English | Telugu

జబర్దస్త్ నుంచి ఎందుకు తీసేసారో తెలీదు

"బంగారం ఒకటి చెప్పనా" అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో ఫేమస్ ఐన శాంతి మొదట్లో చాలా కష్టాలు పడిందట. చాలామంది ఇంటర్వ్యూస్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసి ఒక బియ్యం బస్తా, సబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకుని కారెక్కి వెళ్లిపోయారని బాధపడుతూ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. అలా చాలామంది కూడా అలా ఇంటర్వ్యూస్ తీసుకుని ఏమీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇలా మోసం జరుగుతూ ఉంటుంది అనుకుని వదిలేసాను అని చెప్పింది శాంతి. తర్వాత చలాకి చంటి టీమ్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లి స్కిట్స్ లో నటించిందట శాంతి. ఆ తర్వాత బులెట్ భాస్కర్ టీమ్ లో రోహిణి టీమ్ లో కూడా స్కిట్స్ వేశానని చెప్పింది. ఐతే తర్వాత ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్తూ అనుకోకుండా రెండు ఎపిసోడ్స్ కి వెళ్లకపోవడంతో జబర్దస్త్ నుంచి తీసేశారని చెప్పుకొచ్చింది. జబర్దస్త్ కోసమే హైదరాబాద్ వచ్చానని కానీ తప్పేమి లేకుండా ఎందుకు జబర్దస్త్ నుంచి తీసేసారు తెలీదని చెప్పింది. ఇక సోషల్ మీడియాలో తన ఫాన్స్ అంతా కూడా జబర్దస్త్ కి, బిగ్ బాస్ కి వెళ్ళమని సపోర్ట్ చేస్తామని చెప్తున్నారట..కానీ వాళ్ళు పిలవకుండా ఎలా వెళ్తాను అని శాంతి అంటోంది. ఐతే తన మీద జబర్దస్త్ టీమ్స్ కి ఎవరైనా చాడీలు చెప్పరేమో అందుకే జబర్దస్త్ కి రానివ్వట్లేదేమో అంటూ కొంతమంది తన అన్నారని చెప్పింది శాంతి. ఇక "హాయ్ బ్రో పెళ్లెప్పుడు" అనే వెబ్ సిరీస్ లో నటించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది బంగారం శాంతి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.