English | Telugu

పెట్టెలో దొరికిన క‌త్తిపై తిలోత్త‌మ వేలిముద్ర‌లున్నాయా?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ 'త్రిన‌య‌ని'. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా కొడుకు కోసం ఆరాట‌ప‌డే త‌ల్లి ఆత్మ క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. చిత్ర విచిత్ర‌మైన మలుపులు, ట్విస్ట్ ల‌తో ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ థ్రిల్ల‌ర్ సీరియ‌ల్స్ ని అమితంగా ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఇందులో అషికా గోపాల్, చందూ గౌడ జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల‌లో ప‌విత్రా జ‌య‌రామ్‌, నిహారిక హ‌ర్షు, విష్ణు ప్రియ‌, శ్రీ‌స‌త్య‌, భావ‌నా రెడ్డి, సురేష్ చంద్ర‌, అనిల్ చౌద‌రి, ద్వార‌కేష్ నాయుడు త‌దిత‌ర‌లు న‌టించారు.

న‌య‌ని, విశాల్ వెలికి తీసిన పెట్టెలో ఏముందో చెప్ప‌డం లేద‌ని ఆగ్ర‌హించిన తిలోత్త‌మ.. క‌సి, వల్ల‌భ‌, దురంధ‌ర‌, హాసినిల‌తో క‌లిసి న‌య‌ని ఉంటున్న ఏరియాకు వ‌స్తుంది. అప్ప‌టికే సుమ‌న ద్వారా విష‌యం తెలుసుకున్న విక్రాంత్.. త‌ల్లి తిలోత్త‌మ‌పై సీరియ‌స్ అవుతాడు. త‌ల్లి కూడా న‌టిస్తుందా? అని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తాడు. క‌ట్ చేస్తే.. విశాల్ - న‌య‌నిల‌ని ఈ ప్రాంగ‌ణంలో తవ్వితీసిన పెట్టెని బ‌య‌టికి తీసుకుర‌మ్మ‌ని తిలోత్త‌మ అరుస్తుంది. అంతా ఒక‌చోట చేర‌డంతో బ‌స్తీ జ‌నం కూడా పోగ‌వుతారు. ఇంత‌లో వ‌ల్ల‌భ‌ని పెట్టెని బ్రేక్ చేయ‌మంటుంది తిలోత్త‌మ‌.

ఇదే స‌మ‌యంలో న‌య‌ని త‌న‌కు ప‌రిచ‌యం వున్న ఎస్.ఐ కి ఫోన్ చేసి విష‌యం చెబుతుంది. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన ఎస్.ఐ పెట్టెని బ‌ద్ద‌లు కొట్టాల్సిందే అంటాడు.. వ‌ల్ల‌భ‌ని ఆ ప‌ని చేయ‌మ‌ని తిలోత్త‌మ చెబుతుంది. పెట్టెని బ్రేక్ చేయ‌డంతో డోర్ ఓపెన్ చేసి చూసి అంతా షాక్ అవుతారు. తిలోత్త‌మ‌, క‌సి అనుకుంటున్న‌ట్టుగా అందులో ఎలాంటి నిధి వుండ‌దు. గాయ‌త్రిదేవి హ‌త్య‌కు తిలోత్త‌మ ఉప‌యోగించిన క‌త్తి ల‌భిస్తుంది. దీంతో ఒక్క‌సారిగా తిలోత్త‌మ షాక్ అవుతుంది.

క‌ట్ చేస్తే.. ఇదే విష‌యాన్ని న‌య‌ని.. తిలోత్త‌మ‌తో చెబుతుంది. ఆ క‌త్తిపై వున్న వేలి ముద్ర‌లు మీవో కాదో తేల్చ‌డానికి పోలీస‌న్న వ‌చ్చాడ‌ని.. ఇక గాయ‌త్రి దేవి అమ్మ‌గారిని చంప‌డానికి నువ్వు రాసిన లెట‌ర్ లోని అక్ష‌రాల‌ని విశాల్ బాబు గుర్తు ప‌ట్టాడ‌ని చెబుతుంది న‌య‌ని.. దీంతో తిలోత్త‌మ‌లో టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది.. ఆ త‌రువాత ఏం జ‌ర‌గ‌నుంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.