English | Telugu

నా పెళ్ళికి బిగ్ బాస్ ట్రోఫీ గిఫ్ట్ కావాలి... నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది‌


బిగ్ బాస్ సీజన్-9 లో పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరిని వరుసగా నిల్చోబెట్టి బిగ్ బాస్ మాట్లాడాడు. ‌అదే ఫ్యామిలీ వీక్ గురించి తన మాటల్లో చెప్పాడు బిగ్ బాస్.

బిగ్‌బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి అతి చేరువలో ఉంది.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సాగిన మీ ప్రయాణం మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకి గురి చేసింది.. పరిస్థితులు ఏమైనా కొన్ని బంధాలు మాత్రమే ఎప్పటికీ మీ తోడుని వదలవు.. అలాంటి బంధాల్ని మీ ప్రయాణం కోసం ఈ ఇంటి బయటే వదిలేసి మీ లక్ష్యం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టారు.‌ కుటుంబం మీ తోడు ఉంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్లే.. ఇది ఆ శక్తిని పొందే సమయం.. కానీ ఎవరు తమ ప్రియమైన వ్యక్తులతో ఎంత సమయం గడపాలో తద్వారా ట్రోఫీ వైపు ఎంత ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారన్నది మీ కృషిపైనే ఆధారపడి ఉంటుంది.. ఇందుకోసం మీకు నేను పెడుతున్న పోటీ చిక్కుముడి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఈ పోటీలో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారో దాన్ని బట్టి బోర్డ్ మీద ఉన్న టైమ్ ఫ్రైమ్ దక్కుతుంది. అత్యధికంగా అరవై నిమిషాల సమయం ఈ బోర్డు మీద ఉంటే.. అతి తక్కువ సమయం పదిహేను నిమిషాలుగా ఉంది. మీరు మీ కుటుంబంతో గడిపే ప్రతీ నిమిషం.. వారు మీకు తెలిపే ప్రతీ విషయం మిమ్మల్ని ట్రోఫీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో సహాయపడుతుందన్ని విషయం మర్చిపోకండి అంటూ పోటీకి ముందు బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఇక్కడే దత్తపుత్రికకి ఫేవరెటిజం చూపించాడు బిగ్ బాస్. మీరు కెప్టెన్ అయినందున మీకు నచ్చిన బోర్డ్ ని తీసుకోవచ్చు తనూజ అని అనడంతో తను వెళ్ళి అరవై నిమిషాలు ఉన్న బోర్డ్ తీసుకుంది. ఇక ఆ తర్వాత తాళ్ళతో కూడిన గేమ్ మొదలైంది. ఇందులో డీమాన్ పవన్ కి ముప్పై నిమిషాలు, ఇమ్మాన్యుయల్ కి ఇరవై నిమిషాలు, దివ్యకి పదిహేను నిమిషాలు, భరణికి పదిహేను నిమిషాలు వచ్చాయి. అయితే కళ్యాణ్ ముందుగా వచ్చి ఇరవై నిమిషాలు ఉన్న బోర్డ్ ని పట్టుకొని సుమన్ శెట్టి రాగానే తనకి ఇచ్చేశాడు. అది చూసిన సంజన.. మీరు అలా స్వాప్ చేసుకోకూడదని వాదించింది. కానీ బిగ్ బాస్ అలా చెప్పలేదు కదా అని కళ్యాణ్ అన్నాడు. ఇక ఫైనల్ గా మీ నిర్ణయం చెప్పండి అని సంజనని బిగ్ బాస్ అడుగగా.. హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో సుమన్ గారికి ఇరవై నిమిషాలు, కళ్యాణ్ కి పదిహేను నిమిషాలు గల బోర్డ్ లు ఇచ్చింది సంజన.

ఇక ఫ్యామిలీ వీక్ లో మొదటగా తనూజ వాళ్ళ అక్క పాప, తనూజ చెల్లి అనూజ హౌస్ లోకి వచ్చారు. వారిని చూసి తనూజ ఎమోషనల్ అయింది. ఇక అనూజ కొన్ని టిప్స్ ఇచ్చింది. ఎక్కువగా ఏడ్వకు.. చిరాకు పడకు.. నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది‌. నువ్వు ఒక్కరోజు ఏడిస్తే అమ్మ ఇంట్లో రెండు రోజులు ఏడుస్తుంది‌. అర్థరాత్రి పన్నెండు గంటలకి అక్క, అమ్మ కాల్ చేసి లైవ్ చూసావా అని అడుగుతున్నారు. 24/7 వాళ్లు నిన్ను లైవ్ లో చూస్తున్నారు. నా పెళ్ళి ఉందనే విషయం మర్చిపోయి నీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళని హ్యాండిల్ చేయడం నాకు కష్టంగా ఉంది. నిజంగా నా పెళ్ళి పనులు ఓ వైపు, అమ్మ, అక్కని హ్యాండిల్ చేయడం మరోవైపు అవుతుందని అనూజ అంది. ఇక ఏడ్వనని తనూజ అంది. ఇక అనూజని పెళ్ళి కూతురు చేసింది తనూజ. ఆ తర్వాత నా పెళ్ళికి గిఫ్ట్ గా 'బిగ్ బాస్ ట్రోఫీ' తీసుకొని రా అని తనూజకి వెళ్ళేముందు చెప్పేసింది అనూజ.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.