English | Telugu

'దాదాగిరి అన్‌లిమిటెడ్' తొమ్మిదో సీజ‌న్‌కు సిద్ధ‌మ‌వుతున్న సౌర‌వ్ గంగూలీ!

'దాదా'గా అభిమానులు పిలుచుకొనే ఇండియ‌న్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్‌, బీసీసీఐ ప్రస్తుత అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న పాపుల‌ర్ క్విజ్ షో 'దాదాగిరి అన్‌లిమిటెడ్‌'. ఇప్ప‌టికి ఎనిమిది సీజ‌న్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న‌ది. మునుప‌టి సీజ‌న్ల‌న్నీ బ‌హుళ జ‌నాద‌ర‌ణ పొంద‌డంతో, కొత్త సీజ‌న్ కోసం వ్యూయ‌ర్స్ కుతూహ‌లంగా ఎదురుచూస్తున్నారు.

'దాదాగిరి అన్‌లిమిటెడ్' తొమ్మిదో సీజ‌న్‌కు సంబంధించి అతి త్వ‌ర‌లో ఆడిష‌న్స్‌ను స్టార్ట్ చేసేందుకు నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రెజెంట్ కొవిడ్ ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఆడిష‌న్స్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించ‌బోతున్నారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ముగిసిన‌ సీజ‌న్ 8లో విజేత‌గా డార్జిలింగ్ జిల్లా నిలిచింది.

బెంగాలీ టెలివిజ‌న్‌లోని మోస్ట్ పాపుల‌ర్ నాన్‌-ఫిక్ష‌న్ షోస్‌లో నిస్సందేహంగా 'దాదాగిరి అన్‌లిమిటెడ్' ఒక‌టి. దానికి భారీ స్థాయిలో వ్యూయ‌ర్‌షిప్ ల‌భించింది. వీకెండ్స్‌లో ప్ర‌సారమైన ఈ షో వారం మొత్తం ప్రసార‌మ‌య్యే ఇత‌ర అన్ని పాపుల‌ర్ డైలీ సీరియ‌ల్స్‌కు గ‌ట్టి పోటీ ఇస్తూ వ‌చ్చింది. సౌర‌వ్ చ‌తురోక్తులు, ఆయ‌న షోను నిర్వ‌హించే విధానం, ప్ర‌శ్న‌ల‌ను అడిగే శైలి వీక్ష‌కుల్ని అల‌రిస్తూ వ‌చ్చాయి. ఇంట‌లిజెంట్‌గా, హ్యూమ‌ర‌స్‌గా ఆయ‌న ఇచ్చే రిప్లైలు క్విజ్ షోకు ఆక‌ర్ష‌ణ‌ను తెచ్చాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.