English | Telugu

కైలాష్ నీచుడ‌ని తెలుసుకున్న య‌ష్!

కొంత కాలంగా స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం` చిత్ర విచిత్ర‌మైన ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జిడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, ఆనంద్‌, రాజా శ్రీ‌ధ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ ఎలా సాగ‌నుందో చూద్దాం.

త‌మ‌ ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల్ల ఖుషీ ఇబ్బందిప‌డుతోంద‌ని త‌ల్లి సులోచ‌న‌తో చెబుతూ వేద బాధ‌ప‌డుతూ వుంటుంది. అయితే "నీ మంచిత‌న‌మే నీకు శ్రీ‌రామ‌ర‌క్ష" అని వేదకు త‌ల్లి ధైర్యం చెబుతుంది. క‌ట్ చేస్తే బ‌య‌ట పార్కింగ్ ప్లేస్ లో కూర్చుని వేద ఆలోచిస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో కైలాష్.. వేద ద‌గ్గ‌రికి వెళ్లి భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. వేద భ‌య‌ప‌డుతుంది. వెంట‌నే "నా గురించి ఇంట్లోవాళ్ల‌కి చెప్పాల‌ని ప్ర‌య‌త్నించావు కానీ నీ మాట ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. నీ భ‌ర్త కూడా నీ మాట‌ని వినలేదు. దీన్ని బ‌ట్టి నీకు ఏం అర్థ‌మైంది. ఇంట్లో నీకంటే నా బ‌ల‌మే ఎక్కువ‌ని. ఆ దేవుడు న‌న్ను నీకోస‌మే పుట్టించాడు" అంటూ వేద‌ని వేధిస్తుంటాడు.

దీంతో వేద "చెప్పుతీసుకుని కొడ‌తాను వెధ‌వ" అని మండిప‌డుతుంది. "ఆడ‌ది అంటే ఓపిక‌.. ఆ ఓపిక వ‌దిలేసిందంటే ఈ ప్ర‌పంచం త‌ల‌కిందుల‌వుతుంది. వేద రూపంలో నీకు చావుమూడింది" అంటూ వార్నింగ్ ఇస్తుంది.. కైలాష్.. వేద‌ని వేధిస్తున్న తీరుని చూసిన య‌ష్.. 'వీడు ఇంత నీచుడ‌ని తెలియ‌క అంతా వేద‌ని అపార్థం చేసుకున్నారు' అని ఫీల‌వుతుంటాడు. వెన‌క్కి తిరిగి య‌ష్ ని చూసిన కైలాష్ ప్లేట్ మార్చి వేద‌ని ఇంటికి ర‌మ్మ‌ని బ్ర‌తిమాలుతున్నాన‌ని క‌వ‌ర్ చేస్తాడు. క‌ట్ చేస్తే అభిమ‌న్యు.. య‌ష్ ని వేధించ‌డం మొద‌లు పెడ‌తాడు. "వేద నిన్ను వ‌దిలేసిందంట క‌దా?" అంటూ రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.