English | Telugu

షోస్ లో కంటే సోషల్ మీడియాలోనే టైంపాస్

విష్ణుప్రియ టాలీవుడ్ యాంకర్స్ లో ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ యాంకర్ గా మారి కొన్ని టీవీ షోస్ కూడా చేసింది. వీటన్నిటికంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ అందాల విందు చేస్తూ ఉంటుంది. తన ప్రతీ అప్ డేట్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. విష్ణుప్రియకు హీరోయిన్ అవ్వాలని ఆశ. అందుకే సినిమాల్లో బీభత్సంగా ట్రై చేస్తోంది. మూవీస్ లో అవకాశం రావాలంటే సోషల్ మీడియా ద్వారా దారి వేసుకుంటూ వెళ్లాలన్న విషయం ఈరోజు ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విష్ణు కూడా ఆ దారినే ఫాలో అవుతూ తన హాట్ ఫొటోస్ ని, జిమ్ లో చేసే వర్కౌట్స్ ని, బెల్లీ డ్యాన్సులను, వెకేషన్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.

ఇక లేటెస్ట్ గా సుడిగాలి సుధీర్ హీరో గా యాంకర్ దీపికా పిల్లి, విష్ణు ప్రియా హీరోయిన్స్ గా "వాంటెడ్ పండుగాడ్' అనే మూవీ చేసింది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ చిన్న గౌన్ వేసుకుని ఒక హిందీ సాంగ్ కి డాన్స్ చేసిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనిపిస్తాయి అంటూ కాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోవే పోరా షోతో ఆడియన్స్ ని అలరించింది విష్ణు ప్రియ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో పాల్గొంది. మల్లెమాల వేదిక ద్వారా ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ ఇప్పుడు షోస్ లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.