English | Telugu

Bigg Boss 9 Telugu Family week: తనూజతో కొంచెం జాగ్రత్తగా.. హింట్ ఇచ్చిన సుమన్ భార్య లాస్య!

బిగ్ బాస్ సీజన్-9 లో పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇందులో మొదటగా తనూజ వాళ్ళ అక్క పాప, చెల్లి అనూజ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికి సుమన్ శెట్టి భార్య లాస్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

లాస్య హౌస్ లోకి రాగానే సుమన్ శెట్టి చిన్నపిల్లాడు అయిపోయాడు. ఎగిరి గంతేసి తన భార్యని హత్తుకొని బుగ్గన ముద్దులు పెడుతూ తన ప్రేమని చూపించాడు. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు.. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది.. బాగా ఆడుతున్నానా.. నువ్వెందుకు ఇలా చిక్కిపోయావ్.. నేను లేకుండా ఎలా ఉంటున్నా అంటూ వరుసగా ప్రశ్నలు వేసి మురిసిపోయాడు సుమన్.

ఇక వెళ్లే ముందు సుమన్‌కి తన భార్య లాస్య ఒక సలహా ఇచ్చింది. సంజన గారితో కొంచెం ఇబ్బంది.. మిమ్మల్ని తొక్కలో కెప్టెన్ అన్నదానికి ఇప్పటికీ మేం డిజప్పాయింట్ అవుతున్నాం.. అలానే మీరు తనూజతో తగ్గించండి అంటూ లాస్య చెప్పింది. దీంతో బాలేదా నెగటివ్ వస్తుందా.. అని సుమన్ అడిగాడు. నెగెటివ్ కాదు తనే హైప్ ఉంటుంది.. తను ఎవరు హైప్‌లో ఉంటారో వాళ్లని మంచి చేసుకుంటుంది.. అందుకే చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి.. నేను అంటున్నది మంచిగా మాట్లాడినా.. నమ్మకండి.. మీ మాటికి మీరు పని చేసుకోండి అంటూ క్లియర్‌గా చెప్పింది.

ఇక ఆ తర్వాత అందరి గురించి అడిగి తెలుసుకున్నాడు సుమన్. నా ఆట ఎలా ఉంది.. హౌస్ లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటున్నాను కదా అని అడుగగా అవును నేచురల్ గా ఉ‌న్నావని లాస్య అంది. ఇక లాస్య వెళ్లేముందు తనతో డ్యాన్స్ చేశాడు సుమన్ శెట్టి. భార్య ఇచ్చిన టిప్స్ తో సుమన్ శెట్టి తన ఆటని మెరుగుపర్చుకొని టాప్ లో ఉంటాడా లేదా అనేది చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.