English | Telugu

రష్మిని వదిలేసి రాశి ఖన్నాతో సుధీర్ రొమాన్స్

'పక్కా కమర్షియల్' టీం ప్రమోషన్స్ జోరు చూస్తూ ఆడియన్స్ హోరెత్తిపోతున్నారు. ఐతే ఇటీవల 'థాంక్యూ దిల్ సే' అనే ప్రోగ్రాంకి ఈ టీం వచ్చి సందడి చేసింది. ఇక హోస్ట్స్ సుధీర్, శ్రీముఖి ఇద్దరూ మస్త్ ఎంటర్టైన్ చేశారు. గోపీచంద్ తో కలిసి శ్రీముఖి "ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన" అంటూ పాట పాడింది. 'నేను ఒక్క లైన్ అడిగితే పాడలేదు' అని సుధీర్ అనేసరికి 'లేడీస్ అడిగినప్పుడు పాడకపోతే ఫీల్ ఐపోతారు' అన్నాడు గోపీచంద్. 'మా వైపు రాశిఖన్నా గారు ఉన్నారుగా' అని సుధీర్ అనేసరికి "నా కోసం ఒక పాట పాడతావా" అంటూ రాశి చేతిలో చెయ్యేసి మరీ అడిగేసరికి సుధీర్ మస్త్ సిగ్గుపడిపోయాడు. 'నేను ఎప్పుడూ అమ్మాయిల్ని టచ్ చేయను' అని సుధీర్ అన్న మాటకు అందరూ నవ్వేశారు. "అడిగా అడిగా" అంటూ సుధీర్ పాట అందుకొనేసరికి "ఏమడిగావ్?" అంటూ గోపీచంద్ కోరస్ పాడి నవ్వించారు.

ఇక తర్వాత రాశి ఖన్నా "ఏం సందేహం లేదు" పాట అద్భుతంగా పాడి అందరినీ మెస్మరైజ్ చేసింది. గోపీచంద్, శ్రీముఖి ఒక జోడిగా, రాశిఖన్నా, సుధీర్ ఒక జోడిగా డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. సుధీర్, "నాకు అమ్మాయిలను ముట్టుకోవడం అంటే కొంచెం ప్రాబ్లెమ్" అని రాశితో అనేసరికి, "నాకేం ప్రాబ్లెమ్ లేదు" అని సుధీర్ కి కౌంటర్ ఆన్సర్ ఇచ్చింది రాశి ఖన్నా. "ఇప్పుడు ఈ రెండు జోడీలు మధ్య డాన్స్ వార్ జరగబోతోంది" అంటూ శ్రీముఖి చెప్పేసరికి "అమ్మాయిలతో డాన్స్ వేయడం నాకు సిగ్గు" అన్నాడు సుధీర్. "అమ్మాయిలతో కాకుండా అబ్బాయిలతో వేస్తావా ఏమిటి డ్యాన్స్" అన్నాడు మారుతి.

ఇక తర్వాత "జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి" సాంగ్ కి డాన్స్ వేశారు శ్రీముఖి, గోపీచంద్. తర్వాత రొమాంటిక్ సాంగ్ ఏం సందేహం లేదు పాటకు సుధీర్, రాశీ ఖ‌న్నా ఇద్దరూ చక్కగా డాన్స్ చేసి మంచి ఎనర్జీని అందించారుఆడియన్స్ కి. ఇక జడ్జి మారుతి స్టేజి మీదకు వచ్చి రొమాంటిక్ సాంగ్ లో రాశి, మాస్ సాంగ్ లో గోపీచంద్ గెలిచారని చెప్పాడు. అలా ఈ షో మొత్తం గేమ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.