English | Telugu

తుల‌సి అకౌంట్ లోంచి లాస్య అకౌంట్‌లోకి రూ. 20 ల‌క్ష‌లు!

తులసి మ్యూజిక్ స్కూల్ పెడుతోంద‌నీ, దానికి బ్యాంకు లోన్ కోసం అప్లై చేసిన విషయాన్ని నందుతో చెప్తుంది లాస్య. "తనకు అసలు లోన్ ఎవరిస్తారు?" అంటాడు నందు. మరో వైపు శృతికి డబ్బు ఇస్తానని కచ్చితంగా చెప్తుంది తులసి. ఇక శృతి కూడా ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోమని ప్రేమ్ కి చెప్తుంది. ఇంతలో అకౌంట్ లో డబ్బు పడినట్టు మెసేజ్ వచ్చిందని చెప్తుంది దివ్య. అది చూసి తులసి వాళ్ళ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. శృతికి ఫోన్ చేసి డబ్బు వచ్చిన విషయం చెప్పి చాలా సంతోషంగా ఉంది అంటుంది. ఇంతలో తులసి అకౌంట్ కి మరో మెసేజ్ వస్తుంది.

ఏంటా అని చూస్తుంది అంకిత. "ఆంటీ మీ అకౌంట్ నుంచి 20 లక్షలు డెబిట్ ఐనట్టు మెసేజ్ వచ్చిం"ది అంటుంది. తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి శృతి వస్తుంది. అంకిత అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది శృతి. "వేరే ఏదో బ్యాంకు అకౌంట్ కి మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఐనట్టు మెసేజ్ వచ్చింది ఆంటీ" అంటుంది అంకిత.

బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి అడుగుతుంది. "మీరే చెక్ ఇచ్చారు.. దాని ద్వారానే డబ్బును డ్రా చేసుకున్నారు కదా" అంటాడు. డౌట్ వచ్చి ఫోన్ పెట్టేసి అంకిత తులసిని డాక్యుమెంట్స్ గురించి అడుగుతుంది. అంకితకు డాకుమెంట్స్ చూపిస్తుంది తులసి. కానీ అవన్నీ ఫేక్ అని చెప్తుంది అంకిత. మరో వైపు లాస్య అకౌంట్లోకి డబ్బు పడేసరికి చాలా సంతోషంగా ఉంటుంది. పరంధామయ్య బ్యాంకు ఏజెంట్ రంజిత్ ని బాగా తిడుతూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.