English | Telugu

జ్యోతక్క బంగారం వేసుకోదు.. తింటుంది!

శివజ్యోతి అంటే కొంతమందికే తెలుస్తుంది. కానీ జ్యోతక్క అంటే చాలు ఎవ్వరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. బిగ్ బాస్ హౌస్ జ్యోతక్క ఏడ్చిన మెమోరీస్ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోరు. "నెత్తి మీద గంగను పెట్టుకున్నావా.. అంతలా ఏడుస్తున్నావ్?" అంటూ హోస్ట్ నాగార్జున కూడా అనడం తెలిసిందే. ఇక జ్యోతక్క వీ 6 ఛానెల్లో తీన్మార్, టీవీ 9 లో ఇస్మార్ట్ న్యూస్ వంటి షోస్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లోకి అవకాశం దక్కించుకుంది.

బిగ్ బాస్‌లో ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూ ఉండేది శివజ్యోతి. బిగ్ బాస్ తర్వాత వరసగా టీవీ షోస్‌లో అవకాశాలు దక్కించుకుంటూ తనతో పాటు తన భర్తను కూడా షోల‌కి తీసుకొస్తూ మంచిగాఎంటర్టైన్ చేస్తోంది. అలాగే జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి రకరకాలు వీడియోస్ చేస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరయింది.

ఇప్పుడు తాజాగా ఒక ఫుడ్ వ్లాగ్ చేసింది. అందులో జ్యోతి గోల్డెన్ దోశ గురించి కబుర్లు చెప్పింది. కారం దోశ, చాకోలెట్ దోశ, పిజ్జా దోశ, 916 కేడీఎం గోల్డ్ దోశ తినేసి వాటి రెసిపీలను ఈ వీడియోలో చూపించింది. ఇక ఇక్కడికి వచ్చే కస్టమర్స్ తమ ఫీడ్ బ్యాక్‌ని ఒక నోటీసు బోర్డులో కూడా అంటించి వెళ్తారట. ఎపుడైనా హైదరాబాద్ వస్తే ఈ 'హౌస్ ఆఫ్ దోశ'ని విజిట్ చేయకుండా తినకుండా వెళ్లొద్దు అంటూ చెప్తోంది. ఈ ఫుడ్ వ్లాగ్ కి బోల్డన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక శివజ్యోతి మీద తన పర్సనల్ లైఫ్ విషయంలో ఒకానొక టైమ్‌లో నెగటివ్ కామెంట్స్ బాగా ట్రోల్ అయ్యాయి. కానీ జ్యోతక్క చాలా బోల్డ్ క‌దా. వాటన్నిటిని తిప్పి కొట్టి, సరైన సమాధానం ఇచ్చింది కూడా.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.