English | Telugu

Bigg Boss Wildcard Entry: వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్ గా శ్రీనివాస్ సాయి.. అతని సూపర్ పవర్ ఏంటంటే!


బిగ్ బాస్ సీజన్-9 అయిదు వారాలు పూర్తి చేసుకుంది. ఇక నిన్నటి సండే ఎపిసోడ్ పవర్ స్ట్రామ్ గా నిలిచింది. ఎందుకంటే హౌస్ లోకి ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

నామినేషన్లో ఉన్నవారిలో నుండి‌ మొదటగా ఫ్లోరా సైనీ ఎలిమినేషన్ అవుతుంది. ఇక మిగిలిన వారి నుండి నామినేషన్ చివరి రౌండ్ లో శ్రీజ, సుమన్ శెట్టి ఇద్దరు ఉంటారు. ఇక వీరిలో ఎవరు హౌస్ లో ఉండకూడదని అనుకుంటారో వారిని తీసేయ్యండి అని వైల్డ్ కార్డ్స్ కి నాగార్జున చెప్పగా శ్రీజని ఎలిమినేట్ అవుతుంది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి రెండవ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడం ఒక సూపర్ పర్ఫామెన్స్‌తో అసరగొట్టాడు శ్రీనివాస్ సాయి.. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన సాయి.. ప్రస్తుతం హీరోగా కూడా మూవీస్ చేస్తున్నాడు. సాయికి నాగార్జున ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. అంతకంటే ముందు నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ అంటూ నాగార్జునతో సాయి చెప్పాడు. నిజానికి నేను ఎంట్రీ ఇచ్చిందే కేడీ సినిమాతో.. తర్వాత ఊపిరి కూడా చేశాను.. అలానే గోల్కొండ హైస్కూల్ చిత్రంలో కూడా నటించాను. సో అందరూ నన్ను అక్కినేని ఫ్యామిలీ వ్యక్తి అని అనుకుంటారని శ్రీనివాస్ సాయి చెప్పాడు. ఇక హౌస్‌‌లోకి వెళ్లే ముందు డార్క్ బ్లూ స్టోన్ సాయికి ఇచ్చారు నాగార్జున. దీంతో ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పారు.. ఇది ఉపయోగించి ఎలిమినేషన్‌లో ఎవరినైనా సేవ్ చేయొచ్చంటూ నాగార్జున చెప్పాడు. శ్రీనివాస్ సాయి(Srinivas sai) హౌస్ లోకి రావడం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.