English | Telugu

నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ పెళ్ళిలో అందాల భామలు

సినిమాల్లో విలన్‌గా, కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ పెళ్ళికి అందాల భామలంతా టోక్యో వెళ్లారు. ఖుష్బూ, రాధికా, శరత్ కుమార్, సుహాసిని, మీనా వీళ్లంతా వెళ్లారు. ఇక ఫోటోలకు ఫోజులిచ్చేసరికి నెటిజన్స్ అంతా దిల్ కుష్ ఇపోయారు. ఎందుకంటే అందాల భామలందరినీ ఒకే ఫ్రేమ్ లో చూడడం వాళ్లకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ అరుదైన కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు.

ఐతే అతనికి తిరునెల్వేలిలోని మూలకరైపట్టికి చెందిన అక్షయ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఇక వీళ్లంతా కలిసి టోక్యోని చుట్టేశారు. జాపనీస్ ఐలాండ్ ఆఫ్ హోన్షుకి వెళ్లి అక్కడ ఫొటోస్, వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇక లవ్ ఇన్ టోక్యో, లవ్ ఫ్రమ్ టోక్యో అంటూ క్యాప్షన్స్ పెట్టుకున్నారు. అలాగే నెపోలియన్ పెద్ద కొడుకు ధనుష్ కి అక్షయకు మ్యారేజ్ విషెస్ ని చెప్పారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.