీవితాన్ని ఏ మ‌లుపు తిప్పింది అన్న‌ది తెలియాలంటే ఈ సీరియ‌ల్ చూడాల్సిందే. త‌మిళ న‌టుడు ధీర‌వం రాజ్ కుమార‌న్ హీరోగా, శిరీన్ శ్రీ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళ న‌టుడు నీళ‌ల్ గ‌ళ్ ర‌వి త‌దిత‌రులు క‌నిపించ‌నున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.