English | Telugu

దీపను చంపడానికి మారువేషంలో బయలుదేరిన మోనిత!

కార్తీక్‌ కోసం మోనిత ఎంతదూరమైనా వెళ్తుందని చెప్పడానికి, కార్తీక్‌ను సొంతం చేసుకోవడానికి ఎవరిని అడ్డు తొలగించడానికి అయినా వెనుకాడదని చెప్పడానికి ఈ రోజు (ఆగస్టు 19, 1122) ఎపిసోడ్‌ను ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈరోజు ఏకంగా దీపను చంపడానికి మోనిత బయలుదేరింది. దీపను ఒంటరి చెయ్యడం కోసమే కార్తీక్ ను కేసులులో ఇరికిస్తుంది. అసలు, నేటి ఎపిసోడ్‌లో హైలైట్స్ ఏంటంటే...

కార్తీక్ ఫొటో చూస్తూ... పిల్లల్ని తప్ప దీపతో సహా మిగతా అందర్నీ చంపేస్తానని మోనిత చెబుతూ ఉండటంతో ఎపిసోడ్ మొదలైంది. తనను చంపకుండా కార్తీక్ వదిలేసినా... గన్ గురిపెట్టినప్పుడు 'నిన్ను చంపి జైలుకు వెళితే నా భార్య ఒంటరి అయిపోతుంది' అంటాడు. ఆ మాటలు మోనిత మనసుకు గుచ్చుకుంటాయి. దీపను ఒంటరి చెయ్యడం కోసం తాను చచ్చినట్టు నాటకం ఆడి, కార్తీక్ మీద కేసు పడేలా చేసి జైలుకు పంపిస్తుంది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుని... కార్తీక్ ఫొటో చూస్తూ, 'సారీ బాస్. నీ భార్యను చంపేస్తా. ఇకనుండి తనను అడ్డు తొలగించే పనిలో ఉంటాను. సారీ... నిన్ను కష్టపెట్టక తప్పడం లేదు' అంటుంది.

మరోవైపు కార్తీక్ దగ్గరకు టిఫిన్ తీసుకుని దీప, పిల్లలు శౌర్య, హిమ వెళతారు. వాళ్ళు టిఫిన్ తినిపిస్తామని బతిమాలడంతో రత్నసీత సెల్ డోర్ ఓపెన్ చేస్తుంది. అదే సమయంలో ఏసీపీ రోషిణి వస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని రత్నసీతతో కోపంగా అంటుంది. ఆమెను పిల్లలు గుర్రుగా చూస్తారు. అదొక ఎమోషనల్ సీన్.

సరిగ్గా స్టేషన్ లో ఉన్నప్పుడు భాగ్యం నుండి దీపకు ఫోన్ వస్తుంది. కార్తీక్ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళ్తున్నట్టు చెబుతుంది. తాను కూడా వస్తానని దీప అంటుంది. ఆ మాటలు విన్న రత్నసీత, మోనితకు మేటర్ చేరవేస్తుంది.

ముఖం అంతా పసుపు రాసుకుని, ఎర్రచీర కట్టుకుని సోది చెప్పే మహిళలా ముస్తాబై గన్ తీసుకుని బయలుదేరుతుంది. గుడికి క్యాబ్ బుక్ చేసుకుంటుంది. తన దగ్గర క్యాష్ లేదని, అకౌంట్ కి ట్రాన్స్‌ఫ‌ర్‌ చేస్తానని క్యాబ్ డ్రైవర్ తో అంటుంది. మోనిత మాట్లాడిన ఇంగ్లీష్ చూసి ఆమెను ఆర్టిస్ట్ అనుకుంటాడత‌ను. 'మేడమ్ మీరు ఆర్టిస్టా?' అని అడుగుతాడు. అవునని ఆన్సర్ ఇస్తుంది. 'మేడమ్ ఇప్పుడు మీరు ఏ స్టోరీకి ఈ గెటప్ వేసుకున్నారు?' అని అడిగితే... 'ఓ దీపం ఆరిపోయింది' అని చెబుతుంది. దీప ప్రాణం తియ్యడానికి అని ఆడియన్స్ కి ఇన్ డైరెక్టుగా చెప్పింది. ఆ గుడి దగ్గర ఏం జరిగిందో తదుపరి ఎపిసోడ్ కోసం ఉగ్గ‌బ‌ట్టేలా చేసింది ఈ ఎపిసోడ్‌.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.