English | Telugu

సూరత్‌లో స్ట్రీట్ ఫుడ్ అదుర్స్.. కావాలంటే న‌వీన‌ని అడ‌గండి!

బుల్లితెరపై ఎంతో మంది తమని తాము నిరూపించుకుని దూసుకుపోతున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది నటి యాటా నవీన. తెలుగు సీరియల్స్ ద్వారా ఈమె ఆడియన్స్ కి సుపరిచితమే. 'కలవారి కోడలు', 'చంద్రముఖి' వంటి సీరియల్స్ లో యాక్ట్ చేసిన నవీన తన నటనతో, అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఈమె భర్త పేరు యాట సత్యనారాయణ. ఈయన 'కలవారి కోడలు', 'పెళ్లి నాటి ప్రమాణాలు' సీరియల్స్ కి నిర్మాతగా పని చేశారు. ఇక నవీన సీరియల్స్ తో న‌టించ‌డంతో పాటు యూట్యూబ్ లో కూడా వరుసగా వీడియోస్ చేస్తుంటుంది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఫుడీస్ అందరికోసం ఒక ఫుడ్ వీడియో చేసింది. గుజరాత్ కి వెళ్లిన నవీన సూరత్ లో దొరికే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అని చెప్తూ అక్కడి ఫుడ్ గురించి వివ‌రించింది. ఉధ్నా బజార్ అని సూరత్ లో మంచి ఫేమస్ ప్లేస్. అక్కడ కోల్డ్ కోకో ఫేమస్ డ్రింక్. గ్లాస్ లో ఐస్ వేసి చాక్లెట్ సిరప్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇస్తారు. కోల్డ్ కాఫీలంటే ఇష్టపడని నవీన ఫస్ట్ టైం కోల్డ్ కోకో తాగి టెంప్ట్ ఐపోయింది.

తర్వాత స్పెషల్ ఫ్రాంకీ, సూరత్ స్పెషల్ రింజిమ్ స్టఫ్డ్ పిజ్జా మస్త్ ఎంజాయ్ చేసింది. గుజరాత్ కి వచ్చిన వారెవరైనా పానీపూరి తినకుండా వెళ్ళరు. అంత ఫేమస్ ఫుడ్ అది. ఇక దాన్ని అక్కడ బాస్కెట్ చాట్ అంటారట. అలా సూరత్ లో దొరికే స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ ని ఫుడ్ లవర్స్ కోసం వీడియో చేసి పెట్టింది నవీన. వీటిని ఫాలో అయ్యి ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఆ ఫొటోస్ ని కూడా తనతో షేర్ చేసుకోమని చెప్పుకొచ్చింది నవీన. ఈ వీడియోకి సూపర్ వ్లాగ్ అని, సూపర్ వీడియో అని, యమ్మీ ఫుడ్ అని.. ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.