English | Telugu

వాళ్ళిద్దరితో మాల్దీవ్స్ వెళ్లిన సుమ

కొవిడ్ టైమ్‌లో మాల్దీవ్స్ ఫుల్ ఫేమస్ అయ్యింది. లాక్‌డౌన్ రిస్ట్రిక్షన్స్ నుండి రిలీఫ్ రావడమే ఆలస్యం సెలబ్రిటీలు అందరూ మాల్దీవ్స్ క్యూ కట్టారు. అప్పుడు వాళ్లపై విమర్శలు కూడా వచ్చాయి. ఓ పక్క ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తుంటే విహారయాత్రలు ఏంటని మాల్దీవ్స్ వెళ్లిన సెలబ్రిటీలపై సహచర నటీనటులు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. సాధారణ ప్రజలు కూడా విహారయాత్రలకు వెళుతున్నారు. యాంకర్ సుమ కూడా వెళ్లారు.

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ సుమ మాల్దీవ్స్ వెళ్లారు. కుమారుడు రోషన్ కనకాల, కుమార్తె స్నేహ మనస్వి కానుకలతో కలిసి ప్రముఖ పర్యాటక సముద్రతీర ప్రాంతానికి వెళ్లారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. సుమ చాలా బిజీ యాంకర్. పలు షోస్ చేస్తున్నారు. అయితే.. కరోనా తర్వాత ఎక్కడికి వెళ్లలేదని, కాస్త రిలీఫ్ కోసం షార్ట్ బ్రేక్ తీసుకున్నారని టీవీ ఇండస్ట్రీ టాక్. సుమ, పిల్లలతో పాటు రాజీవ్ కనకాల వెళ్లారో లేదో మరి! పిల్లలతో కలిసున్న ఫొటోలను మాత్రమే సుమ షేర్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.