English | Telugu

బెడ్‌రూమ్‌లో వేద‌ని వేధిస్తున్న‌ కైలాష్.. య‌ష్ ఏం చేశాడు?

నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో సాగుతోంది. ఇందులోని ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు.

య‌ష్ బిజినెస్ ప‌నిమీద‌ ముంబై వెళ్లిపోవ‌డంతో ఇదే మంచి అద‌నుగా భావించిన కైలాష్ వావి వ‌రుస‌లు మ‌రిచిపోయి.. ఒంట‌రిగా బెడ్రూమ్ లో వున్న వేద‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు.. త‌న ప్ర‌పోజ‌ల్ కు ఒప్పుకోమ‌ని ఇబ్బందికి గురిచేస్తాడు. ఇందు కోసం ల‌వ్ సింబ‌ల్ తో వున్న గిఫ్ట్ ని కూడా ఇస్తాడు. అత‌ని నీచ‌పు మ‌న‌స్త‌త్వానికి షాకైన వేద ఏడుస్తూ హాల్లోకి వ‌స్తుంది. జ‌రిగిన విష‌యాన్ని అత్త మాలినితో చెబుతుంది. కానీ త‌ను న‌మ్మ‌దు. పైగా వేద‌నే అనుమానిస్తుంది. కైలాష్ ఎలాంటి వాడో త‌న‌కు తెలుస‌ని, త‌ను ఇంటి అల్లుడు అని, అత‌ని అధికారం ముందు త‌ల వంచాల్సిందేన‌ని, ఈ విష‌యాన్ని య‌ష్ కు ఎట్టిప‌రిస్థితిలో చెప్ప‌కూడ‌ద‌ని వేద‌ని హెచ్చ‌రిస్తుంది.

ఉన్న‌ట్టుండి అంతా తారుమార‌య్యే స‌రికి వేద అచేత‌నురాల‌వుతుంది. అయినా స‌రే.. "సాటి ఆడ‌దాని బాధ‌ని అర్థం చేసుకోండి" అని నిల‌దీస్తుంది. అయినా మాలిని.. వేద మాట‌ల‌ని విన‌దు.. నీది అపోహ అని కొట్టి పారేస్తుంది. ఏం చేయాలో తెలియ‌క బెడ్రూమ్ లో య‌ష్ ఫొటోని అద్దంలో చూస్తూ "మిస్ యు" అని రాస్తుంది వేద‌.. ఆ త‌రువాత య‌ష్ కు జ‌రిగిన విష‌యం చెప్పాల‌ని ఫోన్ చేస్తుంది. కానీ య‌ష్‌.. మాలిని ప‌డిపోవ‌డంతో త‌న వ‌ద్దే వుంటాడు.. ఫోన్ సైలెంట్ లో వున్న విష‌యం ప‌ట్టించుకోడు.. త‌రువాత ఫోన్ చెక్ చేస్తే వేద చాలా సార్లు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది.

వెంట‌నే వేద‌కు ఫోన్ చేస్తాడు య‌ష్‌.. త‌ను విష‌యం చెప్పే లోపు "కైలాష్ గురించేనా?" అంటే షాకిస్తాడు. "త‌న‌కు డ‌బ్బులు ఇప్పించావు, ఉద్యోగం ఇవ్వ‌మ‌న్నావు.. ఇదంతా తెలిసి మా అమ్మ నిన్ను ఆకాశానికి ఎత్తేసి వుంటుంది క‌దా?" అంటాడు. త‌న‌కు జ‌రిగిన విష‌యం చెప్ప‌లేక, మ‌న‌సులో దాచుకోలేక వేద న‌ర‌కం అనుభ‌విస్తూ అది య‌ష్ కు తెలియ‌కుండా మాట్లాడుతుంది. అయినా య‌ష్ గ‌మ‌నించి "ఏం జ‌రిగింది?" అని ఆరాతీస్తే "ఐ మిస్ యూ" అని ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది.. దీంతో స‌మ్ థింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని య‌ష్ కు అర్థ‌మ‌వుతుంది.

క‌ట్ చేస్తే.. వేద ఒంట‌రిగా బెడ్రూమ్ లో వుండ‌టం గ‌మ‌నించిన కైలాష్ త‌న కోరిక తీర్చ‌మ‌ని వేద‌ని వేధించ‌డం మొద‌లు పెడ‌తాడు.. ఇదే స‌మ‌యంలో య‌ష్ ముంబై నుంచి దిరిగి ఇంటికి చేర‌తాడు.. హాలులో య‌ష్‌.. బెడ్రూమ్ లో వేద‌, కైలాష్‌.. ఏం జ‌ర‌గ‌బోతోంది?.. య‌ష్ ఎలా రియాక్ట్ కాబోతున్నాడు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.