English | Telugu

శ్రీముఖి ఇంట విషాదం

ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇంట విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఆమె అమ్మమ్మ మరణించారు. దాంతో శ్రీముఖి భావోద్వేగానికి లోనయ్యింది. అమ్మమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.

"అమ్మమ్మ అంటే ప్రేమ. జీవితంలో చాలా విషయాలను తను నాకు చెప్పింది. అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని పంచేది. అమ్మమ్మ ధైర్యవంతురాలు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. తనతో పాటలు పాడటం, డాన్స్ చేయడం మిస్ అవుతాను. అమ్మమ్మ... ఐ లవ్యూ. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి థాంక్స్. నా జీవితంలో నేను విన్న అత్యుత్తమ ప్రేమ కథల్లో అమ్మమ్మ, తాతయ్య ప్రేమకథ ఒకటి. పైలోకంలో తాతయ్యను అమ్మమ్మ కలుస్తుందని, వాళ్ళ ప్రేమకథ అక్కడ కొనసాగుతుందని ఆశిస్తున్నా" అని శ్రీముఖి రాసుకొచ్చింది.

శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు సందేశాలు పెట్టారు. ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణం మరువక ముందే పరిశ్రమకు చెందిన మ‌రో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.